Job portal
-
సోనూ సూద్ జాబ్ పోర్టల్.. కీలక పరిణామం
ముంబై : కరోనా కష్ట కాలంలో ఎందరినో ఆదుకుని.. రియాల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సోనూ సూద్. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం.. శరణార్థులకు ఆశ్రయం కల్పించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు సోనూ సూద్. వీటన్నింటికంటే ముఖ్యమైనది ఉపాధి కల్పన. కోవిడ్ కారణంగా ఎందరో జీవనోపాధి కోల్పోయారు. వారికి చేయూతనివ్వడం కోసం సోనూ సూద్ దేశంలోని పలు ప్రైవేట్ కంపెనీలతో కలిసి ‘ప్రవాసి రోజ్‌గార్’ పేరిట ఓ జాబ్ పోర్టల్‌ని స్థాపించిన సంగతి తెలిసిందే. కంపెనీలకు, నిరుద్యోగులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది ఈ పోర్టల్. ఈ నేపథ్యంలో తాజాగా సోనూ సూద్ ప్రయత్నం గురించి తెలుసుకున్న ఓ అంతర్జాతీయ కంపెనీ దీనిలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందేకు ముందుకు వచ్చింది. (చదవండి: సోనూసూద్‌కి ఐరాస అవార్డ్) వివరాలు.. సోనూ సూద్ కంపెనీ, ఒకేషనల్ స్కిల్ ప్రొవైడర్ ‘స్కూల్‌నెట్’ రెండు కలిసి టెమాసెక్-బ్యాక్డ్ జాబ్ మ్యాచింగ్ ప్లాట్‌ఫాం గుడ్‌వర్కర్‌తో కలిసి ఓ జాయింట్ వెంచర్‌ని ప్రారంభించనున్నాయి. దీని ద్వారా బ్లూ కాలర్ వర్కర్స్‌కి ఉపాధితో పాటు నైపుణ్యాభివృద్ధికి గాను శిక్షణ ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో గుడ్‌వర్కర్ ఈ జాయింట్ వెంచర్లో 250 కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యింది. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మందికి ఉపాధితో పాటు నైపుణ్యాభివృద్ధికి అవసరమైన శిక్షణ ఇచ్చి వారికి మంచి కెరీర్‌ని అందించడం ఈ ప్లాట్‌ఫామ్ ఉద్దేశం. ఫైనాన్స్, హెల్త్‌కేర్, సోషల్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉపాధి కల్పించనుంది. ఈ జాయింట్ వెంచర్లో 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ ప్రధాన కార్యాలయంగా గల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టెమాసెక్ స్థాపించిన గుడ్‌వర్కర్ ముందుకు వచ్చింది. ఈ జాయింట్ వెంచర్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంఛనంగా తన పనులను ఆరంభించనుంది. (చదవండి: సివిల్స్ అభ్యర్థులకు సోనూ స్కాలర్షిప్) ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ‘లక్షలాది మంది యువతకు మంచి జీవనోపాధి, భవిష్యత్తు అందించాలనే నా కల ఈ పార్టనర్షిప్ ద్వారా నేరవేరనుంది. లక్షలాది మంది వలస కార్మికులకు దీని ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇవ్వనున్నాం’ అని తెలిపారు. సోనూ సూద్, ఒకేషనల్ ట్రైనింగ్ అందించే ‘స్కూల్‌నెట్’తో కలిసి 2020 జూలైలో ‘ప్రవాసి రోజ్‌గార్’ ఎంప్లాయిమెంట్ పోర్టల్‌ని ప్రారంభించారు. వలసకార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ పోర్టల్‌ని ప్రారంభించారు. ఇక దీనిని లాంచ్ చేసిన నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 10 లక్షల మంది ఉద్యోగార్థులు దీనిలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. -
స్టార్టప్స్‌లో పెట్టుబడులు: ఈ షేరు రాకెట్ స్పీడ్
ముంబై, సాక్షి: ఇంటర్నెట్ ఆధారిత సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ షేరు తాజాగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈలో తొలుత దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 3,988కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం యథాతథంగా రూ. 3,925 వద్ద ట్రేడవుతోంది. గత రెండేళ్లలో ఈ కౌంటర్ 187 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా కంపెనీ అనుబంధ సంస్థలైన జాబ్ పోర్టల్, మాట్రిమోనీ, రియల్టీ పోర్టల్ ప్రభావం చూపుతున్నాయి. దీనికితోడు కంపెనీ జొమాటో, పాలసీ బజార్‌సహా కనీసం 23 స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో జొమాటో ఇటీవల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. కంపెనీ నౌకరీ, 99ఏకర్స్, జీవన్సాథీ, శిక్ష తదితర పోర్టళ్లను నిర్వహించే సంగతి తెలిసిందే. తొలి లిస్టెడ్ కంపెనీ డాట్‌కామ్ బూమ్ సమయంలో అంటే 1995లో ఆవిర్భవించిన ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ 2006 నవంబర్‌లో దేశీయంగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. తద్వారా దేశీయంగా లిస్టయిన తొలి ఇంటర్నెట్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇటీవల ఇన్ఫీబీమ్, ఇండియామార్ట్ ఇంటర్మెష్, రూట్ మొబైల్స్ తదితర పలు కంపెనీలు లిస్టయ్యాయి. టెమాసెక్, టైగర్ గ్లోబల్, చైనీస్ యాంట్ గ్రూప్‌నకు సైతం వాటాలు కలిగిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్‌కు సుమారు 20 శాతం వరకూ వాటా ఉన్నట్లు అంచనా. జొమాటోకు విదేశీ రీసెర్చ్ సంస్థ హెచ్ఎస్బీసీ ఏకంగా 5 బిలియన్ డాలర్ల విలువను అంచనా వేయడం గమనార్హం. దీంతో ఇటీవల ఇన్ఫో ఎడ్జ్ కౌంటర్ మరింత జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
నిరుద్యోగులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్
న్యూడిల్లీ: రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త ప్రకటించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ఢిల్లీ ప్రభుత్వం జాబ్ పోర్టల్(ఉపాధి కల్పన సైట్)ను నాలుగు రోజుల క్రితం ప్రారంభించింది. ప్రభుత్వం ప్రారంభించిన జాబ్ పోర్టల్‌కు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటివరకు 2లక్షల ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం పేర్కొనగా, 3లక్షల 22వేల మంది నిరుద్యోగులు జాబ్ పోర్టల్‌లో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 7,577 కంపెనీలు జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయి. అయితే జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు నిరుద్యోగులు ఎటువంటి చార్జీలను కట్టనవసరం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలంటే మొదటగా సైట్లో లాగిన్ అయ్యాక మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి, తర్వాత ఏ విభాగాలలో ఉద్యోగం కావాలో నమోదు చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒకే ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. కాగా పోర్టల్‌లో నమోదు చేశాక ఫోన్ లేదా వాట్సాప్‌లో పోర్టల్ అధికారులు నియామకాలకు సంబంధించిన సమాధానం ఇస్తారు. -
ట్రెండ్ సెట్ చేస్తున్న సోషల్ మీడియా
ఒకప్పుడు ఉద్యోగాన్వేషణలో జాబ్ పోర్టల్స్ పాత్ర ప్రముఖంగా ఉండేది.. కానీ నేటి నెట్వర్కింగ్ యుగంలో నయా ట్రెండ్.. జాబ్ సెర్చ్ వయా సోషల్ నెట్వర్కింగ్. సోషల్ మీడియా ప్రవేశంతో ఉద్యోగాన్వేషణ కొత్త పుంతలు తొక్కుతోంది.. జాబ్ మార్కెట్లోని విస్తృత అవకాశాలను అభ్యర్థుల ముంగిట నిలుపుతోంది. ప్రతి కంపెనీ సోషల్ నెట్వర్కింగ్లో ఖాతాను నిర్వహిస్తుండడం, యువతలో ఎక్కువ మంది సోషల్ వర్కింగ్ సైట్స్‌ను అనుసరిస్తుండడం (ఫాలో) కూడా కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో సోషల్ మీడియా పాత్రపై స్పెషల్ ఫోకస్... పర్సనల్ టు ప్రొఫెషనల్ సోషల్ మీడియా పరిధి విస్తృతం. గత కొంత కాలంగా వ్యక్తిగత ఆసక్తి నుంచి వృత్తి మాధ్యమానికి వేదికగా మారింది. అన్ని కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహంలో సోషల్ నెట్‌వర్కింగ్‌ను తప్పనిసరి అంశంగా భావిస్తున్నా యి. తమ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియూలో పోస్ట్ చేస్తున్నాయి. నియామక ప్రక్రియలను కూడా ఈ మాధ్యమం ద్వారానే నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నాయి. స్వల్ప సమయంలో తక్కువ ఖర్చుతో ప్రతిభావంతులను ఆకర్షించే సులువైన మాధ్య మం సోషల్ మీడియా అని కంపెనీలు భావిస్తున్నాయి. దాంతో అన్ని రంగాలకు చెందిన కంపెనీల హెచ్ఆర్ విభాగంలో ‘సోషల్ రిక్రూట్మెంట్’ కొత్తగా చోటు సంపాదించుకుంది. కంపెనీలో ప్రస్తుత ఖాళీల వివరాలను తెలియజేస్తూ, అర్హతలు, కావల్సిన నైపుణ్యాలు, తదితర వివరాలను పోస్ట్ చేస్తున్నారుు. పెరిగిన ప్రాధాన్యం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌ను ఫాలో కావడం లో యువత వెచ్చిస్తున్న సమయం కూడా కం పెనీలు సోషల్ నెట్వర్కింగ్ మాధ్యమం ద్వా రా నియామకాలు చేపట్టడానికి కారణమవుతుంది. దీనికి ఉన్న విస్తృత పరిధి, వేగంగా కమ్యూనికేట్ చేయడం, ప్రభావం దృష్ట్యా ప్రతి కంపెనీ సోషల్ రిక్రూటింగ్‌కు ప్రాధాన్యతనిస్తుంది. కావల్సిన ఉద్యోగుల కోసం ముందు గా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోని అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తాయి. ఈ క్రవుంలో తమ అవసరాలకు సరిపడా నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను వెంటనే సంప్రదిస్తున్నాయి. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాన్వేషణలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇందులో ఉండే దశలను జాగ్రత్తగా పూర్తి చేయాలి. అవి.. ప్రొఫైల్: ముందుగా ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లను గుర్తించాలి. తర్వాత వాటిల్లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఫొటో, అర్హతలు, నైపుణ్యాలు, కెరీర్, లక్ష్యాలు, గత అనుభవం తదితర వివరాలతో ప్రొఫైల్ రూపొందించాలి. మరో కీలకాంశం.. ప్రొఫైల్ హెడ్లైన్. మీ నేపథ్యాన్ని ఒక వాక్యంలో స్పష్టం చేసేది హెడ్లైన్. ప్రొఫైల్ టెంప్లెట్ కార్టూన్లు లేదా ఇతర డిజైన్లతో గందరగోళంగా కాకుండా వైట్ బ్యాక్‌గ్రౌండ్ వంటి సాదాసీదాగా ఉండే టెంప్లెట్‌ను ఎంచుకోవాలి. భిన్నంగా: ప్రొఫైల్‌పైనే ఆధారపడకుండా కంపెనీలను ఆకర్షించే విధంగా వెబ్బేస్డ్ రెజ్యుమెను రూపకల్పన చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ప్రొఫైల్ లేదా సీవీని రూపొందించి దానికి సంబంధించిన లింక్‌ను ప్రొఫైల్‌లో పొందుపరచాలి. తద్వారా ఎంప్లాయర్స్ మీ ప్రొఫైల్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించేఅవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే.. సొంత బ్లాగ్/వెబ్‌సైట్‌ను ప్రారంభించండి. సోషల్ మీడియాలో వాటి లింక్స్‌ను పోస్ట్ చేయాలి. సంప్రదాయ రెజ్యుమె స్థానంలో..సోషల్ మీడియాలో ప్రొఫైల్, ఆన్లైన్ రెజ్యుమె, వీడియో రెజ్యుమె, బ్లాగ్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి సృజనాత్మకతతో కూడిన వెబ్ బేస్డ్ రెజ్యుమెలను పరిగణనలోకి తీసుకునే కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థిలో వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ, సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎంత ప్రభావవంతంగా సృజనాత్మకంగా వినియోగించుకుంటున్నారనే అంశాలను తెలుసుకునేందుకు కూడా ఈ వెబ్ బేస్డ్ రెజ్యుమె ఉయోగపడుతుందని సంబంధిత నిపుణులు అభిప్రాయం. ప్రభావవంతంగా: మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియా టూల్స్‌ను ప్రభావవంతంగా విని యోగించుకోవాలి. పనిచేయాలనుకుంటున్న రంగానికి సంబంధించిన సంస్థ.. తెలుసుకునే విధంగా మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవాలి. ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడం, జాయినింగ్ ద గ్రూప్స్, ఫాలోయింగ్ కంపెనీ వంటి పనులను ఒకేరోజులో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారం వీటిని చేస్తూండాలి. ప్రొఫైల్ చూసిన వెంటనే నిజాయితీ, ప్రొఫెషనలిజం ప్రస్ఫుటమవ్వాలి. కొన్ని సోషల్ నెట్వర్క్స్ www.facebook.com https://in.linkedin.com https://plus.google.com www.skillpages.com https://myspace.com https://twitter.com గమనించాల్సినవి వేర్వేరు నెట్వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు.. అన్నిట్లోనూ ఒకే రకమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి. ప్రొఫైల్ చూసిన వెంటనే నిజాయితీ, ప్రొఫెషనలిజం ప్రస్ఫుటమవ్వాలి. పోస్టింగ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అన్నిటినీ యాక్సెప్ట్ చేయకుండా.. మనకు బాగా తెలిసిన వారివే స్వీకరించడం ఉత్తమం. ఆన్లైన్ ప్రొఫైల్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌ను నిర్వహించడం మంచిది. కంపెనీల ప్రాధాన్యతకు కారణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉండడం. ఆన్లైన్ టెక్నాలజీలపై అవగాహన ఉన్న యువతను సులువుగా గుర్తించడానికి తోడ్పడుతుంది. నియామక ప్రక్రియ(హైరింగ్ ప్రాసెస్), కమ్యూనికేషన్లో సమయాన్ని ఆదా చేయవచ్చు. సంప్రదాయ నియామక విధానంతో పోల్చితే ఈ మాధ్యమం ద్వారా ఖర్చు తగ్గుతుంది. కంపెనీలు తమ ఎంప్లాయిమెంట్ బ్రాండ్‌ను పెంచుకోవచ్చు. -
హైదరాబాద్‌లో 24% పెరిగిన హైరింగ్
- ఆగస్టు వివరాలను వెల్లడించిన నౌకరీడాట్‌కామ్ న్యూఢిల్లీ: హైరింగ్(ఉద్యోగాలిచ్చే) ప్రక్రియ ఆగస్టులో 13 శాతం పెరిగిందని నౌకరీడాట్‌కామ్ జాబ్ పోర్టల్ తెలిపింది. రానున్న నెలల్లో హైరింగ్ మరింత జోరుగా ఉండగలదని పేర్కొంది. మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా హైరింగ్ ఉందని వివరించింది. ఆగస్టులో హైరింగ్‌కు సంబంధించి ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... - ఆగస్టులో బ్యాంక్, ఆర్థిక సేవల రంగాల్లో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. ఈ రెండు రంగాల తర్వాత ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, సాఫ్ట్వేర్, టెలికం, మీడియా, వినోద రంగాల్లో ఉద్యోగాలొచ్చాయి. - వాహన, విడిభాగాల రంగాల్లో హైరింగ్ నిలకడగా ఉండగా, బీమా రంగంలో మాత్రం ఒకింత తగ్గింది. - మెట్రో నగరాల్లో హైరింగ్ పెరిగింది. హైదరాబాద్‌లో 24 శాతం వృద్ధి చెందింది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ముంబై(19 శాతం), పుణే(15 శాతం), బెంగళూరు(13 శాతం), చెన్నై(10 శాతం), ఢిల్లీ(10 శాతం) నిలిచాయి. కోల్‌కతాలో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. - గత ఏడాది ఆగస్టుతో పోల్చితే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఈ ఏడాది ఆగస్టులో 13 శాతం వృద్ధి చెంది 1,655కు పెరిగింది. - ఏప్రిల్ నుంచి చూస్తే జాబ్ మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది.