హైదరాబాద్ : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి, మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు...ఒంగోలు జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నిరుద్యోగుల నుంచి సుమారు రూ.15 లక్షలు వసూలు చేశాడు.
ఎన్ని రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీయగా నిందుతుడు తప్పించుకు తిరిగాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వినోద్ కుమార్ పై నిఘా వేసిన సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని నుంచి కంప్యూటర్, ప్రింటర్, నకిలీ నియామక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.