unemployees
-
నిరుద్యోగులకు భార్య, భర్త టోకరా
-
లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల
వాష్టింగన్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఇంట మాత్రమే కాదు.. విదేశాల్లోనూ లక్షల మంది ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీంగా ఉందని వాషింగ్టన్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అగ్రరాజ్యంలో వేలమంది భారతీయ ఐటీ ఉద్యోగులు.. లే ఆఫ్స్ బారిన పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీలతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లోనూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. కమిట్మెంట్ల కారణంగా తిరిగి స్వదేశానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు బాగా కష్టపడుతున్నారు. ఇక వీసా చిక్కులతో దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. ఈ లోపే కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణలో మునిగిపోయారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు లే ఆఫ్స్ బారినపడి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. అయితే అందులో 30 నుంచి 40 శాతం ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని నివేదికలు చెప్తున్నాయి. వాళ్లలో ఎక్కువగా హెచ్1బీ, ఎల్1 వీసాల మీద వెళ్లిన వాళ్లే ఉన్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగాల వేటకు.. వాట్సాప్ గ్రూపు ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లు.. వర్క్ వీసాల కింద డెడ్లైన్లు ముందు ఉండడంతో కొత్త జాబ్‌ను వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. ఉద్యోగాలు పొగొట్టుకున్న ఉద్యోగుల్లో కొందరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎనిమిది వందల మందితో ఉన్న ఓ గ్రూప్ అందుకు నిదర్శనం. ఇక వీళ్ల కష్టాలను చూసి జిట్‌ప్రో(GITPRO), ఫిడ్స్(FIIDS) రంగంలోకి దిగాయి. ఆదివారం నుంచి ఓ ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను వాళ్ల కోసం ఏర్పాటు చేశాయి. ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ప్లాట్‌ఫామ్ ద్వారా ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పరిస్థితి వర్ణనాతీతంగా ఉండడంతో ఉద్యోగులు సైతం తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని, చాలా కష్టంగా గడుస్తోందని కొందరు ఉద్యోగుల గోడు వెల్లబోసుకోగా.. వాళ్ల వ్యథలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ రెండు వీసాలు ఎవరికంటే.. H-1B వీసా అనేది వలసేతర వీసా. అమెరికన్ కంపెనీలు తమకు అవసరమయ్యే టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లను(విదేశీ ఉద్యోగులను) నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఇక ఈ వీసా కింద భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అక్కడి బడా కంపెనీలు.హెచ్ 1 బీ వీసా జాబ్ పోతే గనుక.. 60రోజుల్లోగా హెచ్-1బీ స్పాన్సరింగ్ ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక L-1A, L-1B వీసాలు.. కంపెనీలు తాత్కాలిక బదిలీల మీద పంపిస్తుంటాయి. మేనేజెరియల్ పొజిషన్స్ లేదంటే ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉద్యోగుల విషయంలో ఈ వీసాలు ఎక్కువగా ఇస్తుంటారు. -
విజయ్ సేతుపతి సహకారంతోనే.. లక్షకు పైగా ఉద్యోగాలు
Vijay Sethupathi Silent Help to get Jobs for 1 lakh Persons: బహుభాషా నటుడిగా రాణిస్తున్న విజయ్‌సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయనలో మరో ముఖం కూడా ఉంది. అదే సేవా భావం. ఆపదలో ఉన్న వారికి ఆప్పన్న హస్తం అందించడంలో విజయ్ సేతుపతి ముందుంటారు. అలాంటి ఈయన సహాయ సహకారాలతో ఇ.పి.వీరరాఘవన్ అనే సామాజిక సేవకుడు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి జీవితంలో వెలుగు నింపుతున్నారు. దీని గురించి ఈయన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను 2016 నుంచి సామాజిక సేవలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నానన్నారు. ఆ విధంగా 2019లో సన్ టీవీ నిర్వహిస్తున్న నమ్మ ఊరు హీరో కార్యక్రమంలో ఆ ప్రోగ్రాం వ్యాఖ్యాత, నటుడు విజయ్ సేతుపతిని కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఆ తరువాత ఆయన సహాయ సహకారాలతో పాండిచ్చేరిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారన్నారు. అలా ఇప్పటి వరకు పాండిచ్చేరి, తమిళనాడులోని కొన్ని జిల్లాలకు చెందిన సుమారు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు పేర్కొన్నారు. -
Telangana: 56,979 కొలువులేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఉద్యో గాలను భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నా.. ఇప్పటికీ నోటిఫికేషన్లు రాకపోవడంపై నిరుద్యో గులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, ఇంకెన్నాళ్లు వేచిచూడాలని ఆవేదన చెందుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్టు ఆర్థిక శాఖ నాలుగైదు నెలల కిందటే ప్రకటించింది. మూడు నెలల క్రితం ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో మొత్తం 57వేలకుపైగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో.. ఉద్యోగాల భర్తీ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. పోస్టుల విభజన కోసం.. కొత్త జోనల్ విధానం ఆధారంగా.. జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయిల్లో పోస్టుల విభజన, కొత్త జిల్లాల మధ్య పంపిణీ వంటి అంశాలను తేల్చడంపై ఆర్థికశాఖ దృష్టి పెట్టింది. తాజాగా ఈ కసరత్తు కూడా ఓ కొలిక్కి వచ్చిందని.. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 67 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నట్టు తేలిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఈ ఖాళీల వివరాలను ఆమోదించాల్సి ఉందని.. ఆ తర్వాత మార్గదర్శకాలు రూపొందించి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో.. లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేదు కొత్త జోనల్ విధానం నేపథ్యంలో మూడున్నరేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందే జారీ అయిన కొన్ని నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రమే కొనసాగింది. కొత్త నోటిఫికేషన్లేవీ విడుదల కాలేదు. అయితే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి చర్యలు చేపడతామని ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. దీనిపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు హడావుడిగా కసరత్తు మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల వారీగా ఖాళీల జాబితాను రూపొందించాయి. రాష్ట్రవ్యాప్తంగా 56,979 నేరుగా భర్తీ చేసే (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించాయి. ఇందులో ప్రభుత్వ శాఖల్లో 44,022 ఉద్యోగాలు.. సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలో 12,957 ఉద్యోగాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇదే సమయంలో కొత్త జోనల్ విధానంలో సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త విధానానికి అనుగుణంగా.. ఏ జిల్లాకు, జోన్‌కు నష్టం జరగకుండా మళ్లీ ఉద్యోగ ఖాళీలు, అవసరాల లెక్క తీశారు. దీని ప్రకారం.. 67 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తేల్చింది. అడ్డంకులు తొలగిపోయినా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో సర్వీసు సంబంధిత అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని.. కానీ కొత్త నియామకాల విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంతకుముందు జిల్లాస్థాయి నియామకాల కమిటీ (డీఎస్సీ)లు ఉండేవి. ప్రభుత్వం వాటిని రద్దు చేసి.. దాదాపు అన్నిరకాల ఉద్యోగాల భర్తీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఇతర నియామకాల బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్పీఆర్బీ), తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎంఆర్బీ)ల ద్వారా నియామకాలు చేపడుతున్నారు. వివిధ ప్రభుత్వశాఖల్లో పోస్టుల సంఖ్య, నియామకాల ఆవశ్యకత ఆధారంగా ప్రభుత్వం ఆయా శాఖలకు అధికారాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసింది. ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తించిన ఖాళీలను ఇప్పటికిప్పుడు భర్తీ చేసుకునే వీలుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మరోవైపు సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 12,957 పోస్టుల భర్తీకి సర్వీసు నిబంధనల అడ్డంకులు ఉన్నాయని అంటున్నాయి. ప్రభుత్వం గుర్తించిన 67 వేల ఖాళ్లలో టీచర్ పోస్టులు లేవు. ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయితే తప్ప ఖాళీల లెక్క తేలే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంటే టీచర్ పోస్టుల భర్తీపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేడర్ స్ట్రెంత్ కొలిక్కి.. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించి శాఖలవారీగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. కేడర్ వారీగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్ పూర్తిచేస్తే.. విభజన ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు ప్రభుత్వ రంగ విభాగాలైన వివిధ సొసైటీలు, కార్పొరేషన్లలోని పోస్టుల విభజన ఇంకా జరగలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వయసైపోతోంది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు పలు సడలింపులు ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో వయసు పెరిగి.. ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి ఉందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూన్ నాటి గణాంకాల ప్రకారం.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) కింద 24,62,032 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో పురుషులు 14,71,205, మహిళలు 9,90,827 మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ నాటికి 40 ఏళ్లు దాటినవారు 40,994 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి 44 ఏళ్లు దాటి ఉద్యోగాలకు అనర్హులు కానున్నారు. పీఆర్సీ చెప్పిన ఖాళీలు 1.9 లక్షలు మాజీ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తొలి వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) తమ నివేదికలో రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని పేర్కొంది. అయితే అందులో పలు నోటిఫికేషన్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ నియామకాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని అధికారవర్గాలు చెప్తున్నాయి. అవిపోగా మిగతా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడిస్తున్నాయి. -
ప్రత్యేకం: నిరుద్యోగుల కోసం ‘డీట్’ యాప్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాలకు చెందిన అన్నిరకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్) యాప్, పోర్టల్‌ను రూపొందించింది. ఉద్యోగాల వేటలో ఉన్నవారు తమ అర్హతలు, నైపుణ్యం, అనుభవం తదితరాలను ‘డీట్’లో నమోదు చేసుకుంటే వారికి ఉద్యోగ ఖాళీల సమాచారం అందుతుంది. అలాగే ఉద్యోగార్థుల అర్హత వివరాలను కూడా డీట్‌లో నమోదైన ఉద్యోగ కల్పన సంస్థలకు చేరవేస్తుంది. ఉద్యోగార్థులు, ఉద్యోగ కల్పన సంస్థలు అనుసంధానం అయ్యేందుకు ఇదో మంచి వేదిక అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఐటీ శాఖ అంచనా వేస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో డీట్ యాప్ ద్వారా ఈ–కామర్స్, ఆరోగ్య రక్షణ, సేవా రంగాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టెలీకాలర్లు, హెల్త్‌కేర్ అసోసియేట్లు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల భర్తీ జరిగింది. డీట్ యాప్ ఉద్యోగాలను వెతికేందుకే పరిమితం కాకుండా ఆన్లైన్ వీడియో ఇంటర్వ్యూల షెడ్యూల్లోనూ సాయం చేస్తోంది. రెజ్యూమ్ రూపకల్పనలోనూ.. ఉద్యోగార్థులు రెజ్యూమ్ లేదా సీవీని సులభంగా తయారు చేసుకునేందుకు వీలుగా టెక్నాలజీని రూపొందించింది. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఉద్యోగార్థులతో కమ్యూనిటీ గ్రూపుల ఏర్పాటును డీట్ ప్రోత్సహిస్తోంది. ఈ తరహా గ్రూపుల్లో సుమారు 8,800కు పైగా నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు, డీట్ ప్రత్యేకతలు, వాక్–ఇన్ ఇంటర్వ్యూల షెడ్యూలు తదితరాలను తరచూ ఈ గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు డీట్ వేదికగా సుమారు 300కు పైగా నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ఐటీ శాఖ చేరవేసింది. ఉద్యోగాల వేటలో ఉన్న వారికి రెజ్యూమ్ తయారీలో మెళకువలను నేర్పించడంతో పాటు ఉద్యోగాలు వెతికేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై 20కి పైగా ఆన్లైన్ అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘ఈక్విఫాక్స్’తో భాగస్వామ్యం.. డీట్ వేదిక ద్వారా షేర్ చేసే ఉద్యోగాల సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్జూమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ‘ఈక్విఫాక్స్’తో ఐటీ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలుకుని పెద్ద సంస్థల వరకు డీట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి ఈక్విఫాక్స్ సాయం చేస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగార్థుల్లో ఉన్న నైపుణ్య లేమిని గుర్తించడం, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వివిధ విభాగాలు, సంస్థల వారీగా ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు చేరవేయడం దిశగా ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్’ను అభివృద్ధి చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. -
క్షీణిస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్న షర్మిలను వైద్యులు పరీక్షించారు. షుగర్ లెవల్స్ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు ఆమెను పరీక్షించిన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టారు. పోలీసులు సాయంత్రం వరకే అనుమతివ్వడం, ఆ తర్వాత ఆమె పాదయాత్రగా లోటస్‌పాండ్‌కు బయల్దేరడం.. మధ్యలోనే పోలీసులు ఆమెను అడ్డుకుని ఆమె ఇంటివద్ద వదిలేయడంతో అక్కడే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మంచినీరు మాత్రమే తాగుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. మీ కోసం తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేస్తా. ప్రభుత్వ రంగంలోనే కాదు.. ప్రైవేట్‌రంగం లో కూడా 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్సార్‌ది’అని అన్నారు. షర్మిలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి మద్దతు తెలిపారు. ఆటో యూనియన్ నేత అమానుల్లాఖాన్ ఆటోలతో భారీ ర్యాలీగా వచ్చి షర్మిలకు మద్దతు తెలిపారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
సచివాలయంలో ఉద్యోగం.. రూ. 67 లక్షలకు టోకరా
సాక్షి, సంగారెడ్డి: నిరుద్యోగుల అవసరాన్ని అసరాగా చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రవీందర్.. ఆటోడ్రైవర్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన బత్తిని వైకుంఠం.. రైతు. జిల్లాలోని కొండాపూర్ మండలం తొగర్పల్లికి చెందిన బందెమ్మ.. గృహిణి. వీళ్లు ముగ్గురికి సంగారెడ్డి పట్టణానికి చెందిన విజయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ సచివాలయంలో తనకు పరిచయాలు ఉన్నాయని విజయకుమార్ నమ్మబలికడంతో రవీందర్, వైకుంఠం అతనికి సహాయకులుగా ఉన్నారు. కాగా బందెమ్మ 25 మంది వద్ద నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్లుగా రూ.67 లక్షలు వసూలు చేసి వారికి అప్పగించింది. నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు అందజేశారు. విషయం తెలుసుకున్న డబ్బులు ఇచ్చిన పలువురు బాధితులు బందెమ్మను నిలదీశారు. దీంతో తాను తప్పించుకోవడానికి డబ్బులు తీసుకొని రవీందర్, వైకుంఠం, విజయకుమార్‌లు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని నవంబర్ 9వ తేదీన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె సంగారెడ్డి మార్క్స్‌నగర్‌లో నివాసం ఉంటోంది. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా నకిలీ ముఠాగుట్టు రట్టయ్యింది. పోలీసుల దర్యాప్తులో ఆమె సైతం నిందితురాలు అని తెలింది. దీంతో ఆమెతో పాటు రవీందర్, వైకుంఠాన్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి బ్యాంకు చెక్ బుక్కులు, మొబైల్ ఫోన్లు, నకిలీ నియామక పత్రాలను స్వాధీన పరుచుకున్నారు. కాగా విజయకుమార్ పరారీలో ఉన్నాడు. ఆ ముగ్గురిని జ్యూడిషయల్ కస్టడీకి తరలించారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ వెంకటేష్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
నిరుద్యోగులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్
న్యూడిల్లీ: రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త ప్రకటించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ఢిల్లీ ప్రభుత్వం జాబ్ పోర్టల్(ఉపాధి కల్పన సైట్)ను నాలుగు రోజుల క్రితం ప్రారంభించింది. ప్రభుత్వం ప్రారంభించిన జాబ్ పోర్టల్‌కు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటివరకు 2లక్షల ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం పేర్కొనగా, 3లక్షల 22వేల మంది నిరుద్యోగులు జాబ్ పోర్టల్‌లో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 7,577 కంపెనీలు జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయి. అయితే జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు నిరుద్యోగులు ఎటువంటి చార్జీలను కట్టనవసరం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలంటే మొదటగా సైట్లో లాగిన్ అయ్యాక మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి, తర్వాత ఏ విభాగాలలో ఉద్యోగం కావాలో నమోదు చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒకే ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. కాగా పోర్టల్‌లో నమోదు చేశాక ఫోన్ లేదా వాట్సాప్‌లో పోర్టల్ అధికారులు నియామకాలకు సంబంధించిన సమాధానం ఇస్తారు. -
మిగిలింది ఒక్కరోజే..
సాక్షి, నెల్లిమర్ల (విజయనగరం): నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వలంటీర్ల పోస్ట్‌లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నిరుద్యోగుల కోసం యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 4లక్షల గ్రామ వలంటీర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మండలం లోని 26 పంచాయతీల్లో ఈ గ్రామ వలంటీర్ల పోస్ట్‌ల కోసం దరఖాస్తులు వెల్లువులా వచ్చి పడుతున్నాయి. ప్రతి పల్లెలోనూ 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మండలంలో ఆయా గ్రామాల్లో నిరుద్యోగులు వలంటీర్ల పోస్ట్‌లకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో తహసీల్దార్ కార్యాలయానికి నిరుద్యోగులు పోటెత్తారు. 266 గ్రామ వలంటీర్ల పోస్ట్‌లు... మండలంలో 26 పంచాయతీలకు గానూ సుమారు 266 గ్రామ వలంటీర్ల పోస్ట్‌లు ఉన్నాయి. గురువారం నాటికి 1384 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ అక్కారావు తెలిపారు. వీటిలో మొత్తం 77 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు ఏ రోజుకు ఆ రోజు గ్రామ స్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో పొందు పరుస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే సమయం ఉండడంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. ఒక్కో గ్రామంలోనూ నివాసముంటున్న కుటుంబ సభ్యుల వివరాలను ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు సేకరించారు. -
అధికారంలోకి రాగానే 2.30 వేల ఉద్యోగాలు భర్తీ
-
అస్మదీయులకోసం నిరుద్యోగుల కోటాకు ఎసరు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీని చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారు. గత నాలుగున్నరేళ్లల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ కలిపి రెండు లక్షలకుపైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటే ఆ ఊసే మరిచారు. అదే సమయంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన పోస్టులకు సైతం టీడీపీ సర్కారు ఎసరు పెట్టింది. ఖాళీగా ఉన్న 148 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాల్సి ఉండగా.. వాటిని తాత్కాలిక పదోన్నతుల పేరుతో అస్మదీయులకు కట్టబెట్టింది. తద్వారా నిరుద్యోగుల పొట్టకొడుతోంది. అస్మదీయులకోసం నిబంధనలకు తిలోదకాలు.. వ్యవసాయ శాఖలో 173 వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులు ఖాళీగా ఉండగా ఏపీపీఎస్సీ 25 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించిందని, మిగతా 148 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈలోగా తెలుగునాడు బీఎస్సీ (వ్యవసాయ) విస్తరణ అధికారుల అసోసియేషన్ రంగంలోకి దిగింది. పదోన్నతుల ద్వారా వీటిని భర్తీ చేయాలంటూ వ్యవసాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసింది. అంతే.. సర్వీసు నిబంధనలను సైతం ఉల్లంఘించి మరీ అస్మదీయులకు ప్రయోజనం కల్పించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు. డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టుల్లో తాత్కాలిక పదోన్నతులకు వీలు కల్పించారు. తద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాకు పాతరేశారు. ఒకవైపు వ్యవసాయ బీఎస్సీ చదివి వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టుల భర్తీకోసం పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఖాళీగా ఉన్న 148 వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేసేశారు. ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం పెట్టినా, డైరెక్టు రిక్రూట్మెంట్ కోటాలోని పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేయడమంటే ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1996లోని రూల్ 4 (బి) 11 ఉల్లంఘించడమేనని స్పష్టం చేసినా బాబు సర్కారు పట్టించుకోలేదు.148 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తూ వ్యవసాయ శాఖ గత నెల 12న మెమో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఆ మెమోను ఇటీవల జరిగిన కేబినెట్లో పెట్టి సక్రమం చేస్తూ బాబు సర్కారు ఆమోదించింది. తెలుగునాడు అసోసియేషన్ విన్నవించడం ఆలస్యం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే.. అసోసియేషన్‌ను ఎవరు ఏర్పాటు చేయించారో తేటతెల్లం అవుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను తాత్కాలిక పదోన్నతులతో నింపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చర్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
చంద్రబాబు సభలో ఆందోళన
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో గురువారం ఆయన పాల్గొన్న సభలో నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలి.. మెగా డీఎస్సీ వేసి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు నిర్లక్ష్యంగా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారనీ, సంయమనం పాటించాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆయన మాటలను పట్టించుకోకపోవడంతో ఆందోళన చేస్తున్న 20 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అక్రమంగా అరెస్టు చేశారని నిరుద్యోగులు వాపోయారు. 12,900 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఏడువేల పోస్టులకే నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా జిల్లాల కంటే చంద్రబాబు సొంతజిల్లాకు తక్కువ పోస్టులు కేటాయించారని జిల్లాకు చెందిన మహిళా నిరుద్యోగులు ఆరోపించారు. అందరికీ విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి క్రమశిక్షణ లేదంటూ వ్యాఖ్యానించడం బాధ కలిగించిందని అన్నారు. -
చంద్రబాబు దగాకోరు పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్
విజయనగరం మున్సిపాలిటీ : అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ సీఎం చంద్రబాబు సాగిస్తున్న దగాకోరు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. 2014 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, లేని పక్షంలో రూ.2వేల నిరుద్యోగ భృతి హమీ అమల్లో టీడీపీ నయవంచన తీరును నిరసిస్తూ యువగర్జన పేరిట వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో యువత విజయనగరం పట్టణంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి నుంచి ప్రారంభమైన ర్యాలీకి బెల్లాన చంద్రశేఖర్, నగర పార్టీ కన్వీనర్ ఆశపు వేణు, పార్టీ విజయనగరం మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్వీవీ రాజేష్, కేదారశెట్టి సీతారామ్మూర్తిలు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక రింగ్‌రోడ్ సాయిబాబా గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్, అయోధ్యామైదానంరోడ్, కోట జంక్షన్, మూడులాంతర్లు, గంటస్తంభం జంక్షన్, వైఎస్సార్ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్, ఎత్తుబ్రిడ్జి మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అక్కడ సీఎం చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ యువత నినదించారు. అనంతరం యువజన, విద్యార్ధి విభాగం నాయకులు ఎస్.బంగారునాయుడు, జి.ఈశ్వర్‌కౌషిక్, ఎంఎల్‌ఎన్‌రాజు, అల్లు చాణక్య, బోడసింగి ఈశ్వరరావు, గండ్రేటి సన్యాసిరావు, తాడ్డి సురేష్, పొట్నూరు కేశవ, కరకవలస అనిల్, బోనేల తరుణ్, తాళ్లపూడి పండు, కరణం రమేష్, తరుణ్‌లు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్‌కు అందజేశారు. యువతను మోసం చేశారు... 2014 ఎన్నికల్లో మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాలుగున్నరేళ్లపాటు యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం హమీలను విస్మరించి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో సారి యువతను మోసం చసేందుకు రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించారని బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. చంద్రబాబు మాటలను యువత నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 10 లక్షల మందికి రూపాయి చొప్పున నిరుద్యోగ భృతి ప్రకటించడం, రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల పోస్టులు భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్ఎన్ రాజు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్యలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చినహమీల ప్రకారం రూ.2వేల నిరుద్యోగ భృతి మొత్తాన్ని నాలుగు సంవత్సరాల మూడు నెలల బకాయిలతో కలిపి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగుకి రూ.లక్షా 2వేల మొత్తాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని, ఔట్ సోర్సింగ్ నియామకాలను నిలిపివేయాలన్నారు. గ్రూప్–2ని గ్రూప్–1లో విలీనం చేయాలన్న ప్రతిపాదను విరమించుకోవాలన్నారు. వెంటనే ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగం నాయకులు జీవీ రంగారావు, జి.ఈశ్వర్‌కౌషిక్, నెలపర్తి రాజ్‌కుమార్, హర్షరాజు, అప్పుపైడి,ఆనంద్, మనోజ్, పి.కృష్ణ, జిక్కరాజు, నాని, కర్రోతు సంతోష్, కంకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మెట్రోలో ఉద్యోగం.. రూ.1.50 కోట్లకు టోకరా
సాక్షి, హైదరాబాద్ : మెట్రో ప్రభుత్వానికి కాసులు కురిపిస్తోందో లేదో కానీ దోచుకునే వారికి మాత్రం కోట్లకు కోట్లు కురిపిస్తోంది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని పలు కన్సల్టెన్సీలు కోట్లాది రూపాయలను వెనుకేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతోంది. అలా కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చిన కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నాయి. అలాంటి ఓ బోగస్ కంపెనీ చేతుల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రతిష్టాతక్మంగా ప్రారంభించిన మెట్రోరైలు బోగస్ కంపెనీల పాలిట కల్ప తరువుగా మారింది. మెట్రోలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నగరంలోని ఏబీసీ కన్సల్టెన్సీ ఒక్కో నిరుద్యోగి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేసింది. మొత్తం రూ.1.50 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో డబ్బు చెల్లించిన బాధితులు లబోదిబోమంటూ ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగాలు కల్పిస్తామని బోర్డు తిప్పిన కన్సెల్టన్సీ నిర్వాహులకు అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రైల్వే ఉద్యోగాలపై రచ్చ
సాక్షి, విజయనగరం : రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసిన గ్రూప్ డి నోటిఫికేషన్‌పై విద్యార్ధులు, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. పదో తరగతి చదివిన వారితోపాటు అదనంగా ఐటీఐ, టెక్నికల్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. విజయనగరం కోట జంక్షన్ నుంచి రైల్వేస్టేషన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ర్యాలీని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున విద్యార్ధులు తరలి రావడంతో పోలీసులకు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. పలువురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఉద్యోగం కోసం పోటెత్తిన నిరుద్యోగులు
చిత్రంలో కనిపిస్తున్నవారిని చూశారా.. వీరంతా ఉద్యోగం కోసం ఆశగా వచ్చిన వేలాదిమంది నిరుద్యోగులు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉద్యోగ నోటిఫికేషన్లు మాయమయ్యాయి. రాజకీయ వివక్షతో చిరుద్యోగులు ఉపాధికి దూరమయ్యారు. బతుకుకోసం డిగ్రీ పట్టాలు చేతపట్టి వీధిన పడ్డారు. డెంకాడ మండలం చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన జాబ్ మేళాకు కోటిఆశలతో హాజరయ్యారు. ఇక్కడ వేలల్లో ఉన్న నిరుద్యోగులను చూసి.. బిత్తర పోయారు. అయ్యో.. రాష్ట్రంలో నిరుద్యోగం ఇంత దారుణంగా ఉందా అంటూ నిరాశచెందారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని.. బాబు పోతే తప్ప ఈ దుస్థితి మారేలా లేదంటూ కొందరు విమర్శించారు. డెంకాడ: చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డీఆర్డీఎ, వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువ త పోటెత్తింది. పేర్లు న మోదుకు గంటల తరబడి వేచి ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 34 కం పెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు విచ్చేసి నిరుద్యోగ యువతీయువకులకు పరీక్షలు నిర్వహిం చారు. అందులో ప్రతిభ చూపిన వారికి ఇంట ర్వ్యూ చేశారు. ముందుగా ఆయా కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు... జీతభత్యాలు.. షరతులు తదితర వివరాలను తెలియజేశా రు. అయితే... రెండు రోజుల పాటు నిర్వహించే జాబ్‌మేళాకు పదివేల మంది హోజరుకాగా.. రెండోరోజు ఆది వారం నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు ఆరువేల మంది రావడంతో కళాశాల మైదానం కిక్కిరిసింది. మూడేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం... వేలాది మంది విద్యార్థులు ఏటా డిగ్రీలు, ఇంజినీరింగ్ పట్టాలతో రిలీవ్కావడంతో జాబ్ మేళాకు పోటెత్తారు. అక్కడి నిరుద్యోగ లోకాన్ని చూసి కొంద రు బిక్కయిపోయారు. పరీక్ష రాయకుండానే ఇంటిముఖం పట్టారు. మరికొందరు గంటల తరబడి నిరీక్షిం చి ప్రతిభకు పదును పెట్టారు. ఏటా ఉద్యోగాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని... నేతల ప్రకటనలకు.. ఆచరణకు ‘నక్కకి నాగలోకానికి ఉన్నంత’ తేడా ఉందంటూ నిట్టూర్చా రు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని... ఇప్పుడు బాబుకు చెక్చెబితే తప్ప జాబు వచ్చే అవకాశం కనిపించడంలేదంటూ బహిరంగంగానే విమర్శించారు. ప్రభుత్వ కొలు వులు లేకపోవడంతో కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు వేలాది మంది తరలివస్తున్నారంటూ విద్యార్థులకు తోడుగా వచ్చి న తల్లిదండ్రులు పేర్కొన్నారు. పల్లెల్లో ఉంటే చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని.. ఉద్యోగాలు చూసుకోమని చెబితే మీరే చూపిం చండంటూ సమాధానం చెబుతున్నారన్నారు. ఉద్యోగ కల్పనకు చర్యలు నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. జాబ్‌మేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల్లో పదివేల మంది యువతీ యువకులు హాజరుకాగా, 2 వేల మంది ఉద్యోగాలకు అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పతివాడ, గీతలు పాల్గొన్నారు. -
జాబ్ రావాలంటే బాబు పాలన పోవాలి
పుత్తూరు: జాబు రావాలంటే రాష్ట్రంలో బాబు పాలన అంతం కావాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అథ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రత్యేక హోదా హామీలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెవిలో పూలతో పట్టణంలోని ఆరేటమ్మ ఆలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఆమె బుధవారం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, అమర్‌నాధ్‌రెడ్డిలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ వారు యువతకు ఉద్యోగాలు కల్పించలేని అసమర్థులని దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం చంద్రబాబు యువతకు అన్యాయం చేస్తున్నారని రోజా విమర్శించారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా సుమారు 25 వేల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను వీధిన పడేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా హామీని ఓటుకు నోటు కేసుతో తాకట్టు పెట్టి యువత ఆశలకు సజీవ సమాధి కట్టిన బాబు పాలనకు చరమ గీతం పాడేందుకు యువత ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. లోకేష్‌కు జాబ్ వచ్చింది నిరుద్యోగులకు జాబ్ రాలేదు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మాత్రం మంత్రి ఉద్యోగం వచ్చిందని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అథ్యక్షుడు జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఓటు నోటు కేసుతో ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టి చంద్రబాబు నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపించారు. అంతకుమునుపు నిరుద్యోగులను వంచించిన రాష్ట్ర ప్రభుత్వంపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అథ్యక్షుడు సలాం బాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్యాంలాల్, ఇమామ్, యువజన విభాగం చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అథ్యక్షుడు మధు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ రాయల్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు జెన్కో షాక్
సాక్షి, ప్రొద్దుటూరు : ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. ‘బాబు వస్తే జాబు’ వస్తుందని నినాదాలతో అధికారం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం జెన్కో నోటిఫికేషన్లో వయో పరిమితి కుదించడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ఏడేళ్ల నుంచి అకౌంట్స్ విభాగంలో జూనియర్ అకౌంట్స్ అఫీసర్ల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఇటీవల 22 జేఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితో పాటు మరో 4 పోస్టులను బ్యాక్ లాగ్ కింద భర్తీ చేయనుంది. జనరల్ కేటగిరీ వారికి గరిష్ట వయసు అర్హతను 34 ఏళ్లుగా పేర్కొనడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది మార్చిలో అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో గరిష్ట వయో పరిమితి 42 ఏళ్లుగా పేర్కొన్న జెన్కో ఏడు నెలల్లోనే ఏకంగా 8 ఏళ్లు తగ్గించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. చాలా మంది గత కొద్ది రోజులుగా సీఎం, విద్యుత్‌శాఖాధికారులకు, జెన్కో ఉన్నతాధికా రులకు మెయిల్స్, ఫ్యాక్స్‌లు పెడుతున్నారు. ఏడేళ్ల తరువాత వచ్చిన నోటిఫికేషన్‌కు వయసును 42 ఏళ్లకు పొడగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ) ఉద్యోగాలకు జెన్కో నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే ప్రథమం. ఎన్నో ఏళ్లుగా జెన్కోలో ఎల్డీసీ పోస్టులు భర్తీ చేస్తారని ఎదురుచూసిన నిరుద్యోగలకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జెన్కో అధికారులు అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్లు పెంచాలని నిరుద్యోగులు విన్నవిస్తున్నారు. గందరగోళంగా సిలబస్ ఈ పోస్టులకు ఇచ్చిన సిలబస్ కూడా గందరగోళంగా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నాలుగు సెక్షన్లలో వివిధ అంశాలపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నాలుగు సెక్షన్లలో దేనికింద ఎన్ని మార్కులు ఉంటాయన్న విషయం నోటిఫికేషన్లో ఇవ్వలేదు. దీంతో కొద్ది సమయంలోనే ఏయే అంశంపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్ణయించుకోలేక పోతున్నారు. సాధారణంగా బ్యాంకు, రైల్వే ఉద్యోగాలకు ఇచ్చే నోటిఫికేషన్‌ల్లో కూడా ప్రతి సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని మార్కులు ఉంటాయో స్పష్టంగా పేర్కొంటారు. కానీ ఇందులో సెక్షన్లకు సంబంధించి మార్కులను తెలపక పోవడంపై నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీని బదులు 2010లో విడుదల చేసిన జేఏఓ నోటిఫికేషన్‌లోని సిలబస్‌నే ఉంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రెండు పరీక్షలు ఒకే రోజు జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2 వరకు గడువు విధించారు. వీటికి డిసెంబర్ 30న పరీక్షలు నిర్వహిస్తుండటంతో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు నష్టపోవాల్సి వస్తోంది. ఏదో ఒక పరీక్షే రాయాల్సి వస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని వారు కోరుతున్నారు. -
20న జాతీయ స్థాయి జాబ్‌మేళా
కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20న జాతీయ స్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాలల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, డిప్లొమో, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు రూ.99 రుసుం చెల్లించి నేరుగా జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్‌మేళాకు 20కి పైగా పెద్ద పెద్ద కంపెనీలు హాజరుకానున్నాయని, అర్హతలను బట్టి వేతనం, ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతోపాటు ఇతరులు పాల్గొనవచ్చని సూచించారు. వివరాలకు 76800 76632/02/03, 76600 03345, 78429 19899, 81252 58415 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
21న నిరుద్యోగులకు జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మాన్యుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తారన్నారు. అభ్యర్థులు 18 నుంచి 21 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఇంటర్(బైపీసీ/ఎంపీసీ) లేదా డిగ్రీ ఫెయిల్, డిస్కంటిన్యూ చేసి ఉండాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్, విశాఖపట్టణంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
తపాలా ఉద్యోగుల పోస్టులకు అనూహ్య స్పందన
– అరవై ఎనిమిది పోస్టులకు ఐదువేల దరఖాస్తులు కర్నూలు(ఓల్డ్‌సిటీ): తపాలా శాఖ ఏపీ సర్కిల్లో గతనెల 18న జారీ చేసిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీ ప్రకటనకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నిరుద్యోగులు అధిక సంఖ్యలో గ్రామీణ తపాలా ఉద్యోగుల పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తుల చేసుకుంటున్నారు. ఓసీ, ఓబీసీ జనరల్ అభ్యర్థులు హెడ్ పోస్టాఫీసులో రూ.100 ఆన్లైన్ సెలెక్షన్ ఫీజు చెల్లించాల్సి ఉన్నందున కర్నూలు ప్రధాన కార్యాలయంలో సంబంధిత కౌంటర్ల వద్ద రద్దీ పెరిగింది. రోజుకు సుమారు 200 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించేందుకు వస్తున్నారు. ఈనెల 19 వరకు గడువు ఉంది. డివిజన్ పరిధిలోని 26 బ్రాంచి పోస్టుమాస్టర్, 9 మెయిల్ డెలివరీ (జీడీఎస్ఎండి), 28 మెయిల్ కన్వేయన్స్ (జీడీఎస్ఎంసీ), 5 ప్యాకర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తారు. డివిజన్లో మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉంటే, దరఖాస్తుదారుల సంఖ్య ఇప్పటికే ఐదువేలకు చేరింది. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు లాజిస్టిక్స్, ఎంఎస్ ఆఫీసు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ కోర్సుల్లో పీఎంకేవీవై ద్వారా 60 రోజుల ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు సుశాంత్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఎండీ ఎం ప్రవీణ్ సుశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువత ఈ నెల 30, 31వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్ ఎదురుగా ఉన్న క్రిష్ణ ఆర్కేడ్, మూడవ అంతస్తులో ఉన్న కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 8886868248 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
27 నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): గ్రామీణ నిరుద్యోగ యువతకు ఈ నెల 27వ తేదీ నుంచి ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణ శనివారం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా యువతకు మూడు నెలల పాటు ఇంగ్లిష్, పని సంసిద్ధత, కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు చూపిస్తామన్నారు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండి, ఎస్ఎస్సీ/ఇంటర్ పాస్,ఫెయిలైన యువతీయువకులు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో ఈ నెల 27, 28వ తేదీల్లో టీటీడీసీలో అడ్మిషన్ పొందాలన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ–ఈజీఎం కార్యాలయం, ఫోన్ నెం.9866179471, 9885127745, 9966723684, 08518277499 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
రేపు నిరుద్యోగులకు జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగుల కోసం ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఫస్ట్‌స్టెప్ శిక్షణ, ఉపాధి కేంద్రం చైర్మన్ ఎస్. రాజశేఖర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, సత్యసుమ మార్కెటర్స్ కంపెనీల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్ల కోసం నిర్వహించే ఈ మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.7వేల జీతం, ఇన్సెంటీవ్ ఇస్తామన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువకులకు స్థానిక భాగ్యనగర్‌లోని ఫస్ట్‌స్టెప్ సంస్థ కార్యాలయానికి చేరుకోవాలని, వివరాలకు 9393930109, 8099932144 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
తమ్ముడూ..మోసాల కుమ్ముడు
బడ్జెట్ ‘సిత్రాలు’ రూ.500 కోట్లు జిల్లాకే సరిపోవు ∙ ఆ అంకెలతో ఎందుకీ రంకెలు l ప్రశ్నిస్తున్న 84 వేల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ.500 కోట్లు. ఓసారి ఈ లెక్కల చిత్రాలేమిటో విశ్లేషించుకుందాం. జిల్లాలో నిరుద్యోగుల మొత్తం సంఖ్య 84 వేలు ... ఇచ్చిన హామీ భృతి రూ.2000. అంటే 84 వేల నిరుద్యోగులతో రూ.2000 గుణిస్తే ఎంత వస్తుంది...నెలకు సుమారు రూ.17 కోట్లు. బాబు అధికారంలోకి వచ్చి 36 నెలలైంది. బ్యాక్లాగ్ బకాయిలతో కలుపుకుంటే ... అంటే 36 నెలలు... 84 వేల మంది నిరుద్యోగులు ... నెలకు రూ.17 కోట్లు గుణిస్తే ఇప్పటి వరకు నిరుద్యోగులకు బాబు సర్కారు ఇవ్వాల్సింది సుమారు రూ.612 కోట్లు. అంటే బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లకు ఇంకో రూ.112 కోట్లు అదనమన్నమాట. ఒక్క ఈ జిల్లాకే సరిపడని ఈ కేటాయింపులతో ‘తందానా అంటే తాన తందానా’ అంటూ గంతులేస్తున్న ఈ తెలుగు తమ్ముళ్లు ఏం సమాధానం చెబుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సాక్షిప్రతినిధి, కాకినాడ : నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తా’మన్న చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్ ‘సాక్షి’గా నిరుద్యోగులను నిలువునా దగా చేశారు. గతంలో ఎవరూ ఇవ్వని భృతిపై ఆశలు పెంచడంతో జిల్లాలో నిరుద్యోగులు, యువత గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేశారు.బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఆయన మాటలు నమ్మి ఓటేసినందుకు తగిన బుద్ధి చెప్పారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లయినా ఇచ్చిన హామీపై చంద్రబాబు పెదవి విప్పలేదు. కనీసం రాష్ట్ర బడ్జెట్లో భారీగా కేటాయింపులుంటాయని గంపెడాశ పెట్టుకున్నారు. బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు నిరాశనే మిగిల్చాయి. నిరుద్యోగ భృతి కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రూ.500 కోట్లు కేటాయించారు. ఆ బడ్జెట్ ఏమూలకు వస్తుందని నిరుద్యోగ యువకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నాకు ఓటేయండి మీకు ఉద్యోగాలు కల్పిస్తానని, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి రూ.2000 ఇస్తామని ’ నాడు గొప్పగా ప్రకటించి ఆచరణలో దగా చేశారని విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉపాధి వేటలో సుమారు 84 వేల మంది... జిల్లా కేంద్రం కాకినాడ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో అధికారికంగా నమోదైన నిరుద్యోగులు 84 వేల151 మంది ఉన్నారు. వీరిలో పదో తరగతి ఉత్తీర్ణులై 10,641 మంది, ఇంటరీ్మడియట్ ఉత్తీర్ణులై 16,412 మంది, డిగ్రీ ఉత్తీర్ణులై 16596 మంది, బీఈడీ చేసి ఖాళీగా ఉన్న 4297 మంది, ఐటిఐ 13,314 మంది, డిపొ్లమా చేసి 5423 మంది, ఇతరులు 17,468 మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే సర్కార్ జిల్లా ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన వారి సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఉన్న 84 వేల 151 మంది నిరుద్యోగులకు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే రూ.2000 వంతున లెక్కేస్తే నెలకు రూ.16 కోట్ల 83 లక్షలపై చిలుకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే 36 నెలలకు తాను ఇచ్చిన మాటను అమలు చేయాలంటే రూ.612 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అధికారికంగా జిల్లా ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన నిరుద్యోగుల లెక్కలు తీసుకుంటేనే ఇంత మొత్తంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి. ప్రభుత్వం నిరుద్యోగ భృతికి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లు మన జిల్లాలో నిరుద్యోగులకే సరిపోవు. ఉపాధి కల్పనా కేంద్రంలో నమోదైన నిరుద్యోగుల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలోనే అంటే సుమారు లక్షన్నర మంది నమోదు కాని నిరుద్యోగులుంటారని అంచనా. బడ్జెట్లో అరకొర కేటాయింపులతోపాటు అర్హతకు నిర్ధేశించుకున్న మార్గదర్శకాలేమిటో కూడా స్పష్టం చేయకపోవడం తమను దగా చేయడమేనని నిరుద్యోగులు మండిపడుతున్నారు.