లండన్: ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడంలో భారతీయ విద్యా సంస్థలు వెనుకబడ్డాయని ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ ‘ఎమర్జింగ్’ ఈ అంశంపై ఓ సర్వే చేసి ప్రపంచవ్యాప్తంగా 150 విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను టైమ్స్ హయ్యర్ ఎడ్యేకేషన్ గురువారం ప్రచురించింది. ‘గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో 150కిగాను భారత్ నుంచి కేవలం మూడు విద్యా సంస్థలే చోటు దక్కించుకున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) 28వ స్థానంలో నిలవగా, ఐఐటీ–ఢిల్లీకి 53వ స్థానం దక్కింది. గతేడాది ఇదే ర్యాంకింగ్స్‌లో ఐఐటీ–ఢిల్లీ 145వ స్థానంలో ఉండగా ఈసారి దాని ర్యాంకు గణనీయంగా మెరుగుపడటం గమనార్హం. ఈ జాబితా తొలి మూడు ర్యాంకులనూ అమెరికా విశ్వవిద్యాలయాలే సొంతం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment