పెదవి విప్పిన మలైకా అరోరా!
యువహీరోతో ఎఫైర్‌పై స్పందించిన నటి!
Published Thu, Nov 24 2016 10:17 AM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM
‘కెవ్వుకేక’ అంటూ గబ్బర్‌సింగ్‌లో ఐటెం సాంగ్‌తో అలరించిన మలైకా అరోరా వైవాహిక జీవితం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. యువహీరో అర్జున్ కపూర్‌తో మలైకాకు ఎఫైర్ ఉండటం వల్లే ఆమె వైవాహిక బంధం బీటలు వారిందని కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు మలైకా, అర్బాజ్‌ఖాన్ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ దంపతులు సామరస్యంగా విడిపోవాలని భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెప్తుండుగా.. సల్మాన్ ఖాన్ కుటుంబం మాత్రం వీరిని కలిపి ఉంచేందుకే ప్రయత్నిస్తున్నట్టు వినిపిస్తోంది. ఆ మధ్య వీడిపోయి కొన్నిరోజులు వేరువేరుగా ఉన్న మలైకా, అర్బాజ్ మళ్లీ కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ కాలేదు.
అర్జున్ కపూర్‌తో మలైకా సన్నిహితంగా ఉండటం నచ్చకపోవడం వల్లే ఆమె నుంచి విడిపోవాలని అర్బాజ్ భావిస్తున్నాడట. అర్జున్, మలైకా గురించి మీడియాలో ఎన్నో కథనాలు వచ్చినా ఇంతవరకు ఆ ఇద్దరూ ఈ విషయమై మాటమాత్రమైనా స్పందించలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలనూ తోసిపుచ్చారు. ఈ విషయం మీద స్పందిస్తే మీడియా మరింత దారుణంగా చిత్రిస్తుందేమోనని వెనుకాడరు. కానీ ఇప్పుడు అర్జున్ కపూర్ విషయమై తొలిసారి మలైకా అరోరా స్పందించారు. ‘అర్జున్ నాకు చాలామంచి స్నేహితుడు. కానీ ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు. అది నిజం కాదు’ అని మీడియాకు చెప్పారు.
మొత్తానికి మలైకా, అర్బాజ్ దంపతులు కోర్టులో విడాకులకు దాఖలుచేసినా వారికి ఇంకా ఆరు నెలల సమయముంది. ఈలోపు మళ్లీ ఈ దంపతులు కలిసిపోతే బాగుండు అని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఇటు మలైకా, అటు అర్బాజ్ వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం వల్లే వారి మధ్య ఈ బ్రేకప్‌కు కారణమైందని రుమర్లు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement