ప్రమాణ స్వీకారం చేయిస్తున్న అల్లం నారాయణ
పంజగుట్ట (హైదరాబాద్): పెరిక కులస్తుల విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రత్యేక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఆదివారం సోమాజిగూ డ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ హైదరాబాద్ పెరిక కుల సంఘం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రేటర్ అధ్యక్షుడు బత్తిని పరమేష్‌తో పాటు మిగిలిన కార్యవర్గంతో అల్లం నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ సంఘానికి అర ఎకరం స్థలం, రూ.50 లక్షల నిధుల మంజూరు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment