Railway Police Ask Tourists Do Squats For Walking On Tracks - Sakshi
Sakshi News home page

పర్యాటకులకు పనిష్మెంట్ ఇచ్చిన రైల్వే పోలీసులు

Published Mon, Jul 17 2023 8:20 AM | Last Updated on Mon, Jul 17 2023 9:17 AM

Railway Police Ask Tourists Do Squats For Visiting Goa Dudhsagar - Sakshi

పనాజీ: కర్ణాటక గోవా సరిహద్దులో పర్యాటక ప్రాంతమైన దూధ్ సాగర్ జలపాతాలను దగ్గరగా చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న పర్యాటకులను రైల్వే పోలీసులు అడ్డుకుని వారితో గుంజీలు తీయించారు. 

రైలులో గోవా వెళ్తుండగా మార్గమధ్యలో కిటికీల్లోంచి కనిపించే అందమైన పర్యటక దృశ్యం దూద్ సాగర్ జలపాతాలు. దూరం నుంచి చూస్తేనే అంత ఆహ్లాదంగా ఉండే ఈ జలపాతాలను దగ్గరగా చూడాలని కొందరు ఔత్సాహికులైన పర్యాటకులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. 

గతంలో అడవి గుండా జలపాతాలను చేరేందుకు మార్గం ఉండేది. కానీ ఇటీవల ఇక్కడికి సమీపంలోని మైనాపీ జలపాతాల వద్ద ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ దోవను మూసివేశారు. దీంతో పర్యాటకులు దూధ్ సాగర్ చేరుకోవడానికి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. 

అది ఇంకా ప్రమాదమని రైల్వే పోలీసులు అనేకమార్లు పర్యాటకులను హెచ్చరిస్తున్నా వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం అయితే వందల కొద్దీ పర్యాటకులు ఈ మార్గం గుండా వెళ్తూ రైల్వే పోలీసుల కంటపడ్డారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన రైల్వే పోలీసులు నిబంధనలను అతిక్రమించిన వందల టూరిస్టులతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. 

దక్షిణ పశ్చిమ రైల్వే వారు ట్విట్టర్ వేదికగా దయచేసి దూధ్ సాగర్ జలపాతాలను రైలులో నుండే చూసి ఆస్వాదించండి. రైలు పట్టాలెక్కి కాదు. అలా చేస్తే ఇకపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement