
దర్శకుడు వీరశంకర్ (పాత ఫొటో)
సాక్షి, తణుకు: ప్రముఖ దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ(83) మంగళవారం ఉదయం కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి సమీపంలో ఉన్న చివటం గ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో ఆయన బాధ పడుతున్నారు. సత్యనారాయణకు ముగ్గురు కుమారులు వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్ ఉన్నారు. (టాలీవుడ్‌లో మరో విషాదం)
తన తండ్రి గురించి వీరశంకర్ మాట్లాడుతూ.. ‘మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో కేన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం’ అన్నారు. వీరశంకర్ తండ్రి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
శ్రీకాంత్ హీరోగా నటించిన ‘హల్ ఐ లవ్ యూ’ సినిమాతో వీరశంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ సినిమా తీశారు. ప్రేమకోసం, విజయరామరాజు, యువరాజ్యం, మన కుర్రాళ్లే తదితర సినిమాలను ఆయన తెరకెక్కించారు. (నటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం)
Comments
Please login to add a commentAdd a comment