- ఎమ్మెల్సీ రాములునాయక్
నారాయణఖేడ్ రూరల్ (మెదక్ జిల్లా): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ రాములునాయక్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కాకతీయ, వాగ్దేవి పాఠశాలల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఎమ్మెల్సీ రాములునాయక్ మెదక్ డిఎస్పీ రాజారత్నంతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాములునాయక్ మాట్లాడుతూ ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత కానిస్టేబుల్, ఎస్‌ఐతోపాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవకాశం ఉందన్నారు.