పెళ్లి నా కెరీర్‌పై ప్రభావం చూపలేదు: నటి కామెంట్స్‌ వైరల్‌ | Malaika Arora Says Early Marraige And Motherhood Did Not Effect Her Career | Sakshi
Sakshi News home page

Malaika Arora : 'చిన్న వయసులోనే పెళ్లి.. వాటిని అధిగమించాను'

Published Sat, Jan 22 2022 3:44 PM | Last Updated on Sat, Jan 22 2022 3:56 PM

Malaika Arora Says Early Marraige And Motherhood Did Not Effect Her Career - Sakshi

Malaika Arora About Her Early Marraige And Motherhood: బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచే ఈ హాట్‌ బ్యూటీ తాజాగా తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. 1998లో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌తో మలైకా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత వీరికి కొడుకు పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో వీరు విడాకులు తీసుకున్నారు.

అయితే 25ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత బిడ్డను కనడం తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని మలైకా పేర్కొంది. గ్లామరస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఆ సమయంలో ఎదురైన అడ్డంకుల్ని అధిగమించినట్లు తెలిపింది. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక చాలా తక్కువ మంది సినిమాల్లో నటించేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలాగే నటనకు నేను గ్లామర్‌ ఇండస్ట్రీగానే భావిస్తాను. ఆ విధంగా గ్లామరస్‌గా ఉండేందుఎకు ప్రయత్నిస్తూనే అవకాశాలు సొంతం చేసుకున్నాను అని వెల్లడించింది. కాగా ప్రస్తుతం మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉంది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవచ్చనే రూమర్స్‌ కూడా వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement