న్యూడిల్లీ: రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త ప్రకటించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ఢిల్లీ ప్రభుత్వం జాబ్ పోర్టల్(ఉపాధి కల్పన సైట్)ను నాలుగు రోజుల క్రితం ప్రారంభించింది. ప్రభుత్వం ప్రారంభించిన జాబ్ పోర్టల్‌కు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటివరకు 2లక్షల ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం పేర్కొనగా, 3లక్షల 22వేల మంది నిరుద్యోగులు జాబ్ పోర్టల్‌లో తమ పేరును నమోదు చేసుకున్నారు.
ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 7,577 కంపెనీలు జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయి. అయితే జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు నిరుద్యోగులు ఎటువంటి చార్జీలను కట్టనవసరం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలంటే మొదటగా సైట్‌లో లాగిన్ అయ్యాక మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి, తర్వాత ఏ విభాగాలలో ఉద్యోగం కావాలో నమోదు చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒకే ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. కాగా పోర్టల్‌లో నమోదు చేశాక ఫోన్ లేదా వాట్సాప్‌లో పోర్టల్ అధికారులు నియామకాలకు సంబంధించిన సమాధానం ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment