తపాలా ఉద్యోగుల పోస్టులకు అనూహ్య స్పందన
తపాలా ఉద్యోగుల పోస్టులకు అనూహ్య స్పందన
Published Fri, Apr 14 2017 12:32 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
– అరవై ఎనిమిది పోస్టులకు ఐదువేల దరఖాస్తులు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): తపాలా శాఖ ఏపీ సర్కిల్‌లో గతనెల 18న జారీ చేసిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీ ప్రకటనకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నిరుద్యోగులు అధిక సంఖ్యలో గ్రామీణ తపాలా ఉద్యోగుల పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల చేసుకుంటున్నారు. ఓసీ, ఓబీసీ జనరల్ అభ్యర్థులు హెడ్ పోస్టాఫీసులో రూ.100 ఆన్‌లైన్ సెలెక‌్షన్ ఫీజు చెల్లించాల్సి ఉన్నందున కర్నూలు ప్రధాన కార్యాలయంలో సంబంధిత కౌంటర్ల వద్ద రద్దీ పెరిగింది. రోజుకు సుమారు 200 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించేందుకు వస్తున్నారు. ఈనెల 19 వరకు గడువు ఉంది. డివిజన్ పరిధిలోని 26 బ్రాంచి పోస్టుమాస్టర్, 9 మెయిల్ డెలివరీ (జీడీఎస్‌ఎండి), 28 మెయిల్ కన్వేయన్స్ (జీడీఎస్‌ఎంసీ), 5 ప్యాకర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తారు. డివిజన్‌లో మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉంటే, దరఖాస్తుదారుల సంఖ్య ఇప్పటికే ఐదువేలకు చేరింది.
Advertisement