సాక్షి, హైదరాబాద్ : మెట్రో ప్రభుత్వానికి కాసులు కురిపిస్తోందో లేదో కానీ దోచుకునే వారికి మాత్రం కోట్లకు కోట్లు కురిపిస్తోంది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని పలు కన్సల్టెన్సీలు కోట్లాది రూపాయలను వెనుకేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతోంది. అలా కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చిన కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నాయి. అలాంటి ఓ బోగస్ కంపెనీ చేతుల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రతిష్టాతక్మంగా ప్రారంభించిన మెట్రోరైలు బోగస్ కంపెనీల పాలిట కల్ప తరువుగా మారింది. మెట్రోలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నగరంలోని ఏబీసీ కన్సల్టెన్సీ ఒక్కో నిరుద్యోగి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేసింది. మొత్తం రూ.1.50 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో డబ్బు చెల్లించిన బాధితులు లబోదిబోమంటూ ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగాలు కల్పిస్తామని బోర్డు తిప్పిన కన్సెల్టన్సీ నిర్వాహులకు అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment