Directors Day
-
ఎల్బీ స్టేడియంలో ఘనంగా ‘డైరెక్టర్స్ డే’ సెలబ్రేషన్స్ ( ఫొటోలు)
-
శిల్పకళావేదిక : దర్శకరత్న DNR ఫిల్మ్ అవార్డ్స్ (ఫొటోలు)
-
Directors Day 2024: డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం
దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మే 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దాసరి జయంతి అయిన మే 4న ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ– ‘‘దాసరి నారాయణరావుగారి జయంతిని ఈ ఏడాది మే 4న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం, మిడ్ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కల్చరల్ కమిటీలో డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల ఉంటారు’’ అన్నారు. -
దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ
దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని (మే 4) దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ (టీఎఫ్‌డీటీ)ను ఏర్పాటు చేయాలని ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు తీర్మానించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి వైద్యం, విద్య, కుటుంబ అవసరాలకు సహాయం చేసే విధంగా ఒక నిధిని ఏర్పాటు చేసి, ఈ డబ్బుపై వచ్చే వడ్డీతో అర్హులైన వారికి తోడ్పాటుని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముందుగా దర్శకులు రాజమౌళి 50 లక్షలు, దర్శకుడు రాఘవేంద్రరావు 10 లక్షలు, ఆర్కా మీడియా వారు 15 లక్షల విరాళం అందించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ ఆలోచనను మెచ్చి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుల సంఘం ప్యానెల్ మిగతా దర్శకుల సహాయ, సహకారాలతో ఈ టీఎఫ్‌డీటీ ట్రస్టును బుధవారం (24–07–2019) రిజిస్టర్ చేశారు. ‘‘టీఎఫ్డీటీకి మరింత మెరుగైన భవనం, లైబ్రరీ, ఫంక్షన్ హాల్, దర్శకత్వ శాఖలో ప్రావీణ్యత తరగతులు, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా కేటీఆర్‌గారికి జన్మదిన (జూలై 24) శుభాకాంక్షలు’’ అని టీఎఫ్‌డీటీ మేనేజింగ్ ట్రస్టీ ఎన్. శంకర్ పేర్కొన్నారు. రాఘవేంద్రరావు అధ్యక్షుడిగా ఉన్న ఈ సంఘంలో దర్శకులు వీవీ వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, వంశీపైడిపల్లి, మెహెర్ రమేష్, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్రసాద్, కాశీ, బి.వి.ఎస్. రవి ట్రస్టీ సభ్యులుగా, మెహెర్ రమేష్ ట్రెజరర్‌గా వ్యవహరిస్తారు. -
దాసరి నాకు తాత అవుతారు
‘‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఎంతో మంది దర్శకుల శ్రమ ఫలితం వల్లే ఓ హీరో రూపుదిద్దుకుంటాడు. ఎంతో గొప్ప ప్రతిభా పాటవాలున్న దాసరిగారి జన్మదినం రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించి, జరుపుకోవటం నిజంగా దర్శకుల అదృష్టం’’ అన్నారు నటుడు చిరంజీవి. మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా శనివారం తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ‘డైరెక్టర్స్ డే’ వేడుక జరిగింది. ఇందులో దాదాపు 300 మంది దర్శకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. 2018లో మంచి చిత్రాలను అందించిన నలుగురు దర్శకులను ఈ వేదికపై సన్మానించారు. చిరంజీవి చేతుల మీదుగా ‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల, ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల, ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి సన్మానాలు అందుకున్నారు. ఇవే కాకుండా ‘ఫోర్స్డ్ ఆర్ఫన్స్’ అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి అవార్డులు అందుకున్న వీఎన్ ఆదిత్యను, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారిపై ‘విశ్వదర్శనం’ చిత్రానికి దర్శకత్వం వహించి, ఇటీవల దాదాసాహెబ్ స్పెషల్ జ్యూరీ అవార్డు పొందిన జనార్థన మహర్షిని కూడా సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘1940ల కాలం నుండి ఎంతోమంది దర్శకులు ఉన్నారు. నేను నటునిగా మేకప్ వేసుకున్న దగ్గరనుండి ఈ రోజు వరకు ఎంతో మంది దర్శకులను చూశాను. కానీ దాసరిగారి శైలి చాలా ప్రత్యేకమైనది. నాకు ఆయనతో సినిమా పరిచయం అయింది ‘లంకేశ్వరుడు’ ద్వారా. ఆయన దర్శత్వంలో నేను చేసిన ఒకే ఒక్క సినిమా. అది ఆయనకు వందో చిత్రం. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు, నాకూ ఒక్క సినిమా పరిచయమే అయినా మా ఇద్దరికీ దగ్గరి బంధుత్వం ఉంది. అది చాలా కొద్దిమందికే తెలుసు. ఆయన వరసకు నాకు తాత అవుతారు. నేను ఆయనకు మనవడిని అవుతాను. అందుకే నేనెప్పుడూ ఆయనతో ‘మీ మొదటి సినిమా తాతా మనవడు. మీరు, నేను తాతామనవలం’ అనేవాణ్ణి. నేను 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో ఉత్సాహాన్నిచ్చారు. ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రోడ్ జర్నీ చేసుకుంటూ వచ్చి ఆ సభలో ప్రసంగించారు. 150 ఘనవిజయం సాధిస్తుందని సభా ముఖంగా అన్నారు.. దాసరిగారు అన్నట్లుగానే ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పటికే ఆయన ఆరోగ్య స్థితి విషమించి ఆస్పత్రిలో చేరారు. నేను, మా ఆవిడ ఆయన్ను చూడ్డానికి వెళితే అంత ఇబ్బందికర పరిస్థితిలోనూ ‘సినిమా ఎలా ఉంది?’ అని పేపర్ మీద రాస్తూ అడిగారు. తర్వాత ఆయనకు అల్లు రామలింగయ్య అవార్డును ప్రకటించి నేను, అల్లు అరవింద్ ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా అవార్డును అందజేస్తే ఎంతో చిన్న పిల్లాడిలా ఆనందపడిపోయి, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ విధంగా ఆయన ఆఖరి రోజుల్లో నేను చాలా దగ్గరగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘దాసరి పుట్టినరోజున నిర్వహించే ఈ సభలో బొకేలు, శాలువాల ఖర్చులు కూడా వద్దు. మన దగ్గర గతంలో పనిచేసిన దర్శకులకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచించి దర్శకులందరం ఓ నిర్ణయం తీసుకున్నాం. గతంలో దర్శకులుగా చేసి ఈ రోజున పిల్లలని చదివించుకోవటానికి కూడా లేకుండా ఇబ్బంది పడే అనేక మంది దర్శకులు ఉన్నారు. వారి సహాయార్థం ఓ నిధిని ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నాం. దాదాపు ఐదు కోట్ల నుంచి పది కోట్ల మధ్యలో వసూలు చేసి, నెలకు ఓ ఐదు వేల రూపాయల చొప్పున ఓ యాభై మంది నుండి వంద మంది వరకు సహాయం చేయాలనుకుంటున్నాం. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి ఎంతో మంచి మనసుతో యాభై లక్షల విరాళాన్ని తన వంతుగా అందించారు. నేను దర్శకునితో పాటు నిర్మాతని. బాహుబలి’ నిర్మాతల తరపున పదిహేను లక్షలు, నేను సొంతంగా పది లక్షలు ఇస్తున్నాం’’ అని చెప్పారు. మంచి మనసుతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఓ ఇరవై ఐదు లక్షలు తాను ఇస్తానని చిరంజీవి ప్రకటించారు. ఈ వేదికపై మొత్తంగా కోటి రూపాయల విరాళం అందడం ఆనందంగా ఉందని దర్శకుల సంఘం అధ్యక్షుడు యన్. శంకర్ అన్నారు. ఎ. కోదండ రామిరెడ్డి, రేలంగి నరసింహారావు, ఆర్. నారాయణమూర్తి, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, కొరటాల శివ, వీర శంకర్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. పలువురు దర్శకులు స్కిట్లు చేసి అలరించారు. దర్శకుల సంఘం వెబ్‌సైట్‌ని ఆవిష్కరించారు. -
దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు
‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్‌గాను, నేను నటించిన ‘జగత్ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత నేను హీరోగా ‘రాధమ్మ పెళ్లి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. 150 సినిమాలకు పైగా తెరకెక్కించిన ఘనత దాసరిగారిది. నాకు తెలిసి భవిష్యత్‌లో ఏ దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయలేరేమో’’ అని సీనియర్ నటుడు కృష్ణ అన్నారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగిన దాసరి విగ్రహావిష్కరణలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన తన భుజాలపై వేసుకుని పరిష్కరించేవారు. మంచి, చెడు అన్నీ ఆయనే చూసుకునేవారు. పరిశ్రమను తన కుటుంబంలా చూసుకున్నారు. దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు’’ అన్నారు. ‘‘మా నాన్నగారి (నందమూరి తారక రామారావు)తో దాసరిగారు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీశారు. ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం నాకు కలిగింది. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు’’ అన్నారు బాలకృష్ణ. దాసరికి భారతరత్న ఇవ్వాలని, ఈ అంశాన్ని తాము పార్లమెంట్లో కూడా లేవనెత్తామని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలని మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఫిలింనగర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజా సూర్యనారాయణ, నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, నటి–దర్శకురాలు విజయ నిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మే 4.. డైరెక్టర్స్ డే దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 4ని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది తెలుగు సినీ దర్శకుల సంఘం. వేదికపై డైరెక్టర్స్ అందరూ కలిసి ‘హ్యాపీ డైరెక్టర్స్ డే’ అని అనౌన్స్ చేశారు. ‘‘దాసరి జన్మదినాన్ని డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేయాలని నిర్ణయించిన దర్శక పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఇది దాసరిగారి హక్కు’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. తనికెళ్ల భరణి ‘సినిమా’ మీద రాసిన కవిత్వం, డైరెక్టర్స్‌పై చంద్రబోస్ రచించిన పాటను ప్రదర్శించారు. ఈ గీతానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. దాసరిపై రచయిత గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్. అప్పుడు దండం పెట్టినవాళ్లు ఇప్పుడు ఎక్కడ? – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దాసరి నారాయణరావు 76వ జయంతి వేడుకలను ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్’ ఛైర్మన్ బీయస్యన్ సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ‘దాసరి టాలెంట్ అకాడమీ వెబ్సైట్’ ఆవిష్కరణ జరిగింది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘దాసరిగారి దగ్గర ఉండాలని చాలామంది పోటీపడేవారు. ఎప్పుడూ గురువుగారి పక్కన ఉండే మాలాంటి వాళ్లని కూడా తోసేసేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు. కొన్నేళ్ల క్రితం ‘వీళ్లతో ఎందుకు గురువుగారూ.. మీతో పనులు చేయించుకుని, మీ ఇంటి తలుపు దాటక ముందే తిడుతున్నారు’ అని నేనంటే, ‘ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో నాకు తెలియదని కాదు. కానీ ఇండస్ట్రీలో ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు అన్న రోజునే వీళ్లందరూ భయపడతారు. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుంది’ అన్నారు. ఆ కకావికలం దాసరిగారు లేని ఈ వన్ ఇయర్లో చూశాం’’ అన్నారు. దాసరిగారు నిజంగా ఓ శిఖరం – ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి మాట్లాడుతూ – ‘‘ఇక్కడున్న అందరికీ దాసరిగారితో సినిమా అనుబంధం ఉంటే నాకు పత్రికానుబంధం ఉంది. ‘ఉదయం’లో పని చేసిన ఏ ఇద్దరు కలిసినా గత 25 ఏళ్లుగా ఏం జరిగిందని మాట్లాడుకోకుండా ‘ఉదయం’ రోజులు ఎలా గడిపాం అని మాట్లాడుకుంటాం. 1984 నుంచి నేనెక్కడున్నా దాసరిగారు ఎక్కడున్నా తప్పకుండా మే 4న ఆయన్ను కలిసి అభినందించాల్సిందే. గతేడాది వరకూ దాసరిగారిని అభినందించని సంవత్సరం లేదు. దాసరిగారు చాలామందికి సహాయం చేసేవారు. ఇటీవల సినిమా పరిశ్రమలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు నారాయణరావుగారు ఉంటే బావుండు అనుకున్నాం. ఈ కథను ఇంత దూరం రానిచ్చేవారు కాదు. పరిష్కరించేవారని మా జర్నలిస్ట్‌లంతా అనుకున్నాం. ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ అని నాలుగు సంవత్సరాల ముందు మొదలుపెట్టాం. దాసరిగారికి ‘దర్శక శిఖరం’ అని బిరుదును కూడా ప్రదానం చేశాం. ఆయన నిజంగా శిఖరం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, సి. కల్యాణ్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దాసరి స్వగృహంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ‘డైరెక్టర్స్ డే’ని ప్రకటిస్తున్న చిత్రరంగ ప్రముఖులు