
బాలీవుడ్‌లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం రేపింది. ఏడంతస్తుల భవనం నుంచి కిండి పడి మరణించడం విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలోని తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ముంబై పోలీసులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్‌నటీమణులు మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రే అనిల్ అరోరా. ఆయన భార్య జాయిస్ పాలికార్ప్. కాగా విషాదానికి ఒక రోజు ముందు మలైకా అరోరా తల్లిదండ్రుల వద్దకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.
మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్ అరోరాకు రోజూ ఉదయం బాల్కనీలో కూర్చుని వార్తాపత్రికలు చదివే అలవాటుంది. గదిలో భర్త చెప్పులు చూసి బాల్కనీలో అతని కోసం వెతకడానికి వెళ్లగా, అక్కడ కనిపించక పోవడంతో కిందకి వంగి చూడగా అప్పటికే అయన కింద పడిపోయారు. బిల్డింగ్ వాచ్‌మెన్ సహాయం కోసం అరుస్తున్నాడు. అనిల్ అరోరాకు మోకాళ్ల నొప్పులు ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలిపారు. గతంలో తాము విడాకులు తీసుకున్నామని, అయితే గత కొన్నేళ్లుగా మళ్లీ సహజీవనం ప్రారంభించామని పోలీసులతో చెప్పారు.
విషాద వార్త విన్న తర్వాత ఆమె పూణె నుంచి ఇంటికి చేరుకుంది. కన్నీటి పర్యంతమవుతూఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు మలైకా మాజీ భర్త, నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసు మోహరించారు. అనిల్ అరోరా హఠాన్మరణం వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమెను కలిసి ఓదార్చారు. ఇందులో బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ,ఆమె మాజీ భర్త కుటుంబీకులు ఉన్నారు

Comments
Please login to add a commentAdd a comment