20న మెగా జాబ్‌ మేళా | jobmela on 20th | Sakshi
Sakshi News home page

20న మెగా జాబ్‌ మేళా

Published Wed, May 10 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

jobmela on 20th

–డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల  చైర్మన్‌ కె. అశోక్‌వర్దన్‌ రెడ్డి
కల్లూరు: నగర శివారు దూపాడులోని డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల, ఎంబీఏ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన జాతీయ స్థాయి మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని ఆ కళాశాల చైర్మన్‌ కె. అశోక్‌వర్దన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కళాశాల ఆవరణలో జాతీయ స్థాయి మెగా జాబ్‌ ఫెయిర్‌ ‘లెట్స్‌ హైర్‌’ 2కే17 వాల్‌ పోస్టర్లను చైర్మన్‌ కె అశోక్‌వర్దన్‌రెడ్డి, డైరెక్టర్‌ హరీష్‌ క​ృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ జాబ్‌ ఫెయిర్‌లో  2015, 2016, 2017 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, డిప్లొమా, ఎంకామ్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్‌ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాకు బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరై విద్యార్థులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసుకుంటారని తెలిపారు.  మరిన్ని వివరాలకు కళాశాలలోని టీ అండ్‌ పీ విభాగంలో లేదా సెల్‌: 76800 76632, 78428 19899, 81252 58415, 76800 76603 సెల్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement