అనంతపురం: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని రాప్తాడు రోడ్డులో ఉన్న టీటీడీసీలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, అర్హులు బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని పేర్కొన్నారు. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేయడానికి ఏఎన్‌ఎం, జీఎన్‌ఎంలకు ఇంటర్ విద్యార్హత ఉండాలన్నారు. యువతులను మాత్రమే ఎంపిక చేస్తామన్నారు.
చిత్తూరులోని మొబైల్ కంపెనీలో ఉద్యోగాల కోసం 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువతులు అర్హులన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి ఉండాలన్నారు. ఇదే జిల్లాలో వినూత్న ఫర్టిలైజర్స్ సేల్స్‌మన్ కోసం ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. బెంగళూరులోని మెడ్‌ప్లస్ కంపెనీలో పనిచేయడానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు అర్హులన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలన్నారు. ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభమవుతుందన్నారు.
రేపు జాబ్ మేళా
Published Tue, Aug 30 2016 11:14 PM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM
Advertisement