Job seekers
-
మేధావులకు ప్రశ్న.. చెబితే జాబ్: సీఈఓ పోస్ట్ వైరల్
తెలివితేటలను, ఆలోచనా శక్తిని పెంచుకోవడానికి చాలామంది చదరంగం, పదవినోదం వంటివి ఆడుతారు. అయితే ఇటీవల కాలంలో దీనికోసం బ్రెయిన్ టీజర్లు విరివిగా అందుబాటులోకి వచ్చేసాయి. ఇలాంటివి చూడటానికి గమ్మత్తుగా ఉన్నప్పటికీ.. లోతుగా ఆలోచింపజేస్తాయి. ఈ కోవకు చెందిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది.జెనెసిస్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ 'డినో డియోన్' ఈ పోస్ట్ చేస్తూ.. ఉద్యోగం కావాలంటే దీనికి మూడు సెకన్లలో సరైన సమాధానం చెప్పాలి, అని పేర్కొన్నారు. దీనికి సమాధానం నా ఆరేళ్ళ పిల్లాడు 30 సెకన్లలో చెప్పినట్లు వెల్లడించారు.డినో డియోన్ షేర్ చేసిన పోస్టులో 3x3-3/3+3 అని ఉంది. ఇది కేవలం మేధావులకు మాత్రమే అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వేల లైక్స్ పొందిన ఈ పోస్టుకు.. భారీ సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్లలో.. దీనిని మూడు సెకన్లలో ఎలా చెప్పగలం అని కొందరు చెబితే.. మరికొందరు మూడు సెకన్లలో ఆలోచించడానికి ప్రయత్నించవచ్చని అన్నారు. ఇంకొందరు దీనికి సమాధానం తొమ్మిది అని వెల్లడించారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సమాధానాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. -
చాట్‌జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం సంపాదించడం కష్టమైపోతోంది. ఒకప్పుడు ఉద్యోగానికి అప్లై చేయాలంటే చదువు, నైపుణ్యాలు వంటివన్నీ చేర్చి రెజ్యూమ్ (సీవీ) క్రియేట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి కూడా చాట్‌జీపీటీ వాడేస్తున్నారు. ఇలా చాట్‌జీపీటీ సాయంతో రూపొందిన రెస్యూమ్ చూసి ఇటీవల ఓ కంపెనీ సీఈఓ ఖంగుతిన్నారు.ఢిల్లీలోని ఎంట్రేజ్ కంపెనీ సీఈఓ 'అనన్య నారంగ్'.. ఒక ఉద్యోగానికి వచ్చిన సీవీ చూసారు. అది చాట్‌జీపీటీ ద్వారా రూపొందించినట్లు తెలిసింది. చాట్‌జీపీటీ ద్వారా సీవీ క్రియేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అందులో అన్నీ వివరణాత్మకంగా లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది.నిజానికి నువ్వు అడిగే ప్రశ్నకు తగినట్లుగా చాట్‌జీపీటీ ఓ సమాధానం ఇస్తుంది. అందులో కొన్ని మనమే పూరించాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థి చాట్‌జీపీటీ ఇచ్చిన సీవీను నేరుగా కంపెనీకి పంపించారు. అందులో పూరించాల్సిన విషయాలు కూడా అలాగే వదిలిపెట్టేసారు.ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!ఎక్స్పీరియన్స్ కాలమ్ దగ్గర ఉదాహరణ అని ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను అనన్య నారంగ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇటీవల ఉద్యోగ దరఖాస్తును స్వీకరించారు. ఈరోజు మనకు నిరుద్యోగం ఎక్కువైందంటే ఆశ్చర్యం లేదు అని పేర్కొన్నారు.అనన్య నారంగ్ షేర్ చేసిన ఈ సీవీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్‌షాట్ చూస్తుంటే అభ్యర్థి సీవీను చదవకుండా.. కాపీ పేస్ట్ చేసినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత సమాచారానికి బదులుగా టెంప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. చాట్‌జీపీటీ వచ్చిన తరువాత ఇలాంటి సీవీలు సర్వ సాధారణం అయిపోయాయని కొందరు చెబతున్నారు.Just received yet another job application. No wonder we have so much unemployment today :’) pic.twitter.com/c0VaGWYrIJ— Ananya Narang (@AnanyaNarang_) October 15, 2024 -
39 లక్షల జాబ్స్.. ఉద్యోగార్థులకు పండగే!
కొత్త సంవత్సరంలో జాబ్స్ కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు పండగ లాంటి వార్త ఇది. వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లో దేశవ్యాప్తంగా పలు రంగాల్లో 39 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. స్థూల ఆర్థికపరమైన ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ 2024 ప్రథమార్థంలో భారతదేశంలో 3.9 మిలియన్ల ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని సాస్(SaaS), ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ బెటర్‌ప్లేస్ (BetterPlace) తమ సంవత్సరాంతపు నివేదికలో పేర్కొంది. ఈ పరిశ్రమల నుంచే అత్యధికం ఒక మిలియన్ డేటా పాయింట్లను విశ్లేషించిన బెటర్‌ప్లేస్ నివేదిక.. మొత్తం డిమాండ్‌లో 50 శాతం లాజిస్టిక్స్, మొబిలిటీ పరిశ్రమల నుంచే ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ-కామర్స్, ఐఎఫ్ఎం, ఐటీ పరిశ్రమలు వరుసగా 27 శాతం, 13.7 శాతంతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం నుంచి 0.87 శాతం, రిటైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(QSR) నుంచి 1.96 శాతం డిమాండ్ కొనసాగుతుందని నివేదిక విశ్లేషించింది. ఇదీ చదవండి: అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు! -
ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన..
ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైనది రెజ్యూమ్. ఇది ఎంత ఆకట్టుకునేలా ఉంటే జాజ్ వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే మంచి జాబ్ సాధించాలంటే ఒక్క రెజ్యూమ్ సరిపోదంటున్నారు ఐఐటీయన్, ఢిల్లీకి చెందిన స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్. విభిన్నమైన జాబ్లకు విభిన్న రెజ్యూమ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ.. ఢిల్లీ ఐఐటీలో ప్లేస్మెంట్ల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని, విభిన్న రెజ్యూమ్‌లతో తనకు కలిగిన ప్రయోజనాన్ని స్మార్ట్బుక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్ ట్విటర్ ద్వారా ఉద్యోగార్థులకు తెలియజేశారు. ఇదీ చదవండి ➤ లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? ఐఐటీలో ఇంటర్న్‌షిప్, ప్లేస్మెంట్ సందర్భంగా వివిధ కంపెనీలు, జాబ్లకు విభిన్న వెర్షన్ల రెజ్యూమ్‌లను రూపొందించుకోవాలని తమకు చెప్పేవారని పేర్కొన్నారు. మీరు కన్సల్టింగ్ జాబ్లకు దరఖాస్తు చేస్తున్నట్లయితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి, అదే డెవలప్మెంట్కు సంబంధించిన జాబ్‌ల కోసమైతే మీ డెవలప్మెంట్ నైపుణ్యాలను చూపించే ప్రాజెక్ట్‌ల గురించి రెజ్యూమ్‌లలో వైవిధ్యంగా పేర్కొనాలని సూచించారు. విభిన్న రెజ్యూమ్‌లలో ప్రతి అంశమూ విభిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు. కీలకమైన అంశాన్ని విభిన్నంగా పేర్కొంటే సరిపోతుందని ఆయన సూచిస్తున్నారు. తమ ఐఐటీలో అలా విద్యార్థులకు అలా సూచించేవారని, మిగిలిన ఐఐటీలు తమ విద్యార్థులకు అలాంటి సలహా ఇచ్చాయో లేదో తనకు కచ్చితంగా తెలియదని సౌరభ్‌కుమార్ అన్నారు. కాగా సౌరభ్‌కుమార్ సూచనలతో పలువురు యూజర్లు ఏకీభవిస్తూ కామెంట్లు చేశారు. In IIT during internship/placement season we were often told to keep multiple versions of our resume Different resume for different kind of company or role you’re applying for For instance, having different resumes for different roles such as Dev based roles Quant based… — Saurabh Kumar (@drummatick) July 16, 2023 -
ప్రస్తుత జాబ్‌లోనే కొనసాగుతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలతోపాటు ఉద్యోగార్ధులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక ప్రకారం.. ఇంటర్వ్యూలో పాల్గొన్న 47 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాదిలో ఉద్యోగాలు మారడానికి ఇష్టపడడం లేదు. అంటే తాము పనిచేస్తున్న సంస్థలోనే కొనసాగాలని నిర్ణయించారన్న మాట. 37 శాతం మంది 2023లో తమ కెరీర్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. కంపెనీలు ఇప్పుడు ఈ నిపుణులను నిలుపుకోవడానికి, ఆకర్షిస్తూ ఉండే మార్గాలను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. వాల్యూవాక్స్ 2023 జనవరి–ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో వివిధ రంగాలకు చెందిన 1,157 కంపెనీలు, 1,583 ఉద్యోగార్థులు పాలుపంచుకున్నారు. ‘బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయి. ఈ విభాగాల్లో బలమైన భవిష్యత్ కనిపిస్తోంది. బీఎఫ్ఎస్ఐలో 71 శాతం, ఆరోగ్య సేవల్లో 64, నిర్మాణం, రియల్టీ 57, మీడియా, వినోదం 49, తయారీ 39, ఐటీ, ఐటీఈఎస్ 29 శాతం కంపెనీలు కొత్త వారిని చేర్చుకుంటున్నాయి. కొత్తగా జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య అక్టోబర్–డిసెంబర్‌తో పోలిస్తే 16 నుంచి 23 శాతానికి ఎగబాకింది. తాత్కాలిక ఉద్యోగులను పెద్దగా ఆమోదించడం కూడా ఈ ఏడాది జాబ్ మార్కెట్‌ను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు’ అని నివేదిక వివరించింది. -
ఉద్యోగార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యోగార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యుఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యుఎస్‌కు ఐదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లో ఈ డబ్ల్యు ఎస్ వర్గాలు మేలు పొందనున్నాయి. -
మ్యాడ్స్కిల్స్కు మహర్దశ.. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే?
మీరు కబడ్డీలో మేటి కావచ్చు. సంగీతంలో ఘనాపాఠీ కావచ్చు. సాహసాలు చేయడంలో ‘వారెవా’ అనిపించవచ్చు... అయితే ఇవి మీ అభిరుచి, ఆసక్తికి మాత్రమే పరిమితం కావడం లేదు. మీరు మంచి ఉద్యోగంలో ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించే శక్తులు అవుతున్నాయి. కాలంతో పాటు ఉద్యోగ ఎంపిక ప్రమాణాలలో కూడా మార్పు వస్తోంది. ఉద్యోగం రావడానికి ఉపకరించే హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ విభాగాలకు ఇప్పుడు మూడో విభాగం కూడా తోడైంది. అదే... మ్యాడ్ స్కిల్స్. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే? ఉద్యోగప్రయత్నాలు చేసేవారి రెజ్యూమ్ లేదా సీవీలలో హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ అని రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది జ్ఞానాన్ని సర్టిఫికెట్లతో తూచే విషయం. రెండోది మార్కులు, ర్యాంకులతో పాటు నైపుణ్యబలాన్ని అంచనావేయడం. ఇప్పుడు ఈ రెండు విభాగాలతో పాటు ‘మ్యాడ్ స్కిల్స్’ అనే మూడో విభాగం కూడా తోడైంది. మ్యాడ్ స్కిల్స్ అనగానే వ్యంగ్యం, వ్యతిరేకత ధ్వనించవచ్చుగానీ... ఇక్కడ మ్యాడ్ స్కిల్స్ అంటే ‘పనికిరాని వృథా స్కిల్స్’ అని అర్థం కాదు. ఉద్యోగుల ఎంపికకు సంబంధించి కంపెనీల నిర్ణయాలలో ‘మ్యాడ్ స్కిల్స్’ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ కంటే ‘మ్యాడ్ స్కిల్స్’ను అరుదైన, అవసరమైన స్కిల్స్గా భావిస్తున్నాయి కంపెనీలు. ఒక మేనేజర్ పోస్ట్ ఎంపికలో అభ్యర్ధి అభిరుచులపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది గతంలో అంతగా లేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం అది ఒక అనివార్యమైన విషయం అయింది. రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌లు రెజ్యూమ్‌లోని ‘హాబీస్ అండ్ ట్రావెల్స్’ స్పేస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ‘మ్యాడ్ స్కిల్స్’ను కంపెనీలు తమ ప్రత్యేక ఆస్తిగా భావించుకోవడానికి కారణం అవి క్రియేటివ్ స్కిల్స్ రూపంలో తమ కంపెనీకి తోడ్పడతాయనే నమ్మకం. ఉదాహరణకు కీర్తి అనే అమ్మాయి ఒక కంపెనీలో ఏదో ఉద్యోగానికి అప్లై చేసింది అనుకుందాం. కీర్తికి ‘ట్రెక్కింగ్’ హాబీ ఉంది. అయితే ఉద్యోగ ఎంపికలో అది ఆమె వ్యక్తిగత అభిరుచికి సంబధించిన గుర్తింపుకే పరిమితం కావడం లేదు. ఈ అభిరుచి ద్వారా కంపెనీలు తన వ్యక్తిత్వాన్ని అంచనావేయడానికి ఉపయోగపడుతుంది. ‘కొత్త ప్రదేశాలలో సర్దుకుపోగలదు’ ‘సవాళ్లను స్వీకరించగలదు’ ‘అందరితో కలిసిపోయే స్వభావం ఉంది’.. ఇలా కీర్తి గురించి కొన్ని అంచనాలకు రావడానికి వీలవుతుంది. ‘ఒక మేనేజర్ పోస్ట్‌కు పదిమంది వ్యక్తులు పోటీ పడితే, అందరి బలాలు సమానంగా ఉన్నాయనుకున్నప్పుడు మ్యాడ్ స్కిల్స్ కీలకం అవుతాయి. అభిరుచుల ఆధారంగా వ్యక్తిత్వంపై ఒక అంచనాకు రావడానికి ఇవి తోడ్పడతాయి. విభిన్నమైన అభిరుచులు, నైపుణ్యాలు, బలమైన వ్యక్తిత్వం, పర్సనల్ ప్రాజెక్ట్‌లకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి’ అంటుంది ‘యూ విల్ బీ ఏ మేనేజర్ మై సన్’ పుస్తక రచయిత్రి సాండ్రిన్. ఆటలు (ఫుట్‌బాల్ నుంచి చెస్ బాక్సింగ్ వరకు), ఆర్టిస్టిక్ యాక్టివిటీస్(రచనలు చేయడం నుంచి పాటలు పాడడం వరకు), ప్రధాన స్రవంతికి భిన్నంగా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం ... ఇలా ఎన్నో మ్యాడ్‌స్కిల్స్ (యూనిక్ క్రియేటివ్ స్కిల్స్) విభాగంలోకి వస్తాయి. ‘జాబ్ ఔట్లుక్ 2022’ సర్వే ప్రకారం ఉద్యోగ ఎంపికలో బడా కంపెనీలు ప్రాబ్లమ్ సాల్వింగ్–స్కిల్స్, ‘ ఇది మాత్రమే నా పని’ అని కాకుండా ఇతరత్రా విషయాలలో ‘చొరవ’ చూపించే నైపుణ్యం, రచన, కమ్యూనికేషన్ స్కిల్స్... మొదలైవాటికి అగ్రస్థానం ఇస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన వేర్లు ‘మ్యాడ్ స్కిల్స్’లోనే ఉన్నాయి! అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రతిధ్వనించిన ఎక్స్ప్రెషన్ మ్యాడ్ స్కిల్స్. సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు ఉద్యోగ ఎంపికలో మ్యాడ్ స్కిల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పుడు యూరప్‌లో కూడా ఉద్యోగ ఎంపికలో ‘మ్యాడ్ స్కిల్స్’ ట్రెండ్‌గా మారింది. ‘మంచి మార్కులు, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరిౖయెన సమాధానాలు చెప్పడం అనేవి ఉద్యోగ ఎంపికలో కీలక పాత్ర పోషించినప్పటికీ, మ్యాడ్‌స్కిల్స్ ప్రాధాన్యత వేరు. కంపెనీ అభివృద్ధి చెందాలంటే భిన్నంగా ఆలోచించేవారు ఉండాలి. వారి నుంచే కంపెనీ అభివృద్ధికి అవసరమైన సృజనాత్మక ఐడియాలు వస్తాయి. హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ద్వారా అభ్యర్థిని సులభంగా అంచనా వేయవచ్చు. అయితే మ్యాడ్‌స్కిల్స్ ద్వారా అది అంత సులభం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు’ అంటున్నారు విశ్లేషకులు. ‘సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నాకు ఇష్టం. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి సేవాకార్యక్రమాలు కూడా కీలక పాత్ర వహిస్తున్నాయి అనే విషయం తెలిశాక సంతోషం వేసింది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్. (క్లిక్ చేయండి: వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?) -
రైల్వే ఉద్యోగం..8 గంటల డ్యూటీ, వచ్చే పోయే రైళ్లను లెక్కించడమే పని!
Railway Recruitment Scam: ప్రైవేట్ ఉద్యోగంలో ఆర్ధిక మాంద్యం భయాలు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామంటే బోలెడంత కాంపిటీషన్. అయినా సరే కాలంతో పోటీ పడుతూ కోరుకున్న జాబ్‌ను దక్కించుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఆ కోచింగ్, ఈ ఈవెంట్లు అంటూ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఆ అవసరాన్నే క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తమిళనాడుకు చెందిన 28 మంది యువకులకు రైల్వే శాఖలో ఉద్యోగం. ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్(టీటీఈ), ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్ విభాగాల్లో జాబ్ డిజిగ్నేషన్ కోసం ఈ ఏడాది జూన్ - జులై నెలలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ ఏంటో తెలుసా? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆయా ప్లాట్‌ఫామ్‌లలో నెలకు ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నాయి. ఎన్ని రైళ్లు వస్తున్నాయో లెక్కపెట్టడమే. ఇందుకోసం ఆ యువకులు ఒక్కొక్కరు రూ.2లక్షల నుంచి రూ.24 లక్షల వరకు..మొత్తంగా రూ.2.67 కోట్లు చెల్లించారు. పాపం సుబ్బుసామి తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన సుబ్బుసామి మాజీ సైనికుడు. మంచి వ్యక్తి. తన ఊరిలో, లేదంటే తనకు తెలిసిన యువకులకు ఉపాధి కల్పించాలని నిత్యం ఆరాటపడుతుంటారు. ఈ తరుణంలో సుబ్బుసామి పనిమీద ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌కు వెళ్లగా.. అక్కడ కోయంబత్తూరు నివాసి శివరామన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తనకు ఎంపీలు, మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, డబ్బులు చెల్లిస్తే నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగం వచ్చేలా చేస్తానని శివరామన్.. సుబ్బుసామిని నమ్మించాడు. రూ.2.67 కోట్లు వసూలు అతని మాటలు నమ్మిన సుబ్బుసామి ముగ్గురు నిరుద్యోగుల్ని శివరామన్‌కు ఫోన్లో పరిచయం చేయించాడు. ఉద్యోగం కావాలంటే ఢిల్లీకి రావాల్సిందేనని ఆదేశించాడు. ఇలా ముగ్గురు నిరుద్యోగులు కాస్తా.. 25మంది అయ్యారు. దీంతో నిందితుడు తాను వేసిన మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా బాధితుల్ని ఢిల్లీకి రప్పించాడు. అక్కడ అభ్యర్ధులకు వికాస్ రాణా’తో మాట్లాడించాడు. ఉద్యోగం, ట్రైనింగ్, మెటీరియల్, ఆఫర్‌లెటర్, జాబ్ డిజిగ్నేషన్ ఏంటో క్లుప్తంగా వివరించిన రాణా.. వారి వద్ద నుంచి రూ.2.67 కోట్ల వరకు వసూలు చేశాడు. వచ్చే, పోయే రైళ్లను లెక్కేయడమే ఉద్యోగం అనంతరం డబ్బులు తీసుకున్న కేటుగాళ్లు అభ్యర్ధులకు రైల్వే సెంట్రల్ హాస్పిటల్, కన్నాట్ ప్లేస్‌లో వైద్య పరీక్షల కోసం పిలిపించారు. ఆపై ఉత్తర రైల్వేలోని జూనియర్ ఇంజనీర్, శంకర్ మార్కెట్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. ఒక నెల ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్‌లో రోజుకి 8 గంటల పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్లో వచ్చే, పోయే రైళ్లు, రైళ్లకు ఉన్న భోగీలు లెక్కించారు. ట్రైనింగ్ కూడా పూర్తయింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం వికాస్ రాణా వారికి ఆఫర్ లెటర్లు అందించాడు. ఆ ఆఫర్ లెటర్లు తీసుకొని న్యూ ఢిల్లీ రైల్వే శాఖ అధికారుల్ని ఆశ్రయించడంతో ఈ ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. నిందితులు చేతుల్లో మోసపోయామని భావించిన అభ్యర్ధులు న్యాయం చేయాలని పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బుసామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సుబ్బు సామి యువకుల్ని మోసం చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఈ జాబ్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు. వికాస్ రాణా పచ్చి మోసగాడు డబ్బు వసూలు కోసం వికాస్ రాణా ఎప్పుడూ తమను బయట కలుస్తుంటాడని, ఏ రైల్వే భవనంలోకి తీసుకెళ్లలేదని బాధితులు చెబుతున్నారు. శిక్షణకు సంబంధించిన ఆర్డర్లు, గుర్తింపు కార్డులు, శిక్షణ పూర్తయిన సర్టిఫికెట్లు, అపాయింట్మెంట్ లెటర్లు వంటి అన్ని పత్రాలను రైల్వే అధికారులతో క్రాస్ వెరిఫై చేయగా నకిలీవని తేలిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. -
కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి గుడ్ న్యూస్. లక్షల ఉద్యోగాలు భర్తీకి కెనడా రారమ్మని ఆహ్వానిస్తోంది. కెనడాలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత పెరగొచ్చని తాజా సర్వే వెల్లడించింది. దేశంలో పెద్దవాళ్లు ఎక్కువగా ఉండటం, ఎక్కువమంది రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నకారణంగా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో కెనడా ప్రస్తుతం 2022లో అత్యధిక సంఖ్యలో శాశ్వత నివాసితులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. సో..కెనడాకు ఎగిరిపోయి అక్కడే స్థిరపడేలా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పొందాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం. (చదవండి: Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్) మే 2022 నాటి లేబర్ ఫోర్స్ సర్వే అనేక పరిశ్రమలలో పెరుగుతున్న కార్మికుల కొరతను హైలైట్ చేసింది. 2021, మే నుండి ఖాళీల సంఖ్య 3 లక్షలకు పైగా పెరిగిందని తెలిపింది. వృత్తిపరమైన, శాస్త్రీయ , సాంకేతిక సేవలు, రవాణా , గిడ్డంగులు, ఫైనాన్స్ , భీమా, వినోదం, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతీ రంగంలోనూ రికార్డు స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. వలసదారులు ఓపెన్ స్థానాలకు పర్మినెంట్ వీసాలకు డిమాండ్ పెరగనుందని వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో గతంలో కంటే ఇప్పుడు మరిన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయని మరో సర్వే తెలిపింది. (CSIR: టాప్ సైంటిఫిక్ బాడీకి తొలి మహిళా హెడ్‌గా కలైసెల్వి రికార్డు) అల్బెర్టా , అంటారియోలో, ఏప్రిల్‌లో ప్రతి ఓపెన్ పొజిషన్‌కు 1.1రేషియోలో నిరుద్యోగులు ఉన్నారు,ఈ నిష్పత్తి అంతకు ముందు సంవత్సరం 1.2 పోలిస్తే, ఈ మార్చికి 2.4 కు పెరిగింది. న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్లో ఖాళీగా ఉన్న ప్రతి స్థానానికి, దాదాపు నలుగురు నిరుద్యోగులు ఉన్నారు. నిర్మాణ పరిశ్రమలో ఖాళీలు కూడా ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 89,900కి చేరుకున్నాయి, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 45 శాతం,మార్చి నుండి 5.4 శాతం పెరిగాయి. నోవా స్కోటియా, మానిటోబా రెండింటిలోనూ లాడ్జింగ్ , ఫుడ్ సర్వీసెస్ సెక్టార్లో 1,61 లక్షల ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. అలాగే వసతి, ఆహార సేవలు వరుసగా 13వ నెలలో కూడా అత్యధిక సంఖ్యలో ఖాళీలుండటం విశేషం.2022లోకెనడా రికార్డు స్థాయిలో 431,645 కొత్త శాశ్వత నివాసితులకు తలుపులు తెరవనుంది. 2022 మొదటి అర్ధభాగంలోనే, కెనడా ఇప్పటికే దాదాపు 2 లక్షలమందికి పర్మినెంట్ రెసిడెన్సీలుగా అవకాశం ఇచ్చింది. 2024 నాటికి 4.5 లక్షల టార్గెట్‌గా పెట్టుకుందని నివేదిక పేర్కొంది. తక్కువ మంది వ్యక్తులు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించడంతోపాటు, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్నవారు ముందుగానే రిటైర్ అవుతున్నారట. దీంతో కెనడా లేబర్ మార్కెట్ ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ఇటీవలి ఆర్బీసీ సర్వే ప్రకారం, కెనడియన్లలో మూడింట ఒక వంతు మంది ముందుగానే పదవీ విరమణ చేస్తున్నారు . పదవీ విరమణకు దగ్గరగా ఉన్న 10 మందిలో ముగ్గురు కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యంగా రిటైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే కెనడాలో 2020లో, సంతానోత్పత్తి రేటు 1.4 రేషియోలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఇదీ చదవండి : మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా? -
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: హైకోర్టు పేరుతో తప్పుడు లెటర్ప్యాడ్లు సృష్టించి కొందరు వ్యక్తులు వాట్సాప్‌లో సర్క్యులేట్ చేస్తూ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని, ఉద్యోగార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు హెచ్చరించింది. ఉద్యోగాల భర్తీపై వచ్చే తప్పుడు నోటిఫికేషన్లను, లెటర్లను తమ దృష్టికి తీసుకురావాలని కోరింది. తప్పుడు వాట్సాప్ సందేశాలు, నకిలీ నోటిఫికేషన్లను వ్యాప్తి చేసే వారిని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించింది. తప్పుడు హైకోర్టు లెటర్ ప్యాడ్ తయారు చేసి, హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) సంతకాన్ని స్కాన్ చేసి క్లర్క్ ఉద్యోగాలంటూ వాట్సాప్‌లో వ్యాప్తి చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు చర్యలు చేపట్టింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు సందేశాల వ్యాప్తి వెనుకున్న కుట్రదారులను, నేరస్తులను చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరింది. ఉద్యోగ ఆశావహులు, ఇతరులు కూడా హైకోర్టు భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో హైకోర్టు వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని కోరింది. ఉద్యోగ ప్రకటన మొదలు, భర్తీ వరకు ప్రతి విషయాన్నీ అందులో పొందుపరుస్తామని, ఆ వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) ఆలపాటి గిరిధర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఆ రంగంలో మూడు కోట్ల ఉద్యోగాలు - టాటా గ్రూప్ చైర్మన్
భవిష్యత్తులో డిజిటల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగంల్లో డిజిటల్ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమికండర్లు, 5జీ ఎక్విప్మెంట్ తయారీలోకి టాటా అడుగుపెడుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై జాతీయ మీడియాకు ఆయన వివరించిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఈ నాలుగే కీలకం కరోనా తర్వాత పరిస్థితులూ పూర్తిగా మారిపోయాయి. జీవన విధానం మారిపోయింది, పని చేఏ తీరులో మార్పులు వచ్చాయి. వ్యాపారం కూడా రూపు మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో డిజిటలీకరణ, కొత్త రకం సప్లై చైయిన్, పర్యవరణానికి హానీ చేయకుండా అభివృద్ధి చెందడం ముఖ్యమైన అంశాలుగా మారబోతున్నాయి. వీటన్నింటీలో ఆరోగ్యం కాపాడుకోవడం ఓ అంతర్భాగంగా ఉంటుంది. ఈ నాలుగు అంశాల్లో వ్యాపార విస్తరణపై టాటా గ్రూపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో ఈ నాలుగు థీమ్‌లకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయి. టేకోవర్లు డిజిటలీకరణ అని సింపుల్‌గా చెప్పుకున్నాం. కానీ ప్రయాణాలు, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా అన్నింటా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పని. ఈ రంగంలో విస్తరించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అవసరాలను బట్టి కొన్ని సంస్థలను కొనాల్సి రావచ్చు. సెమికండక్టర్ల తయారీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెమి కండక్టర్ల కొరత ఉంది. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ ఉంటుంది. వ్యూహాత్మకంగా టాటా గ్రూపు సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలోకి అడడుగుపెడుతోంది. ఇప్పటి వరకు సెమికండక్టర్ల తయారీకి చాలా దేశాలు చైనాపై ఆధారపడేవి. ప్రపంచ వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు చైనాకు ప్రత్యామ్నయం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా వినియోగించుకోవాలి. అందుకే సెమికండక్టర్లు, 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారీపై దృష్టి పెట్టాం. 3 కోట్ల ఉద్యోగాలు కరోనా కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇవి సమసిపోవాలంటే విద్యా, వైద్య రంగంలో త్వరితగతిన మార్పులు జరగాల్సి ఉంది. ఈ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్ తక్కువగా ఉన్న వారికి ఉద్యోగాలను కల్పించే వెసులుబాటు కలుగుతుంది. హైబ్రిడ్‌తో ఇంటి నుంచి, ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మరింత విస్త్రృతమైతే పదో తరగతి వరకు చదివిన గృహిణులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మా అంచనా ప్రకారం హైబ్రిడ్ పద్దతి సక్సెస్ అయితే 12 కోట్ల మంది మహిళలు ఇంటి నుంచే వివిధ ఉద్యోగాలు చేయగలుతారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి 440 బిలియన్ డాలర్లు సమకూరుతాయి. -
ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్ ఇది!
న్యూఢిల్లీ: ఓవైపు వర్క్‌ఫ్రం హోం విధానానికి ముగింపు పలికేందుకు బడా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా... మరోవైపు వర్క్‌ఫ్రం హోంకే మెజారిటీ ఉద్యోగార్థులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఓ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. కరోనా నేపథ్యంలో దేశంలో ఉద్యోగ అవకాశాలు, పని విధానంపై ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. తొమ్మిది నగరాల్లోని 1,200 కంపెనీలతోపాటు 1,500 మంది ఉద్యోగుల నుంచి ఈ సర్వే కోసం శాంపిల్స్ సేకరించారు. వర్క్‌ఫ్రం హోం బెటర్ కరోనా కేసులు తగ్గినా.. దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. ఆఫీసుకు వెళ్లి పని చేసేయడానికి ఫ్రెషర్లు విముఖత చూపిస్తున్నారు. ఇంటి పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. విధానంపై ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వేలో ఇంటి నుంచి పనికి 46 శాతం మంది మద్దతు తెలపగా హైబ్రిడ్ విధానం ఉండాలని 29 శాతం మంది అన్నారు. హైబ్రిడ్ అంటున్న కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీసు, ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మేలని 42 శాతం కంపెనీలు తెలిపాయి. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే వీలు ఉంటుందని ఆ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. కాగా ఇంటి నుంచి విధులు ఉండాలని 35 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయడమే సరైన పద్దతని 23 శాతం కంపెనీలు చెప్పాయి. ఆఫీసే... మేల్ వర్క్‌ఫ్రం హోం విధానానికి మేల్ ఎంప్లాయిస్ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. అయితే ఇదే సమయంలో మహిళలు వర్క్‌ఫ్రం హోంకే జై కొడుతున్నారు. ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వేలో ఇంటి నుంచి పని కొనసాగించడమే బాగుంది 51 శాతం మహిళలు తెలియజేస్తే.. పురుషుల విషయంలో ఇది 29 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. సాధారణంగా బయటకు వెళ్లి పని చేయడాన్ని ఇష్టపడే మగవాళ్లు, వర్క్‌ఫ్రం హోంలో ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండటాన్ని ఇష్టపడటం లేదు. వేతనమే ముఖ్యం వర్క్‌ఫ్రం హోం , ఆఫీస్ అనే తేడాలు పెద్దగా పట్టించుకోమని కంపెనీ ఎంత వేతనం అందిస్తుంది అనేదే తమకు ప్రాధాన్యమని 25 శాతం మంది ఉద్యోగార్థులు స్పష్టం చేశారు. నియమకాలు పెరిగాయ్ దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 శాతం పెరిగాయి. ఐటీ 61 శాతం, ఆర్థిక సేవలు 48, బీపీవో, ఐటీఈఎస్ రంగాలు 47 శాతం వృద్ధి కనబరిచాయి. అయితే గడిచిన త్రైమాసికంలో పదోన్నతి, వేతన పెంపు అందుకోలేదని 70 శాతం మంది ఉద్యోగులు వెల్లడించారు. -
గల్ఫ్ జాబ్స్ కోసం ఇది ఉండాల్సిందే..
దుబాయ్ : గల్ఫ్ దేశాలలో ఉద్యోగం కోసం అభ్యర్థులు మంచి ప్రవర్తన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. యూఏఈ ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల్లో ఒకటైన పీసీసీ (పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్)కు సంబంధించిన వివరాల కోసం పాస్‌పోర్టు, వీసా సమస్యలను పరిష్కరించే సంస్థలు ఇండియన్ మిషన్, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్‌కు ఉద్యోగార్థుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే ఈ పీసీసీ సర్టిఫికెట్ పొందడం చాలా తేలికని బీఎస్ఎల్ ఇంటర్నేషల్ సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు. భారతీయ మిషన్, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ ద్వారా వెలువడిన పీసీసీలను ఆమోదిస్తుందని కూడా తెలిపారు. పీసీసీ పొందేందుకు ఇలా చేయాలి.. ముందుగా బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అధికారిక వెబ్సైట్ నుంచి పీసీసీ ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా నేరుగా బీఎల్ఎస్ సెంటర్ నుంచి కూడా పొందవచ్చు, డౌన్లోడ్ చేసిన ఫారంతో పాటు జాబ్ ఆఫర్ లెటర్, కంపెనీ ట్రేడ్ లైసెన్స్, పాస్‌పోర్టు, వీసాల జిరాక్స్ కాపీలను నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జతచేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఇండియన్ ఎంబసీని సంప్రదించి ఆమోదం పొంది, మళ్లీ తిరిగి బీఎల్ఎస్ కార్యాలయంలో ఇవ్వాలి. ఇక్కడ ప్రాసెస్ జరగడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. సర్టిఫికెట్ సిద్ధమైతే దరఖాస్తుదారుడి మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. -
ఒత్తిడిని చిత్తు చేద్దాం.. విజయ తీరాలకు చేరుకుందాం..
టాప్ స్టోరీ ఒత్తిడి.. మూడు అక్షరాల పదం! ప్రభావం మాత్రం.. కొండంత!! నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి బాధితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులే! అకడమిక్ పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించాలని ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు.. పోటీ పరీక్షల్లో విజయం సాధించి కలల కొలువులు సొంతం చేసుకోవాలని ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగార్థులు.. 24్ఠ7 పని వాతావరణం; డెడ్‌లైన్స్; డెసిషన్ మేకింగ్; ఉన్నత స్థానాలు అందుకోవాలనే తపనతో ఒత్తిడి ఎదుర్కొంటున్న కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు.. ఇలా... ఇప్పుడు క్లాస్ రూం, నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు ఒత్తిడి అనే మాట సర్వ సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలు.. సూచనలు.. ఆత్మవిశ్వాసం ఆలంబనగా ఒత్తిడిని జయించే క్రమంలో ఇటు విద్యార్థులైనా, అటు ఉద్యోగార్థులైనా, ఉద్యోగులైనా.. ముందుగా పెంపొందించుకోవాల్సింది ఆత్మవిశ్వాసం. ఒత్తిడికి గురవడం అనే సమస్య.. సాధారణంగా సహచరులతో పోల్చుకోవడం వల్ల, పోటీ గురించి అతిగా ఆలోచించడం వల్ల ఎదురవుతుంది. తమపై తాము నమ్మకం పెంచుకుంటే ఒత్తిడిని సగం జయించినట్లే! మెండైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండటంతో పాటు తోటివారితో పోల్చుకోవడం, పోటీ గురించి అదేపనిగా ఆలోచించడం మానేయడం ద్వారా ఒత్తిడిని చాలా వరకు అధిగమించొచ్చు. సానుకూల జీవన శైలి ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపకరించే మరో అంశం.. వ్యక్తిగత జీవన శైలి సరళంగా, మానవ సంబంధాలు సానుకూలంగా ఉండేలా చూసుకోవడం. దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించుకోవడం మేలు. కొన్ని సందర్భాల్లో అత్యంత సాధారణంగా ఉండే అంశాలు కూడా సమయాన్ని వృథా చేసి ఒత్తిడికి గురిచేస్తాయి. కాబట్టి ఇలాంటి అంశాల గురించి పదేపదే ఆలోచించకుండా కుటుంబ సభ్యులు, మిత్రులతో వీలైనంత గడపడం మంచిది. అలసటగా అనిపించినా.. ఆందోళనకు గురవుతున్నా కొత్త ప్రాంతాలను సందర్శించడం చేయాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రాధాన్యతలను గుర్తిస్తూ చాలామంది తాము చేయాల్సిన పనులు పూర్తి చేయలేదనే భయంతోనో లేదా వాటిని పూర్తి చేయకపోతే కలిగే ప్రభావాన్ని తలచుకొని చివరి నిమిషంలో ఎక్కువగా ఒత్తిడికి గురువుతుంటారు. ఇలాంటి వారికి ఒత్తిడిని జయించే క్రమంలో ఉపయోగపడే మంచి సాధనం.. ముందస్తు ప్రణాళిక. విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా ఒక వారం లేదా ఒక రోజుకు సంబంధించి తాము చేయాల్సిన పనులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వీలైతే వాటిని డైరీలోనో లేదా తమకు నిత్యం కనిపించే విధంగా వాల్ క్యాలెండర్‌లోనో నోట్ చేసుకోవాలి. ఒకరోజు చదవాల్సిన అంశాల్లో ప్రాధాన్యతను గుర్తిస్తూ ముందుకు సాగాలి. తద్వారా ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు. ఒత్తిడికి గురిచేసే వారికి దూరంగా ఒత్తిడిని దూరం పెట్టడంలో ఉపయోగపడే మరో చిట్కా. ‘ఒత్తిడి’కి గురిచేసే వారిని లేదా ‘నిరాశావాదు’లకు దూరంగా ఉండటం. కొంతమంది అదే పనిగా వచ్చి.. ఒక పరీక్షకు సంబంధించి ప్రతికూల అంశాలే చెబుతుంటారు. ‘ఇంత పోటీలో ఎంత చదివినా ఉపయోగం ఏంటి? నేను కూడా గతంలో ఎంతో కృషి చేశాను. కానీ ఫలితం లేదు’ అనే మాటలతో నిరుత్సాహానికి గురిచేస్తారు. అలాంటివారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్ తాము చేయాల్సిన పనులు లేదా చదవాల్సిన అంశాలను వాటి క్లిష్టత స్థాయి ఆధారంగా ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్‌గా వర్గీకరించుకోవాలి. ముందుగా ‘ఈజీ’తో మొదలుపెట్టాలి. ఇవి పూర్తయ్యాక మోడరేట్, డిఫికల్ట్ అంశాలనుఎదుర్కొనేందుకు ముందస్తు మానసిక సంసిద్ధత లభిస్తుంది. ఇలా కాకుండా.. ఇష్టం లేకున్నా కష్టమైన అంశాలతో మొదలుపెడితే ఒత్తిడి మరింత పెరుగుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని సందర్భాల్లో ఎంత వద్దనుకున్నా.. ఎంత ఏకాగ్రతతో చదవాలనుకున్నా.. ఆందోళన పెరిగిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో చదువుతున్న పుస్తకాలను కొద్దిసేపు పక్కనపెట్టి మానసిక విశ్రాంతి కోసం టెక్నిక్స్ పాటించాలి. అంటే.. ఇష్టమైన సంగీతం వినడం, గార్డెనింగ్, లేదా టీవీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడటం లాంటివి చేయాలి. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్.. మరికొన్ని టిప్స్ * దినచర్యను ఇష్టమైన పనితో ప్రారంభించాలి. * ప్రతిరోజూ కొద్దిసేపు నడక, యోగా, ఎక్సర్సైజ్ వంటివి చేయాలి. * ఆ రోజు చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలి. * ఇష్టమైన ప్రదేశాలు చూడాలి. అయితే వీటికోసం రోజుల తరబడి వృథా చేయకూడదు. తాము నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోని ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్తుండాలి. * విసుగు, కోపం, ఆవేదనకు దూరంగా ఉండాలి. * ఇతరుల విజయాల పట్ల సానుకూల దృక్పథం అవసరం. * ఉద్యోగులు డెడ్‌లైన్స్, లాస్ట్ మినిట్ వరకు వేచి చూడకుండా ముందుగానే పనులు పూర్తి చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. * ప్రతిరోజూ తప్పనిసరిగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. అందరికీ ఒత్తిడి.. అధిగమించేందుకు ఎన్నో మార్గాలు ప్రస్తుత పోటీ వాతావరణంలో ఒత్తిడి అనే మాట వినిపించని రంగం, ఆ మాట తలవని వ్యక్తులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే దాన్ని అధిగమిస్తేనే విజయం. ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మానసిక ఉపశమన ప్రక్రియల ద్వారా ఒత్తిడిని అధిగమించొచ్చు. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడి ఎదురైనప్పుడు కొద్దిసేపు దానికి విరామమిచ్చి సహచరులతో బృందచర్చల్లో పాల్పంచుకోవడం, అది వీలు కాకపోతే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పుస్తకాలు చదవడం వంటివి చేయాలి. ఇక.. విజయం పరంగా పోటీ గురించి ఆలోచించకుండా కృషిచేస్తే ఒత్తిడి అనే మాట దరిచేరదు. - డాక్టర్. ఎం.ఎస్.రెడ్డి,సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్స్ తల్లిదండ్రులదీ కీలక పాత్ర 17 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉండి పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. ఆ వయసులో పిల్లలు సహచర విద్యార్థులతో పోల్చుకుని మరింత ఒత్తిడికి లోనవుతారు. అంతేకాకుండా వారికి ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితులను తల్లిదండ్రులే గుర్తించి వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ సహచర విద్యార్థులతో పోల్చి మరింత ఒత్తిడికి గురి చేయడం సరికాదు. పోటీల్లో జయాపజయాలు సహజం. దీన్ని గుర్తించి ఫలితం ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధత పొందాలి. - డాక్టర్. జి.కృష్ణ, క్లినికల్ సైకాలజిస్ట్, ఎన్ఐఎంహెచ్ - సికింద్రాబాద్ -
నిరుద్యోగులకు కానిస్టేబుల్ రాతపరీక్ష
- ఎమ్మెల్సీ రాములునాయక్ నారాయణఖేడ్ రూరల్ (మెదక్ జిల్లా): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ రాములునాయక్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కాకతీయ, వాగ్దేవి పాఠశాలల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఎమ్మెల్సీ రాములునాయక్ మెదక్ డిఎస్పీ రాజారత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాములునాయక్ మాట్లాడుతూ ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత కానిస్టేబుల్, ఎస్ఐతోపాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవకాశం ఉందన్నారు. -
రాత పోల్చుకో.. రంగం ఎంచుకో..
కెరీర్ ఎంపికలో హ్యాండ్ రైటింగ్ పాత్ర నప్పే కెరీర్ కోసం గ్రాఫాలజిస్ట్తో సంప్రదింపులు నగరంలో నవ్య ధోరణి టెక్నాలజీ పుణ్యమాని ఉత్తరాలు రాసే అవకాశం లేకపోయింది. కీబోర్డ్ రాకతో చేత్తో రాసే అవసరం తగ్గిపోతుంటే.. చేతిరాతను తరచి చూసే అవసరం మరోవైపు పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఇచ్చేవారు మాత్రమే కాదు ఉద్యోగార్థులు సైతం తమ చేతి‘రాత’ను పరీక్షించుకుంటున్నారు. దాని ప్రకారం తల రాతను దిద్దుకుంటున్నారు. ఇప్పుడు సిటీలో ఈ ధోరణి బాగా పెరిగింది. వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నవారు తమ కెరీర్ కోసం గ్రాఫాలజిస్టులను సంప్రదించి చేతిరాతలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. ‘నేనెందుకు పనికొస్తాను?’.. ఈ ప్రశ్న నిరాశతో మాత్రమే కాదు అత్యంత ఆశావహ దృక్పథంతో కూడా వేసుకోవచ్చు. అలా ప్రశ్నించుకున్న తర్వాత, తన శక్తియుక్తులు తరచి చూసుకున్న తర్వాత ‘రంగం’లోకి దూకితే.. ఆ దూకుడుకు అడ్డుండదు. ఇది విజయవంతమైన వ్యక్తుల కథల సాక్షిగా నిరూపితమైన నిజం. కెరీర్ ఎంపికకు ముందుగా తమని తాము తరచి చూసుకుంటున్న వారికి అందుబాటులోకి వచ్చిన మరో మార్గం ‘హ్యాండ్ రైటింగ్ ఎనాలసిస్’. ‘అక్షరాలా’ మనమే.. పలకా బలపం నాటి రోజుల తర్వాత రకరకాల మార్పులకు లోనైంది. ఎంతగా అంటే.. సన్నిహితులు మనల్ని గుర్తు పట్టడానికి అదొక మార్గంగా మారిపోయింది. మనకు అంతగా అలవాటైపోయిన చేతిరాత.. అలవోకగా అమరిపోయిందనుకుంటే పొరపాటే అని గ్రాఫాలజీ చెబుతోంది. మన ఆలోచనలు, ప్రవర్తన, మనస్తత్వం.. వీటన్నింటి ప్రతిరూపంగానే రాసే శైలి కూడా ఉంటుందని గ్రాఫాలజిస్ట్‌లు చెబుతున్నారు. మనం ఏ రంగంలో రాణిస్తామో తెలుసుకోవాలంటే మన ఇష్టాఇష్టాలు, శక్తి యుక్తులు తరిచి చూసుకోవడం అవసరమని, అందులో భాగంగా చేతిరాతను సైతం ఎనలైజ్ చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని రకాల హ్యాండ్ రైటింగ్ స్టైల్స్‌ను చూస్తే.. లార్జ్ హ్యాండ్ రైటింగ్ అక్షరాలపై బార్స్ పెద్దగా ఉండడం స్ట్రోక్స్ అన్నీ కనెక్టింగ్‌గా ఉండడం.. ఈ శైలి సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ ఎక్కువని చెబుతుంది. ఉద్యోగం కన్నా స్వేచ్ఛ, స్వతంత్రత ఎక్కువగా ఉండే వ్యాపకాలను ఎంచుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక పదానికి పదానికి మధ్య తక్కువ స్పేస్ ఉండడం కలుపుగోలు తనానికి చిహ్నం. ఈ ధోరణి సేల్స్ అండ్ మార్కెటింగ్ లేదా సంబంధిత రంగానికి అతికినట్టు సరిపోతుంది. స్మాల్ సైజ్ రైటింగ్ ఈ స్టైల్లో అక్షరం మీద చుక్కను రౌండ్ చుడుతుంటారు. అలాగే పదాల్లో స్పష్టత ఎక్కువగా ఉంది. ఇది పలు అంశాలపై ఉన్న క్లారిటీకి చిహ్నం. వీరిది చిన్న చిన్న డిటైల్స్ అన్నీ పర్ఫెక్ట్గా రాసే తరహా. ఈ ‘రాత’ గల వ్యక్తులకు ఫైనాన్షియల్ సంబంధిత రంగాల (అకౌంటెంట్, ఫైనాన్షియల్ అడ్వయిజర్)కు ఉపయుక్తం. యాంగ్యులర్ రైటింగ్ ఈ తరహా రైటింగ్ చివర్లన్నీ సూదిగా ఉంటాయి. ఇది ఇంటిలిజెన్స్‌కి చిహ్నం. అక్షరాలన్నీ ఒక్కోటి ఒక్కో యాంగిల్లా ఉంటాయి. అంటే వీరు లాజికల్‌గా ఆలోచిస్తారు. ప్రతి అక్షరానికి ముందు స్టార్టింగ్ స్ట్రోక్ ఉంటుంది. ఇది వాదనా పటిమకు, వేగంగా నేర్చుకునే తత్వానికి సూచిక. ప్రతి అక్షరానికీ ముందు తోక తగిలించడాన్ని చూశారా.. ఇది పరిశోధనాత్మక ఆలోచనా ధోరణిని సూచిస్తుంది. అడ్వకేట్స్, లీగల్, డిటెక్టివ్ తదితర రంగాల్లో రాణిస్తారు. రౌండ్ రైటింగ్ రైటింగ్ సైజ్ పెద్దగా ఉంది. మంచి శ్రోతలవుతారు. కొన్ని అక్షరాలు కలిపి, కొన్ని విడివిడిగా ఉంటాయి. అంటే ఎడాప్టబులిటీ, ఫ్లెక్సిబులిటీలని సూచిస్తుంది. పదాల మధ్య ఈక్వెల్ స్పేస్ ఇచ్చారు. అంటే, వీళ్లు వెల్ బ్యాలెన్స్డ్ థింకింగ్ గలవారు. టీచర్స్, కౌన్సిలర్స్, సోషల్ వర్క్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాలు వీరికి నప్పుతాయి. షార్ప్ టాల్ హ్యాండ్ రైటింగ్ అడుగున ఉన్న అక్షరాలు పొడవుగా వెళతాయి. ప్రతి పదం చివర్లో, మొదటి అక్షరమో తోకలు కింద లైన్లోకి వెళ్లిపోయేంతగా పొడవుగా ఉంటాయి. వీరికి ఇన్నర్ స్టామినా, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. షార్ప్‌గా ఉంటారు. స్పోర్ట్స్‌కి, అవుట్ డోర్ యాక్టివిటీస్‌కి నప్పుతారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తారు. సంతకం చెప్పే సంగతులు.. - చేతిరాత విశ్లేషణ ద్వారా మన శక్తియుక్తులు ఎలా తెలుస్తాయో.. సంతకం చేసే శైలిని బట్టి.. మన మనస్తత్వాన్ని విశ్లేషించుకోవచ్చని చెబుతున్నారు గ్రాఫాలజిస్ట్, డాక్టర్ రణధీర్ కుమార్. ఎడమ నుంచి కుడివైపునకు వెళుతున్నట్టుండేది, అలాగే పైనుంచి కిందకు, కింద నుంచి పైకి వెళ్తున్నన్నట్టుగా ఉండేలా అక్షరాలు రాసేవారు పైకి గంభీరంగా, రిజర్వ్డ్గా ఉన్నప్పటికీ చాలా సహృదయులై ఉంటారు. - సంతకంలో అక్షరాలు పెద్దగా ఉంటే ఆ వ్యక్తికి ఇగో ఎక్కువని, తాను చెప్పింది ఇతరులు అంగీకరించి తీరాల్సిందేనన్న తత్వం గలవారని అర్థం చేసుకోవచ్చు. చేతిరాత కంటే సంతకం చిన్నగా ఉంటే ఆ వ్యక్తి తనను తాను ప్రాధాన్యత లేనివాడిగా భావించే గుణం ఉందని. - సంతకం అర్థం కాకుండా, చదివే వీలు లేకుండా ఉంటే.. ఆ వ్యక్తులు తమ విషయం ప్రపంచం ఎక్కువగా తెలుసుకోకూడదని కోరుకుంటారు. తన గురించి చెప్పేందుకు ఇష్టం లేని దాపరికం ఉన్న వ్యక్తి కూడా అయి ఉంటారు. సంతకం మరీ కాంప్లికేటెడ్‌గా ఉంటే ఇతరులకు తనో రహస్యం కావాలనుకుంటున్నట్టు. - సంతకంలోని చివరి స్ట్రోక్ (అక్షరం) వెనుకడుగు వేసినట్టుగా అంటే.. ప్రారంభించిన చోటుకి తిరిగి వచ్చినట్టుగా ఉంటే అది తనను తాను పాడు చేసుకునే తత్వానికి నిదర్శనం. - పొడవైన కింద నుంచి పైకి వెళ్లే రైజింగ్ లైన్‌తో ఉన్న సంతకం... రగిలే ఆశలు, ఆశయాలతో ఉన్న మనస్తత్వానికి గుర్తు. - రెండు సార్ల కంటే ఎక్కువగా అండర్ స్కోర్ చేసిన సంతకం రాజీపడని, ధృఢమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. - సంతకం కింద వ త్తిపట్టి అండర్స్కోర్ చేస్తే అది స్వార్థ మనస్తత్వం, గుర్తింపు కోసం పడే ఆరాటానికి గుర్తు. -
జాబ్ మేకర్స్‌గా ఎదగండి: అబ్దుల్ కలాం
విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపు హైదరాబాద్ : విద్యార్థులు జాబ్ సీకర్స్(పొందేవారు)గా కాకుండా జాబ్ మేకర్స్(సృష్టించేవారు)గా ఎదగాలని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. మంగళవారం జేఎన్టీయూహెచ్లోని ఆడిటోరియంలో డెరైక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీలో భారతదేశం 39వ స్థానంలో ఉందని, సింగపూర్ లాంటి దేశాలు అమెరికాను దాటి అగ్రస్థానంలో నిలిచాయన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అపారమైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చని చెప్పారు. సాంకేతికంగా, విప్లవాత్మకంగా మార్పులు వస్తున్నాయని, ఈ తరుణంలో విద్యార్థులు తమ మేధోశక్తికి పదును పెట్టాలని సూచించారు. చదువులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సృజనాత్మకతకు, పరిశోధనలకు దోహదపడాలన్నారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో టెక్నాలజీ ఆవిష్కరణలను క్షణాల్లో తెలుసుకొని విద్యార్థులు తమ ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. వైజ్ఞానిక రంగంలో మన దేశం పరిపూర్ణత్వాన్ని సాధించడానికి ప్రతి భారతీయుడు తనవంతు చేయూతనివ్వాలని ఆయన కోరారు. నానోటెక్నాలజీ, ఐసీటీ, డీఎన్ఏ వంటి అంశాల గురించి ఆయన విపులంగా వివరించారు. విద్యుత్‌కు అంతరాయం సదస్సులో అబ్దుల్ కలాం ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినా ఆయన తన ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించారు. విద్యార్థినీ విద్యార్థులు మాత్రం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇరాక్ వెళ్లితే ఇంక అంతే...!
పానాజీ: ఉద్యోగం కోసం ఇరాక్ కు వెళ్లవద్దని యువకులకు గోవా రాష్ట్రానికి సంబంధించిన ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. బాగ్దాద్ లోని భారతీయ రాయబార కార్యాలయంలో విచారించిన తర్వాతే ఈ హెచ్చరిక చేస్తున్నామని ఎన్నారై విభాగా డైరెక్టర్ యూడీ కామత్ తెలిపారు. ఇరాక్ లో అంతర్గత పరిస్థితులు దారుణంగా ఉన్న కారణంగా ఉద్యోగం కోసం యువకులు వెళ్లకూడదని.. ఆ దేశానికి ప్రయాణించకూడదని ఆంక్షల్ని విధించారు. ఇరాక్ సంక్షోభంలో నలభై ఆరు మంది భారతీయ నర్సులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.