విశాఖ విమ్స్ డైరెక్టర్ అరెస్ట్ | VIMS director subbarao arrested in cheating case | Sakshi
Sakshi News home page

విశాఖ విమ్స్ డైరెక్టర్ అరెస్ట్

Published Fri, Sep 11 2015 7:10 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

విశాఖ విమ్స్ డైరెక్టర్ అరెస్ట్ - Sakshi

విశాఖ విమ్స్ డైరెక్టర్ అరెస్ట్

విశాఖపట్నం : విశాఖపట్నం విమ్స్ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఈ విషయాన్ని అధికారింగా ధృవీకరించడం లేదు. విమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులను యోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకూ 16 మంది బాధితుల నుంచి ద్వారకా పోలీసులు ఫిర్యాదులు అందుకున్నట్లు సమాచారం.

ఈ మోసాల ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఓ ప్రజా ప్రతినిధి రామన్ బళ్లాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం విదితమే. డైరెక్టర్ సుబ్బారావును ద్వారకా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిరుద్యోగులను ఎలా మోసగించాడు, బాధితులు ఎవరన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement