
కోడి పందేల్లోనే కాదు, అందాల పోటీల్లోనూ తగ్గేదేలే అంటున్నాయి కోళ్లు. కోళ్లకు అందాల పోటీలేంటని ఆశ్చర్యపోకండి, అందం ఎవరి సొంతం కాదని, కోడి పందేల మాదిరే, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ జిల్లా, సులేమానిలో ఓ ప్రైవేటు సంస్థ ఇటీవల కోళ్లకు అందాల పోటీలను నిర్వహించింది.
ఈ పోటీల్లో, దాదాపు వందకుపైగా కోళ్లు పోటీ పడగా, ఇరాక్‌కు చెందిన గరీబ్ మహమ్మద్ పెంచుకున్న కోడి, 96 పాయింట్లతో విజయం సాధించింది. కోడి శరీర పరిమాణం, రంగు, జాతి, ఈకల నాణ్యత, శరీర అకృతి ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, పోటీ న్యాయనిర్ణేతలు దీనికి ఈ పాయింట్లను ఇచ్చారు.
ఇక ఈ విషయమై మహమ్మద్ మాట్లాడుతూ ‘నేను నా రెండు కోళ్లను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే పెంచాను. వాటి ఆరోగ్యం, ఆహారం విషయంలో మొదటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఇంకా చెప్పాలంటే, నా పిల్లల కంటే నా కోడినే నేను ఎక్కువగా ప్రేమిస్తాను’ అని చెప్పాడు.
(చదవండి: సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా..)
Comments
Please login to add a commentAdd a comment