jobmela
-
నిరుద్యోగులకు వరం.. జాబ్‌మేళా
యాదగిరిగుట్ట (ఆలేరు) : నిరుద్యోగ సమస్యను అధిగమించే దిశగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని వ్యవసాయం, ఇతర పనులు చేస్తూ, ఇంట్లోనే ఖాళీగా గడుపుతున్న నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో వివిధ పరిశ్రమలతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చర్చలు జరిపి, నిరుద్యోగులకు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి ఆలేరులో జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తిప్పలుండవ్.. ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారం మండలాల్లో ఉన్నత చదువులు అభ్యసించిన నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రతి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగ వేట చేసి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. దీంతో ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయం, ఉపాధి కూలీ, తదితర పనులు చేసుకుంటున్నారు. గమనించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సహకారంతో డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అధికారులతో కలిసి ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో జాబ్‌మేళ నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఈనెల 25న జాబ్ మేళా... నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదీన ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 9.30గంటల నుంచి మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సుమారు 30 ప్రైవేట్ పరిశ్రమలతో అగ్రిమెంట్ చేసుకొని, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఈ జాబ్‌మేళా చేపడుతున్నారు. ఈ మెగా జాబ్‌మేళాకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించనున్నారు. విద్యార్హత ఇదే.. 8, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, నర్సింగ్, ఐటిఐ తదితర అర్హతలతో కూడిన నిరుద్యోగులు జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులు. www. employment.telangana.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. జాబ్‌మేళాకు వచ్చే వారు 3 సెట్లు విద్యార్హత జిరాక్స్ పత్రులు, సర్టిఫికెట్లు తీసుకురావాలి. సద్వినియోగం చేసుకోవాలి ఈనెల25వ తేదీన ఆలేరు పట్టణంలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. నియోజకవర్గంలోని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని 30 ప్రైవేట్ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ జాబ్‌మేళాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. -గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఉద్యోగం సంపాదిస్తా ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని, ఉద్యోగం సంపాదిస్తాను. అంతే కాకుండా ఇతర నిరుద్యోగులను సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కృషి చేస్తాను. -శ్రీకాంత్, నిరుద్యోగి, యాదగిరిగుట్ట -
భళా..'రో జా'బ్ మేళా
పుట్టిన రోజూ పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి..అన్నాడో సినీకవి..నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా బర్త్‌డే వేడుకలు జరుపుకున్న తీరును గమనించిన వారెవరికైనా ఈ పాట ఇట్టే స్ఫురిస్తుంది. తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకోసం శుక్రవారం జన్మదినం సందర్భంగా జాబ్ మేళా నిర్వహించి శెభాష్ అనిపించుకున్నారీమె.. జాబ్‌మేళాకు తరలివస్తున్న యువతను ఈ చిత్రంలో రోజా వెంట చూడవచ్చు. పుత్తూరు: ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు.. ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగులతో శుక్రవారం పుత్తూరు కిక్కిరిసిపోయింది. ఉదయం స్థానిక డిగ్రీ కళాశాలలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఎమ్మెల్యే రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందించారు. కేక్ కట్ చేసి ఆమె జన్మదిన వేడుకలను ప్రారంభించారు. రోజా మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్ కుటుంబంలో పర్యటిస్తుంటే ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగులు గోడు వెళ్లబోసుకున్న వైనాన్ని ప్రస్తావించారు. జన్మదినోత్సవం రోజున ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం కంటే ఉద్యోగ అవకాశాలను కల్పించాలని నిర్ణయిం చుకున్నానన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర పట్టణాల్లో కంపెనీల ప్రతినిధులను సంప్రదించి జాబ్‌మేళా నిర్వహణకు కసరత్తు చేసినట్లు వివరించారు. జాబ్‌మేళాకు హాజరై నిరుద్యోగుల నుంచి వివరాల నమోదు ప్రక్రియను ఆమె ప్రారంభిం చారు. నగరి రోడ్డులో కస్తూరి కల్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అ«ధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే రోజా దంపతులను సన్మానించారు. -
ఖమ్మంలో మెగా జాబ్‌మేళా
ఖమ్మం: ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న మెగా జామ్మేళాను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఖమ్మంలో శనివారం నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు వేల సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కలెక్టర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బాలసాని, కార్పొరేషన్ చైర్మన్లు పిడమర్తి తదితరులు పాల్గొన్నారు. -
రేపు జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : బెంగళూరుకు చెందిన ఫెడరల్ ముఘల్ కంపెనీలో ట్రైనీ/ఆపరేటర్ల ఉద్యోగాలకు ఈనెల 7న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ. కళ్యాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులై 18–24 ఏళ్ల వయసులోపు అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయన్నారు. ఉద్యోగానికి ఎంపికైన వారు బెంగళూరులోనే పని చేయాల్సి ఉంటుందన్నారు. వేతనం నెలకు రూ. 8500 నుంచి రూ.13000 దాకా ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల7న ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయానికి చేరుకోవాలన్నారు. -
20న జాతీయ స్థాయి జాబ్‌మేళా
కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20న జాతీయ స్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాలల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, డిప్లొమో, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు రూ.99 రుసుం చెల్లించి నేరుగా జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్‌మేళాకు 20కి పైగా పెద్ద పెద్ద కంపెనీలు హాజరుకానున్నాయని, అర్హతలను బట్టి వేతనం, ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతోపాటు ఇతరులు పాల్గొనవచ్చని సూచించారు. వివరాలకు 76800 76632/02/03, 76600 03345, 78429 19899, 81252 58415 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
మైనార్టీ నిరుద్యోగ మహిళలకు జాబ్‌మేళా
అనంతపురం సప్తగిరిసర్కిల్ : మైనార్టీ నిరుద్యోగ మహిళలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ బాబా తాజుద్దీన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పనకు కర్నూలు, ఒంగోలులో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 33 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు ఈ నెల 15 లోపు ఠీఠీఠీ.్చpటఝజఛి.ఛిౌఝ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–246615లో సంప్రదించాలన్నారు. -
రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్ఎల్ మైనింగ్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ఈ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాలలోపు వయస్సుగల వారు, ఐటీఐ(ఫిట్టర్ట్రేడ్) చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు బేతంచర్ల మండలం వీరయపల్లి గ్రామంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీరికి రూ.8,700 నుంచి రూ.9వేల వరకు జీతం ఇస్తామన్నారు. -
20న మెగా జాబ్ మేళా
–డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కె. అశోక్‌వర్దన్ రెడ్డి కల్లూరు: నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఎంబీఏ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన జాతీయ స్థాయి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆ కళాశాల చైర్మన్ కె. అశోక్‌వర్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కళాశాల ఆవరణలో జాతీయ స్థాయి మెగా జాబ్ ఫెయిర్ ‘లెట్స్ హైర్’ 2కే17 వాల్ పోస్టర్లను చైర్మన్ కె అశోక్‌వర్దన్‌రెడ్డి, డైరెక్టర్ హరీష్ కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జాబ్ ఫెయిర్‌లో 2015, 2016, 2017 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, డిప్లొమా, ఎంకామ్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాకు బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరై విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకుంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలోని టీ అండ్ పీ విభాగంలో లేదా సెల్: 76800 76632, 78428 19899, 81252 58415, 76800 76603 సెల్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రేపు జాబ్‌మేళా
– డీవీఈవో సుబ్రమ్మణేశ్వరరావు వెల్లడి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) టి.వి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. ఇదే అంశంపై శనివారం స్థానిక ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2014 నాటికి ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్‌మేళాకు అర్హులన్నారు. వివిధ కంపెనీలు పాల్గొంటున్నందున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఆధార్‌కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తెచ్చుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, పారా మెడికల్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశమన్నారు. బీక్యాంప్‌లోని ప్రభుత్వ ఒకేషనల్ వృత్తి విద్య కళాశాలలో ఉదయం 10.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, అభ్యర్థులు ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డిప్యూటీ డీవీఈఓ కె.వెంకట్రావ్, వృత్తి విద్య కోర్సుల ప్లేస్మెంట్ అధికారి బి.వి.మాధవరావు కూడా హాజరయ్యారు. -
28న డీఆర్డీఏ మెగా జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ఈ నెల 28వ తేదీన ఉదయం 10గంటలకు బి.తాండ్రపాడు టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ,ఐటీఐ, బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 19 నుంచి 30 ఏళ్లలోపు వయసు కల్గిన అభ్యర్థులు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ-ఈజీఎం కార్యాలయంలో ప్రత్యక్షంగా కానీ, ఫోన్(8099855969, 9177016174) ద్వారా కానీ సంప్రదించాలన్నారు. -
21న నిరుద్యోగులకు జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మాన్యుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తారన్నారు. అభ్యర్థులు 18 నుంచి 21 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఇంటర్(బైపీసీ/ఎంపీసీ) లేదా డిగ్రీ ఫెయిల్, డిస్కంటిన్యూ చేసి ఉండాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్, విశాఖపట్టణంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
– 29 కంపెనీల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు – 1500 మంది హాజరు.. 300 మందికి ఉద్యోగాలు – ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందించిన చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. రాయలసీమ జిల్లాలతోపాటు తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మేళాలో 29 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో సుమారు 300 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లా చరిత్రలో మెగాజాబ్ మేళా నూతన అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. సీమ నిరుద్యోగలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన వారు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆంప్లస్, ఇన్ఫోసిస్ గ్రూపు ఆఫ్ ఇంజనీర్స్ సర్వీస్, హెచ్‌ఐఈఈ, కాన్రాడ్ లైటింగ్ సొల్యూషన్స్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, ద రైజ్ సొల్యూషన్స్, డాక్టర్ రెడ్డీస్, స్వాగతం రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జీమూంబా ప్రైవేట్ లిమిటెడ్, ధనుష్ ఇంజనీరింగ్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర 29 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. నియామక ఉత్తర్వులు పొందిన వారు వెంటనే ఉద్యోగాల్లో చేరాలని, ఒక్కొక్కరికి కంపెనీని బట్టి సుమారు రూ.38 వేల వరకు నెలసరి వేతనం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ తిమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రేపు నిరుద్యోగులకు జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగుల కోసం ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఫస్ట్‌స్టెప్ శిక్షణ, ఉపాధి కేంద్రం చైర్మన్ ఎస్. రాజశేఖర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, సత్యసుమ మార్కెటర్స్ కంపెనీల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్ల కోసం నిర్వహించే ఈ మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.7వేల జీతం, ఇన్సెంటీవ్ ఇస్తామన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువకులకు స్థానిక భాగ్యనగర్‌లోని ఫస్ట్‌స్టెప్ సంస్థ కార్యాలయానికి చేరుకోవాలని, వివరాలకు 9393930109, 8099932144 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
మైనారిటీ యువతకు గుంటూరులో జాబ్‌మేళా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈనెల 25, 26 తేదీల్లో గుంటూరులో మైనారిటీ యువతకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ ఎస్.కె.బషీర్‌అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కార్పొరేషన్ (విజయవాడ) ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నామన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులైన మైనారిటీ అభ్యర్థులు (ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, జైన్స్, బుద్దీస్, పార్సీస్) ఈనెల 23లోపు దరఖాస్తులను www.apsmfc.com వెబ్సైట్లో పంపాలన్నారు. అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకుని జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం 98499 01149, 98853 77707 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 30 మందికి ఉద్యోగాలు
జేఎన్టీయూ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ,అనంతపురంలో మైరేత్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ శనివారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కినట్లు ప్రిన్సిపాల్ ఆష్రప్ అలీ తెలిపారు. 6,7 తేదీల్లో ఎల్ అండ్ టీ కంపెనీ, 9న చెన్నైకి చెందిన టీవీఎస్ కంపెనీ, 10న బెంగళూరుకు చెందిన జేఎంసీ కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. -
నైపుణ్యానికే కొలువు
- ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిత - జేఎన్టీయూ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి - ఎస్వీఐటీలో జాతీయస్థాయి మెగా జాబ్‌మేళా - ఇంటర్వ్యూలకు 3 వేలమంది విద్యార్థుల హాజరు - వెయ్యి మందికి నేడు ఉద్యోగ నియామకపత్రాల జారీ రాప్తాడు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ ఉన్న వారికే ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్ కళాశాలలో చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరకు చెందిన జైన్ యూనివర్సిటీ సహకారంతో దేశంలోని 25 ప్రముఖ కంపెనీలతో జాతీయస్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ‘అనంత’తోపాటు ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థలు తరగతి గదికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యం మెరుగు పర్చుకోవాలన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. చైర్మన్ సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రతనాల్లాంటి విద్యార్థులు ఉన్నారన్నారు. ఆ రతనాలకు మెరిపించేందుకే జాబ్‌మేళా నిర్వహించామన్నారు. అన్ని ప్రాంతాల విద్యార్థులకూ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జాబ్‌మేళాలో ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుం విధించలేదన్నారు. వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో 25 కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలు జరపడం ఇదే మొదటిసారని, అనూహ్య స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో కోచింగ్‌లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి చదివినా ఉద్యోగాలు వచ్చేది నమ్మకం లేదన్నారు. విద్యార్థులు కష్టపడకుండా ఉద్యోగాలు సాధించేందుకు తమ కళాశాలలో ఉద్యోగా మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగాలకు వెయ్యి మంది ఎంపిక.. జాతీయస్థాయి జాబ్‌మేళా విజయవంతం అయ్యింది. డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమో, ఫార్మసీ, 2015, 16లో ఎంబీఏ పూర్తి చేసిన వారు, 2017లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 3 వేల మంది హాజరయ్యారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు వివిధ గదులు కేటాయించారు. కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు రాత పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన జాబ్‌మేళాలో దాదాపు 1000 మంది విద్యార్థులను ఎంపిక చేశామని, వారికి ఆదివారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని ఎస్వీఐటీ యాజమన్యం తెలిపింది. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్సిటీ మార్కెటింగ్ మేనెజర్ అశ్విన్, ఫ్లేస్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్లు చందీల్, గణేష్, ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి, కళాశాల ట్రెజరర్ రామసుబ్బమ్మ, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, పీడీ శ్రీనివాసులునాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
4న ఎస్వీఐటీలో మెగా జాబ్‌మేళా
రాప్తాడు : హంపాపురంలోని ఎస్వీఐటీ కళాశాలలో ఈ నెల 4న జాతీయ స్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం వారు కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ జాబ్‌మేళాకు దేశంలోని 25 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 2 వేల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు చేపడతారని తెలిపారు. బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్‌మేళాకు ఇంజినీరింగ్, ఏదైనా డిగ్రీ , పాలిటెక్నిక్, 2015-16లో ఎంబీఏ పూర్తి చేసిన వారు, 2017లో ఫైనలియర్ డిప్లొమో, ఫార్మసీ చదువుతున్న వారు హాజరుకావచ్చన్నారు. మేళాకు వచ్చేవారికోసం ఆరోజు ఉదయం 8 గంటలకు అనంతపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. -
సిద్ధిపేటలో మెగా జాబ్ మేళా
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కొండ భూలక్ష్మి గార్డెన్లో మెగా జాబ్ మేళాను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం, పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించొచ్చని నిరుద్యోగ అభ్యర్థులకు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో 51 కంపెనీలు పాల్గొన్నాయి. యువతకు 4,391 ఉద్యోగాలు లభించాయి. -
రేపు మెగా జాబ్‌మేళా
హిందూపురం రూరల్ : స్థానిక ఎంజీఎం పాఠశాలలో శుక్రవారం దివ్యాంగుల మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్డీఏ జాబ్ కోఆర్డినేటర్ లక్ష్మిదేవి తెలిపారు. మేళాను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పదోతరగతి ఉత్తీర్ణులైన, ఆపైన చదివిన వారు అర్హులన్నారు. అదేవిధంగా 18 నుంచి 32 ఏళ్ల లోపు వయసు ఉండాలి. శారీరక వికలాంగులు (ఆర్థోపెడిక్), బధిరులు (డెఫ్ అండ్ డంబ్), పార్షిక అంధులందరికీ ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా బ్యుటీషియన్, కాల్‌సెంటర్, ట్యాలీ, కంప్యూటర్ ఆపరేటర్, రీటైల్, హోటల్ మేనేజ్మెంట్, మొబైల్ సర్వీసింగ్‌తో పాటు స్పోకెన్ ఇంగ్లిషు, పర్సనాలిటీ డెవలప్మెంట్లో శిక్షణ కల్పిస్తామన్నారు. జాబ్‌మేళాకు హాజరయ్యే దివ్యాంగులు విద్యార్హత సర్టిఫికెట్లు, వికలాంగుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు. -
13న ఉస్మానియా కళాశాలలో జాబ్‌మేళా
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): స్థానిక ఉస్మానియా కళాశాలలో ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి డా. నిస్సార్ అహ్మద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డా. రెడ్డీస్ ఎస్ఎంటీ(హైదరాబాద్) ఆధ్వర్యంలో ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 18–19 ఏళ్లలోపు యువకులు హాజరుకావాలని ఆయన కోరారు. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ(2016)లో 60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్ సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌కార్డుతో ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన వారికి రెండేళ్లపాటు అన్ని సదుపాయాలతో ఏడాదికి రూ.1.45 లక్షల వేతనంతో ఉపాధి కల్పిస్తారని తెలిపారు. వివరాలకు 9700382288 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. -
9న జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : బెంగళూరుకు చెందిన జోలోస్టేస్ ప్రాపర్టీస్ కంపెనీలో ప్రాపర్టీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈనెల 9న జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎ. కల్యాణి ఓ ప్రకటనలో తెలపారు. ఇంటర్, డిగ్రీ చేసి, 18–30 ఏళ్ల వయసు ఉన్న పురుషులు మాత్రమే అర్హులన్నారు. 25 ఖాళీలున్నాయని, జీతం నెలకు రూ. 10 వేలు ఉచిత భోజనం, వసతి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 9న ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08554–245547 నంబరులో సంప్రదించాలని కోరారు. -
‘ఇక ప్రతినెలా జాబ్ మేళా’
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నగరంలో ఇక ప్రతినెలా ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిట్స్ పాఠశాలలో రెండో రోజు జరిగిన ఉద్యోగ మేళాకు ఆయన హాజరై ఉద్యోగాలకు ఎంపికైన పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ జాబ్ మేళాలో నాలుగువేల మంది ఉద్యోగాలు పొందారు. ప్రతినెలా నిర్వహించనున్న ఉద్యోగమేళా అవకాశాన్ని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
20న టీటీడీసీలో జాబ్‌మేళా
అనంతపురం అగ్రికల్చర్ : బెంగళూరు ఐసీఐసీఐ బ్యాంకు, అనంతపురం ఫ్లిప్‌కార్టు సంస్థలో డెలివరీ విభాగంలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు ఈనెల 20న ఉదయం 10 గంటలకు స్థానిక టీటీడీసీ కేంద్రంలో జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు డీఆర్డీఏ– వెలుగు పీడీ ఎం.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు రూ.10 వేలు వేతనం కలిగిన ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలన్నారు. నెలకు రూ.8 వేలు, అదనంగా టీఏ కలిగిన ఫ్లిప్కార్డుకు సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు, ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత ఉండాలని తెలిపారు. బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జెరాక్స్‌తో స్థానిక పంగల్‌రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీ కేంద్రంలో హాజరు కావాలని సూచించారు. -
జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి
కర్నూలు(అర్బన్): కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న జాబ్‌మేళాకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాని ఏపీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి. విజయకుమార్ అన్నారు. శనివారం స్థానిక బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను కొంతమేరకైనా రూపుమాపేందుకు ఎంపీ చూపుతున్న చొరవను గుర్తించాలన్నారు. ఎంజీఆర్‌ఎస్ టెక్నాలజీస్ సహకారంతో చేపడుతున్న ఈ మేళాలో 25 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులందరూ ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, జగదీష్, ఖాజా, రమణ, బాషా తదితరులు పాల్గొన్నారు. -
రేపు జాబ్ మేళా
కర్నూలు సిటీ: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రి గ్రో ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా హెడ్ ఇబ్రహీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు ఉండి, డిగ్రీ, ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంకులో సెల్స్ ఆఫీసర్‌గా పని చేయుటకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళా భూపాల్ కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తులో నిర్వహిస్తారని చెప్పారు. నేడు .. నగరంలోని ఆక్సా హోటల్ మేనేజ్మెంట్ సంస్థ ఆదివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి నాజ్నిక్ తెలిపారు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు పదోతరగతి, ఆ పై చదువులు చదివిన వారు మేళాకు హాజరుకావాలని కోరారు. పార్క్ రోడ్డులో ఉన్న ఆక్సా కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 8519868994, 9030486715 నంబర్లను సంప్రదించాలన్నారు.