జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి | utilize job mela | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి

Published Sun, Dec 25 2016 12:01 AM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM

utilize job mela

కర్నూలు(అర్బన్‌): కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న జాబ్‌మేళాకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాని ఏపీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి. విజయకుమార్‌ అన్నారు. శనివారం స్థానిక బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను కొంతమేరకైనా రూపుమాపేందుకు ఎంపీ చూపుతున్న చొరవను గుర్తించాలన్నారు. ఎంజీఆర్‌ఎస్‌ టెక్నాలజీస్‌ సహకారంతో చేపడుతున్న ఈ మేళాలో 25 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులందరూ ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, జగదీష్, ఖాజా, రమణ, బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement