టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు.
టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు. కర్నూలుకు చెందిన మురళీమోహన్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి నిరుద్యోగులకు గాలం వేశాడు. నిరుద్యోగం అనే బలహీనతను ఆసరాగా చేసుకుని అతడు వారినుంచి దాదాపు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. సోమ్ము ముట్టగానే తిన్నగా జారుకున్నాడు.
దీంతో మోసం పోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. ఉద్యోగం పేరుతో తమ వద్ద నుంచి భారీగా సొమ్మును తీసుకుని మోసం చేసాడంటూ మురళీమోహన్పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సత్తెనపల్లి పోలీసులు నిందితుడు మురళీమోహన్ను అరెస్ట్ చేశారు.