
పనాజి: గోవా బీచ్ కు విదేశీ పర్యాటకులు తగ్గి పోవడంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా బీచ్ లో ఇడ్లీ-సాంబార్, వడా పావ్ లు అమ్మడం వల్లే విదేశీ పర్యాటకులు రావడం లేదన్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ బీచ్ దుకాణాల్లో వడా పావ్ లు అమ్ముతున్నారు.
కొంతమంది ఇడ్లీ సాంబార్ విక్రయాలు జరుపుతున్నారు. దాని వల్ల గత కొన్నేళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఈ కారణాలతో స్థానికుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. అయితే వాటి వల్ల విదేశీ పర్యాటకులు రావడం లేదని చెప్పారు కానీ, అవే ఎందుకు కారణమయ్యాయి అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment