పనాజీ : కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌లతో బోసిపోయిన గోవా మళ్లీ పర్యాటకులతో కళకళలాడనుంది. అక్కడి బీచ్‌లు సందడిగా మారనున్నాయి. పర్యాటకులను గురువారం నుంచి అనుమతించనున్నట్టు గోవా ప్రభుత్వం పేర్కొంది. 250 హోటళ్లకు ప్రభుత్వం టూరిస్టులను అనుమతించవచ్చని పర్మిషన్ ఇచ్చింది. కాగా గోవాలో పర్యాటకులు ప్రవేశించాలంటే కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ చూపనిపక్షంలో గోవాలోనే కోవిడ్-19 పరీక్షకు సంసిద్ధం కావాలని టూరిజం మంత్రి ఎం అజగోంకర్ చెప్పారు.చదవండి : 90 శాతం పేషెంట్లు వాళ్లే: గోవా సీఎం
Comments
Please login to add a commentAdd a comment