వరంగల్, న్యూస్‌లైన్
మరో ముప్పు ముంచుకొస్తోంది. జిల్లాపై లెహర్ తుపాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కిషన్ జిల్లా విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో సమీక్షిం చారు. 28వ తేదీ నుంచి మూడు, నాలుగు రోజుల పాటు తుపాన్ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలో కోతకు వచ్చిన వరి, పగిలిన పత్తి ఏరుకోవాలని, రక్ష ణ ప్రాంతాల్లో దాచుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. కోసిన ధాన్యాన్ని పక్కా భవనాలు, ప్రభుత్వ భవనాల్లో నిల్వ చేసుకోవాలని, అవసరమైతే వ్యవసాధికారి, గ్రామ అధికారుల సాయం తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లతో పాటు పలు శాఖల అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
తుపాన్ ప్రభావంతో నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు పలు శాఖల అధికారులు కలిసికట్టుగా ప్రత్యేక బృందంగా పని చేయాలని, చెరువు కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువుల సంరక్షణకు పశు సంవర్థక శాఖ, అగ్నిమాపక శాఖ సహాయ చర్యలందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని గ్రామాల్లో తాగునీటిని క్లోరినైజేషన్ చేయించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో జనరేటర్లు సిద్ధం గా పెట్టాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ ప్రసార సాదనాల ద్వారా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, నగరంలోని గుర్తించిన లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు, అర్బన్, రూరల్ ఎస్పీలు వెంకటేశ్వర్‌రావు, కాళిదాసు, మున్సిపల్ కమిషనర్ పండాదాస్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
రైతన్నలూ... జాగ్రత్త
Published Tue, Nov 26 2013 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement