Raju Gari Ammayi Naidu Gari Abbayi Movie
-
విలేజ్‌లో మిస్టరీ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం సుమారు పది నెలల తర్వాత సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కించారు.మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో వచ్చిన ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’ సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరోయిన్ హత్యతో సినిమా కథ మొదలౌతుంది. ఆపై ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ఇంపాక్ట్‌తో కథ ఉంటుంది. లవ్ స్టోరీకి మర్డర్ మిస్టరీ అంశాలను జోడించారు. కానీ, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టైటిల్‌ను షార్ట్ కట్లో రానా పేరుతో ప్రమోట్ చేశారు. ఐఎమ్‌డీబీలో 8.5 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలామంది కొత్తవారే నటించారు. కానీ, నటన పరంగా వారికి మంచి మార్కులే పడ్డాయి. -
విలేజ్‌లో మిస్టరీ
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కమర్షియల్ సబ్జెక్ట్ ఈ చిత్రం. ఎన్నో ఇబ్బందులు పడి ఈ సినిమా పూర్తి చేశాం’’ అన్నారు రవితేజ. ‘‘ఈ సినిమాలో హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు ముత్యాల రామదాసు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సత్యరాజ్. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి. ∙నేహ జురెల్, రవితేజ నున్నా -
ఆసక్తికరంగా ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’ ట్రైలర్
రవితేజ నున్నా, నేహ జురెల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి.వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు,నున్నా కుమారి గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ విడుదల చేశారు. లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో వినోదభరితంగా ట్రైలర్ ప్రారంభమైంది. నాయికా నాయకుల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సాఫీగా సాగిపోతున్న ట్రైలర్ కథానాయిక హత్యతో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్‌ని ముగించారు.