![CM Revanth Reddy will attend the Christmas celebrations at LB Stadium on 22nd as the chief guest - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/19/revanthreddy.jpg.webp?itok=deVZX0gT)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కాగా, రాష్ట్రమంతా ఈ వేడుకలను నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ వెల్లడించారు.
ప్రభుత్వం ఏటా ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment