ట్రెండ్ సెట్ చేస్తున్న సోషల్ మీడియా
ఒకప్పుడు ఉద్యోగాన్వేషణలో జాబ్ పోర్టల్స్ పాత్ర ప్రముఖంగా ఉండేది.. కానీ నేటి నెట్‌వర్కింగ్ యుగంలో నయా ట్రెండ్.. జాబ్ సెర్చ్ వయా సోషల్ నెట్‌వర్కింగ్. సోషల్ మీడియా ప్రవేశంతో ఉద్యోగాన్వేషణ కొత్త పుంతలు తొక్కుతోంది.. జాబ్ మార్కెట్‌లోని విస్తృత అవకాశాలను అభ్యర్థుల ముంగిట నిలుపుతోంది. ప్రతి కంపెనీ సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఖాతాను నిర్వహిస్తుండడం, యువతలో ఎక్కువ మంది సోషల్ వర్కింగ్ సైట్స్‌ను అనుసరిస్తుండడం (ఫాలో) కూడా కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో సోషల్ మీడియా పాత్రపై స్పెషల్ ఫోకస్...
పర్సనల్ టు ప్రొఫెషనల్
సోషల్ మీడియా పరిధి విస్తృతం. గత కొంత కాలంగా వ్యక్తిగత ఆసక్తి నుంచి వృత్తి మాధ్యమానికి వేదికగా మారింది. అన్ని కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహంలో సోషల్ నెట్‌వర్కింగ్‌ను తప్పనిసరి అంశంగా భావిస్తున్నా యి. తమ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియూలో పోస్ట్ చేస్తున్నాయి. నియామక ప్రక్రియలను కూడా ఈ మాధ్యమం ద్వారానే నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నాయి. స్వల్ప సమయంలో తక్కువ ఖర్చుతో ప్రతిభావంతులను ఆకర్షించే సులువైన మాధ్య మం సోషల్ మీడియా అని కంపెనీలు భావిస్తున్నాయి. దాంతో అన్ని రంగాలకు చెందిన కంపెనీల హెచ్‌ఆర్ విభాగంలో ‘సోషల్ రిక్రూట్‌మెంట్’ కొత్తగా చోటు సంపాదించుకుంది. కంపెనీలో ప్రస్తుత ఖాళీల వివరాలను తెలియజేస్తూ, అర్హతలు, కావల్సిన నైపుణ్యాలు, తదితర వివరాలను పోస్ట్ చేస్తున్నారుు.
పెరిగిన ప్రాధాన్యం
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను ఫాలో కావడం లో యువత వెచ్చిస్తున్న సమయం కూడా కం పెనీలు సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమం ద్వా రా నియామకాలు చేపట్టడానికి కారణమవుతుంది. దీనికి ఉన్న విస్తృత పరిధి, వేగంగా కమ్యూనికేట్ చేయడం, ప్రభావం దృష్ట్యా ప్రతి కంపెనీ సోషల్ రిక్రూటింగ్‌కు ప్రాధాన్యతనిస్తుంది. కావల్సిన ఉద్యోగుల కోసం ముందు గా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోని అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తాయి. ఈ క్రవుంలో తమ అవసరాలకు సరిపడా నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను వెంటనే సంప్రదిస్తున్నాయి.
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల ద్వారా ఉద్యోగాన్వేషణలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇందులో ఉండే దశలను జాగ్రత్తగా పూర్తి చేయాలి. అవి..
ప్రొఫైల్:
ముందుగా ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లను గుర్తించాలి. తర్వాత వాటిల్లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఫొటో, అర్హతలు, నైపుణ్యాలు, కెరీర్, లక్ష్యాలు, గత అనుభవం తదితర వివరాలతో ప్రొఫైల్ రూపొందించాలి. మరో కీలకాంశం.. ప్రొఫైల్ హెడ్‌లైన్. మీ నేపథ్యాన్ని ఒక వాక్యంలో స్పష్టం చేసేది హెడ్‌లైన్. ప్రొఫైల్ టెంప్‌లెట్ కార్టూన్లు లేదా ఇతర డిజైన్లతో గందరగోళంగా కాకుండా వైట్ బ్యాక్‌గ్రౌండ్ వంటి సాదాసీదాగా ఉండే టెంప్‌లెట్‌ను ఎంచుకోవాలి.
భిన్నంగా:
ప్రొఫైల్‌పైనే ఆధారపడకుండా కంపెనీలను ఆకర్షించే విధంగా వెబ్‌బేస్డ్ రెజ్యుమెను రూపకల్పన చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ప్రొఫైల్ లేదా సీవీని రూపొందించి దానికి సంబంధించిన లింక్‌ను ప్రొఫైల్‌లో పొందుపరచాలి. తద్వారా ఎంప్లాయర్స్ మీ ప్రొఫైల్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించేఅవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే.. సొంత బ్లాగ్/వెబ్‌సైట్‌ను ప్రారంభించండి. సోషల్ మీడియాలో వాటి లింక్స్‌ను పోస్ట్ చేయాలి. సంప్రదాయ రెజ్యుమె స్థానంలో..సోషల్ మీడియాలో ప్రొఫైల్, ఆన్‌లైన్ రెజ్యుమె, వీడియో రెజ్యుమె, బ్లాగ్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి సృజనాత్మకతతో కూడిన వెబ్ బేస్డ్ రెజ్యుమెలను పరిగణనలోకి తీసుకునే కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థిలో వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ, సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎంత ప్రభావవంతంగా సృజనాత్మకంగా వినియోగించుకుంటున్నారనే అంశాలను తెలుసుకునేందుకు కూడా ఈ వెబ్ బేస్డ్ రెజ్యుమె ఉయోగపడుతుందని సంబంధిత నిపుణులు అభిప్రాయం.
ప్రభావవంతంగా:
మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియా టూల్స్‌ను ప్రభావవంతంగా విని యోగించుకోవాలి. పనిచేయాలనుకుంటున్న రంగానికి సంబంధించిన సంస్థ.. తెలుసుకునే విధంగా మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవాలి. ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడం, జాయినింగ్ ద గ్రూప్స్, ఫాలోయింగ్ కంపెనీ వంటి పనులను ఒకేరోజులో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారం వీటిని చేస్తూండాలి. ప్రొఫైల్ చూసిన వెంటనే నిజాయితీ, ప్రొఫెషనలిజం ప్రస్ఫుటమవ్వాలి.
కొన్ని సోషల్ నెట్‌వర్క్స్
www.facebook.com
https://in.linkedin.com
https://plus.google.com
www.skillpages.com
https://myspace.com
https://twitter.com
గమనించాల్సినవి
- వేర్వేరు నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు.. అన్నిట్లోనూ ఒకే రకమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.
- ప్రొఫైల్ చూసిన వెంటనే నిజాయితీ, ప్రొఫెషనలిజం ప్రస్ఫుటమవ్వాలి.
- పోస్టింగ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అన్నిటినీ యాక్సెప్ట్ చేయకుండా.. మనకు బాగా తెలిసిన వారివే స్వీకరించడం ఉత్తమం.
- ఆన్‌లైన్ ప్రొఫైల్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌ను నిర్వహించడం మంచిది.
కంపెనీల ప్రాధాన్యతకు కారణం
- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉండడం.
- ఆన్‌లైన్ టెక్నాలజీలపై అవగాహన ఉన్న యువతను సులువుగా గుర్తించడానికి తోడ్పడుతుంది.
- నియామక ప్రక్రియ(హైరింగ్ ప్రాసెస్), కమ్యూనికేషన్‌లో సమయాన్ని ఆదా చేయవచ్చు.
- సంప్రదాయ నియామక విధానంతో పోల్చితే ఈ మాధ్యమం ద్వారా ఖర్చు తగ్గుతుంది.
- కంపెనీలు తమ ఎంప్లాయిమెంట్ బ్రాండ్‌ను పెంచుకోవచ్చు.