పనాజీ: తెలంగాణకు చెందిన 15మంది పర్యాటకులు గోవాలో హత్యకేసు ఎదుర్కొంటున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా వీరు దాడి చేసినట్టు భావిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందడంతో పోలీసులు వీరిపై హత్యకేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం కొల్వాలెలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాడి ఘటన జరిగిన రాత్రి వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొత్త సంవత్సరం వేడుకల కోసం గోవాకు 15మంది తెలంగాణ పర్యాటకులు గోవాకు వచ్చారు. ఈ నెల 1వ తేదీన రాత్రి కలన్‌గుటె గెస్ట్‌హౌస్‌లో బస చేసిన వీరు.. ఓ చిన్న విషయమై గెస్ట్‌హౌస్ సిబ్బందితో గొడవకు దిగినట్టు తెలుస్తోంది. వీరు దాడి చేయడంతో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి.. మినీ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన జయేష్ భండారి తాజాగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో నిందితులపై నమోదుచేసిన హత్యాయత్నం కేసును హత్యకేసుగా మార్చి.. దర్యాప్తు చేపడుతున్నట్టు స్థానిక ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటికే హత్య అభియోగాలను చేర్చామని, మరింత విచారణ కోసం నిందితులను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోర్టును కోరుతామని ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment