kv subbareddy college
-
20న జాతీయ స్థాయి జాబ్‌మేళా
కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20న జాతీయ స్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాలల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, డిప్లొమో, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు రూ.99 రుసుం చెల్లించి నేరుగా జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్‌మేళాకు 20కి పైగా పెద్ద పెద్ద కంపెనీలు హాజరుకానున్నాయని, అర్హతలను బట్టి వేతనం, ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతోపాటు ఇతరులు పాల్గొనవచ్చని సూచించారు. వివరాలకు 76800 76632/02/03, 76600 03345, 78429 19899, 81252 58415 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
20న మెగా జాబ్ మేళా
–డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కె. అశోక్‌వర్దన్ రెడ్డి కల్లూరు: నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఎంబీఏ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన జాతీయ స్థాయి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆ కళాశాల చైర్మన్ కె. అశోక్‌వర్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కళాశాల ఆవరణలో జాతీయ స్థాయి మెగా జాబ్ ఫెయిర్ ‘లెట్స్ హైర్’ 2కే17 వాల్ పోస్టర్లను చైర్మన్ కె అశోక్‌వర్దన్‌రెడ్డి, డైరెక్టర్ హరీష్ కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జాబ్ ఫెయిర్‌లో 2015, 2016, 2017 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, డిప్లొమా, ఎంకామ్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాకు బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరై విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకుంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలోని టీ అండ్ పీ విభాగంలో లేదా సెల్: 76800 76632, 78428 19899, 81252 58415, 76800 76603 సెల్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
– 29 కంపెనీల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు – 1500 మంది హాజరు.. 300 మందికి ఉద్యోగాలు – ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందించిన చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. రాయలసీమ జిల్లాలతోపాటు తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మేళాలో 29 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో సుమారు 300 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లా చరిత్రలో మెగాజాబ్ మేళా నూతన అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. సీమ నిరుద్యోగలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన వారు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆంప్లస్, ఇన్ఫోసిస్ గ్రూపు ఆఫ్ ఇంజనీర్స్ సర్వీస్, హెచ్‌ఐఈఈ, కాన్రాడ్ లైటింగ్ సొల్యూషన్స్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, ద రైజ్ సొల్యూషన్స్, డాక్టర్ రెడ్డీస్, స్వాగతం రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జీమూంబా ప్రైవేట్ లిమిటెడ్, ధనుష్ ఇంజనీరింగ్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర 29 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. నియామక ఉత్తర్వులు పొందిన వారు వెంటనే ఉద్యోగాల్లో చేరాలని, ఒక్కొక్కరికి కంపెనీని బట్టి సుమారు రూ.38 వేల వరకు నెలసరి వేతనం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ తిమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.