హైదరాబాద్‌లో 24% పెరిగిన హైరింగ్ | Increased hiring in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 24% పెరిగిన హైరింగ్

Published Tue, Sep 22 2015 1:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

హైదరాబాద్‌లో 24% పెరిగిన హైరింగ్ - Sakshi

హైదరాబాద్‌లో 24% పెరిగిన హైరింగ్

- ఆగస్టు వివరాలను వెల్లడించిన నౌకరీడాట్‌కామ్
న్యూఢిల్లీ:
హైరింగ్(ఉద్యోగాలిచ్చే) ప్రక్రియ ఆగస్టులో 13 శాతం పెరిగిందని నౌకరీడాట్‌కామ్ జాబ్ పోర్టల్ తెలిపింది. రానున్న నెలల్లో హైరింగ్ మరింత జోరుగా ఉండగలదని పేర్కొంది. మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా హైరింగ్ ఉందని వివరించింది.  ఆగస్టులో హైరింగ్‌కు సంబంధించి ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...

- ఆగస్టులో బ్యాంక్, ఆర్థిక సేవల రంగాల్లో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. ఈ రెండు రంగాల తర్వాత ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, సాఫ్ట్‌వేర్, టెలికం, మీడియా, వినోద రంగాల్లో ఉద్యోగాలొచ్చాయి.
- వాహన, విడిభాగాల రంగాల్లో హైరింగ్ నిలకడగా ఉండగా, బీమా రంగంలో మాత్రం ఒకింత తగ్గింది.
- మెట్రో నగరాల్లో హైరింగ్ పెరిగింది.  హైదరాబాద్‌లో 24 శాతం వృద్ధి చెందింది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ముంబై(19 శాతం), పుణే(15 శాతం), బెంగళూరు(13 శాతం), చెన్నై(10 శాతం), ఢిల్లీ(10 శాతం) నిలిచాయి. కోల్‌కతాలో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు.
- గత ఏడాది ఆగస్టుతో పోల్చితే  నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఈ ఏడాది ఆగస్టులో 13 శాతం వృద్ధి చెంది 1,655కు పెరిగింది.
- ఏప్రిల్ నుంచి చూస్తే జాబ్ మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement