consultancy
-
రాజీనామాకూ కన్సల్టెన్సీ
మన దగ్గర ఉద్యోగం కలి్పంచడం కోసం బోలెడన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి. కానీ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ అందుకు భిన్నం! అక్కడ రాజీనామా చేయాలనుకునే ఉద్యోగుల కోసం కన్సల్టెన్సీలుంటాయి!! అవి ఇటీవల దేశవ్యాప్తంగా పుట్ట గొడుగుల్లా పెరుగుతున్నాయి. రాజీనామాకు కన్సల్టెన్సీలు ఎందుకా అనుకుంటున్నారా? జపాన్ పని సంస్కృతి, అందులోని సంక్లిష్టతలే అందుకు కారణం... రాజీనామా చేయాలంటే ఏం చేస్తాం? గడువు ప్రకారం రాజీనామా లేఖ ఇస్తాం. అంతటితో సరిపోతుంది. కానీ జపాన్‌లో రాజీనామా అంత ఈజీ కాదు. అక్కడి పని సంస్కృతే ఇందుకు కారణం. అక్కడ కెరీర్ మొత్తం ఒకే సంస్థలో కొనసాగించే వాళ్ల సంఖ్యే ఎక్కువట. చేస్తున్న పని ఇష్టం లేకపోయినా, బాస్ తీరు నచ్చకపోయినా వేధింపులకు భయపడో, మరో కారణంతోనో కష్టంగా అదే ఉద్యోగంలో కొనసాగుతున్న వాళ్లు చాలామంది. సరిగ్గా ఇలాంటి వాళ్లకు సాయం చేసేందుకే పుట్టుకొచ్చాయి ‘రాజీనామా కన్సల్టెన్సీలు’. ఇవి కొవిడ్‌కు ముందే ఉన్నా, ఆ మహమ్మారి తదనంతర కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 11,000 పై చిలుకు క్లయింట్ల తమ సేవల గురించి ఎంక్వైరీ చేసినట్టు ‘మోమూరి ఆపరేషన్స్’ అనే రాజీనామాల కన్సల్టెన్సీ సంస్థ చెబుతోంది. ‘మోమూరి’ అంటే జపనీస్‌లో ‘నేనీ పని ఇంకే మాత్రమూ చేయలేను (ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్)’ అని అర్థం! ఇది 2022లో పుట్టుకొచి్చంది. కర్ర విరక్రుండా, పాము చావకుండా ఎలా రాజీనామా చేసి బయట పడాలో ఇవి సలహాలిస్తాయన్నమాట. ఈ వ్యవహారంలో చట్టపరమైన వివాదాల్లాంటివి తలెత్తితే కూడా అవే చూసుకుంటాయి. అధిక పని సంస్కృతి... జపాన్‌లో చాలాకాలంగా అధిక పని సంస్కృతి ఉంది. రంగమేదైనా ఉద్యోగులకు పనివేళలు మరీ ఎక్కువ. ఏకధాటిగా 12 గంటలు పని చేయడం చాలా మామూలు విషయం. ఇల్లు చేసేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. మళ్లీ ఉదయాన్నే హడావుడిగా బయల్దేరాలి. ఇలా వెనక్కు తిరిగి చూసుకుంటే పనిలో కరగదీసిన జీవితమే తప్పితే సరదాగా గడిపిన క్షణాలంటూ పెద్దగా కన్పించడం లేదని వాపోయేవాళ్ల సంఖ్యే అధికం. వీటికి తోడు సూపర్వైజర్లు, మేనేజర్ల నుంచి ఒత్తిళ్లు. తట్టుకోలేక రాజీనామాకు ప్రయతి్నస్తే యజమానులు వేధిస్తారట. ఇలాంటి సంస్థలను ‘నల్లజాతి సంస్థలు’గా పిలుస్తుంటారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లోనే గాక పెద్ద సంస్థల్లోనూ ఈ సంస్కృతి ఉందట. బాధితుల్లో ప్రధానంగా ఆహార పరిశ్రమ కార్మికులు, ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ రంగాల వారున్నారు. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే, తీవ్రమైన పని ఒత్తిడి పెట్టే సంస్థల జాబితాను ప్రభుత్వమే నిషేధిత జాబితాలో పెట్టడం ప్రారంభించింది! అలా జపాన్వ్యాప్తంగా ఇప్పటికే 370కి పైగా కంపెనీలు లేబర్ బ్యూరో బ్లాక్ లిస్ట్‌లో చేరాయి. అధిక పని ఒత్తిడి వల్ల మెదడు, గుండె సంబంధిత జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య జపాన్‌లో పెరుగుతోందట. 31 ఏళ్ల జర్నలిస్టు ఒకామె కేవలం పని ఒత్తిడి వల్లే హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణించింది. చనిపోవడానికి ముందు ఒకే నెలలో ఆమె ఏకంగా 159 గంటలు ఓవర్ టైమ్ పని చేసిందట! అలాగే ఓ 26 ఏళ్ల వైద్యుడు కూడా ఒకే నెలలో 200 గంటలకు పైగా ఓవర్ టైమ్ పనిచేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు! మారుతున్న యూత్.. ఈ పని జపాన్‌లో ఎప్పటినుంచో సంస్కృతి ఉన్నా రాజీనామా కన్సల్టెన్సీలు ఇటీవలి కాలంలోనే ఎందుకు పుట్టుకొచ్చాయి? అంటే యువత ఆలోచనల్లో వచి్చన మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లో ఉద్యోగుల్లో వృద్ధుల సంఖ్య తగ్గుతోంది. ఎక్కడ చూసినా యువ ఉద్యోగులే. ఉద్యోగం స్వభావంతో సంబంధం లేకుండా యజమాని ఏది చెబితే అది చేయాలనే పాత తరం ఆలోచనతో వాళ్లు ఏకీభవించడం లేదు. అందుకే అవసరమైతే రాజీనామాకూ వెనకాడటం లేదు. అలాగని యాజమాన్యంతో ఘర్షణ పడి ఉద్యోగ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే నేర్పుగా పని కానిచ్చుకోవడానికి కన్సల్టెన్సీల బాట పడుతున్నారు.‘‘రాజీనామా ఏజెన్సీలు జపాన్ సమాజం నుంచి పూర్తిగా కనుమరుగవ్వాలని మేం నిజాయితీగా కోరుకుంటున్నాం. ఉద్యోగులు తమ రాజీనామా గురించి నేరుగా బాస్‌తో మాట్లాడుకునే వాతావరణం వస్తే మేలు. కానీ మా క్లయింట్ల భయానక గాథలు వింటుంటే అది ఇప్పట్లో జరుగుతుందని అనిపించడం లేదు’’ – మోమూరీ కన్సల్టెనీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
పక్కా స్క్రిప్టు.. దోపిడీ కిక్కు!
సాక్షి, అమరావతి : కొత్త మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీశారు. అందుకోసం తన ట్రేడ్ మార్కు శైలి అయిన ‘కన్సల్టెన్సీ ఎంపిక’ పేరుతో ఎత్తుగడ వేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ నేతల సిండికేట్ గుత్తాధిపత్యం కిందకు తీసుకువచ్చేందుకు పక్కాగా పన్నాగం పన్నారు. ఈ కుట్రకు రాజ ముద్ర వేయించి, అనంతరం మద్యం విక్రయాల పేరుతో భారీగా దోపిడీకి పాల్పడాలన్నది ఆయన వ్యూహం. అందుకే మద్యం విధానం రూపకల్పన కోసం కన్సల్టెన్సీ ఎంపిక పేరిట డ్రామా ఆడుతున్నారు. మద్యం పాలసీ రూపొందించేందుకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఎక్సైజ్ శాఖ ద్వారా కాకుండా ‘ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్) ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించడం విడ్డూరం. మద్యం విధానం రూపకల్పనలో ఏపీయూఐఏఎంఎల్‌కు ఎలాంటి అనుభవం లేదు. కేవలం ఎక్సైజ్ శాఖకు మట్టి అంటకుండా ఏపీయూఐఏఎంఎల్ ద్వారా కథ నడిపించాలని ఎత్తుగడ వేశారు. తమ అస్మదీయ కన్సల్టెన్సీకి అనుకూలంగా నిబంధనలను రూపొందించి, పక్కాగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ సాగిస్తున్న కుతంత్రం ఇలా ఉంది. చంద్రబాబు ట్రేడ్‌మార్కు కన్సల్టెన్సీ కుట్ర 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి, రాష్ట్రంలో యథేచ్ఛగా మద్యం దోపిడీకి పాల్పడిన విషయం అందరికీ గుర్తుంది. మద్యం దుకాణాలన్నింటినీ టీడీపీ నేతలు గుప్పెట పట్టడంతోపాటు పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలదని.. ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే 25 శాతం అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడ్డారు. ఏటా రూ.2.50 లక్షల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.12.50 కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. దాంతో మద్యం దోపిడీకి అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతానికి మించి, మద్యం దుకాణాల ద్వారా దోపిడీకి పాల్పడేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం చంద్రబాబు అండ్ కో ఇప్పటికే ఓ విధానాన్ని రూపొందించినట్టు సమాచారం. ఎక్సైజ్ పాలసీపై సమీక్ష పేరుతో చంద్రబాబు ఇప్పటికే కొత్త మద్యం విధానాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. కాగా శంఖంలో పోస్తేగానీ తీర్థం కాదన్నట్టు.. తాము రూపొందించిన విధానాన్ని ఓ కన్సల్టెన్సీయే ప్రతిపాదించిందని కనికట్టు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీయూఐఏఎంఎల్ ద్వారా టెండర్లను ఆహ్వానించారు.బిడ్ల దాఖలుకు నాలుగు రోజులే గడువు» తమ అస్మదీయ కన్సల్టెన్సీకే రాష్ట్రంలో మద్యం విధానాన్ని రూపొందించే కాంట్రాక్టు దక్కేలా స్క్రిప్ట్ రూపొందించారు. కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీయూఐఏఎంఎల్ రూపొందించిన అర్హత నిబంధనలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. » టెండర్ల ప్రక్రియలో పాల్గొనే కన్సల్టెన్సీకి గత మూడేళ్లలో సగటున ఏటా రూ.100 కోట్లు టర్నోవర్ ఉండాలని నిబంధన పెట్టారు. ఇతర రాష్ట్రాల్లోగానీ, విదేశాల్లోగానీ ఆ మేరకు టర్నోవర్ ఉండొచ్చన్నారు. ఇంత భారీగా టర్నోవర్ ఉండాలనడానికి ఇది రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టు కాదని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.» కేవలం ఓ పాలసీ రూపొందించాల్సిన కన్సల్టెన్సీకి ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ కన్సల్టెన్సీకి ఇతర కన్సార్షియం ద్వారా రూ.100 కోట్లు టర్నోవర్ ఉందని రికార్డులు సృష్టించి ఉంటారు. అందుకే ఆ నిబంధన పెట్టారన్నది స్పష్టమవుతోంది. » కన్సల్టెన్సీ ఎంపిక కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం ప్రభుత్వ దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. సాధారణ టెండర్లకు 21 రోజులు, ఎంతటి స్వల్ప కాలిక టెండరుకు అయినా కనీసం 14 రోజులు గడువు ఇస్తారు. ఏపీయూఐఏఎంఎల్ మాత్రం ఆ నిబంధనను పట్టించుకోలేదు. » ఈ నెల 13న టెండరు నోటిఫికేషన్ ఇచ్చి.. బిడ్లు దాఖలు చేసేందుకు 16 వరకు తొలుత గడువు విధించింది. తర్వాత మరో రోజు పొడిగించి 17లోగా బిడ్లు సమర్పించాలని పేర్కొంది. కేవలం నాలుగు రోజుల గడువు ఇవ్వడమంటే ఇతర కన్సల్టెన్సీలు ఏవీ పోటీకి రాకూడదని వేసిన ఎత్తుగడేనన్నది స్పష్టమవుతోంది. అంతేకాకుండా బిడ్లను స్వయంగా వచ్చి దాఖలు చేయాలని పేర్కొంది. ఆన్లైన్లో దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వ లేదు. పైగా బిడ్లు దాఖలు చేసిన తర్వాత ఒక్క రోజులోనే ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది.» దూరప్రాంతంలో ఉన్న కన్సల్టెన్సీ సంస్థలు కేవలం నాలుగు రోజుల్లోనే బిడ్లను రూపొందించి.. తమ ప్రతినిధులను అమరావతికి పంపించి దాఖలు చేయడం.. అనంతరం ఒక్క రోజులోనే ప్రజెంటేషన్ ఇవ్వడం.. అన్నది మామూలుగా సాధ్యం కాదు. కేవలం ఇతర కన్సల్టెన్సీలు బిడ్లు దాఖలు చేయకుండా ఉండేందుకే ఇటువంటి అసంబద్ధ నిబంధనలు విధించారు. తద్వారా తమ అస్మదీయ కన్సల్టెన్సీకే అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారని ఎక్సైజ్ శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
‘బి’ గ్యాంగ్ బేరాల జోరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడో దశలో కన్వీనర్ కోటాలో చేరే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. కన్వీనర్ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకూ 70,627 కేటాయించారు. ఇంకా 13,139 సీట్లు ఉన్నాయి. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కౌన్సెలింగ్‌లో మిగిలిపోయే సీట్లను ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లుగా భర్తీ చేయడం సర్వసాధారణం. వాస్తవానికి వీటిని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజులతోనే భర్తీ చేయాలి. కానీ కౌన్సెలింగ్‌లో సీటు రాని విద్యార్థులకు ఎక్కువ మొత్తం తీసుకుంటూ సీట్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు యాజమాన్య కోటా సీట్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 33 వేల వరకూ ఉంటాయి. ఇందులో సగం బి కేటగిరీ కింద, మిగతా సగం ఎన్ఆర్ఐ కోటా కింద ఉంటాయి. వీటితో కాసుల పంట పండించుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. రంగంలోకి ఏజెంట్లు, కన్సల్టెన్సీలు ప్రధాన ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు దాదాపు భర్తీ అయ్యాయి. అయితే టాప్ టెన్ కాలేజీలను మినహాయిస్తే మిగతా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. వీటిని ఈ నెలాఖరు వరకూ భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో కాలేజీలు ఏజెంట్లను, కన్సల్టెన్సీలను భారీగా కమీషన్లు ఆశచూపి రంగంలోకి దించుతున్నాయి. ఏజెంట్లు, కన్సల్టెన్సీల ప్రతినిధులు ఎంసెట్ అర్హుల జాబితా ఆధారంగా వారి ఫోన్ నంబర్లు సంపాదించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఏదో రకంగా నమ్మబలుకుతూ తమకు అనుకూలమైన కాలేజీల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సీట్లు అయిపోతున్నాయని, త్వరగా అప్రమత్తం కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కసారి కాలేజీ యాజమాన్యం వద్దకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నారు. కంప్యూటర్ కోర్సుకు గిరాకీ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 56,811 కంప్యూటర్ సైన్స్ సీట్లున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో 19 వేల వరకు సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 53,034 సీట్లు భర్తీ చేశారు. ఇంకా 3,777 సీట్లు మిగిలిపో యాయి. ఇవన్నీ టాప్‌టెన్ కాని కాలేజీల్లోనే ఉన్నా యి. ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు, కోరు కున్న కాలేజీలో, కోరుకున్న బ్రాంచీలో సీట్లు రాని వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్ని స్తున్నారు. సీఎస్సీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉందంటూ కాలేజీల యాజమాన్యాలు, ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. ఒక్కో సీటు రూ.12 నుంచి రూ.16 లక్షలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో రూ.2 లక్షల వరకూ కన్సల్టెన్సీలకు కమీషన్లుగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి బి కేటగిరీ సీట్లను ఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుకు, మెరిట్ ప్రకారమే ఇవ్వాలి. ఈ నిబంధన ఎక్కడా పాటించడం లేదని తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్నా ఫీజు ఎక్కువగా ఉండటంతో అవి మిగిలిపోతున్నాయి. వీటిని కూడా భారీగా డబ్బులు తీసుకుని ఎన్ఆర్ఐ కోటా మాదిరి పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారని, యాజమాన్య కోటా సీట్ల దందా అపాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
మనమెక్కడో తెలుసుకుందాం..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకునేందుకు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, నేతలు సొంత సర్వేల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో తమ తమ నియోజక వర్గాల్లో పరిస్థితిని, ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. పనితీరు మెరుగ్గా ఉండి గెలుపు అవకాశాలు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ దక్కుతుందని పార్టీ అధి నేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలు ‘థర్డ్ పార్టీ’ సర్వేలు చేయించుకుంటున్నారు. తమ పనితీరు, అదే సమయంలో ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈసారి గట్టిగా టికెట్ ఆశిస్తు న్న బీఆర్ఎస్ నేతలు కూడా సర్వేలపై ఆసక్తి చూపిస్తున్నారు. పథకాలు, పనితీరు ప్రభావంపై అంచనా ప్రభుత్వ పథకాలతో పాటు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఇతర పనులు ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందో ఓ అంచనాకు వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, కింది స్థాయిలో కేడర్ పనితీరు తమ గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకుల పనితీరు పైనా, తమతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారేమైనా దుర్వినియోగం చేశారా అనే కోణంలోనూ సర్వేలు చేయిస్తున్నారు. సర్వేలతో పాటు వివిధ మార్గాల్లో ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు. కేవలం పైపైన సమాచారంతో సరిపుచ్చుకోకుండా లోతుగా విశ్లేషించాలని కన్సల్టెన్సీలను కోరుతున్నారు. ఒక్కో మండలాన్ని మూడు నాలుగు క్లస్టర్లుగా విభజించి ఇన్ఫ్లూయెన్సర్స్ (ప్రభావశీలురు) నుంచి వివరాలు సేకరించేలా చేస్తున్నారు. ఇన్ఫ్లూయెన్సర్స్ కేటగిరీలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, ఉద్యోగులు, ఆర్ఎంపీలు, ఎల్ఐసీ ఏజెంట్లు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు తదితరులను చేర్చి కన్సల్టెన్సీలు శాంపిళ్లు సేకరిస్తున్నాయి. ఎన్నికల మేనేజ్మెంట్ సంస్థలకు ఫుల్ గిరాకీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే సంస్థలకున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని పలు కన్సల్టెన్సీలు పుట్టుకొస్తున్నాయి. సర్వేలతో పాటు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ప్రచారం, ఇతర కార్యకలాపాల కోసం ఎమ్మెల్యేలు సొంతంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నారు. సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ, ఎన్నికల మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్, ప్రచార వ్యూహాల రూపకల్పన, పర్సెప్షన్ మేనేజ్మెంట్ (ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు) తదితర సరికొత్త అంశాలతో ఈ కన్సల్టెన్సీలు రాజకీయ నేతలను ఆకర్షిస్తున్నాయి. ఈ కన్సల్టెన్సీల ద్వారా నియోజకవర్గాల్లో జరిగే కార్యకలాపాలను నేతల కుటుంబ సభ్యులు, సన్నిహితులు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వర్గాల నుంచి అందే సమాచారం కంటే ఈ థర్డ్ పార్టీ సంస్థల నుంచి అందే నివేదికలు శాస్త్రీయంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీ సర్వే నివేదికలపై ఎమ్మెల్యేల ఆసక్తి గతంలో బీఆర్ఎస్కు రాజకీయ వ్యూహాలు, సర్వే సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ దూరమైన తర్వాత ఇతర సంస్థలు తెరమీదకు వచ్చాయి. డిజిటల్ మీడియా వింగ్‌కు చెందిన ఓ నిపుణుడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ సర్వే సంస్థ ప్రస్తుతం బీఆర్ఎస్కు ఎన్నికల కోణంలో విస్తృత సేవలు అందిస్తోంది. ‘కె2 కన్సల్టెన్సీ’గా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న ఈ సంస్థ విపక్ష పార్టీల కన్సల్టెన్సీల కంటే చాలా ముందంజలో ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే నేతృత్వంలోని సంస్థ కూడా సర్వేలు చేసి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కన్సల్టెన్సీల నివేదికలతో పాటు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి తమపై వెళ్తున్న నివేదికల వివరాలు తెలుసుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారు. -
హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం
-
పెరికలకు ప్రత్యేక కన్సల్టెన్సీ
పంజగుట్ట (హైదరాబాద్): పెరిక కులస్తుల విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రత్యేక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఆదివారం సోమాజిగూ డ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ హైదరాబాద్ పెరిక కుల సంఘం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ అధ్యక్షుడు బత్తిని పరమేష్‌తో పాటు మిగిలిన కార్యవర్గంతో అల్లం నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ సంఘానికి అర ఎకరం స్థలం, రూ.50 లక్షల నిధుల మంజూరు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
డేటా సెంటర్లు.. భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: డేటా సెంటర్ల వ్యాపారంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. గత ఐదేళ్లలో ఈ విభాగంలోకి 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని.. 2025 నాటికి మొత్తం పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు (రూ.1.6 లక్షల కోట్లు) చేరుకుంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేసింది. స్థిరమైన ఆదాయం వచ్చే ఆస్తుల పట్ల కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. డేటా సెంటర్లు – రియల్ ఎస్టేట్‌లో డిమాండ్‌పై ఈ సంస్థ మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. విధానపరమైన ప్రోత్సాహం, డిజిటలైజేషన్‌తో దేశంలో డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి టెక్నాలజీ అమలును వేగవంతం చేసిందని, దీంతో డేటా వినియోగం గణనీయమైన స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. ఓటీటీ, ఆన్లైన్ గేమింగ్, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, ఈ కామర్స్, ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్‌ల ఆన్లైన్ విద్య, లొకేషన్ ఆధారిత పని, అత్యాధుని టెక్నాలజీలు.. మెషిన్ లెర్నింగ్, 5జీ, బ్లాక్‌చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలసి డేటా ట్రాన్స్‌మిషన్‌ను ఎన్నో రెట్లు పెంచినట్టు.. అధిక సామర్థ్యం కలిగిన సర్వర్ల అవసరం ఏర్పడినట్టు వివరించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం డేటా సెంటర్లు అన్నవి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు రియల్ ఎస్టేట్‌లో ముఖ్యమైన ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారినట్టు సీబీఆర్ఈ పేర్కొంది. స్థిరమైన ఆదాయం కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నందున ఈ రంగంలో పెట్టుబడులు మరిన్ని గరిష్టాలకు చేరాతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం డేటా కేంద్రాలకు మౌలికరంగ హోదాను కల్పించడాన్ని కూడా సానుకూలంగా పేర్కొంది. ఇది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనా వేసింది. ఈ సానుకూలతలతోనే 2025 నాటికి పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లు దాటతాయన్న అంచనాతో ఉంది. అంటే గత ఐదేళ్లలో వచ్చిన 14 బిలియన్ డాలర్లకు అదనంగా, వచ్చే ఐదేళ్లలో మరో 6 బిలియన్ డాలర్ల నిధులు ఈ రంగంలోకి రానున్నాయి. వివిధ రంగాల్లోని వ్యాపారాలు డిజిటల్ విభాగంలోకి విస్తరిస్తున్నందున డేటా కేంద్రాలకు డిమాండ్ పెరుగుతుందని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. టెక్నాలజీ, ఆటోమేషన్ అన్నవి వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో డేటా కేంద్రాలు ఏ విధంగా విస్తరిస్తాయనేదానికి కీలకమని పేర్కొంది. -
మున్నాభాయ్ వర్సిటీ..! పది నుంచి పీహెచ్డీ దాకా.. ఏది కావాలన్నా రెడీ
సాక్షి, హైదరాబాద్: ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం చూశాం.. కాపీ కొట్టి పరీక్ష రాసి టాప్ ర్యాంకులు పొందిన వారినీ చూశాం.. కానీ ఏ కోర్సు చదవకుండానే ఎంబీబీఎస్, ఎంటెక్, పీహెచ్డీ... ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా చిటికెలో రూపొందించి ఇస్తున్న ముఠాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పదో తరగతి నుంచి పీహెచ్డీ, ప్రొఫెషనల్ కోర్సుల సర్టిఫికెట్ల దాకా ఏదైనా తయారుచేసి నిరుద్యోగ యువతను కటకటాల్లోకి వెళ్లేలా చేస్తున్నాయి. సర్టిఫికెట్‌ను బట్టి రేటు.. కూకట్‌పల్లికి చెందిన నవీన్ (పేరు మార్చాం) డిగ్రీ సర్టిఫికెట్ కావాలని తన స్నేహితుడు కరణ్ (పేరు మార్చాం)కి అడి గాడు. తనకు తెలిసిన విజయవాడ స్నేహితుడు రామ్మో హన్ను కలిస్తే పని అవుతుందని, యూపీలోని ఓ యూని వర్సిటీ నుంచి బీకాం సర్టిఫికెట్ తెప్పిస్తాడని చెప్పాడు. రామ్మోహన్‌కు కాల్ చేయగా రూ.1.2 లక్షలు ఖర్చువుతుందనగా... తాను 90 వేలు ఇవ్వగలను అన్నాడు. ఆ మేరకు డబ్బులివ్వగా వారంలోనే సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇలా ముఠాలు నిరుద్యోగ యువత అవసరాన్ని ఆసరాగా చేసుకొని పేర్లు కూడా సరిగ్గా తెలియని యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. పదో తరగతి సర్టిఫికెట్‌కు రూ.లక్ష, ఇంటర్ రూ.80 వేలు, డిగ్రీకి కనీసం రూ.లక్ష, బీటెక్ అయితే రూ.2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు రాచకొండ, సైబరాబాద్ పోలీసుల విచారణలో బయటపడింది. వరుస కేసులతో గుట్టురట్టు.. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టులో సైబరాబాద్, రాచకొండ పోలీసులు నకిలీ సర్టిఫికెట్ రాకెట్ల గుట్టురట్టు చేసి పలువురిని కటకటాల పాలుచేశారు. జూలైలో గ్యాంగ్ సూత్రధారిగా ఉన్న విజయవాడకు చెందిన ప్రైవేట్ టీచర్ కోటా కిషోర్ వివిధ బోర్డులు, యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్టు గుర్తించి 11మందిని అరెస్ట్ చేశారు. 18 వర్సి టీలు, 13 రాష్ట్రాల బోర్డుల పేరిట వందల సర్టిఫికెట్లు సృష్టించి డబ్బులు దండుకున్నట్టు గుర్తించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకున్న వారిని టార్గెట్ చేసు కొని నకిలీలు రూపొందించిన ఏడుగురిని గత ఆగస్టులో అరెస్ట్‌చేశారు. రూ.25 వేల నుంచి 5 లక్షల వరకు తీసుకొని 500 మందికి నకిలీ సర్టిఫికెట్లు, రికమెండేషన్ లెటర్లు సమకూర్చి నట్టు వెలుగులోకి వచ్చింది. అలాగే, విదేశాలకు వెళ్లా లనుకునే వారికి బీటెక్, ఎంటెక్ సర్టిఫి కెట్లు రూపొందించి లక్షలు సొమ్ము చేసుకున్నట్టు బయటపడింది. అమెరికా, యూకే, కెనడా వెళ్లేందుకు వీసాలు ప్రాసెస్ చేస్తా మని చైతన్యపురిలో కన్సల్టెన్సీ బోర్డు పెట్టి నకిలీలు రూపొందించిన ముఠాను అరెస్ట్ చేశారు. కాక తీయ, ఉస్మానియా, ఆచార్య నాగార్జున, జేఎన్టీయూ వర్సిటీల ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి నకిలీలు సృష్టి స్తూ వీసాలకు డాక్యుమెంట్లను రూపొందించిన వ్యవహా రా న్ని పోలీసులు బయటపెట్టారు. ఈ ముఠాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంజనీ రింగ్ పూర్తిచేసిన ఓ మహిళ, మరో ఇద్దరు నిరుద్యోగులను కటకటాల్లోకి నెట్టినట్టు పోలీసులు తెలిపారు. గల్లీకో కన్సల్టెన్సీ.. ఎలాగైనా విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని అక్రమ మార్గాలను ఎంచుకుంటున్న యువతకు ఈ కన్సల్టెన్సీలు ఆశాదీపంగా కనిపిస్తున్నాయి. పైగా ఎంత డిమాండ్ చేస్తే అంత మొత్తంలో డబ్బులు దండుకోవచ్చన్న అత్యాశతో మోసాలకు పాల్ప డుతున్నారు. గల్లీకో కన్సల్టెన్సీ పేరిట అందమైన ఆఫీసులు పెట్టి బురిడీ కొట్టిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 2వేలకు పైగా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో సగానికి పైగా కన్సల్టెన్సీలు అక్రమ మార్గాల్లో విద్యార్థులను విదేశాలకు పంపుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నా వీసా రాదనే భయంతో కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు. -
కల చెదురుతోంది.. కథ మారుతోంది! భద్రం బ్రదరూ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ చదువుల మోజులో అనేకమంది విద్యార్థులు కన్సల్టెన్సీల మాయలో పడి మోసపోతున్నారు. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ తంతు సర్వసాధారణంగా మారిపోయింది. ఇదే సమయంలో విదేశాల్లో ఎంఎస్ కోర్సులకు ప్రవేశాలుంటాయి. దీంతో వివిధ రూపాల్లో గ్రాడ్యుయేట్ల, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థుల ఫోన్ నంబర్లు సంపాదిస్తున్న కన్సల్టెన్సీలు, ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలోని వర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని పత్రాలూ తామే రెడీ చేస్తామని చెబుతున్నాయి. అంతేకాదు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు తాత్కాలిక సర్దుబాటు చేసేవారిని ఏర్పాటు చేస్తామంటూ విద్యార్థుల్ని ముగ్గులోకి దింపుతున్నాయి. దీంతో ఏదో ఒక కారణంగా అమెరికా లాంటి విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ కన్సల్టెన్సీల వలలో చిక్కుతున్నారు. లక్షకు రూ.10 వేలు కమీషన్! మన రాష్ట్రం నుంచి ఎంఎస్ కోసం ఏటా ఒక్క అమెరికా నుంచే 12 వేల మంది వెళ్తున్నారు.కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు మరో 15 వేల మంది వెళ్తున్నారు. ఎంఎస్ కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ వర్సిటీ ఫీజులతో పాటు, చదువుకునే సమయంలో ఖర్చులన్నీ తానే భరించాలి. చదువు పూర్తయ్యే వరకు ఎలాంటి ఉద్యోగం చేయడానికి వీల్లేదు. దీంతో విశ్వవిద్యాలయం ఫీజు రూ.25 లక్షలు, ఇతర ఖర్చులకు మరికొంత నగదు బ్యాంకులో ఉన్నట్టు చూపించాలి. లేదా తగిన ఆదాయ వనరులున్నట్టు అధికారిక పత్రాలు చూపించాలి. ఇంజనీరింగ్ తర్వాత కొనసాగింపుగా మరే కోర్సులోనూ చేరని వాళ్లు, ఈ మధ్యకాలంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నట్టుగా చూపించాలి. సంబంధిత పత్రాలతో పాటు, ఉద్యోగానుభవానికి సంబంధించిన పత్రాలు కూడా కన్సల్టెన్సీలే సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఊరూ పేరూ లేని కంపెనీలతో నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, ఇంటర్న్‌షిప్ చేసినట్టు ధ్రువపత్రాలు పుట్టిస్తున్నారు. అంతేకాదు వాళ్లే విద్యార్థి పేరుతో అప్పటికప్పుడు ఖాతా తెరిపించి, అందులో తమకు తెలిసిన వారి ద్వారా డబ్బులు వేయిస్తున్నారు. ముందు చెక్‌పై సంతకం పెట్టించుకుని విద్యార్థి వెళ్లిన వెంటనే డ్రా చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు రూ.3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకుంటున్నారు. బ్యాంకులో డబ్బులు వేసిన వ్యక్తికి లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్ ఇప్పిస్తున్నారు. నకిలీలపై పెరిగిన నిఘా.. అమెరికా, మరికొన్ని దేశాలు నకిలీ పత్రాలు, బ్యాంకు ఖాతాలపై గత రెండేళ్ళుగా దృష్టి పెట్టాయి. ప్రైవేటు సంస్థల చేత విచారణ చేయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ఇలాంటి అనేక ఉదంతాలు వెలుగుచూశాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా కన్సల్టెన్సీల దందా కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు మోసపోతూనే ఉన్నారు. కొన్నిసార్లు వీసానే మంజూరు కావడం లేదు. మరికొన్ని సందర్భాల్లో వీసా వచ్చి విమానం ఎక్కినా విదేశాల్లో దిగాక విమానాశ్రయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా బయటపడ్డారనే సమాచారం తెలిసేవరకు గుండెలరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దొరికిన వారెందరో.. ►ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఈ విధమైన నకిలీ పత్రాలు వెలుగు చూశాయి. దీంతో ఎంబసీ అధికారులు ఢిల్లీ చాణక్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు చేసి పలువురిని అరెస్టు చేశారు. ►హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన వెర్టెక్స్ నెట్‌కామ్ సొల్యూషన్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినట్టు ఓ కన్సల్టెన్సీ నకిలీ పత్రాలు సృష్టించినట్టు తేలింది. ఇదే సంస్థ పేరుతో ఇంటర్న్‌షిప్ లెటర్, మహారాష్ట్రలోని గోదావరి అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ కో–ఆపరేటివ్ బ్యాంకు పాస్‌బుక్, అందులో రూ.24 లక్షలున్నట్టు పత్రాలు సమర్పించి దొరికిపోయారు. ►వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి సాఫ్ట్‌టెక్ కంప్యూటర్స్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు పేర్కొని, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో రూ.25 లక్షలు ఉన్నట్టు చూపించి పట్టుబడ్డాడు.ఇదే జిల్లాకు చెందిన మరో అభ్యర్థి సాఫ్ట్‌టెక్ కంప్యూటర్స్‌లో పైతాన్ కోర్సు చేసినట్టు నకిలీ పత్రాలు సమర్పించి పట్టుబడ్డాడు. ►ఏప్రిల్ నెలలో మొత్తం ఆరు కన్సల్టెన్సీ సంస్థలపై కేసులు నమోదు కావడం గమనార్హం. నాన్న కల నిజం చేయాలని.. హైదరాబాద్‌లోని సుచిత్ర సర్కిల్లో ఉండే కన్సల్టెన్సీ ఏజెంట్ ఫోన్ చేసి నమ్మించాడు. అమెరికాలో చదువు కోవడమే కాకుండా, ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తానన్నాడు. మా నాన్నకు నేను అమెరికా వెళ్లాలనేది కల. అక్కడ అందరూ డాలర్లు సంపాదిస్తున్నారనే ఆలోచన ఉండేది. ఆయన కల నిజం చేయాలని కన్సల్టెన్సీ చెప్పినట్టు చేశాం. బ్యాంకు ఖాతాలో ఎవరు డబ్బులేశారో? అనుభవ పత్రాలు ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు. వీసా ఇంటర్వ్యూలో అమెరికన్ ఎంబసీ కనిపెట్టింది. నేను నిజం చెప్పి తప్పించుకున్నాను. కానీ రూ.4 లక్షల వరకు పోగొట్టుకున్నాను. – నవీన్ (అమెరికన్ ఎంబసీ వీసా ఇంటర్వ్యూలో పట్టుబడ్డ విద్యార్థి, వరంగల్) కన్సల్టెన్సీల ఉచ్చులో పడొద్దు విదేశాలకు వెళ్లే విద్యార్థులు తెలియకుండానే కన్సల్టెన్సీల ఉచ్చులో పడుతున్నారు.ఒకసారి వెళ్ళాక ఏమవుతుందిలే అని తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ విదేశాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంది. విశ్వసనీయత కోణంలో వాళ్ళు చూస్తారు. ఈ మధ్య సర్టిఫికెట్లు కూడా నకిలీవి సృష్టిస్తున్నారు. ఇలాంటి మార్గాన్ని విద్యార్థులు ఎంచుకోవద్దు. – తుమ్మల పాపిరెడ్డి (ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్) -
‘పీకే’కు ఓకే? ఇప్పట్నుంచే కేసీఆర్ పక్కా ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏడాది ముందుగానే కసరత్తు ప్రారంభించారు. ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనే విషయంలో పొలిటికల్ కన్సల్టెన్సీల పాత్ర కూడా కీలకమని భావిస్తున్న గులాబీ దళపతి... ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలు పొలిటికల్ కన్సల్టెంట్లను నియమించుకున్న తరహాలోనే రాష్ట్రంలోనూ కన్సల్టెంట్ల సేవలు పొందాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ–ప్యాక్) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే)కు చెందిన బృందం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పలుమార్లు సమావేశమైంది. రాష్ట్ర రాజకీయాలు, క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలకు సంబంధించి తమ పరిశీలనలోకి వచ్చిన అంశాలను పీకే బృందం ఈ భేటీల్లో ప్రస్తావించినట్లు సమాచారం. ఐ–ప్యాక్ బృందం ఏ తరహా సేవలు అందిస్తుంది, దాని పరిధి, పరిమితులు ఏమిటనే అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పీకే బృందంతో కలిసి పనిచేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను మదింపు చేసిన తర్వాత త్వరలో టీఆర్ఎస్, ఐ–ప్యాక్ నడుమ తుది ఒప్పందం కుదరనుంది. పార్టీపరంగా ఎప్పటికప్పుడు సర్వేలు... రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ యంత్రాంగం, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల పనితీరుపై టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సమాచార సేకరణకు మై యాక్సిస్ వంటి ప్రముఖ సర్వే సంస్థల సేవలను వినియోగించుకుంటోంది. సర్వేలు శాస్త్రీయంగా ఉండేందుకు ప్రశ్నావళి రూపకల్పన మొదలుకొని నమూనాల సేకరణకు వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సర్వేలో భాగంగా కన్సల్టెన్సీలు కేవలం నమూనాల సేకరణకే పరిమితమవకుండా వివిధ కోణాల్లోనూ విశ్లేషిస్తూ నివేదికలు అందజేస్తున్నాయి. సందర్భాన్ని బట్టి సర్వేల ద్వారా ప్రజానాడిని పసిగట్టడం, పార్టీ పనితీరును అంచనా వేస్తున్న టీఆర్ఎస్ అధినేత... వివిధ నిఘా సంస్థల నుంచి అందే నివేదికలతో వాటిని పోల్చి చూస్తూ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో... ఇన్నాళ్లూ అధికారిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాల ప్రచారం కోసం పీఏలు, పీఆర్వోలపై ఆధారపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇటీవలి కాలంలో పొలిటికల్ కన్సల్టెన్సీల వైపు చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ పనితీరుపై ప్రచారం, తమపై వచ్చే ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడం తదితరాల కోసం కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోజువారీ కార్యక్రమాలు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణకు నాలుగు కన్సల్టెన్సీలు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ కీలక మంత్రి కూడా ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించినట్లు సమాచారం. -
రండి బాబు రండి!.... రూ.50 వేలకే బీటెక్, డిగ్రి, ఇంటర్ సర్టిఫికేట్లు!!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), తెలంగాణ విశ్వ విద్యాలయం (టీయూ), మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసి.. నకిలీవి తయారు చేస్తూ అవసరమున్న వారికి విక్రయిస్తోంది ఓ కన్సల్టెన్సీ. రూ.50 వేల నుంచి రూ.75 వేలకు ఆయా వర్సిటీల బీటెక్, డిగ్రీ, ఇంటర్ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నట్లు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ దృష్టికి రావటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏయూకు చెందిన 130, టీయూకు చెందిన 63, మహారాష్ట్ర ఇంటర్ బోర్డుకు చెందిన 27 నకిలీ సర్టిఫికెట్లను, 6 కంప్యూటర్లు, 4 ల్యాప్‌టాప్‌లు, 2 హెచ్‌పీ ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. నగర సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. యాకుత్‌పురా దోభీఘాట్‌కు చెందిన సయ్యద్ నవీద్ అలియాస్ ఫైసల్ (30)కు బషీర్‌బాగ్‌లోని బాబుఖాన్ ఎస్టేట్స్ 7వ అంతస్తులో క్యూబెస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కన్సల్టెన్సీ ఉంది. ఇందులో గౌలిపురకు చెందిన సయ్యద్ ఓవైస్ అలీ అలియాస్ ఓవైస్ (22) డీటీపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ కన్సల్టెన్సీ డీటీపీ వర్క్, వీసా ప్రాసెసింగ్, సర్టిఫికేషన్ వర్క్స్ వంటి అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. కరోనా నేపథ్యంలో వ్యాపారం నష్టాల్లో ఉండటంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జులై నుంచి నకిలీ సర్టిఫికెట్లు, సాలరీ స్లిప్‌లు, మెడికల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, జాబ్ ఆఫర్, రిలీవింగ్ లెటర్లు వంటివి తయారు చేస్తూ.. అవసరం ఉన్న కస్టమర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా యూనివర్సిటీ వెబ్సైట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లను ఫొటోషాప్, డీటీపీ వర్క్‌తో ఎడిట్ చేసి నకిలీవి తయారు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్లే ప్రైవేట్ ఉద్యోగులకు, అల్రెడీ చేస్తున్న వారికి అంతర్గత ప్రమోషన్ల కోసం ఈ నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే యూకేలోని టీసైడ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్‌పోల్, యూనివర్సిటీ ఆఫ్ లా, స్కాంట్లాండ్‌లోని హెరియట్‌వాట్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ షిల్లెర్, యూనివర్సిటీ ఆఫ్ కన్కార్డియాలలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయని టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ డీసీపీ పి. రాధాకిషన్ రావు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నిందితులు నవీద్, సయ్యద్ ఓవైస్ అలీలపై సైఫాబాద్, అబిద్ రోడ్, ముషీరాబాద్, నిజామాబాద్‌లోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) -
నియామకాల్లో మహిళలకు రెడ్ కార్పెట్
ముంబై: వచ్చే ఏడాది మహిళా ఉద్యోగుల నియామకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2019లో మహిళల హైరింగ్ 15–20 శాతం మేర పెరగనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీపుల్‌స్ట్రాంగ్ తెలియజేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ .. ఫైనాన్షియల్ సర్వీసెస్ .. ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఆటోమోటివ్, ఐటీ, సాఫ్ట్వేర్, హాస్పిటాలిటీ.. ట్రావెల్ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్లు ’ది ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్ 2019’ పేరిట రూపొందించిన నివేదికలో పీపుల్‌స్ట్రాంగ్ తెలియజేసింది. సుమారు 15 రంగాలకు చెందిన 1,000 పైగా సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. నిర్దిష్ట హోదాలకు సంబంధించి సుశిక్షితులైన వారి సంఖ్య తక్కువగా ఉండటం, సామాజిక కట్టుబాట్లు, పని ప్రదేశాల్లో భద్రత తదితర అంశాలు సైతం మహిళల నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు పీపుల్‌స్ట్రాంగ్ వ్యవస్థాపకుడు దేవాశీష్ శర్మ చెప్పారు. మహిళల నియామకాలను ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు. మహిళల ఉద్యోగిత క్రమంగా పెరుగుతోందంటూ ‘‘2017లో 38 శాతంగా ఉన్న ఉద్యోగిత.. 2018లో 46 శాతానికి చేరింది. కానీ ఇప్పటికీ మహిళా జనాభాతో పోలిస్తే వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగానే ఉంటోంది’’ అని శర్మ వివరించారు. ఉద్యోగులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ ఆఖరున ఉంది. తెలంగాణతో పాటు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఈ లిస్టులో ఈ ఏడాది కొత్తగా చోటు దక్కించుకున్నాయి. -
భారత్‌లో ఉద్యోగాలకు తగ్గ బోధనేది?
లండన్: ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడంలో భారతీయ విద్యా సంస్థలు వెనుకబడ్డాయని ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెచ్ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ ‘ఎమర్జింగ్’ ఈ అంశంపై ఓ సర్వే చేసి ప్రపంచవ్యాప్తంగా 150 విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను టైమ్స్ హయ్యర్ ఎడ్యేకేషన్ గురువారం ప్రచురించింది. ‘గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో 150కిగాను భారత్ నుంచి కేవలం మూడు విద్యా సంస్థలే చోటు దక్కించుకున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 28వ స్థానంలో నిలవగా, ఐఐటీ–ఢిల్లీకి 53వ స్థానం దక్కింది. గతేడాది ఇదే ర్యాంకింగ్స్‌లో ఐఐటీ–ఢిల్లీ 145వ స్థానంలో ఉండగా ఈసారి దాని ర్యాంకు గణనీయంగా మెరుగుపడటం గమనార్హం. ఈ జాబితా తొలి మూడు ర్యాంకులనూ అమెరికా విశ్వవిద్యాలయాలే సొంతం చేసుకున్నాయి. -
బీమా రంగంలోకి ఇండియాపోస్ట్..
న్యూఢిల్లీ: ప్రత్యేకంగా బీమా సర్వీసుల వ్యాపార విభాగం ఏర్పాటుపై ఇండియా పోస్ట్ దృష్టి సారించింది. దీనికి సంబంధించి తగు సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఎంపిౖMðన కన్సల్టెంటు.. వ్యూహాత్మక వ్యాపార విభాగంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) ఏర్పాటు, ప్రభావాలు, పోస్టల్ విభాగం పరిధిలోనే ప్రభుత్వ రంగ çస్వతంత్ర సంస్థగా మార్చడం తదితర అంశాలను అధ్యయనం చేసి, ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రీ–బిడ్ సమావేశం సెప్టెంబర్ 18న జరిగినట్లు వివరించాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ, డెలాయిట్ ఇండియా వంటి పేరొందిన కన్సల్టెన్సీ సంస్థలు దీనికి హాజరైనట్లు పేర్కొన్నాయి. రెండేళ్ల కాలంలో పోస్టల్ విభాగం ప్రత్యేక బీమా సంస్థ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం పోస్టల్ విభాగం.. ప్రభుత్వ, సెమీ – గవర్నమెంట్ ఉద్యోగులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) కింద జీవిత బీమా పథకాలు అందిస్తోంది. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు, మహిళలకు బీమా కవరేజీ అందించే ఉద్దేశంతో 1995 మార్చిలో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ) పథకాలను కూడా ప్రవేశపెట్టింది. 2017 మార్చి 31నాటికి మొత్తం 46.8 లక్షల పీఎల్ఐ, 1.46 కోట్ల ఆర్పీఎల్ఐ పాలసీలు ఉన్నాయి. పోస్టల్ విభాగం ఇటీవలే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ను కూడా ప్రారంభించింది. బజాజ్ అలయంజ్ పాలసీలను విక్రయించేందుకు అయిదేళ్ల పాటు కార్పొరేట్ ఏజంటుగా వ్యవహరించే ఒప్పందాన్ని ఇటీవలే కుదుర్చుకుంది. -
నిర్ణయం
హక్కుల కోసం పోరాడాల్సి వస్తే మనసే కాదు దేహం కూడా ప్రధానాంశమే! ఆ పోరాటం యుద్ధంగా మారితే? తెగిపోయేవీ ఉంటాయి. తెగ్గొట్టుకునేవీ ఉంటాయి. తెగిపోయేముందే బంధం గట్టిదనం తెలుస్తుంది. మరి తెగ్గొట్టుకోవాలనుకుంటే? ఆ గట్టిదనం ఎవరికుండాలి? వాసంతి మనసులో భయంకర అంతర్యుద్ధం! ఓ నిర్ణయాన్ని చుట్టేసుకున్న చిక్కుముళ్లెన్నో. మూడుముళ్లు పడ్డాక గానీ తనకు ఈ విషయం తెలిసిరాలేదు. ఎలాగైతేనేం చివరికి నిర్ణయం తీసుకుంది, చాలా ఊగిసలాట తర్వాత. మనసు బెలూన్లా నింగిలో ఈదుతున్న ఫీలింగ్. చాలా కాలం తర్వాత మళ్లీ స్వేచ్ఛ. సమీర్ వాసంతి జీవితంలోకి చాలా అనూహ్యంగా వచ్చాడు. ఓ ఫ్రెండ్ మ్యారేజీలో పరిచయం, పెళ్లి దాకా తీసుకెళ్లింది. సమీర్ పరిచయం అయిన కొత్తలో తన టెండర్ ఫీలింగ్స్‌ని అక్షరాల్లో బంధించి, గులాబీ కాయితంలో అందంగా రాసి కొరియర్ చేసింది. ఆ పని చేసేదాకా నిద్రపోలేదు. ఎఫ్బీ దాటేసి వాట్సాప్... ట్విటర్... ఇన్స్టాగ్రాం దిశగా కమ్యూనికేషన్ రాకెట్లా పరిగెడుతుంటే... ఈ లెటర్ గోలేంటీ? నేషనల్ హైవేలో ఎడ్లబండిలా అనుకుంటాడేమో? అని డౌట్ పడినా, కొన్ని ఇలా ఉంటేనే అందం అని చాలా అందంగా సమర్థించుకుంది. ‘వాసంత సమీరం నువ్వయితే... హేమంత తుషారం నేనవుతా...’ అంటూ పొయటిక్‌గా రాసుకున్న ఆ లెటర్ తన జీవితంలో వసంతాన్ని మోసుకుకొస్తుందని కలగంది. వాస్తవం వసంతం అంత అందంగా ఉండదని చాలా త్వరగా అర్థమైంది. అది తెలిసేలోగా గుండెకు బోలెడన్ని గాయాలు. రక్తసిక్తమైన భావాలు! సమీర్ తన లైఫ్‌లోకి వచ్చినపుడు బ్యూటిఫుల్ అనుకుంది. వచ్చినపుడు అని ఎందుకంటే ఇప్పుడా ఫీలింగ్ లేదు కాబట్టి. పెళ్లి లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అనుకుంది. సమీర్ తప్ప తనకెవరూ కరెక్టు కాదని అమ్మతో వాదించి మరీ ఒప్పించుకుంది. జీవితాంతం తోడుంటాడని, ఉండాలని అనుకుంది. కానీ ఆరునెలల్లోపే ఆశలన్నీ ఆవిరవుతాయని, కలలు కరిగి కన్నీరవుతుందని తను మాత్రం ఊహించిందా ఏంటి? జీవితం అనూహ్యంగా ఉంటుందని కథల్లో చదవడమే కానీ ఇంతలా ఉంటుందని వాసంతి అస్సలు ఊహించలేదు. ‘‘ఏమైందే నీకు. మైండ్ దొబ్బిందా?’’.వాసంతి ఇరానీ చాయ్‌లో తడిసి మెరుస్తున్న బిస్కెట్‌ను శ్రద్ధగా తింటోంది.స్నేహకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏంటే... నేనిక్కడ వాగుతుంటే తమాషాగా ఉందా? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా?’’‘‘ఏం చేస్తున్నాను?’’‘‘చెప్పవే ఏం చేస్తున్నాను. ఓ నరకం నుంచి బైటకు రావాలనుకుంటున్నాను. తప్పా?’’‘‘అది కాదే బాబూ. లైఫ్‌లో కాసింత అడ్జెస్ట్మెంట్ ఉండాలి. అన్నీ మనం అనకున్నట్టుండవు..’’‘‘ఇంకాపుతావా సోది. చూడు... నా బాధేంటో నాకు తెలుసు. నేనెంతగా నలిగానో నాకు తెలుసు. నేనెంతగా చెప్పినా మీకర్థం కాదని మాత్రం ఇప్పుడే తెలుస్తోంది.’’‘...కాదే! సమీర్‌ను ఇష్టపడి చేసుకున్నావుగా ఏం ప్రాబ్లెమ్..’’‘‘డామిట్. ఏం చెప్పాలే! హీఈజ్ సెక్సువలీ పర్వర్టెడ్. నాట్ గుడ్ అట్ బెడ్. నన్ను నంజుకు తిన్నాడు...చాలా ఇంకా పచ్చిగా చెప్పాలా’’‘‘హే... లైట్ తీస్కో. కొందరలా ఉంటారం...’’‘‘ఇంకెక్కువ వాగితే చంపేస్తానంతే. ఇంత ఓపెన్‌గా చెప్పినా నీకర్థం కాలేదా?’’‘‘ఓకే బాబా. పోనీ సమీర్‌తో మాట్లాడనా...’’‘‘మన ఫ్రెండ్షిప్ ఉండాలంటే కాస్త మూసుకునుండు...’’‘‘అలాగే ఉంటా! కానీ మీ మమ్మీ గురించి ఆలోచించవా? నిన్ను ప్రాణంలా పెంచుకుంది. ఆంటీని అలా చూడలేకున్నారా!’’‘‘స్నేహా! గాయం తగిలింది. మందేస్తున్నాం. మానాలంటే టైం పడుతుంది కదా! చూద్దాం...’’ లేచింది.‘‘వాసూ వన్ మినిట్...’’ స్నేహæగట్టిగా హగ్ చేసుకుంది. ఇద్దరి కళ్లల్లో చివ్వున ఎగసిన కన్నీరు. గాలికి రెపరెపలాడే దీపం లాంటి నవ్వును పెదాలపై నిలుపుకుంటూ వాసంతి, ‘‘హే... డోంట్ బీ సిల్లీ.నన్ను డౌన్ చేయొద్దు ప్లీజ్...’’ అంటూ ముందుకు కదిలింది. అమెరికా నుంచి మూటాముల్లె సర్దేసుకొచ్చిందని తెలీని మణి, కూతురికి తనపై బెంగయిందనుకుంది. రెండ్రోజులయ్యాక అది బెంగ కాదని అర్థమైంది. ఏమైందని తను అడగలేదు. ఏం వినాల్సి వస్తుందోనని భయం వల్ల. పదిహేనేళ్లుగా మణి చాలా విషయాల్లో భయపడుతూనే ఉంది. భర్త పోయాక జీవితంలో ఒంటరితనం ఒంటరిగా రాలేదు. భయాన్ని వెంటబెట్టుకొచ్చింది. ఈ విషయం వాసంతికి తెల్సు. అందుకే వచ్చి రెండ్రోజులవుతున్నా ఏం చెప్పలేదు. తనేం చెబుతుందా అని మణి ఎదురుచూస్తోంది. రాత్రి పదకొండు గంటలు. గదిలో చిన్నలైట్. బెడ్‌పై మణి, వాసంతి.‘‘మమ్మీ నాపై కోపంగా ఉందా?’’‘‘.....’’ఒకరి గుండెలో ఆవేశం. ఒకరి గుండెలో ఆవేదన. ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తున్నాయి.‘‘రాగానే చెబుదామనుకున్నా. బట్ మొదట నేను సెట్ కావాలి కదా!’’మణి తలెత్తింది. చెక్కిళ్లపై జారిపోతున్న కన్నీళ్లు. మొహంలో చెప్పలేనంత ఆందోళన.‘‘మమ్మీ! కూల్...’’ వాసంతి గొంతు వణుకుతోంది. ‘‘ఎందుకిలా. మనకే ఎందుకిలా? ఇంకా ఎంత కాలం పోరాడాలి? నా ఒంట్లో ఓపిక చచ్చిపోయింది. ఇప్పుడెలా?’’ వెక్కిళ్ల మధ్య మణి మాటలు అస్పష్టంగా వస్తున్నాయి.వాసంతికిలాంటి సందర్భం వస్తుందని తెలుసు. కానీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. తనేం చెప్పినా మళ్లీ విషయం ‘అడ్జస్ట్’ అన్న పదం వద్దే ఆగుతుంది. అయితే అదెంత నరకమో ఆర్నెల్ల అమెరికా జీవితం చాలా ప్రాక్టికల్‌గా చూపింది. అసలు ‘దాడి’ అనేదే ఇన్‌హ్యూమన్! మానసికమైనా, దైహికమైనా. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అన్బేరబుల్గా ఉంటుంది. అసలు ఎవరు ఎవర్నైనా టేకిట్ గ్రాంట్‌గా తీసుకోవడం కన్నా విషాదం మరొకటి ఉండదేమో! వద్దన్నారంటే వద్దనేగా. ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కాదని మొదట్లో అనుకున్నా, అర్థం కాకపోవడం కాదు అహంకారమని అర్థమైంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడో కొత్త సమస్య. అసలు ఎవరు ఎవరిని ఓదార్చాలి?గాయం తనకే. నష్టమూ తనకే. కానీ ఇబ్బంది మాత్రం ఇద్దరిదీ!‘‘అమ్మా బాధ పడకు. అన్నీ మనమంచికే...’’‘‘ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? అయినా నువ్వుండగా నేను ఒంటరినెలా అవుతా?’’‘‘నాకదంతా తెలీదే. నాకోసం... కేవలం నాకోసం ఒక్కసారి ఆలోచించు ప్లీజ్...’’ తల్లి మాటలు గుండెలో మంటలు రేపుతున్నాయి. ఏం మాట్లాడలేక రూం నుంచి భారంగా కదలింది. వెనకాల వెక్కిళ్లు వినిపిస్తునే ఉన్నాయి. వాసంతి మనసు నిర్వికార స్థితిలో ఉంది. అమ్మ కోసం, స్నేహ కోసం, ఆ వెధవ సమీర్ కోసం, సమాజం కోసం, ఇంకా ఇంకా... ఎంతమంది కోసం నన్ను నేను మార్చుకోవాలి, రాజీ పడాలి? పోనీ అలా చేస్తే నెమ్మది దొరికి ఛస్తుందన్న గ్యారెంటీ ఉందా? ఛీఛీ. వెధవ జీవితం! ఒక్కసారిగా తలవిదల్చుకుంది. హాల్లో సోఫాపై నీరసంగా వాలిపోయింది. కళ్లు మూతబడుతున్నాయి. అనుపమారావు. సిటీలో చాలా పేరున్న లాయర్. ఫ్యామిలీ కౌన్సెలర్. ఆఫీస్ ఫర్నిచర్, యాంబియన్స్ చాలా హైఫైగా ఉంది. కన్సల్టెన్సీ ఫీజు కూడా అదే లెవెల్లో ఉంటుంది. వెయిటింగ్ లాంజ్‌లో పదిమంది దాకా ఉన్నారు. మణి బలవంతం మీద ఇష్టం లేకున్నా వాసంతి వచ్చింది. గదిలో అందరినీ నిశితంగా గమనిస్తోంది. అందరూ ఏదో ఓ సమస్యతో పోరాడుతున్నట్టే ఉన్నారు. ‘నా మొహం. సమస్య లేకుంటే ఇక్కడికెందుకు వస్తారు?’ అనుకుంది. పక్కనే ఓ ఆంటీ. తెల్లగా చందమామలా మెరుస్తోంది. పొందిగ్గా కట్టుకున్న బ్లాక్ శారీలో మరింత అందంగా కనిపిస్తోంది. మొహంలో ప్రశాంతత! మరి ఇక్కడికెందుకొచ్చిందో? వాసంతిని చూసి మెల్లగా నవ్వింది. అసలు మనుషుల్తో మాట కలపాలంటేనే విసుగ్గా ఫీలవుతున్న వాసంతికి చల్లని గాలి తాకినట్టు హాయి అనిపించింది. ఆంటీతో మాట్లాడితే బావుణ్ను అనుకుంటుండగానే ఆమే ‘‘హాయ్’’ అంది. దాదాపు పది నిమిషాల ఆత్మీయ సంభాషణలో వాసంతి చాలా అసంకల్పితంగా తన సమస్య ప్రస్తావించింది. ‘‘డోంట్ వర్రీ బేబీ! ఇదే లైఫ్. లోపల నా కూతురుంది. తనకూ సేమ్ ప్రాబ్లమ్. నేను క్లియర్‌గా చెప్పా. ఎవరి కోసమో మన ఇష్టాలను, లైఫ్‌నూ మార్చుకోవాల్సిన అవసరం లేదని. స్త్రీగా తన సమస్య నాకు అర్థమవుతోంది. డివోర్స్‌కు లీగల్‌గా ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. అయామ్ విత్ హర్’’ ఆంటీ మాటలు బూస్ట్‌లా పనిచేశాయి. ఇంతలో ఆంటీ కూతురు బైటికి వచ్చింది. తనకు కనీసం నలభై ఏళ్ల పై చిలుకుంటాయి. పరిచయం చేసింది. ఆమెకు అయిదేళ్ల బాబు. ఈ స్టేజీలో ఈ సమస్యేంటి అని వాసంతికి ఆశ్చర్యమేసింది. ‘‘రెండేళ్లుగా తనలో ఈ విపరీత ధోరణి పెరిగింది. ఎంత ఓపిక పట్టినా, మార్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. సైకాలజిస్టులు, ఫ్యామిలీ కౌన్సెలర్లు చాలా మందిని కలిశాం. ఎవరైనా చివర్లో చెబుతున్న మాట ‘కాస్త ఓపిక పట్టండి. తనలో మార్పు రావచ్చు.’ అని. కానీ ఆ కొన్నేళ్లు ఎన్నేళ్లు? అప్పటిదాకా ఈ హింసను నిబ్బరించుకోవడం ఎలా? ఒకసారి నేనే అడిగా ఎందుకిలా? అని. ‘నాయిష్టం. నా స్ట్రెస్ బరస్ట్‌కు అదొక్కటే దారి.’ అన్నాడు. అప్పుడే నేను డిసైడ్ అయ్యా. ఈ సమస్యకు పరిష్కారం నిరీక్షణ కాదు. మరో దారి వెతుక్కోవడమేనని. ఆరునెలలుగా పోరాడితే, ఇదిగో ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది.’’ ఆమె మాటలు విన్నప్పుడు వాసంతికి తను నడుస్తున్నది సరైన దారేనని మరోసారి అనిపించింది. ఆంటీ తన కూతురు భుజంపై చేయి వేసుకువెళుతుంటే. దెబ్బతిన్న పిట్టను తల్లి తన రెక్కలతో జాగ్రత్తగా కాపాడుతున్నట్టుగా ఉంది. తనెంత అదృష్టవంతురాలో కదా అనిపించింది. అదే సమయంలో తన యుద్ధం సరైనదే అనిపించింది. ‘‘వాసంతీ...’’ అటెండర్ పిలుపు విని లేచింది, స్థిరచిత్తంతో.గతాన్ని వదిలించుకునేందుకు, కొత్త బతుకును వెతుక్కునేందుకు వాసంతి సరికొత్తగా ప్రయత్నిస్తోంది.అనుకోకుండా ఓరోజు సమీర్ ప్రత్యక్షమయ్యాడు. వాసంతి నివ్వెరపోయింది. అదీ క్షణం పాటే. వెంటనే ఎలా వచ్చాడో అర్థమై మనసు నిబ్బరం చేసుకుంది. గదిలో ఇద్దరే. వారిని ఆవరించుకున్న నిశ్శబ్దం. ‘‘సారీ చెబుతున్నానుగా... ఇంకేం చేయమంటావో చెప్పు’’ సమీర్ తీయని స్వరం వాసంతికి చేదుగా అనిపిస్తోంది. అసలు తన ముందు కూర్చోడానికే ఇబ్బందిగా ఉంటోంది.‘‘...ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు లేకుండా నేను ఉండలేనురా.’’‘‘చచ్చిపో. వెంటనే చచ్చిపో. ఆపితే ఒట్టు!’’ మాట గొంతు వద్ద ఆగింది.‘‘ఏదో బ్యాడ్ టైమ్. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. నువ్వెలా ఉండమంటే అలా ఉంటా! నవ్వు పర్మిషన్ ఇవ్వందే టచ్ కూడా చేయను. సరేనా!’’అసహ్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇంతలో అమ్మ కాఫీ తీసుకొచ్చింది.‘‘ఆంటీ మీరుండండి. మరో కప్పు నేను తీసుకొస్తా. ముగ్గురం తాగుదాం’’ అంటూ లేచాడు. అల్లుడి మాటలకు మురిసిపోయింది. ‘‘వద్దులే సమీర్. కాసేపు రెస్టు తీసుకో! మళ్లీ రేపు ప్రయాణం అంటున్నావుగా. వాసంతి ఈసారైనా పచ్చళ్లు పట్టుకెళ్లు’’‘ఓహ్. అంటే ఈయనగారు వాలిపోయి నా ప్రయాణానికి కూడా రంగం సిద్ధం చేశారన్నమాట’. అమ్మపైన కోపం వచ్చేస్తోంది. కనీసం సమీర్ వస్తున్నట్టు చెప్పలేదు. ఎందుకిలా? తను తల్లే కావచ్చు. కానీ ప్రాబ్లం స్పష్టంగా చెప్పాక కూడా ఎందుకీ నాటకాలు. ఎవర్ని మెప్పించడానికి. నాన్న చిన్నప్పుడే పోయాడు. చాలా కేర్‌తో పెంచింది. నిజమే! కానీ మళ్లీ ఆ నరకంలో పంపడానికి సిద్ధమైందంటే సమీర్ సెంటిమెంట్ మాటలకి కరిగిపోయి ఉండొచ్చు. లేదా కన్నతల్లిగా నన్ను కాపురానికి పంపడమే జీవిత పరమావధి అనుకుంటుందేమో. నాకైతే ఈ రెండూ తప్పే! ముసురుకుంటున్న ఆలోచనల్లో ఈదుతున్న వాసంతి ఉక్కిరిబిక్కిరవుతోంది. ‘‘రేపటికి ఫ్లైట్ టికెట్లు తీశా. సరేనా?’’ సమీర్ మాటల్ని మధ్యలోనే తుంచింది – ‘‘...సమీర్ నీతో ఎక్కువ మాట్లాడ్డం నాకిష్టం లేదు. ఒకటే చెబుతున్నా. మన పెళ్లి, కాపురం ఓ పీడకల అనుకో. నేనూ అలానే అనుకుంటున్నా! ఎవరికి వారు హాయిగా ఉందాం’’.అతని మొహం జేవురించింది. అయినా నవ్వు పులుముకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.‘‘ప్లీజ్ వాసంతి. డోంట్ మేక్ ఎ బిగ్ ఇష్యూ...’’‘‘డామిట్. బిగ్ ఇష్యూ కాదా! రాత్రంతా ఒంటిపై బట్టల్లేకుండా నిలబెట్టడం, సిగరెట్లతో కాల్చడం, ఒళ్లంతా పచ్చిపుండు చేస్తూ, నోట్లో డ్రింక్ పోస్తూ, ఇవేవీ బిగ్ ఇష్యూస్ కాదా?’’ తన గొంతు అదురుతోంది. చింతనిప్పుల్లా భగభగమంటున్న కళ్లు. ఉబికి వస్తున్న కన్నీళ్లు. ఆవేశంతో బెడ్‌షీట్‌పై బిగుసుకుంటున్న పిడికిలి. క్లౌడ్ బరస్ట్లా ఉంది వాతావరణం.‘‘అరే! ఇవన్నీ చిన్న చిన్న సరదాలు. అర్థం చేసుకుంటావనుకున్నా. ఓకే నీకిష్టం లేదంటున్నావుగా వదిలేయ్. అయినా పిల్లలయ్యాక ఈ సరదాలు ఎలాగూ ఉండవుగా. పోనీ ఇద్దరం అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అంతేగానీ నిన్న పెళ్లి, ఇవాళ పెటాకులు అంటే ఎలా? నాకూ సొసైటీలో ఓ పరువు ఏడ్చింది కదా!’’‘‘సమీర్ సార్! మీ పరువు మీవద్దే భద్రంగా ఉంచుకోండి. బట్ డోంట్ ఫోర్స్ మీ...’’క్షణకాలం నిశ్శబ్దం. తుపానుకు సూచికలా!‘‘అసలేంటే నీ ప్రాబ్లం?’’ వ్యంగ్యం అహంకారం దట్టించి వదిలిన మాటల తూటా. ఒక్కసారిగా దూసుకొచ్చింది. ‘‘మహా నోరేసుకుని మాట్లాడేస్తున్నావ్? నన్ను కాదని బతికేద్దామనే? ఏంటి ఎవడ్నయినా ఫిక్స్ చేసుకున్నావా? అలా అయితే చెప్పు ఇప్పుడే వెళ్లిపోతా!’’ వాసంతికి నవ్వొచ్చింది. మాటలకు ఎంత మేకప్పు వేసినా కొన్ని సందర్భాల్లో అసల్ రంగు నికల్ గయా అన్నట్టు ఇట్టే బైట పడిపోతుంది. వీడిదీ ఇంతే! ‘‘సమీర్ మైండ్ యువర్ టంగ్. నువ్వు నా ఇంట్లో ఉన్నావు. ముందు బైటికి నడు. వారంలోగా లాయర్ నోటీసు నీ మొహాన కొడ్తా.’’ వాసంతి ధోరణి మరింత రెచ్చగొట్టింది. తట్టుకోలేకపోయాడు. ఎవరికైనా ఓడిపోతున్నప్పుడే బ్యాలెన్స్ తప్పుతుంది. ‘‘నువ్వింత బజారు దానివనుకోలేదు. నిన్ను కట్టుకోడానికి గంతులేశాను చూడు... అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. థూ ఆడదానివేనా?’’ ముక్కుపుటాలదురుతుంటే బూతులు తిడుతూ పైకి లేచాడు.‘‘సమీర్ ఆగు... ఆగు.. ఏమైంది?’’ అప్పుడే వచ్చిన మణి కంగారుగా అడిగింది.‘‘నీ కూతురికి కొవ్వు ఎక్కువైంది. రాక్షసి. నన్ను కాదని ఎవడ్తోనో పడుకుంటుందట! నేనూ చూస్తా.’’ పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ వెళ్లిపోయాడు.‘‘ఏంటే ఇదంతా...’’ మణి ఏడుస్తోంది.‘‘అమ్మా! ఎందుకేడుస్తున్నావ్? ఇప్పుడేమైంది. నా రాత బాగుంది కాబట్టే ఈ వెధవను వదిలించుకోగలిగాను. అయినా ఎందుకమ్మా! ఫోన్ చేసి ఈ చెత్తగాడ్ని ఇండియాకి రప్పించడం అవసరమా? నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెల్సు’’.ఏం చెప్పాలో అర్థం కాకుండా ఆమె నిస్త్రాణంగా బైటికెళ్లిపోయింది.గదిలో నిశ్శబ్దం. యుద్ధం ముగిసిన తర్వాత ఉండే నిశ్శబ్దం. చాలాసేపు వాసంతి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎందుకో తెల్లని ఆంటీ గుర్తొచ్చింది. అమ్మ కూడా అలానే ఉంటే ఎంత బావుణ్ణు అనిపించింది. - రామదుర్గం మధుసూదనరావు -
మెట్రోలో ఉద్యోగం.. రూ.1.50 కోట్లకు టోకరా
సాక్షి, హైదరాబాద్ : మెట్రో ప్రభుత్వానికి కాసులు కురిపిస్తోందో లేదో కానీ దోచుకునే వారికి మాత్రం కోట్లకు కోట్లు కురిపిస్తోంది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని పలు కన్సల్టెన్సీలు కోట్లాది రూపాయలను వెనుకేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతోంది. అలా కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చిన కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నాయి. అలాంటి ఓ బోగస్ కంపెనీ చేతుల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రతిష్టాతక్మంగా ప్రారంభించిన మెట్రోరైలు బోగస్ కంపెనీల పాలిట కల్ప తరువుగా మారింది. మెట్రోలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నగరంలోని ఏబీసీ కన్సల్టెన్సీ ఒక్కో నిరుద్యోగి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేసింది. మొత్తం రూ.1.50 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో డబ్బు చెల్లించిన బాధితులు లబోదిబోమంటూ ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగాలు కల్పిస్తామని బోర్డు తిప్పిన కన్సెల్టన్సీ నిర్వాహులకు అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మంత్రి గారడీ..కన్సల్టెన్సీ కంపెనీ దోపిడీ
♦ గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల్లో అవకతవకలు ♦ యూజీడీ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టులపై డీపీఆర్ సిద్ధం చేసిన కన్సల్టెన్సీపై పురపాలక శాఖ మంత్రి అతి ప్రేమ ♦ గుంటూరు ప్రాజెక్టులో నిబంధనలు మీరి మరీ కన్సల్టెన్సీ ఫీజు చెల్లింపులు ♦ జీవో విడుదల చేసి మరీ ప్రజాధనం చెల్లింపు ♦ గుంటూరు వాసి లోకాయుక్తను ఆశ్రయించడంతో వెలుగు చూసిన వైనం గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల్లో చేపట్టిన యూజీడీ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు డీపీఆర్ రూపొందించిన కన్సల్టెన్సీ సంస్థకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఓ మంత్రి నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారు. నిబంధనల ప్రకారం అంచనా వ్యయంపై ఫీజు నిర్ణయించాల్సి ఉండగా నిర్మాణ సంస్థలు వేసిన టెండర్ల ప్రకారం ఫీజు నిర్ణయించి నిధులు ముట్టజెప్పారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. సాక్షి, గుంటూరు : రాజధాని నగరాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పథకాలకు డీపీఆర్ తయారు చేసి ఇచ్చిన కన్సల్టెన్సీలపై పురపాలక శాఖ అతి ప్రేమ కనబరిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేస్తే అంచనా వ్యయంపై కాకుండా నిర్మాణ సంస్థలు టెండర్ వేసిన ధరపై పర్సంటేజీ చొప్పున కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జేఎన్ఎన్యూ ఆర్ఎం (జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్) నిధులతో జరిగే ఏ ప్రాజెక్టు పనులకైనా డీపీఆర్ తయారు చేస్తే గరిష్ఠంగా రూ. 2 కోట్లు మాత్రమే కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాలనే నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు నగరంలో చేపట్టే యూజీడీ పథకానికి మాత్రం అంచనా వ్యయంపై ఫీజులు చెల్లించి డీపీఆర్ తయారు చేసిన కన్సల్టెన్సీపై అతి ప్రేమ కనబరిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కన్సల్టెన్సీకి అనుకూలంగా జీవో.. గుంటూరు నగరంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులపై 2014లో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసే బాధ్యతను అధికారులు ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. దీనిపై సదరు సంస్థ డీపీఆర్ తయారు చేసి ఇవ్వడం, నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించడమూ అన్నీ చకచకా జరిగిపోయాయి. 2016 సెప్టెంబర్ 27వ తేదీన కన్సల్టెన్సీ కంపెనీకి గుంటూరు, విజయవాడ నగరాల్లో కలిపి రూ.12.91 కోట్లు ఫీజు చెల్లించాలంటూ ఏపీ యూఎఫ్ఐడీసీ ఎండీకి ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 233 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు నగరపాలక సంస్థలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెన్సీకి ఫీజులు చెల్లించాయి. గుంటూరు నగరపాలక సంస్థ రూ.7.69 కోట్లు, విజయవాడ నగరపాలక సంస్థ రూ.5.21 కోట్లు చొప్పున ఫీజులు చెల్లించాయి. ఎంపీ, మంత్రుల అండదండలతో... ఫీజు చెల్లించే సమయంలో అప్పటి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఎంత చెల్లింపులు చేయాలనే విషయంపై ప్రభుత్వం నివేదిక కోరింది. యూజీడీ పథకంలో అంచనా వ్యయం రూ.903 కోట్లు ఉండగా నిర్మాణ సంస్థ వేసిన టెండరు, పన్నులు మినహాయించి సుమారు రూ.600 కోట్లు మాత్రమే అని తేలింది. దీంతో ఆ మొత్తానికే డీపీఆర్ తయారు చేసిన కన్సల్టెన్సీకి ఫీజు చెల్లించాలంటూ అప్పటి కమిషనర్ లేఖ కూడా రాసినట్లు సమాచారం. తర్వాత అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ కన్సల్టెన్సీకి నష్టం కలుగుతుందని అంచనా వ్యయంపై వారికి ఫీజులు చెల్లించాలంటూ లేఖ రాసినట్లు తెలిసింది. ఎంపీ లేఖపై చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ పురపాలక శాఖ మంత్రి ఆదేశించినట్లు సమాచారం. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే యూజీడీ పథకానికి అంచనా వ్యయంపైనే కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు ఏపీ యూఎఫ్ఐడీసీ ద్వారా జీఎంసీ, వీఎంసీలు కన్సల్టెన్సీ ఫీజులు చెల్లించాలంటూ జీవో విడుదల చేసింది. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ కన్సల్టెన్సీ ఫీజులు చెల్లించేసింది. అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జేఎన్ఎన్యూ ఆర్ఎం ద్వారా జరిగే ఏ ప్రాజెక్టుకైనా డీపీఆర్ తయారు చేసే కన్సల్టెన్సీకి గరిష్ఠంగా రూ.2 కోట్లు మాత్రమే ఫీజు చెల్లించాలని నిబంధన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బిగుస్తున్న ఉచ్చు.. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెన్సీకి అధిక ఫీజులు చెల్లించారంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీనిపై పూర్తి వివరాలు పంపాలంటూ లోకాయుక్త నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు సమాచారం పంపినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలతో పాటు ఉన్నతాధికారుల ప్రమేయం ఉండటంతో ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయంతో అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. -
కన్సల్టెన్సీల గుప్పిట ఇంజనీరింగ్ కాలేజీలు!
మేనేజ్మెంట్ సీట్ల కోసం ఇంజనీరింగ్ కాలేజీలతో కుమ్మక్కు ► కాలేజీకెళితే.. చుక్కలనంటే రేట్లు ► తక్కువకు ఇప్పిస్తామంటూ కన్సల్టెంట్ల ఎర! సాక్షి, హైదరాబాద్ మహారాష్ట్రలో ఉద్యోగం చేసే ఓ హైదరాబాదీ తన కుమారుడిని ఇంజనీరింగ్ చదివించేందుకు హైదరాబాద్‌లోని పేరున్న కాలేజీలను సంప్రదించగా మేనేజ్మెంట్ కోటా సీట్లు అయిపోయాయని చెప్పారు. మరో కాలేజీకి వెళ్తే రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. ఓ కన్సల్టెన్సీని ఆశ్రయించగా ఆయన సంప్రదించిన కాలేజీలోనే రూ. 5 లక్షలకే సీటు ఇప్పిస్తామన్నారు. సింగిల్ పేమెంట్‌లో డబ్బు చెల్లిస్తే ఓకే..లేదంటే వెళ్లిపోండి.. అని తెగేసి చెప్పారు. పైగా మీరెన్ని ప్రయత్నాలు చేసినా యాజమాన్యాలు సీట్లు లేవనే చెబుతాయని...ఎందుకంటే అన్ని సీట్లనూ తామే కొనేశామని, వాటిని కొంత లాభానికి అమ్ముతుంటామని కుండబద్దలు కొట్టాడు. ఇదీ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో కన్సల్టెన్సీలు సాగిస్తున్న నయా దందా. ఇన్నాళ్లూ కమీషన్లు తీసుకొని సీట్ల భర్తీకి సహకరించిన కన్సల్టెన్సీలు ఇప్పుడు ఏకంగా పేరున్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. మేనేజ్మెంట్ సీట్లను కొనేసి అమ్మకానికి పెట్టాయి. ప్రవేశాల ప్రారంభం నుంచే.. ఎంసెట్ ఫలితాలు వెలువడినప్పటి నుంచే కన్సల్టెన్సీలు రంగం ప్రవేశం చేశాయి. 30 వేల వరకు ఉన్న యాజమాన్య కోటా సీట్లను కొన్నింటికి యాజమాన్యాలకు అమ్ముకోగా, మరికొన్నింటిని కన్సెల్టెన్సీలకు అప్పగించాయి. మరోవైపు కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన 12 వేల సీట్ల భర్తీకి మార్గం సుగమం కావడంతో వాటిని కన్సల్టెన్సీల ద్వారా అమ్ముకునేందుకు పలు యాజమన్యాలు సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటా చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తి కావడంతో కన్సల్టెన్సీలు పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చాయి. తమ ప్రతినిధులను కాలేజీల వద్ద పెట్టి మరీ సీట్లను బేరానికి పెట్టాయి. ఫలానా కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తాం.. సీటు కావాలంటే.. మా దగ్గరికి రండి.. వారు చెప్పిన రేటు కంటే తక్కువకే ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. దొరకదు అనుకున్న సీటు కన్సల్టెన్సీల ద్వారా లభిస్తుండటంతో తల్లిదండ్రులు కూడా కన్సల్టెన్సీలనే ఆశ్రయిస్తున్నారు. సదుపాయాలు, మంచి ఫ్యాకల్టీ, క్యాంపస్ ప్లేస్మెంట్లు, ఉద్యోగం గ్యారంటీ అన్న ప్రచారంతో తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి అధిక మొత్తం చెల్లించి సీట్లను కొనుక్కుంటున్నారు. -
బీటెక్ చదివి ఇదేం పని...
నాగోలు: బీటెక్ పూర్తి చేసిన యువకుడు జాబ్ అన్వేషణలో కన్సల్టెన్సీకి డబ్బు చెల్లించలేక అక్రమ మార్గాన్ని ఎంచుకొని కటకటాల పాలయ్యాడు. సోమవారం ఎల్బీనగర్ ఠాణాలో ఎడీసీపీ తఫ్సీర్ ఇగ్బాల్ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన మిర్యాల రవికుమార్ అలియాస్ రవి(22) నల్లగొండలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నంపై నగరానికి వచ్చి నాగోల్‌లోని సాయినగర్‌లో అద్దెకుంటున్నాడు. పలు ప్రాంతాల్లో ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. దీంతో జాబ్ కన్సల్టెన్సీల్లో సంప్రదించగా డబ్బు ఇస్తే జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా వారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఎలాగైన డబ్బు సంపాదించాలని అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈనెల 16న రాత్రి 8 గంటలకు రాక్టౌన కాలనీ ప్రధాన రహదారిపై మన్సూరాబాద్ సాయిసప్తగిరి కాలనీకి చెందిన కె.సుజాత తన స్కూటీపై స్నేహితురాలి కోసం వేచి ఉండగా... వెనుక నుంచి వచ్చిన రవి ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసు తెంచుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల18న రాత్రి చాణక్యపురి కాలనీలో ఇదే తరహా స్నాచింగ్ చేసేందుకు రవి తిరుగుతుండగా... పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అతని దగ్గర ఇంతకు మునుపు చేసిన స్నాచింగ్ గొలుసు దొరికింది. దీంతో అదుపులోకి తీసుకుని అతని నుంచి రెండు తులాల గొలుసును రికవరీ చేశారు. రవి గతంలో చైతన్యపురి పరిధిలోని అల్కాపురి దగ్గర ఓ మహిళ మెడలో గొలుసు స్నాచింగ్ చేయగా అది రోల్డ్ గోల్డ్ అవటంతో బాధితురాలు ఫిర్యాదు చేయలేదని సమాచారం. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు, సీఐ కాశిరెడ్డి, డీఐ బి.విఠల్‌రెడ్డి, ఎస్ఐ కాశీవిశ్వనాథ్, డీఎస్ఐ రవీందర్, వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూకట్‌పల్లిలో బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల వరకు వసూలు చేసింది. సుమారు 70 మంది వద్ద వసూలు చేసిన కన్సల్టన్సీ నిర్వాహకులు మొదటి రెండు నెలలు జీతాలు ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ కన్సల్టెన్సీ
తార్నాకలో ఎస్కే గ్లోబల్ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. సుమారు 200 మంది నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.2 కోట్ల వరకు వసూలు చేసి రాత్రికి రాత్రే దుకాణం సర్దేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి లక్షన్నర వరకు నిర్వాహకుడు పవన్ కుమార్ వసూలు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధితులు ఓయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
శరణం ‘కన్సల్టెన్సీ’
సాక్షి, హైదరాబాద్: తనకు ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా గట్టెక్కడానికి ప్రభుత్వం వద్ద ఉన్న మంత్రం.. ‘కన్సల్టెన్సీ’.కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కన్సల్టెంట్లకు సమర్పిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను రక్షించడానికీ అదే మార్గాన్ని అనుసరించింది. నత్తతో పోటీ పడుతూ సాగుతున్న పోలవరం పనుల ప్రగతి పట్ల ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాయడంతో పాటు సోమవారం సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదేవిధంగా పనులు జరిగితే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో కూడా చెప్పలేమని పేర్కొంది. షెడ్యూలు ప్రకారం పనులు చేయకుంటే కాంట్రాక్టును రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికీ వెనకాడబోమని పీపీఏ సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ను రక్షించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. అథారిటీ హెచ్చరికను నేరుగా కాంట్రాక్టర్‌కు తెలియచేసి పనులు చేయకుంటే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించాలన్న అధికారుల ప్రతిపాదనను ప్రభుత్వ పెద్దలు తిరస్కరించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ‘కన్సల్టెంట్లు’ పరిష్కారం చూపిస్తారని బలంగా నమ్ముతున్న సర్కారు పెద్దలు.. పోలవరం విషయంలోనూ ఇదే మంత్రం జపించారు. పోలవరం పనులు వేగవంతం చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని సూచించాలంటూ ‘కేపీఎంజీ’ అనే కన్సల్టెంటుకు బాధ్యతలు అప్పగించారు. ప్రాజెక్టు అథారిటీ సూచించినంత వేగంగా పనులు చేసే సామర్థ్యం కాంట్రాక్టర్‌కు లేదని, ‘సామర్థ్యం పెంపు’నకు అనుసరించాల్సిన మార్గాలనూ చెప్పాలని ‘కేపీఎంజీ’ కన్సల్టెన్సీని ప్రభుత్వం కోరింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను కన్సల్టెన్సీలకు అప్పగించింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కన్సల్టెన్సీకి ప్రభుత్వం గడువు ఇచ్చింది. కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని, అథారిటీని చల్లబరిచి కాంట్రాక్టర్‌కు ఇబ్బందులు రాకుండా రక్షించాలనే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ల సూచనలు, సలహాలు పాటించడానికి ససేమిరా అంటున్న ప్రభుత్వం.. కన్సల్టెన్సీలకు రూ. కోట్లు ఖర్చు పెట్టడాన్ని అధికారులు విమర్శిస్తున్నారు. -
కన్సల్టెన్సీలకు 100 కోట్లు
చంద్రబాబు హయాంలో మళ్లీ మొదలు రూ. వందకోట్లు కేటాయించాలంటూ ప్రణాళికా శాఖ ప్రతిపాదన.. ఆర్థిక మంత్రి యనమల ఆశ్చర్యం 7 మిషన్లు, లక్ష్యాల పూర్తికి అవసరమన్న ప్రత్యేక కార్యదర్శి కన్సల్టెన్సీలమయమైన ప్రణాళికా శాఖ పలు శాఖల్లో అనుభవం కలిగిన డెరైక్టర్లు, ఇంజనీర్లున్నా వినియోగించుకోని వైనం.. కన్సల్టెన్సీల పేరుతో నచ్చినవారికి కట్టబెడుతున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం మొదలైంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఆయా కార్యక్రమాలకు కన్సల్టెన్సీలను నియమించి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను చెల్లించిన విషయం తెలిసిందే. మరలా ఇప్పుడు కన్సల్టెన్సీలకే ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారు. కన్సల్టెన్సీలకోసం ప్రణాళికా శాఖ పద్దు కింద ఏకంగా రూ.వంద కోట్లను కేటాయించాలని ప్రతిపాదించడం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కన్సల్టెన్సీల కోసం రూ.100 కోట్లు కేటాయించాలంటూ ప్రణాళిక శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదన మంత్రిని విస్మయపరిచింది. దాంతో మంత్రి ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్‌ను ఆరా తీశారు. దీంతో ఆయన వివరిస్తూ.. ప్రభుత్వం ఏడు రంగాల మిషన్లకు సంబంధించిన పనులన్నీ కన్సల్టెన్సీల ద్వారానే సాగుతున్నాయని, అంతేగాక విజన్ 2029 డాక్యుమెంట్ తయారీకి కన్సల్టెన్సీల అవసరం ఎక్కువగా ఉందని వివరించినట్టు తెలిసింది. ఏడు మిషన్లు, ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడానికి కన్సల్టెన్సీలు తప్పనిసరని నిర్దేశించినట్టు ఆయన వివరించారు. అంతా కన్సల్టెన్సీల మయం.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే అనేక కన్సల్టెన్సీలను నియమించారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఏడు మిషన్లకోసం తొలిదశలో 70 మందికి పైగా కన్సల్టెన్సీలను నియమించారు. ఒక్కొక్కరికి నెలకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలను చెల్లించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను పక్కన పెట్టి కన్సల్టెన్సీల ద్వారానే ఏడు మిషన్లకు సంబంధించిన కార్యకలాపాలపై ప్రజెంటేషన్లను తయారు చేయిస్తున్నారు. ప్రణాళికా శాఖ ఇప్పటికే కన్సల్టెన్సీల మయమైంది. పర్యాటక ప్రాంతాలను గుర్తించి ప్రణాళికను రూపొందించాలన్నా... పార్కులు అభివృద్ధి చేయాలన్నా కన్సల్టెన్సీల నియామకం జరగాల్సిందే. ఆఖరికి పన్నేతర ఆదాయం పెంచుకోవడానికీ కన్సల్టెన్సీ నియామకం చేపడుతున్నారు. ప్రణాళికా శాఖతోపాటు పలు శాఖల్లో అనుభవం కలిగిన డెరైక్టర్లు, ఇంజనీర్లు ఉన్నప్పటికీ వారి సేవలను వినియోగించుకోకుండా కన్సల్టెన్సీల పేరుతో తమకు నచ్చిన వ్యక్తులను బయటినుంచి తెచ్చుకుంటున్నారనే విమర్శలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. ఏడు మిషన్లకు సంబంధించిన జీవోలను కూడా కన్సల్టెన్సీలే తయారు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జీవోల తయారీ సైతం.. సాధారణంగా అయితే జీవోలను సెక్షన్ ఆఫీసర్లు రూపొందిస్తారు. లేదా ప్రణాళికా శాఖలో డెరైక్టర్లు రూపొందిస్తారు. అయితే ఇక్కడ జీవోల తయారీని కూడా కన్సల్టెన్సీలకు అప్పగించేశారు. ఈ కన్సల్టెన్సీల నియామకంలో రిజర్వేషన్లు పాటించట్లేదని, అలాగే తమకు నచ్చిన వర్గానికే కన్సల్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వచ్చిన దరఖాస్తుల నుంచి కన్సల్టెంట్లను ఎంపిక చేయడానికి అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక రంగం, మౌలిక వసతులు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పన, సాంఘిక రంగం, పట్టణ, సేవా రంగాలకు సంబంధించి ఏడు మిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా పరిశ్రమల రంగంలో ఆరుగురు యంగ్ ప్రొఫెషనల్స్, ఆరుగురు సీనియర్ స్థాయి కన్సల్టెంట్లను నియమించారు. మైక్రో ఇరిగేషన్ రంగంలో సీనియర్ స్థాయిలో ముగ్గురు, మిడిల్ స్థాయిలో ఇద్దరు కన్సల్టెన్సీలను నియమించారు. అలాగే పశుసంవర్థక రంగంలో ఆరుగురు యంగ్ ప్రొఫెషనల్స్, మరో ఆరుగురు సీనియర్ స్థాయి కన్సల్టెంట్లను నియమించారు. ఉద్యాన రంగంలో ఇద్దరు యంగ్ ప్రొఫెషనల్స్‌ను నియమించారు. ప్రభుత్వ అధికారులు చేయగలిగే పనులే అయినా... సాధారణంగా ఈ కన్సల్టెన్సీలు ఆయా రంగాల్లో సవిరమైన ప్రాజెక్టు నివేదికలను అధ్యయనం చేసి అంచనా వేయడం, సంబంధిత శాఖలకు సాంకేతిక సహాయం అందించడం, పెట్టుబడిదారులను తీసుకురావడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చేయగలిగినప్పటికీ విదేశీ సంస్థల నుంచి అప్పులు పుట్టాలంటే కన్సల్టెంట్లు ఉండాలని, రంగు రంగుల మ్యాప్‌లు, సూచికలతో ప్రజెంటేషన్లను, నివేదికలను రూపొందించాల్సి ఉంటుందని, అందుకే కన్సల్టెంట్లను వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ‘బాబు’ నియమించిన కన్సల్టెన్సీలివే.. గోదావరి పుష్కరాల నిర్వహణకు బాధ్యతలను తాజాగా కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇక తాత్కాలిక రాజధాని నిర్మాణాల మాస్టర్ ప్లాన్‌కు సత్యవాణి కన్సల్టెన్సీ సంస్థకు, రెవెన్యూ చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుచేర్పులపై సలహాలకు ఎస్ఐపీఎస్ అనే సంస్థకు కన్సల్టెన్సీకి బాధ్యతలిచ్చారు. నీటిపారుదల శాఖలో కేపీఎంజీ కన్సల్టెన్సీకి బాధ్యతలుకట్టబెట్టారు. ప్రభుత్వ ప్రచార బాధ్యతలు బ్రాండిక్స్ అనే కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రైస్ వాటర్‌కు, రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి మెకన్సీ కన్సల్టెన్సీకి కట్టబెట్టారు. ఇదిలా ఉండగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో పనుల తనిఖీకి గతంలో చంద్రబాబు హయాంలో నియమించిన సుబ్బిరామిరెడ్డి కన్సల్టెన్సీ తరహాలో ఇప్పుడు కూడా కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించేందుకు యోచిస్తున్నారు. -
మెట్రో స్టేషన్లు ఖరారు!
సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ నగరంలో ప్రతిపాదించిన రెండు మెట్రో రైలు కారిడార్లలో ఎక్కడెక్కడ స్టేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశంపై ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తుది నిర్ణయానికి వచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి సవివర నివేదిక రూపకల్పనలో భాగంగా డీఎంఆర్సీ ఒక కన్సల్టెన్సీతో సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ కన్సల్టెన్సీ బస్టాండ్ నుంచి రామవరప్పాడు రింగురోడ్డు మీదుగా 16వ నంబరు జాతీయ రహదారిపై బెస్ట్ ప్రైస్ షోరూం వరకు 13 మెట్రో స్టేషన్లు, బస్టాండ్ నుంచి కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ వరకు 12 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి టోపోగ్రఫీ సర్వే కూడా పూర్తి చేసింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి టోపోగ్రఫీ సర్వే వివరాలను తెలుసుకున్న డీఎంఆర్సీ డెరైక్టర్ ఎస్డీ శర్మ, డెప్యూటీ జనరల్ మేనేజర్ రాజశేఖర్, చీఫ్ ఆర్కిటెక్ట్ ఖురానా ప్రాథమికంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రెండు కారిడార్లలో రోడ్డు ఎంత వెడల్పు ఉందనే విషయాన్ని పరిశీలించారు. స్టేషన్లు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించే ప్రాంతాల్లో ట్రాఫిక్, జనసాంద్రత తదితర వివరాలను సేకరించారు. చీఫ్ ఆర్కిటెక్ట్ ఖురానా రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడి పరిసరాలను గమనించారు. ఏలూరు రోడ్డు కారిడార్‌లో బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్‌కు లింకు ఎక్కడ, ఎలా కలపాలనే దానిపై ఖురానా చర్చించినట్లు తెలిసింది. ఆ తర్వాత బృందం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ప్రత్యేక కమిషనర్‌కు సర్వే పనులు, ఇతర వివరాలను అందించింది. సర్వే వివరాలు, పరిశీలించిన అంశాలపై బృందం సభ్యులు ఢిల్లీ వెళ్లి డీఎంఆర్సీ మాజీ ఎండీ శ్రీధరన్‌తో చర్చించనున్నారు. ఆయన వచ్చే నెల మూడో వారంలో నగరానికి వచ్చి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉంది. -
రోడ్డు పనులకు డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.10 వేల కోట్లతో నిర్మించేందుకు గానూ డీపీఆర్(డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించేందుకు వీలుగా అంచనాలు, డ్రాయింగ్స్ రూపొందించే బాధ్యతను కొన్ని కన్సల్టెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.22 కోట్లను కేటాయించింది. జాతీయ రహదారుల నుంచి నగరంలోకి నేరుగా చేరుకునేందుకు ఎలివేటెడ్ వంతెలను నిర్మించాలని నిర్ణయించింది. రాజీవ్ రహదారిని అనుసంధానిస్తూ 20 కి.మీ. పొడవుతో ప్యారడైజ్ జంక్షన్ నుంచి వంతెన, బాలానగర్ నుంచి ఓఆర్ఆర్కు అనుసంధానిస్తూ 20 కి.మీ.పొడవుతో నర్సాపూర్ జంక్షన్ వద్ద వంతెనను నిర్మించాలని నిర్ణయించింది. ఈ రెండింటి డీపీఆర్ కోసం నివేదికలు తయారీ బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించింది. కన్సల్టెన్సీలను గుర్తించేదుకు రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీలు కె.బిక్షపతి, పి.రవీందర్రావు, చీఫ్ ఇంజినీర్ ఐ.గణపతిరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేసింది.