lehar toofan
-
తెల్లబోయిన రైతు
సత్తెనపల్లిరూరల్, న్యూస్‌లైన్ సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతులకు మద్దతు ధర క ల్పిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆర్భాటంగానే మిగిలిపోతున్నాయి. ఆచరణలో మాత్రం ఎక్కడా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో పత్తి రైతులు ఆరంభంలోనే కనీస ధర లేక దగా పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ దిగుబడి అందే సమ యానికి నిరాశే మిగిలింది. మండలంలో సుమారు 8,600 హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా. గత ఏడాదితో కంటే ఏడాది అదనంగా సుమారు 500 హెక్టార్లలో సాగు చేశారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో కొంత మేర వాడకం త గ్గింది. ఈ ఏడాది దిగుబడి బాగుంటుందని రైతులు ఆశించారు. అయితే పై-లీన్, లెహర్ తుపానుల ప్రభావంతో అంచనాలు తలకిందులయ్యాయి. దీనికి తోడు మద్దతు ధర లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు, గత ఏడాదితో పోలిస్తే కూలి వ్యయం మరింతగా పెరిగింది. గతంలో రూ. 100 వున్న కూలి ప్రస్తుతం రూ. 150 కి చేరింది. పైగా పత్తి సాగు అధికం కావటం, ఎక్కువగా బీటీ రకం సాగు చేయటంతో పత్తి తీత అంతా ఒకే సారి వచ్చింది. దీంతో కూలీల కొరత ఏర్పడింది. గతంలో క్వింటా పత్తి తీసేందుకు రూ. 800 వరకు ఖర్చు కాగా, నేడు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వ చ్చింది. రంగంలోకి దిగిన ప్రైవేటు వ్యాపారులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో ప్రైవేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేసి తక్కువ ధరకే సొమ్ము చేసుకుంటున్నారు. సాగుకు అప్పులు ఇచ్చిన రుణ దాతల నుంచి ఒత్తిడి పెరగటంతో మంచి ధర కోసం వేచి చూసే పరిస్థితి లేకపోయింది. దీనికి తోడు తుపానుల ప్రభావంతో పత్తిరంగు కొంత మేర మారటంతో నిల్వ చేసేందుకు రైతులు ఆసక్తి చూపటం లేదు. దీంతో ధర గిట్టుబాటు కాకపోయినా వ్యాపారులు నిర్ణయించిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. తేమ శాతం అంటూ వ్యాపారులు క్వింటా పత్తిని రూ. 3000 నుంచి రూ. 3200 వరకు కొనుగోలు చేస్తున్నారు. జాడ లేని సీసీఐ కేంద్రాలు.. మద్దతు ధర ప్రకటించి సీసీఐ కేంద్రాలతో రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రం ఏర్పాటు చే యిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించిన ధరకు పంటను తెగనమ్ముకుంటున్నా సీసీఐ కేంద్రాల ఏర్పాటు చేయకపోవడం దారుణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
లెహర్‌పై ముందస్తు చర్యలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: లెహర్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం ఉదయం కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, వుడా వీసీ ఎన్.యువరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్డీఓ వెంకట మురళితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగా తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తుపాను నేపథ్యంలో చేపడుతున్న చర్యలను మంత్రికి కలెక్టర్ వివరించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నేవీ సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామన్నారు. డార్నియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకోనున్నాయని, వాటిని పాయకరావుపేట, రాంబిల్లి, ఎస్.రాయవరం, యలమంచిలి, నక్కపల్లి, మునగపాక మండలాలతో పాటు విశాఖ నగరానికి కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను సర్వ సన్నద్ధంగా ఉంచామన్నారు. బుదవారం నుంచి మండల కేంద్రాల్లో ప్రత్యేక అధికారులు తుపాను పరిస్థితిని సమీక్షిస్తుంటారని తెలిపారు. -
నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: లెహర్ తుపా నుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపడుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ ఇతర సహాయక బృందాలను రంగంలోకి దింపింది. కలెక్టరేట్లో 1800-4250-0002 టోల్‌ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి హర్‌ప్రీత్‌సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీరంలోని 11 మండలాలకు పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు. జనం రోడ్లమీదకు రాకూడదు అత్యంత వేగంగా వస్తున్న లెహర్ తుపాను ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల మేరకు గాలులు వీస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు రోడ్ల మీదకు రావడం శ్రేయస్కరం కాదని అధికారులు సూచిస్తున్నారు. ఆ రోజున జిల్లావాసులు ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొంటున్నారు. నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ తుపాను తీరం దాటే 28న రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. భారీ వర్షాలు, గాలులు కారణంగా ప్రజా రవాణా వ్యవస్థను పరిమితంగా నడపాలని ఆయా శాఖల అధికారులు నిర్ణయించారు. ఆ రోజున పరిస్థితులను బట్టి బస్సులను పరిమితంగా నడపడం, లేకుంటే పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇటీవల వచ్చిన పై-లీన్, అల్పపీడనం, హెలెన్ తుపానుల సమయంలో రైళ్లు భారీ సంఖ్యలో రద్దయ్యాయి. లెహర్ ప్రభావం వాటి కంటే తీవ్రంగా ఉండనుండటంతో ఆ రోజున రైళ్లను ముందుగానే రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ దీనిపై తూర్పుకోస్తా డీఆర్ఎంతో చర్చించారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలలో రైల్వే ట్రాఫిక్‌పై ముందస్తుగా దృష్టి సారించాలని కోరారు. దీంతో ఆ రోజు కొన్ని రైళ్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. 55 గ్రామాలు తరలింపు తుపాను నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాలుగా గుర్తించిన 55 గ్రామాలను తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి 40 వేల మందిని 71 పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. అధికార బృందాలు బుధవారం ఉదయం నుంచి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఇందుకోసం వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. సహాయక చర్యలకు భద్రతా దళాలు లెహర్ తుపానుకు సహాయ చర్యలు చేపట్టేందుకు మునుపెన్నడూ లేని విధంగా జిల్లాకు భద్రతా దళాలు చేరుకుంటున్నాయి. 120 మంది సభ్యులతో కూడిన ఆర్మీ బృందాన్ని కేంద్రం జిల్లాకు పంపించింది. అలాగే 20 నేవీ బృందాలతో పాటు, ఒడిశా నుంచి 4 ఎన్డీఆర్ఎఫ్ టీములు ఇప్పటికే చేరుకున్నాయి. మరో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బుధవారం రానున్నాయి. అత్యవసర పరిస్థితులకు డార్నియర్ ఎయిర్క్రాాఫ్ట్ను సిద్ధంగా ఉంచారు. ఈ బృందాలను పాయకరావుపేట, యలమంచిలి, ఎస్.రాయవరం, రాంబిల్లి, విశాఖ నగరానికి కేటాయిస్తున్నారు. వీరితో పాటు 20 ఫైర్‌మెన్ బృందాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొననున్నాయి. పాఠశాలలు, కాలేజీలు సెలవు తుపాను హెచ్చరికల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 28న పాఠశాలలతోపాటు కళాశాలలకూ కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సెలవు ప్రకటించారు. ఆ రోజున నిర్వాహకులు తరగతులను నిర్వహించకూడదని సూచించారు. -
‘లెహర్’పై అప్రమత్తం
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: లెహర్ తుపాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై అధికంగా ఉంటుందని, ఈ దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. లెహర్ తుపాన్ నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తలను కలెక్టరేట్లోని తన చాంబర్లో ‘న్యూస్‌లైన్’కు ఆయన మంగళవారం వివరించారు. లెహర్ తుపాను ప్రభావం చిత్తూరు జిల్లాపై అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెక్చరికల కేంద్రం, అమెరికన్ మెట్రోలాజికల్ టీం హెచ్చరించాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఫైలిన్ తుపాను కారణంగా జిల్లాలోని 80 శాతం చెరువుల్లోకి నీళ్లు చేరాయన్నారు. హెలెన్ తుపాను కారణంగా కురిసిన మోస్తరు వర్షాలకు చెరువులు ప్రమాదస్థితికి చేరుకున్నాయని వివరించారు. లెహర్ ప్రభావం జిల్లాపై అధికం గా ఉంటుందని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరించాయన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ దృష్ట్యా కలెక్టరేట్, తిరుపతి, చిత్తూరు డివిజన్ కార్యాలయాల్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 16 మండలాలపై ప్రభావం జిల్లాలోని 16 మండలాల్లో లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని జేసీ తెలిపారు. తిరుపతి డివిజన్లోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, చిత్తూరు డివిజన్ పరిధిలోని విజయపురం, నగరి, నిండ్ర, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం, కార్వేటినగరం, నారాయణవనం మండలాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు నిండి ప్రమాదకర స్థితిలో ఉన్న మండలాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. వర్షాలు కురిసే సమయంలో సర్పంచ్‌లు, వీఆర్వోలు, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ధాన్యం తరలింపు తూర్పు మండలాల్లో రైతుల చేతికి అందిన పంట ముంపునకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నామని చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్, డీఆర్డీఏ శాఖల ద్వారా బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జేసీ సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. 26 సీటీఆర్ 11 : జేసీ బసంత్‌కుమార్ ‘లెహర్’పై అప్రమత్తం ఉందని చెప్పారు. ఈ దృష్ట్యా కలెక్టరేట్, తిరుపతి, చిత్తూరు డివిజన్ కార్యాలయాల్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 16 మండలాలపై ప్రభావం జిల్లాలోని 16 మండలాల్లో లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని జేసీ తెలిపారు. తిరుపతి డివిజన్లోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, చిత్తూరు డివిజన్ పరిధిలోని విజయపురం, నగరి, నిండ్ర, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం, కార్వేటినగరం, నారాయణవనం మండలాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు నిండి ప్రమాదకర స్థితిలో ఉన్న మండలాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. వర్షాలు కురిసే సమయంలో సర్పంచ్‌లు, వీఆర్వోలు, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ధాన్యం తరలింపు తూర్పు మండలాల్లో రైతుల చేతికి అందిన పంట ముంపునకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నామని చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్, డీఆర్డీఏ శాఖల ద్వారా బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జేసీ సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. -
రైతన్నలూ... జాగ్రత్త
వరంగల్, న్యూస్‌లైన్ మరో ముప్పు ముంచుకొస్తోంది. జిల్లాపై లెహర్ తుపాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కిషన్ జిల్లా విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో సమీక్షిం చారు. 28వ తేదీ నుంచి మూడు, నాలుగు రోజుల పాటు తుపాన్ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలో కోతకు వచ్చిన వరి, పగిలిన పత్తి ఏరుకోవాలని, రక్ష ణ ప్రాంతాల్లో దాచుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. కోసిన ధాన్యాన్ని పక్కా భవనాలు, ప్రభుత్వ భవనాల్లో నిల్వ చేసుకోవాలని, అవసరమైతే వ్యవసాధికారి, గ్రామ అధికారుల సాయం తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లతో పాటు పలు శాఖల అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుపాన్ ప్రభావంతో నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు పలు శాఖల అధికారులు కలిసికట్టుగా ప్రత్యేక బృందంగా పని చేయాలని, చెరువు కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువుల సంరక్షణకు పశు సంవర్థక శాఖ, అగ్నిమాపక శాఖ సహాయ చర్యలందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని గ్రామాల్లో తాగునీటిని క్లోరినైజేషన్ చేయించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో జనరేటర్లు సిద్ధం గా పెట్టాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ ప్రసార సాదనాల ద్వారా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, నగరంలోని గుర్తించిన లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు, అర్బన్, రూరల్ ఎస్పీలు వెంకటేశ్వర్రావు, కాళిదాసు, మున్సిపల్ కమిషనర్ పండాదాస్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.