management seats
-
ఏఐకి రూ.19 లక్షలు సైబర్ సెక్యూరిటీకి రూ.18 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు యాజ మాన్య కోటా సీట్ల బేరసారాల జోరు పెంచాయి. వీలైనంత ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లను పెద్ద మొత్తంలో అమ్ముకోవాలని చూస్తున్నాయి. డిమాండ్ ఉన్న టాప్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు సామాన్యులు ఆశించే స్థాయిలో లేవని తెలుస్తోంది.ఇంజనీరింగ్ సెట్ ఫలితాలు మరో పది రోజుల్లో రానుండటంతో యాజమాన్య సీట్ల వైపు ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అయితే, సీట్లు కొనుగోలు చేసేవాళ్లు, విక్రయించే కాలేజీలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తామేమీ చేయలేక పోతున్నామని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కడితేనే సీటు గ్యారంటీరాష్ట్రంలో ఈ ఏడాది 1.09 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండే వీలుంది. ఇందులో 30% అంటే దాదాపు 31 వేల సీట్లు మేనేజ్మెంట్ కోటా కిందకొస్తాయి. ఇందులో టాప్ కాలే జీల్లో 19 వేల సీట్ల వరకూ ఉండగా, వీటిలో సగం సీట్లను ఎన్ ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలి. బీ కేటగిరీ సీట్లను జేఈఈ, ఈఏపీసెట్ ర్యాంకర్లు, ఇంటర్లో మార్కులు ఎక్కువ వచ్చిన వారికి క్రమానుగతంగా ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఏడాదికి 5 వేల డాలర్లు (దాదాపు రూ. 4 లక్షలు) వసూలు చేసుకునే వీలుంది. అయితే, బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసే వాళ్ల వివ రాలు ప్రభుత్వ సంస్థల పరిధిలోకి రావడం లేదు. ఆన్లైన్ విధానంలోనూ ఉండటం లేదు. దీన్ని సాకుగా తీసుకుని యాజమాన్యాలు ముందే సీట్లను అమ్ముకుంటున్నాయి. ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు రాదని తెలిసిన వాళ్లు సీట్ల కోసం ఎగబడుతున్నారు. సెట్ రిజల్ట్ వస్తే డిమాండ్ పెరుగు తుందని, సీట్లు కూడా అయిపోయే ప్రమాదం ఉందని యాజ మాన్యాలు డిమాండ్ సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజు ప్రత్యేక విభాగాలు పెట్టి సీట్ల కోసం వచ్చే వారిని ఒప్పించి, మెప్పించి డబ్బు వసూలు చేస్తున్నాయి. సీటు ఇవ్వాలంటే ముందే డబ్బులు కట్టి రిజర్వు చేసుకోవాలని షరతు విధిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాకే అడ్మిషన్లు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే సీట్లు భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా సీట్లు అమ్ముకునే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ర్యాంకర్లకూ గాలం» జేఈఈ ర్యాంకర్లతో కాలేజీ యాజ మాన్యాలు రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్లకు కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేయించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు రాష్ట్ర సెట్లోనూ మంచి ర్యాంకు వస్తుంది. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు దరఖాస్తు చేస్తే తొలి కౌన్సెలింగ్‌లోనే సీటు వస్తోంది. జాయినింగ్ రిపోర్టు చేసి సీటు కన్ఫమ్ చేసుకుంటున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్ తర్వాత, స్పాట్ అడ్మిషన్‌కు ముందు సీటు వదులుకుని, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. ఇలా ఖాళీ అయిన సీట్లనూ యాజమాన్యాలు భారీ మొత్తంలో అమ్ముకుంటాయి. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి కోర్సులకు ఏకంగా రూ. 19 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 58 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. -
100 ఎంబీబీఎస్ సీట్ల మిగులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పెద్ద ఎత్తున ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 100 వరకు ఎంబీబీఎస్ సీట్లు మిగిలినట్లు అంటున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. వాటికి మాప్ అప్ రౌండ్ నిర్వహించాక మిగిలిన 128 సీట్లను స్ట్రే వేకెన్సీ పద్ధతిలో నింపేందుకు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసినా పెద్దగా స్పందన రాలేదని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు బీ–కేటగిరీ సీట్లలోనూ కొన్ని సీట్లు మిగిలిపోయినట్లు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు 100 వరకు మిగిలినట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని కాలేజీలు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు సమాచారం ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఫిజికల్ కౌన్సెలింగ్ రద్దుతో మారిన పరిస్థితి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పెట్టేందుకు వీలుగా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లనూ భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజికల్ కౌన్సెలింగ్ చేపట్టవద్దని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని, అయినా సీట్లు మిగిలిపోతే వాటిని వదిలేయాలని పేర్కొంది. దీనివల్ల కూడా సీట్లు మిగిలిపోయినట్లు చెబుతున్నారు. సహజంగా ఏటా కొన్ని ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుంటాయి. ఎన్ఆర్ఐ సీట్లపై అభ్యర్థుల అనాసక్తి... రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. బీ–కేటగిరీ సీట్లలో 85 శాతం వరకు లోకల్‌కు కేటాయిస్తుండటంతో రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్ఆర్ఐలో సీట్లు ఎక్కువగానే ఉన్నా ఫీజులు అధికంగా ఉన్నాయి. బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు స్థాయిలో ఎన్ఆర్ఐ కోటా ఫీజులున్నాయి. అంటే ఏటా ఎన్ఆర్ఐ కోటా సీటు ఫీజు రూ. 23 లక్షలకుపైగా ఉంది. దీంతో 723 ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్లున్నా తక్కువమంది విద్యార్థులే ఆప్షన్లు పెట్టుకున్నారు. చివరకు వెసులుబాట్లు కల్పించినా ఇంకా సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో ఎంబీబీఎస్ చేసే బదులు ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ సీట్లు మిగలడంతో అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. -
కన్సల్టెన్సీల గుప్పిట ఇంజనీరింగ్ కాలేజీలు!
మేనేజ్మెంట్ సీట్ల కోసం ఇంజనీరింగ్ కాలేజీలతో కుమ్మక్కు ► కాలేజీకెళితే.. చుక్కలనంటే రేట్లు ► తక్కువకు ఇప్పిస్తామంటూ కన్సల్టెంట్ల ఎర! సాక్షి, హైదరాబాద్ మహారాష్ట్రలో ఉద్యోగం చేసే ఓ హైదరాబాదీ తన కుమారుడిని ఇంజనీరింగ్ చదివించేందుకు హైదరాబాద్‌లోని పేరున్న కాలేజీలను సంప్రదించగా మేనేజ్మెంట్ కోటా సీట్లు అయిపోయాయని చెప్పారు. మరో కాలేజీకి వెళ్తే రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. ఓ కన్సల్టెన్సీని ఆశ్రయించగా ఆయన సంప్రదించిన కాలేజీలోనే రూ. 5 లక్షలకే సీటు ఇప్పిస్తామన్నారు. సింగిల్ పేమెంట్‌లో డబ్బు చెల్లిస్తే ఓకే..లేదంటే వెళ్లిపోండి.. అని తెగేసి చెప్పారు. పైగా మీరెన్ని ప్రయత్నాలు చేసినా యాజమాన్యాలు సీట్లు లేవనే చెబుతాయని...ఎందుకంటే అన్ని సీట్లనూ తామే కొనేశామని, వాటిని కొంత లాభానికి అమ్ముతుంటామని కుండబద్దలు కొట్టాడు. ఇదీ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో కన్సల్టెన్సీలు సాగిస్తున్న నయా దందా. ఇన్నాళ్లూ కమీషన్లు తీసుకొని సీట్ల భర్తీకి సహకరించిన కన్సల్టెన్సీలు ఇప్పుడు ఏకంగా పేరున్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. మేనేజ్మెంట్ సీట్లను కొనేసి అమ్మకానికి పెట్టాయి. ప్రవేశాల ప్రారంభం నుంచే.. ఎంసెట్ ఫలితాలు వెలువడినప్పటి నుంచే కన్సల్టెన్సీలు రంగం ప్రవేశం చేశాయి. 30 వేల వరకు ఉన్న యాజమాన్య కోటా సీట్లను కొన్నింటికి యాజమాన్యాలకు అమ్ముకోగా, మరికొన్నింటిని కన్సెల్టెన్సీలకు అప్పగించాయి. మరోవైపు కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన 12 వేల సీట్ల భర్తీకి మార్గం సుగమం కావడంతో వాటిని కన్సల్టెన్సీల ద్వారా అమ్ముకునేందుకు పలు యాజమన్యాలు సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటా చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తి కావడంతో కన్సల్టెన్సీలు పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చాయి. తమ ప్రతినిధులను కాలేజీల వద్ద పెట్టి మరీ సీట్లను బేరానికి పెట్టాయి. ఫలానా కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తాం.. సీటు కావాలంటే.. మా దగ్గరికి రండి.. వారు చెప్పిన రేటు కంటే తక్కువకే ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. దొరకదు అనుకున్న సీటు కన్సల్టెన్సీల ద్వారా లభిస్తుండటంతో తల్లిదండ్రులు కూడా కన్సల్టెన్సీలనే ఆశ్రయిస్తున్నారు. సదుపాయాలు, మంచి ఫ్యాకల్టీ, క్యాంపస్ ప్లేస్మెంట్లు, ఉద్యోగం గ్యారంటీ అన్న ప్రచారంతో తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి అధిక మొత్తం చెల్లించి సీట్లను కొనుక్కుంటున్నారు. -
యాజమాన్య సీట్లు హాంఫట్!
- ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్డగోలు దందా - వసూళ్ల పర్వానికి తెరలేపిన టాప్ కాలేజీలు - కంప్యూటర్ సైన్స్‌కు రూ.14 లక్షల వరకు డొనేషన్.. కాస్త పేరున్న కాలేజీల్లో - రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు - ఏజెంట్లను పెట్టుకొని మరీ సీట్ల అమ్మకాలు - ముందుగానే రిజిస్ట్రేషన్లు.. అడ్వాన్సులు తీసుకుంటున్న వైనం - అడ్మిషన్ల విధానం ఖరారు కాకముందే అంగట్లో సరుకులైన సీట్లు - ఈసారి సీట్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్ కోటిరెడ్డి ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కొడుకు అక్షయ్‌కి ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు. అయినా టాప్ కాలేజీలో చదివించాలన్నది కోటిరెడ్డి కోరిక. ఓ కాలేజీని సంప్రదించాడు. కంప్యూటర్ సైన్స్‌లో సీటు కావాలన్నాడు. ఆ కాలేజీ యాజమాన్య ప్రతినిధి కొద్ది రోజులు ఆగండని చెప్పాడు. చాంబర్ బయటే ఉన్న ఏజెంట్ మాత్రం రూ.14 లక్షలిస్తే సీటు వస్తుందన్నాడు. చివరగా రూ.12 లక్షలకు తాను సీటు ఇప్పిస్తానన్నాడు. ముందు రూ.50 వేలు చెల్లించి సీటు రిజర్వ్ చేసుకొమ్మని చెప్పాడు. శ్రీధర్‌రావు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి. తన కూతురు శ్రావ్యను కంప్యూటర్ సైన్స్ చదివించాలని మేనేజ్మెంట్ కోటా సీటు కోసం ఓ కాలేజీకి వెళ్లాడు. సీటు కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని యాజమాన్య ప్రతినిధి తెగేసి చెప్పాడు. ‘ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటాం.. సీటు వస్తే ఇస్తారా..?’ అని శ్రీధర్‌రావు అడగ్గా.. ‘ఇక మీరు వెళ్లిపోవచ్చు..’ అని యాజమాన్య ప్రతినిధి బదులిచ్చాడు. ...ఇదీ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో సాగుతున్న దందా! ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ కాకముందే యాజమాన్యాలు సీట్ల అమ్మకాలకు తెరదీశాయి. కొన్ని యాజమాన్యాలు నేరుగా తల్లిదండ్రులతోనే బేరాలు చేస్తుండగా.. మరికొన్ని యాజమాన్యాలు ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నాయి. రాష్ట్రంలో పేరున్న టాప్ కాలేజీల్లో కొన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్లకు బేరాలు పెట్టాయి. అడ్వాన్సులు మిగతా తీసుకుంటున్నాయి. కనీసం రూ.50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెబుతున్నాయి. కన్వీనర్ కోటాలో తమ పిల్లలకు పేరున్న మంచి కాలేజీలో సీటు రాదేమోన్న ఆందోⶠనతో తల్లిదండ్రులు ముందే డబ్బు చెల్లించి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలే ఆసరాగా తమ పిల్లలను కాస్త మంచి కాలేజీలో చదివించాలని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉన్న కళాశాలల్లో చేర్పించాలన్న తల్లిదండ్రుల ఆశలను యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వాస్తవానికి 70 శాతం కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేశాక యాజమాన్యాలు మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలి. తర్వాత ప్రతిభ ఆధారంగా సీట్లను భర్తీ చేయాలి. కానీ ఆ ప్రక్రియే మొదలు కాలేదు. కాలేజీల్లో ఫీజులు కూడా ఖరారు కాలేదు. అయినా కాలేజీలు అప్పుడే డొనేషన్ల దందాకు తెరదీయడం గమనార్హం. ఎన్ని ఉంటాయో.. ఎన్ని ఊడుతాయో తెలియకుండానే.. గతేడాది లెక్కల ప్రకారం రాష్ట్రంలో 247 కాలేజీల్లో 1.26 లక్షల సీట్లు ఉన్నాయి. ఈసారి ఎన్ని కాలేజీల్లో, ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయో ఇంకా తెలియదు. అసలు ఏయే కాలేజీల్లో ఏయే బ్రాంచీలు ఉంటాయో, ఏయే బ్రాంచీలకు అనుబంధ గుర్తింపు వస్తుందో? ఎన్నింటికి రద్దు అవుతుందో కూడా తెలియదు. చివరకు ఎన్ని కాలేజీల్లో ఏయే బ్రాంచీల్లో, ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయన్న అంశం తేలలేదు. జేఎన్టీయూహెచ్ జారీ చేయాల్సిన కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఖరారు కాలేదు. ప్రభుత్వం చేపట్టిన విజిలెన్స్ తనిఖీలు సైతం కొలిక్కి రాలేదు. ఈ తనిఖీలు పూర్తయ్యాక.. ఆ నివేదికలను జేఎన్టీయూ నివేదికలతో సరిపోల్చి అప్పుడు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కూడా ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు. అలాగే ప్రభుత్వం ఈసారి మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ కోటా తరహాలోనే ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. ఇవేవీ తేలకముందే కాలేజీ యాజమాన్యాలు మాత్రం సీట్లను అంగడి సరుకుగా మార్చేశాయి. కంప్యూటర్ సైన్స్‌కు భలే గిరాకీ ప్రస్తుతం తల్లిదండ్రులు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ కోర్సుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీన్ని యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. భారీగా డొనేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాలేజీ ప్రతినిధులను మాటలను నమ్మి తల్లిదండ్రులు అడ్వాన్స్‌లు చెల్లించి సీట్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈసారి భారీగా తగ్గనున్న సీట్లు! ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్ల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కాలేజీలో ల్యాబ్, ల్రైబరీ, తదితర వసతులు 250 మంది విద్యార్థులకు సరిపడ ఉంటే అనుమతులు మాత్రం 550 నుంచి 750 విద్యార్థుల వరకు తెచ్చుకుంటున్నట్టు జేఎన్టీయూహెచ్ గుర్తించింది. దీంతో కాలేజీల్లో ఉన్న సదుపాయాల ప్రకారమే విద్యార్థుల అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఫలితంగా ఈసారి కాలేజీల్లో సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయం బయటకు పొక్కడంతో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆందోళనలో పడ్డారు. కొంతమంది తమ డబ్బును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
‘మేనేజ్మెంట్’ బేరాలు
సాక్షి, హైదరాబాద్: టాప్ కాలేజీలుగా చలామణీ అవుతున్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా కన్వీనర్ కోటా ప్రవేశాలు ప్రారంభం కాకముందే మేనేజ్మెంట్ సీట్లు అమ్మేందుకు సమాయత్తమవుతున్నాయి. దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు పేరుమోసిన కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే డొనేషన్లు కూడా అమాంతం పెంచేశాయి. అటు ఉన్నత విద్యా శాఖ కాని, ఉన్నత విద్యా మండలి కానీ ఈ వ్యవహారంపై దృష్టిసారించకపోగా, అధికారుల దృష్టికి తీసుకెళ్తే సరైన ఆధారాలు లేవని చేతులెత్తేస్తున్నారు తప్ప కనీసం నిబంధనల అమలును కూడా పట్టించుకోవడం లేదు. సందిగ్ధతను ఆసరాగా చేసుకొని.. గతేడాది లోపాల కారణంగా 143 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించలేదు. ఈ ఏడాది కూడా ఎన్ని కాలేజీలకు అనుమతి వస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అనుబంధ గుర్తింపు వచ్చినా ఎన్ని సీట్లలో ప్రవేశాలకు ఆమోదం తెలుపుతారో కూడా తెలియదు. ఈ సందిగ్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని ‘దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న’ చందంగా గుర్తింపు కాలేజీలను జేఎన్టీయూహెచ్ ప్రకటించేలోపే ఎలాగైనా సీట్లు భర్తీ చేయాలని చూస్తున్నాయి. జేఎన్టీయూహెచ్ ఇటీవల చేపట్టిన తనిఖీల్లో టాప్ కాలేజీలుగా చెప్పుకొంటున్న వాటిల్లోనూ లోపాలున్నట్లు వెల్లడైంది. అయినా కూడా తమవి టాప్ కాలేజీలంటూ ప్రచారం చేసుకుని మేనేజ్మెంట్ సీట్లకు లక్షలకు బేరం కుదుర్చుకుంటున్నాయి. ప్రభుత్వమే కల్పించిన అవకాశం! మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ విషయంలో గతంలో కోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు.. విద్యార్థి స్థితిగతులు తెలుసుకునేందుకు వారి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసుకునే వీలు కల్పించాలని కోరాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో యాజమాన్యాలకు అనుగుణంగా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అప్పటి ఏపీ ఉన్నత విద్యామండలి రివ్యూ పిటిషన్ వేయలేదు. కనీసం నిబంధనల అమలులోనైనా సరిగ్గా వ్యవహరించలేదని విమర్శలు ఎదుర్కొంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న కామన్ ఫీజు విధానం ప్రకారం అన్ని కేటగిరీల సీట్ల ఫీజులు కాలేజీల ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఒకే ఫీజు విధానం అమలు చేయాలి. ఒకటీ అరా కాలేజీలు తప్ప చాలా కాలేజీలు ఈ విధానాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు కూడా ఆధారాలు లేవని పట్టించుకోవడం లేదు. ఈ కామన్ ఫీజు విధానం అమలయ్యేలా పకడ్బందీ కార్యాచరణ చేపడితే తప్ప కాలేజీల యాజమాన్యాల దూకుడును అరికట్టడం సాధ్యం కాదని పలువురు సూచిస్తున్నారు. -
సీటు కోటిపైనే..!
- ప్రత్యేక ఎంసెట్‌కు ముందే యాజమాన్య కోటా సీట్ల అమ్మకం - 500 ఎంబీబీఎస్ సీట్లు హాంఫట్! - ప్రైవేటు మెడికల్ కాలేజీల బరితెగింపు - సీట్లు కొన్నవారికి పేపర్ లీక్! - ‘దోపిడీ’కి సర్కారు వెసులుబాటు... ఇంకా ఎంసెట్ ఫలితాలు రాలేదు... ‘బి’ కేటగిరీ వైద్య సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష జరగనే లేదు... కానీ ఈలోపే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు బరితెగించాయి. యథేచ్ఛగా సీట్ల దందా సాగించాయి. ఎంబీబీఎస్‌కు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటూ యాజమాన్య కోటాలోని సీట్లను ఫిబ్రవరి నుంచే భర్తీ చేసేసుకున్నాయి! కాలేజీని, ప్రాంతాన్నిబట్టి ఒక్కో సీటుకు రూ. 1.10 కోట్ల నుంచి 1.25 కోట్లు దండుకున్నాయి! హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి. 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం (1,050) సీట్లు, ‘బి’ కేటగిరీలోని 10 శాతం (210) సీట్లను ఎంసెట్ మెరిట్ ద్వారానే ప్రభుత్వం భర్తీ చేసేది. మిగిలిన 40 శాతంలో (25 శాతం యాజమాన్య, 15 శాతం ప్రవాస భారతీయ) సీట్లను ప్రైవేటు కళాశాలలే తమకు నచ్చినట్లు సీట్లు భర్తీ చేసుకునేవి. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చింది. బీ కేటగిరీలోని 35 శాతం సీట్లను యాజమాన్య కోటాలో కలిపేస్తూ రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ‘ఎ’ కేటగిరీలో 50 శాతం సీట్లు 1,050 ఉంటాయి. అవన్నీ ఎంసెట్ కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 35 శాతం సీట్లు (735) ఉన్నాయి. వీటికి ప్రస్తుత ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా ప్రైవేటు వైద్య కళాశాలల ఆధ్వర్యంలోనే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకొని వారే భర్తీ చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ప్రైవేటు కళాశాలలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వారే కన్వీనర్‌ను నియమించుకొని త్వరలో ప్రత్యేక పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మిగిలిన 15 శాతం కోటాలో 315 సీట్లున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం సీట్లతోపాటు బి కేటగిరిలో 200 దాకా సీట్లను కూడా యాజమాన్యాలు అమ్మేసుకున్నాయి. ‘దోపిడీ’కి సర్కారు వెసులుబాటు... యాజమాన్య కోటా సీట్లలో ప్రైవేట్ వారి దోపిడీ చాలదన్నట్లు సర్కారు మరో మార్గం కూడా చూపింది. కాలేజీలకు అనుకూలంగా రెండ్రోజుల కిందట మార్గదర్శకాలు జారీ చేసింది. బి కేటగిరిలో 35 శాతం సీట్లకు రూ. 9 లక్షలుగా ఫీజును నిర్ధారించింది. ప్రైవేటు వారు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసి ర్యాంక్ సాధించినా ఏటా రూ. 9 లక్షలు చెల్లించడానికి స్థోమత లేక ఆ సీటు భర్తీ కాకపోతే యాజమాన్యాలు ఆ సీటును భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును అడ్డంపెట్టుకునే కాలేజీలు ప్రవేశ పరీక్ష కూడా పెట్టకుండానే బి కేటగిరిలో దాదాపు 200 సీట్లను అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్లు కొన్నవారికి పేపర్ లీక్! యాజమాన్య కోటా 15 శాతం కంటే అధికంగా సీట్లు తెగనమ్ముకున్న కాలేజీలు బి కేటగిరిలో 35 శాతం సీట్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాన్ని సీట్లు కొన్నవారికి ముందే లీక్ చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ సీటు కావాలంటూ దక్షిణ తెలంగాణలోని ఓ వైద్య కళాశాలను సంప్రదించిన ఓ తండ్రికి ఆ కాలేజీ యాజమాన్యం ఇదే మాట చెప్పింది. ‘మీరు ముందే రూ.1.25 కోట్లు చెల్లించండి. మీ అమ్మాయికి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ముందే లీక్ అయ్యేట్టు చూస్తాం’ అని హామీ ఇచ్చింది. దీనిపై ఆయన సాక్షి కార్యాలయానికి ఫోన్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ర్యాంకు రాకుంటే డబ్బు వాపస్ కాలేజీలు ఒకవేళ సీట్లన్నీ ముందే భర్తీ చేసుకున్నా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చే ర్యాంకుల బట్టే ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ర్యాంకు రాని వారుంటే విద్యార్థుల నుంచి ముందే తీసుకున్న సొమ్మును వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిసారి కాబట్టి కొంత గందరగోళం సాధారణం. మున్ముందు ఈ పరిస్థితి మారనుంది. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
ప్రత్యేక మెడికల్ ఎంట్రన్స్‌పై ప్రతిష్టంభన
సొంతంగా పరీక్ష నిర్వహిస్తామని ప్రైవేటు కాలేజీల స్పష్టీకరణ ‘బి’ కేటగిరీలోని 10 సీట్లూ తమకే ఇవ్వాలని విన్నపం కుదరదన్న మంత్రి లక్ష్మారెడ్డి... అర్ధంతరంగా ముగిసిన సమావేశం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. తామే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకుంటామని... అందుకు అనుమతించాలని తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ముందు నుంచే అంగీకరిస్తున్న ప్రభుత్వం... ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలే సొంతంగా పరీక్ష నిర్వహించుకుంటామన్న అంశాన్ని తిరస్కరించినట్లు తెలిసింది. ఈ అంశంపై శుక్రవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ప్రవేశ పరీక్షకు సానుకూలంగా ఉన్నామని... అయితే ఆ పరీక్షను ప్రభుత్వమే నిర్వహిస్తుందని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు మాత్రం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని ఘంటాపథంగా చెప్పాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేటు మెడికల్ కాలేజీలు విభేదించడంతో ఎటువంటి నిర్ణయానికి రాకుండానే సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అయితే దీనిపై ప్రైవేటు కాలేజీలు తమ విన్నపాలతో కూడిన లేఖను మంత్రికి అందజేసినట్లు యాజమాన్యాలు తెలిపాయి. 40 శాతమే కాదు... ‘బి’ కేటగిరీలోని 10 శాతం సీట్లూ మాకే ఇవ్వండి తెలంగాణలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఆ ప్రైవేటు సీట్లలో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం సీట్లు, ‘బి’ కేటగిరీ 10 శాతం సీట్లను ఎంసెట్ అర్హత ద్వారా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన ‘సి’ కేటగిరీ 40 శాతంలో 25 శాతం యాజమాన్య కోటా సీట్లు, 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ 40 శాతం సీట్లను కూడా ప్రస్తుతం ఎంసెట్ పరీక్ష ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. వీటికే ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రైవేటు మెడికల్ యాజమాన్యాలు కోరుతున్నాయి. మంత్రితో జరిగిన సమావేశంలో తాజాగా ప్రైవేటు యాజమాన్యాలు మరో ప్రతిపాదన కూడా చేశాయి. ‘బి’ కేటగిరీలోని 10 శాతం సీట్లను కూడా యాజమాన్య సీట్లతో కలిపి వాటిని కూడా తామే నింపుకునేలా చేయాలని కోరాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చేస్తుందని వెల్లడించాయి. అలా చేసేట్లయితే 40 శాతంగా ఉన్న 840 సీట్లకు 10 శాతం సీట్లు 210 కలిపితే మొత్తం 1,050 సీట్లకు సొంతంగా పరీక్ష పెట్టుకుని నింపుకోవాలనేది ప్రైవేటు మేనేజ్మెంట్ల ఉద్దేశం. పైగా వీటన్నిం టికీ ఒకే ఏకీకృత ఫీజు రూ. 11 లక్షలు వసూలు చేసుకునేలా అనుమతించాలని కూడా కోరినట్లు తెలిసింది. అంటే 15% ఎన్ఆర్ఐ సీట్లకు వసూ లు చేస్తున్న రూ. 11 లక్షల ఫీజును మరో 35 శాతం సీట్లకు కూడా వర్తింప చేయాలని కోరి నట్లు సమాచారం. ఇన్ని కోర్కెలపై సర్కారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఇచ్చిన లేఖపై సీఎం చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు కాలేజీలు తమ నిర్ణయాన్ని ప్రభుత్వం పరి గణనలోకి తీసుకుంటుందని అంటున్నారు. 3, 4 రోజుల్లో నిర్ణయం: మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహణకు సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో అనేక అభిప్రాయాలు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. సొంతంగా తామే ఎంట్రన్స్ నిర్వహించుకుంటామని యాజమాన్యాలు తన దృష్టికి తీసుకొచ్చాయని వివరించారు. రెండు మూడు రోజుల్లో ఒక సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా వారిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు. -
యాజమాన్య సీట్లకు ప్రత్యేక ఎంట్రన్స్
ప్రైవేటు మెడికల్ కళాశాలల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరీక్ష నిర్వహించాలని సూత్రప్రాయ నిర్ణయం యాజమాన్యాలతో నేడు సమావేశం కానున్న మంత్రి లక్ష్మారెడ్డి ఇక 840 యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక పరీక్ష ఈ ఏడాదికి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ద్వారా నిర్వహించే యోచన సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లకు ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించాలని చేస్తున్న డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇష్టానికి వదిలివేయకుండా ప్రత్యేక ఎంట్రన్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని సర్కారు తాజాగా నిర్ణయించిం ది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ విషయంపై ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తుది నిర్ణయం తీసుకుంటే ఈ ఏడాదే ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించే అవకాశాలున్నాయి. 840 సీట్లకు ప్రత్యేక ఎంట్రన్స్ తెలంగాణలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఆ ప్రైవేటు మెడికల్ కాలేజీ సీట్లలో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం సీట్లు (ఫీజు రూ. 60 వేలు), ‘బి’ కేటగిరీ 10 శాతం (ఫీజు రూ. 2.40 లక్షలు) సీట్లను ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన ‘సి’ కేటగిరీ 40 శాతం (840 సీట్లను) యాజమాన్య కోటా కింద ప్రైవేటు కళాశాలలు ప్రస్తుతం ఎంసెట్ ఆధారంగానే భర్తీ చేసుకుంటున్నాయి. వీటికే ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వానికి ఎప్పటినుంచో విన్నవిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఈ సీట్లకు ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహిస్తారు. ఈసారికి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ద్వారానే... యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఈ ఏడాదికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారానే నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యోచిస్తున్నారు. తెలంగాణకు వరంగల్‌లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ అది పూర్తికాకపోవడంతో ఈసారి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంపైనే ఆధారపడాలని యోచిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం దాదాపు 91,133 దరఖాస్తులు వచ్చాయి. అందులో తెలంగాణకు చెందినదరఖాస్తులు సుమారు 60,427 ఉన్నాయి. ఇందులో చాలామంది యాజమాన్య కోటా సీట్లకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. ప్రత్యేక ఎంట్రన్స్‌పై రాష్ర్ట ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనుంది. అంతా ప్రభుత్వ నియంత్రణలోనే.. ‘సి’ కేటగిరీల్లోని 25 శాతం యాజమాన్య కోటా, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాలోని 840 సీట్లను తమ ఇష్టానికి తగ్గట్లుగా ఫీజులు వసూలు చేసుకోవాలనేది ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆలోచన. ప్రస్తుతం వాటికి ప్రభుత్వ నిర్ణయం మేరకు రూ. 11.50 లక్షలు ఫీజుగా ఉంది. ప్రత్యేక ఎంట్రన్స్ తామే నిర్వహించుకోవడం ద్వారా రూ. 45 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చని ప్రైవేటు కాలేజీల యోచన. అయితే వారు సొంతంగా ఎంట్రన్స్ నిర్వహించుకోకుండా అడ్డుక ట్ట వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. సొంతంగా ఎంట్రన్స్ నిర్వహించుకునే అవకాశమే ఇస్తే పారదర్శకత లోపించి ఎంట్రన్స్‌కు ముందు రాత్రికి రాత్రే ఎక్కువ డబ్బులు ఇచ్చినవారికి పేపర్ లీకేజీ కూడా జరిగే ప్రమాదం కూడా ఉందనేది ప్రభుత్వ వర్గాల భయం. అందువల్ల అధిక ఫీజుల వసూలుకు చెక్ పెట్టడం, ఇతరత్రా అవకతవకలు జరగకుండా అడ్డుకోవడం కోసం ప్రభుత్వమే యాజమాన్య కోటా సీట్లకు కూడా ప్రవేశ పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో జరిగే సమావేశంలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాలని అధికారులు భావిస్తున్నారు. -
ఈసారికి ప్రవేశాల బాధ్యత మాదే
ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ తెలంగాణలోనూ మేనేజ్మెంట్ సీట్లకు మేమే రాటిఫికేషన్ ఇస్తాం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ అధికారం తమకే ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. అందువల్లే తాము మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు. ప్రవేశాలను యాజమాన్యాలు సెప్టెంబర్ 15లోగా పూర్తిచేసి, రాటిఫికేషన్ కోసం తమకు పంపించాలన్నారు. ఆయన సోమవారమిక్కడి మండలి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభ జన చట్టం ప్రకారం ఈ ఏడాది ప్రవేశాలు పూర్తిచేసే అధికారం ఏపీ ఉన్నత విద్యామండలికే ఉందని తెలిపారు. వచ్చే ఏడాదికి చెప్పలేమన్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాలను ఆగస్టు 31లోగా పూర్తి చేయాల్సినా ఇంకా కొనసాగిస్తున్నారని, రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమే అవుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. ప్రవేశాల విషయంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల ఒకటో తేదీన తరగతులు ప్రారంభమైనట్టేనన్నారు. సీట్లు ఎక్కువగా మిగిలిపోయినందున విద్యార్థులకు మార్పులకు అవకాశం కల్పించేందుకు రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించవద్దని లేదని ఆయన వివరించారు. మొదటి రోజు ఇంజనీరింగ్ ప్రవేశాలకు 28 వేల మంది మెుదటి రోజు ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం 28 వేల మంది హెల్ప్‌లైన్ కేంద్రాల్లో అనుమతి పొందారు. సోమవారం 1వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు పరిధిలోని 32,616 మంది విద్యార్థులకు అవకాశం కల్పించగా, సాయుంత్రం 6 గంటల వరకు 28 వేల మంది అనుమతి కోసం రిపోర్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రఘునాథ్ కొనసాగింపు: వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్ ఈనెల 31న పదవీ విరమణ పొందారు. అయితే ప్రవేశాల క్యాంపులో ఆయన సేవలు అవసరమని, ఆయనను కొనసాగించాలని ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశాలు పూర్తయ్యే వరకూ ఏపీ తరపున ఆయన ప్రవేశాల క్యాంపులో కొనసాగిస్తున్నట్లు లేఖ ఇచ్చినట్లు మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ఆయన స్వస్థలం అనంతపురం కావడంతో ఆయన తనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని గతంలోనే అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన 31న పదవీ విరమణ పొందినా, ఏపీ ప్రభుత్వం ఆయున పదవీ విరవుణ కాలాన్ని రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది. -
ఇంటర్వ్యూతో మేనేజ్మెంట్ సీట్ల భర్తీ
ఇంజనీరింగ్ సీట్లపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ఉన్నత విద్యా మండలి విద్యార్థుల ఆర్థికస్థితి తెలుసుకునేందుకే ఇంటర్వ్యూలు చెల్లిస్తారనుకుంటేనే సీట్ల కేటాయింపు 23 నుంచి మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ 15 శాతానికి మించకుండా ఎన్ఆర్ఐ కోటా సీట్లు సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీరింగ్ కోర్సుల్లో 30 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని, వారు ఫీజు చెల్లిస్తారనే నమ్మకం కలిగితేనే సీట్లు ఇస్తారు. యాజమాన్యానికి నమ్మకం కుదరకపోతే సీటు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అయితే అందుకు కారణాలను తెలియజే యాలి’’.. అని ఏపీ ఉన్నత విద్యా మండలి బుధవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈనెల 22 లేదా 23వ తేదీ నుంచి 15 రోజుల పాటు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించనుంది. దీనికి సంబంధించి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఉన్నత విద్యా వుండలి ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయునుంది. అలాగే విద్యార్థులు నేరుగా కాలేజీలోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఉన్నత విద్యా మండలి ఈ చర్యలు చేపట్టింది. 5 శాతం ఉన్న ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) కోటాను 15 శాతానికి పెంచింది. మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల నిబంధనలు ఇవీ.. 30 శాతం మేనే జ్మెంట్ కోటా సీట్లలో 15 శాతానికి మించకుండా సీట్లను ఎన్ఆర్ఐ పిల్లలకు ఇవ్వొచ్చు. అర్హత పరీక్షలో వారు 50 శాతం మార్కులను పొంది ఉండాలి. మిగతా సీట్లను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. జేఈఈలో ర్యాంకు సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించవచ్చు. వారు అర్హత పరీక్ష గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించి ఉండాలి. ఆ తరువాత ఎంసెట్‌లో అర్హత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా కేటాయించాలి. అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్ గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు (రిజర్వేషన్ కేటగిరీ వారికి 40 శాతం) సాధించిన వారికి కేటాయించవచ్చు. ప్రవేశాల విధానం.. ఉన్నత విద్యా మండలి వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుంది. ప్రతి కళాశాలకు యూనిక్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. యాజమాన్య కోటా సీట్ల వివరాలను అందులో అప్లోడ్ చేయాలి. విద్యార్థులు ఆ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చేలా చర్యలు చేపడతారు. విద్యార్థులు వ్యక్తిగతంగా కాలేజీకి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యాజమాన్యం విద్యార్థులకు రసీదు లేదా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. నిర్ణీత సమయంలో సీట్ల భర్తీని పూర్తి చేయాలి. విద్యార్థులు ఎన్నికాలేజీల్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తరువాత మెరిట్ జాబితాలను కాలేజీలకు అందజేస్తారు. యాజమాన్యాలు ఇంటర్వ్యూ చేసి సీట్లు కేటాయిస్తారుు. డబ్బు చెల్లిస్తారనే నమ్మకం కుదరకపోతే సీటు నిరాకరించవచ్చు. నిరాకరణ కారణాలతో ఎంపిక జాబితాలను మండలికి అందజేయాలి. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది. -
పాత పద్ధతిలోనే ప్రవేశాలు
ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీపై ప్రవేశాల కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో ప్రవేశాలను పాత విధానంలోనే చే పట్టాలని ఇంజనీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. తొలుత జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అప్పటికీ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు మిగిలిపోతే చివరగా ఇంటర్మీడియెట్ మార్కులతో ప్రవేశాలు చేపడతారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు భర్తీ విధానాన్ని ఖరారు చేశారు. మేనేజ్మెంట్ కోటా భర్తీ విధివిధానాలను మేనేజ్మెంట్లకు తెలియజేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున, ఈనెల 28న కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సతీష్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్, ఏఎఫ్ఆర్సీ నుంచి బాలసుబ్రహ్మణ్యం, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇదీ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ విధానం... గతేడాది అనుసరించిన విధంగా 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేస్తారు. గతంలో ఎన్ఆర్ఐ కోటా 5 శాతమే ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు దానిని 15 శాతానికి పెంచుతున్నారు. అయితే ఇందులో కేవలం ఎన్ఆర్ఐ కోటానే కాకుండా ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా పేరును చేర్చాలని, తద్వారా స్పాన్సర్డ్ కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. అయితే విమర్శలు వస్తాయనే ఆలోచనతో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకు కమిటీ నిరాకరించింది. - ఈసారి 15 శాతం ఎన్ఆర్ఐ కోటాలో నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలనే చేర్చుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సీట్లు మిగిలిపోతే అవి మేనేజ్మెంట్ కోటాలోకి వెళతాయి. - మిగిలిన 15 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం అంటూ ఏమీ ఉండదు. అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. - మొత్తం మేనేజ్మెంట్ కోటాను ఇంటర్ మార్కులతోనే భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలన్న యాజమాన్యాల డిమాండ్లకు ఉన్నత స్థాయి కమిటీ మొదట్లో తలొగ్గి, ఆ అంశంపై చర్చించింది. అయితే దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది.