విశాఖ విమ్స్ డైరెక్టర్ అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నం విమ్స్ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఈ విషయాన్ని అధికారింగా ధృవీకరించడం లేదు. విమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులను యోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకూ 16 మంది బాధితుల నుంచి ద్వారకా పోలీసులు ఫిర్యాదులు అందుకున్నట్లు సమాచారం.
ఈ మోసాల ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఓ ప్రజా ప్రతినిధి రామన్ బళ్లాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం విదితమే. డైరెక్టర్ సుబ్బారావును ద్వారకా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిరుద్యోగులను ఎలా మోసగించాడు, బాధితులు ఎవరన్న వివరాలు తెలియాల్సి ఉంది.