కన్సల్టెన్సీల గుప్పిట ఇంజనీరింగ్‌ కాలేజీలు! | Consultancys plays tricks with engineering students | Sakshi
Sakshi News home page

కన్సల్టెన్సీల గుప్పిట ఇంజనీరింగ్‌ కాలేజీలు!

Published Mon, Jul 24 2017 10:41 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

కన్సల్టెన్సీల గుప్పిట ఇంజనీరింగ్‌ కాలేజీలు!

కన్సల్టెన్సీల గుప్పిట ఇంజనీరింగ్‌ కాలేజీలు!

మేనేజ్‌మెంట్‌ సీట్ల కోసం ఇంజనీరింగ్‌ కాలేజీలతో కుమ్మక్కు
► కాలేజీకెళితే.. చుక్కలనంటే రేట్లు
► తక్కువకు ఇప్పిస్తామంటూ కన్సల్టెంట్ల ఎర!


సాక్షి, హైదరాబాద్‌
మహారాష్ట్రలో ఉద్యోగం చేసే ఓ హైదరాబాదీ తన కుమారుడిని ఇంజనీరింగ్‌ చదివించేందుకు హైదరాబాద్‌లోని పేరున్న కాలేజీలను సంప్రదించగా మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు అయిపోయాయని చెప్పారు. మరో కాలేజీకి వెళ్తే రూ. 8 లక్షలు డిమాండ్‌ చేశారు. ఓ కన్సల్టెన్సీని ఆశ్రయించగా ఆయన సంప్రదించిన కాలేజీలోనే రూ. 5 లక్షలకే సీటు ఇప్పిస్తామన్నారు. సింగిల్‌ పేమెంట్‌లో డబ్బు చెల్లిస్తే ఓకే..లేదంటే వెళ్లిపోండి.. అని తెగేసి చెప్పారు. పైగా మీరెన్ని ప్రయత్నాలు చేసినా యాజమాన్యాలు సీట్లు లేవనే చెబుతాయని...ఎందుకంటే అన్ని సీట్లనూ తామే కొనేశామని, వాటిని కొంత లాభానికి అమ్ముతుంటామని కుండబద్దలు కొట్టాడు.

ఇదీ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీలో కన్సల్టెన్సీలు సాగిస్తున్న నయా దందా. ఇన్నాళ్లూ కమీషన్లు తీసుకొని సీట్ల భర్తీకి సహకరించిన కన్సల్టెన్సీలు ఇప్పుడు ఏకంగా పేరున్న కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. మేనేజ్‌మెంట్‌ సీట్లను కొనేసి అమ్మకానికి పెట్టాయి.

ప్రవేశాల ప్రారంభం నుంచే..
ఎంసెట్‌ ఫలితాలు వెలువడినప్పటి నుంచే కన్సల్టెన్సీలు రంగం ప్రవేశం చేశాయి. 30 వేల వరకు ఉన్న యాజమాన్య కోటా సీట్లను కొన్నింటికి యాజమాన్యాలకు అమ్ముకోగా, మరికొన్నింటిని కన్సెల్టెన్సీలకు అప్పగించాయి. మరోవైపు కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన 12 వేల సీట్ల భర్తీకి మార్గం సుగమం కావడంతో వాటిని కన్సల్టెన్సీల ద్వారా అమ్ముకునేందుకు పలు యాజమన్యాలు సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కన్వీనర్‌ కోటా చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ పూర్తి కావడంతో కన్సల్టెన్సీలు పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చాయి. తమ ప్రతినిధులను కాలేజీల వద్ద పెట్టి మరీ సీట్లను బేరానికి పెట్టాయి.

ఫలానా కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తాం.. సీటు కావాలంటే.. మా దగ్గరికి రండి.. వారు చెప్పిన రేటు కంటే తక్కువకే ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నాయి. దొరకదు అనుకున్న సీటు కన్సల్టెన్సీల ద్వారా లభిస్తుండటంతో తల్లిదండ్రులు కూడా కన్సల్టెన్సీలనే ఆశ్రయిస్తున్నారు. సదుపాయాలు, మంచి ఫ్యాకల్టీ, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు, ఉద్యోగం గ్యారంటీ అన్న ప్రచారంతో తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి అధిక మొత్తం చెల్లించి సీట్లను కొనుక్కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement