తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీరశంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా డైరెక్టర్ వీర శంకర్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా వశిష్ఠ, సాయి రాజేష్.. జనరల్ సెక్రటరీలుగా మద్దినేని రమేష్ , సుబ్బారెడ్డి.. ట్రెజరర్ గా పి.వి. రమణరావు విజయం సాధించారు.
కాగా ఆదివారం ఉదయం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. వీర శంకర్, సముద్ర ప్యానెల్ బరిలోకి దిగాయి. దర్శకుల సంఘంలో 1500 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ఈ రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగ్గా సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించారు. వీర శంకర్ విజయం సాధించినట్లు ప్రకటించారు. మొత్తం 1113 ఓట్లు పోలవగా ఇందులో వీరశంకర్‌కు 536 రాగా సముద్రకు 304 వచ్చాయి.
చదవండి: ఓటీటీలో గుంటూరు కారం.. ఆ విషయంలో మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్!
Comments
Please login to add a commentAdd a comment