20న జాతీయ స్థాయి జాబ్‌మేళా | national jobmela on 20th | Sakshi
Sakshi News home page

20న జాతీయ స్థాయి జాబ్‌మేళా

Published Wed, May 17 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

national jobmela on 20th

కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20న జాతీయ స్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాలల చైర్మన్‌ డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, డిప్లొమో, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు రూ.99 రుసుం చెల్లించి నేరుగా జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్‌మేళాకు 20కి పైగా పెద్ద పెద్ద కంపెనీలు హాజరుకానున్నాయని, అర్హతలను బట్టి వేతనం, ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతోపాటు ఇతరులు పాల్గొనవచ్చని సూచించారు. వివరాలకు 76800 76632/02/03, 76600 03345, 78429 19899, 81252 58415 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement