
రవితేజ నున్నా, నేహ జురెల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి.వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు,నున్నా కుమారి గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ విడుదల చేశారు.
లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో వినోదభరితంగా ట్రైలర్ ప్రారంభమైంది. నాయికా నాయకుల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సాఫీగా సాగిపోతున్న ట్రైలర్ కథానాయిక హత్యతో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్‌ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment