సత్తెనపల్లిరూరల్, న్యూస్‌లైన్
సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతులకు మద్దతు ధర క ల్పిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆర్భాటంగానే మిగిలిపోతున్నాయి. ఆచరణలో మాత్రం ఎక్కడా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో పత్తి రైతులు ఆరంభంలోనే కనీస ధర లేక దగా పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ దిగుబడి అందే సమ యానికి నిరాశే మిగిలింది. మండలంలో సుమారు 8,600 హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా. గత ఏడాదితో కంటే ఏడాది అదనంగా సుమారు 500 హెక్టార్లలో సాగు చేశారు.
ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో కొంత మేర వాడకం త గ్గింది. ఈ ఏడాది దిగుబడి బాగుంటుందని రైతులు ఆశించారు. అయితే పై-లీన్, లెహర్ తుపానుల ప్రభావంతో అంచనాలు తలకిందులయ్యాయి. దీనికి తోడు మద్దతు ధర లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు, గత ఏడాదితో పోలిస్తే కూలి వ్యయం మరింతగా పెరిగింది. గతంలో రూ. 100 వున్న కూలి ప్రస్తుతం రూ. 150 కి చేరింది. పైగా పత్తి సాగు అధికం కావటం, ఎక్కువగా బీటీ రకం సాగు చేయటంతో పత్తి తీత అంతా ఒకే సారి వచ్చింది. దీంతో కూలీల కొరత ఏర్పడింది. గతంలో క్వింటా పత్తి తీసేందుకు రూ. 800 వరకు ఖర్చు కాగా, నేడు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వ చ్చింది.
రంగంలోకి దిగిన ప్రైవేటు వ్యాపారులు
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో ప్రైవేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేసి తక్కువ ధరకే సొమ్ము చేసుకుంటున్నారు. సాగుకు అప్పులు ఇచ్చిన రుణ దాతల నుంచి ఒత్తిడి పెరగటంతో మంచి ధర కోసం వేచి చూసే పరిస్థితి లేకపోయింది. దీనికి తోడు తుపానుల ప్రభావంతో పత్తిరంగు కొంత మేర మారటంతో నిల్వ చేసేందుకు రైతులు ఆసక్తి చూపటం లేదు. దీంతో ధర గిట్టుబాటు కాకపోయినా వ్యాపారులు నిర్ణయించిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. తేమ శాతం అంటూ వ్యాపారులు క్వింటా పత్తిని రూ. 3000 నుంచి రూ. 3200 వరకు కొనుగోలు చేస్తున్నారు.
జాడ లేని సీసీఐ కేంద్రాలు.. మద్దతు ధర ప్రకటించి సీసీఐ కేంద్రాలతో రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రం ఏర్పాటు చే యిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించిన ధరకు పంటను తెగనమ్ముకుంటున్నా సీసీఐ కేంద్రాల ఏర్పాటు చేయకపోవడం దారుణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లబోయిన రైతు
Published Sat, Dec 7 2013 3:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement