Indian IT Professionals Struggle to Stay in US amid Layoffs - Sakshi
Sakshi News home page

లే ఆఫ్స్‌ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల.. అమెరికాలో అరిగోస

Published Mon, Jan 23 2023 4:02 PM | Last Updated on Mon, Jan 23 2023 4:33 PM

Indian IT Professionals Struggle To Stay In US Amid Lay Offs - Sakshi

వాష్టింగన్‌: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఇంట మాత్రమే కాదు.. విదేశాల్లోనూ లక్షల మంది ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీంగా ఉందని వాషింగ్టన్‌ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.   

అగ్రరాజ్యంలో వేలమంది భారతీయ ఐటీ ఉద్యోగులు.. లే ఆఫ్స్‌ బారిన పడ్డారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ లాంటి బడా కంపెనీలతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లోనూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. కమిట్‌మెంట్‌ల కారణంగా తిరిగి స్వదేశానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు బాగా కష్టపడుతున్నారు. ఇక వీసా చిక్కులతో దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. ఈ లోపే కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణలో మునిగిపోయారు.  

వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. గతేడాది నవంబర్‌ నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు లే ఆఫ్స్‌ బారినపడి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. అయితే అందులో 30 నుంచి 40 శాతం ఇండియన్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ ఉన్నారని నివేదికలు చెప్తున్నాయి. వాళ్లలో ఎక్కువగా హెచ్‌1బీ, ఎల్‌1 వీసాల మీద వెళ్లిన వాళ్లే ఉన్నారు. ఈ క్రమంలో.. 

ఉద్యోగాల వేటకు.. వాట్సాప్‌ గ్రూపు
ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లు.. వర్క్ వీసాల కింద డెడ్‌లైన్‌లు ముందు ఉండడంతో కొత్త జాబ్‌ను వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. ఉద్యోగాలు పొగొట్టుకున్న ఉద్యోగుల్లో కొందరు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎనిమిది వందల మందితో ఉన్న ఓ గ్రూప్‌ అందుకు నిదర్శనం. ఇక వీళ్ల కష్టాలను చూసి జిట్‌ప్రో(GITPRO), ఫిడ్స్‌(FIIDS) రంగంలోకి దిగాయి. ఆదివారం నుంచి ఓ ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను వాళ్ల కోసం ఏర్పాటు చేశాయి. ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పరిస్థితి వర్ణనాతీతంగా ఉండడంతో ఉద్యోగులు సైతం తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని, చాలా కష్టంగా గడుస్తోందని కొందరు ఉద్యోగుల గోడు వెల్లబోసుకోగా.. వాళ్ల వ్యథలను వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించింది.

ఈ రెండు వీసాలు ఎవరికంటే..

H-1B వీసా అనేది వలసేతర వీసా. అమెరికన్‌ కంపెనీలు తమకు అవసరమయ్యే టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌లను(విదేశీ ఉద్యోగులను)  నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఇక ఈ వీసా కింద భారత్‌, చైనా లాంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి  అక్కడి బడా కంపెనీలు.హెచ్‌ 1 బీ వీసా జాబ్‌ పోతే గనుక.. 60రోజుల్లోగా హెచ్‌-1బీ స్పాన్సరింగ్‌ ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. 

ఇక L-1A, L-1B వీసాలు.. కంపెనీలు తాత్కాలిక బదిలీల మీద పంపిస్తుంటాయి. మేనేజెరియల్‌ పొజిషన్స్‌ లేదంటే ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉద్యోగుల విషయంలో ఈ వీసాలు ఎక్కువగా ఇస్తుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement