Vijay Sethupathi Silent Help to get Jobs for 1 lakh Persons, Deets Inside - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi Wins Hearts: విజయ్‌ సేతుపతి సహకారంతోనే.. లక్షకు పైగా ఉద్యోగాలు

Published Thu, Mar 24 2022 6:22 AM | Last Updated on Thu, Mar 24 2022 1:19 PM

Vijay Sethupathi Silent Help to get Jobs for 1 lakh Persons - Sakshi

విజయ్‌సేతుపతితో వీరరాఘవన్‌

Vijay Sethupathi Silent Help to get Jobs for 1 lakh Persons: బహుభాషా నటుడిగా రాణిస్తున్న విజయ్‌సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయనలో మరో ముఖం కూడా ఉంది. అదే సేవా భావం. ఆపదలో ఉన్న వారికి ఆప్పన్న హస్తం అందించడంలో విజయ్‌ సేతుపతి ముందుంటారు. అలాంటి ఈయన సహాయ సహకారాలతో ఇ.పి.వీరరాఘవన్‌ అనే సామాజిక సేవకుడు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి జీవితంలో వెలుగు నింపుతున్నారు. దీని గురించి ఈయన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను 2016 నుంచి సామాజిక సేవలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నానన్నారు.

ఆ విధంగా 2019లో సన్‌ టీవీ నిర్వహిస్తున్న నమ్మ ఊరు హీరో కార్యక్రమంలో ఆ ప్రోగ్రాం వ్యాఖ్యాత, నటుడు విజయ్‌ సేతుపతిని కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఆ తరువాత ఆయన సహాయ సహకారాలతో పాండిచ్చేరిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారన్నారు. అలా ఇప్పటి వరకు పాండిచ్చేరి, తమిళనాడులోని కొన్ని జిల్లాలకు చెందిన సుమారు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement