శ్రీకాంత్‌కు పితృవియోగం | Actor Srikanth Father Meka Parameswara Rao Passes Away | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌కు పితృవియోగం

Published Tue, Feb 18 2020 5:18 AM | Last Updated on Tue, Feb 18 2020 5:18 AM

Actor Srikanth Father Meka Parameswara Rao Passes Away - Sakshi

నటుడు శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు ఇక లేరు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు తుది శ్వాస విడిచారు. కృష్ణాజిల్లా మేకావారి పాలెంలో 1948 మార్చి 16న జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్‌ ఉన్నారు. పరమేశ్వరరావు భౌతిక కాయానికి  హీరో చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, నటి రాశీ, హీరో గోపీచంద్, మాదాల రవి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement