ఇరాక్ వెళ్లితే ఇంక అంతే...!
Published Wed, Jul 30 2014 2:17 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
పానాజీ: ఉద్యోగం కోసం ఇరాక్ కు వెళ్లవద్దని యువకులకు గోవా రాష్ట్రానికి సంబంధించిన ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. బాగ్దాద్ లోని భారతీయ రాయబార కార్యాలయంలో విచారించిన తర్వాతే ఈ హెచ్చరిక చేస్తున్నామని ఎన్నారై విభాగా డైరెక్టర్ యూడీ కామత్ తెలిపారు.
ఇరాక్ లో అంతర్గత పరిస్థితులు దారుణంగా ఉన్న కారణంగా ఉద్యోగం కోసం యువకులు వెళ్లకూడదని.. ఆ దేశానికి ప్రయాణించకూడదని ఆంక్షల్ని విధించారు. ఇరాక్ సంక్షోభంలో నలభై ఆరు మంది భారతీయ నర్సులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement