రేపు నిరుద్యోగులకు జాబ్‌మేళా
Published Sat, Mar 25 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగుల కోసం ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఫస్ట్‌స్టెప్ శిక్షణ, ఉపాధి కేంద్రం చైర్మన్ ఎస్. రాజశేఖర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, సత్యసుమ మార్కెటర్స్ కంపెనీల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్ల కోసం నిర్వహించే ఈ మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.7వేల జీతం, ఇన్సెంటీవ్ ఇస్తామన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువకులకు స్థానిక భాగ్యనగర్‌లోని ఫస్ట్‌స్టెప్ సంస్థ కార్యాలయానికి చేరుకోవాలని,
వివరాలకు 9393930109, 8099932144 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
Advertisement
Advertisement