నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
Published Sun, Dec 4 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఓరియంటల్ స్కిల్స్ అండ్ సెఫ్టీ సర్వీసెస్ సంస్థ మేనేజర్ అభిషేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని ఎస్‌ఎల్‌వీ బీఈడీ కాలేజీలో గౌండ(బెల్దార్), ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వెల్డింగ్, మహిళలకు హౌస్‌కీపింగ్ తదితర రంగాల్లో 90 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిక్షణకు వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయంతో పాటు, హాస్టల్ వసతి, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామన్నారు. ఇందుకు 10వ తరగతి, ఐటీఐ, ఒకేషనల్, డిప్లమా, పాలిటెక్నిక్ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు 98666 82579, 94927 05795 నెంబర్లను సంప్రదించవచ్చన్నా
Advertisement
Advertisement