waterfalls
-
భారత్‌లో ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. షిల్లాంగ్ తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)
-
Hyderabad: సెలయేటికి చలో..
చిన్ని చిన్ని ఆశ అంటూ పాతికేళ్ల క్రితం ఓ సినిమాలో హీరోయిన్ నీళ్లలో తడుస్తూ పరవశించి పాడినా, జల.. జల.. జలపాతం.. నువ్వు అంటూ ఇటీవల ఓ సినిమాలో హీరో కీర్తించినా.. ప్రకృతి అందాల్లో జలధారల ప్రత్యేకతే వేరు. అలాంటి నిలువెత్తు నీటి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే వాటర్ ఫాల్స్‌ని మించిన మార్గం లేదు. ఆ తెల్లని నీళ్ల సిరుల్ని కళ్లకు హత్తుకోవాలంటే.. మాన్సూన్ని మించిన సీజన్ లేదు. మిగిలిన అన్ని కాలాల్లోనూ పొడి పొడిగా సాదాసీదాగా కనిపించే ప్రాంతాలు.. వర్షాకాలంలో మాత్రం హర్షామోదాల కేరింతల నిలయాలుగా మారిపోతాయి. ఈ సీజన్లో నప్పే ట్రిప్స్‌గా జలధారల దారి పట్టేవారి కోసం మన నగరం నుంచి అందుబాటు దూరంలో ఉన్న కొన్ని జలపాతాల విశేషాలివి.. వాటర్ ఫాల్స్.. ఈ పేరు చెప్పగానే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా వాటి అందాలను ఆస్వాదించేందుకు ఉవి్వళ్లూరుతారు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఆ జలపాతం కింద తడిసి ముద్దవ్వాలనుకుంటారు. నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో పలు జలపాతాలు నగర వాసులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వర్షా కాలంలో కొండ కోనల్లో ప్రకృతి ఒడిలో గంగ పరవళ్లు.. సెలయేటి గలగలలు చెవులకు వినసొంపుగా వినిపిస్తాయి. భువనగిరికి దగ్గర్లో ఓ జలపాతం ఉంటుంది. చుట్టూ పచ్చదనం రాతి గుట్టలు ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది. బొగత.. మన ఘనత..తెలంగాణ వాసులు సగర్వంగా చెప్పుకునే అద్భుత అందాల ఘనతగా బొగత జలపాతాన్ని చెప్పుకోవచ్చు. భద్రాచలం నుంచి 120 కిమీ దూరంలో నగరం నుంచి 329 కిమీ దూరంలో ఉందీ వాటర్ ఫాల్స్. ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలపాతం ఇదే. తెలంగాణ నయాగరగా పేరుగాంచి మాన్సూన్లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడకు చేరుకోడానికి సందర్శకులు కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. రాయకల్.. జలరాశుల్.. పోతపోసిన ప్రకృతి అందాల నిలయం రాయకల్ జలపాతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పెద్దగట్లు, రాయకల్ జలపాతం ఉంటాయి. మార్గమధ్యంలో పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చు. కొండమీది నుంచి రాసులు పోస్తున్నట్టు కిందకు దుమికే నీటి ధారలు రాయకల్ జలపాత దృశ్యం కనువిందు చేస్తుంది. మల్లెల తీర్థం.. అరణ్య మార్గం.. నగరానికి దాదాపు 185 కిమీ దూరంలో నల్లమల అరణ్యంలో ఉంది. ఈ జలపాతానికి చేరుకోడానికి, అడవి గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంతమేర సాహసోపేతమైన ప్రయాణం అనే చెప్పాలి.రాజేంద్రనగర్.. వాటర్ ఫాల్స్.. నగరానికి కేవలం 13.9 కిమీ దూరంలో ఈ సుందరమైన జలపాతం శీఘ్ర విహారానికి అనువైనది. సందర్శకులు ఒక చిన్న రైడ్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.జలజల.. కుంటాల.. తెలంగాణలోనే ఎత్తైన జలపాతం. నగరం నుంచి 564.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఆదిలా బాద్‌లో ఉంది. దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతూ వీక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.వైజాగ్ వారి ఆతిథ్యం.. అందం ‘చందం’ నల్లగొండ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉంది. దేవరకొండ నియోజకవర్గంలోని చందం పేట మండలంలో కృష్ణానది బ్యాక్ వాటర్ ఆనుకుని ఉన్న కుగ్రామం ఇది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నలువైపులా నల్లమల అడవులు, గుట్టలతో కప్పి ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు వైజాగ్‌కు చెందిన కొన్ని కుటుంబాలు స్థిరపడడంతో దీనికి వైజాగ్ కాలనీగా పేరొచి్చంది. వీకెండ్లో టూరిస్టుల కోసం కాలనీ వాసులే వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. కృష్ణానదిలో పట్టిన తాజా చేపల వంటకాలు ఇక్కడ ఫేమస్.ఎత్తిపోతల.. జలకళ.. సిటీకి 163.4 కిలోమీటర్ల దూరంలో చంద్రవంక నది సమీపంలో ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది. సమీపంలోని మొసళ్ల పెంపక కేంద్రం కూడా సందర్శనీయమే. నాగార్జున సాగర్ డ్యామ్ వైపు ఎన్‌హెచ్ 56 నుంచి డ్రైవింగ్ చేయడం ద్వారా జలపాతాన్ని, డ్యామ్‌ను చూడవచ్చు.భీముని పాదం.. ఆనందానికి ఆ‘మోదం’ దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూఎత్తయిన కొండలు, పక్షుల కిలకిలలు. సాయంత్రం వేళ అడవి జంతువుల అరుపులు, వర్షా కాలంలో ఎత్తయిన గుట్ట మీది నుంచి పాదం మధ్యలో జాలువారే నీటి సిరులు.. అస్వాదించాలంటే భీమునిపాదం జలపాతం దగ్గరికి పోవాల్సిందే. మానుకోట జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా దీన్ని చెప్పుకుంటారు.ఏడు బావుల.. వింతలా..బయ్యారం, గంగారం సరిహద్దుల్లో మిర్యాలపెంట సమీపంలో ఏడుబావుల జలపాతాలున్నాయి. పాండవుల గుట్టపై సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. జలపాతం నుంచి కిందికి పడే నీళ్లు కొద్ది దూరం ప్రవహించి తరువాత అదృశ్యమవడం. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా నీళ్లు పడుతూ కనువిందు చేస్తుంది.పచ్చని నెచ్చెలి.. చెచ్చెర..ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎన్నో జలపాతాలున్నా ఎక్కువ మందికి పరిచయం లేని జలపాతం చెచ్చెర. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కౌరగామ్ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందీ జలపాతం. ఎత్తయిన కొండల మధ్యలో 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే జలపాతాన్ని చూడటం కనువిందే. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆకట్టుకుంటాయి. -
హైదరాబాద్ : ప్రకృతి సోయగం.. ప్రమాదం అంచున యువత! (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల జలపాతం..చూసేందుకు పర్యాటకులు క్యూ (ఫొటోలు)
-
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
దేవరపల్లి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దే సాయిసూర్య అవినాష్ (26) సోమవారం వాటర్‌ఫాల్స్‌లో పడి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అమెరికాలో ఉంటుండగా, 2023 జనవరిలో ఆమె సోదరుడు సాయి సూర్య అవినాష్ ఉన్నత చదువు (ఎంఎస్)కు అమెరికా వెళ్లాడు. అక్క ఇంటి వద్ద ఉంటూ ఉన్నత చదువుకుంటున్నాడు. ఆదివారం అక్క కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రెండు కుటుంబాలూ వాటర్‌ఫాల్స్‌కు వెళ్లాయి. అక్కడ సాయిసూర్య అవినాష్ ప్రమాదవశాత్తూ వాటర్‌ఫాల్స్‌లో పడి నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అవినాష్ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకు వచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
దేశంలో ఎత్తైన జలపాతాలు:రెండు కళ్లూ చాలవంతే! (ఫొటోలు)
-
తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రకృతి చెక్కిన సుందర జలపాతాలు (ఫొటోలు)
-
విహార యాత్రలో విషాదం
-
జలపాతం ఒడ్డున ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ.. అంతా క్షణాల్లోనే..
కర్ణాటక: భారీ వర్షాలు కురుస్తున్నందున జలపాతం వద్ద వీడియోలు తీసుకోవడానికి వెళ్లిన యువకుడు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా కొల్లూరు అరశినగుండి జలపాతం వద్ద సోమవారం చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లా భద్రావతి కి చెందిన శరత్‌కుమార్ (23) అనే యువకుడు. దక్షిణ కన్నడ జిల్లా కొల్లూరు అరశినగుండి జలపాతం చూడడానికి వెళ్లాడు. జలపాతం దగ్గర బండపై నిలబడి వీడియోలు తీసుకుంటూ ఉండగా పట్టుతప్పి కిందకు పడిపోయాడు. నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈ దృశ్యాలను కొందరు మొబైళ్లలో వీడియోలు తీశారు. ఫైర్, కొల్లూరు పొలీసులు చేరుకుని నీటిలో గాలించగా అతని మృతదేహం బయటపడింది. Video: He Wanted An Instagram Reel, He Fell In A Waterfall While Posing https://t.co/5YQGGrtCib pic.twitter.com/KGFhnfTIXI — NDTV (@ndtv) July 25, 2023 -
Sabitham Waterfalls Photos: ఉరకలేస్తున్న సబితం జలపాతం.. సందర్శకుల తాకిడి (ఫొటోలు)
-
టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు
పనాజీ: కర్ణాటక గోవా సరిహద్దులో పర్యాటక ప్రాంతమైన దూధ్ సాగర్ జలపాతాలను దగ్గరగా చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న పర్యాటకులను రైల్వే పోలీసులు అడ్డుకుని వారితో గుంజీలు తీయించారు. రైలులో గోవా వెళ్తుండగా మార్గమధ్యలో కిటికీల్లోంచి కనిపించే అందమైన పర్యటక దృశ్యం దూద్ సాగర్ జలపాతాలు. దూరం నుంచి చూస్తేనే అంత ఆహ్లాదంగా ఉండే ఈ జలపాతాలను దగ్గరగా చూడాలని కొందరు ఔత్సాహికులైన పర్యాటకులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. గతంలో అడవి గుండా జలపాతాలను చేరేందుకు మార్గం ఉండేది. కానీ ఇటీవల ఇక్కడికి సమీపంలోని మైనాపీ జలపాతాల వద్ద ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ దోవను మూసివేశారు. దీంతో పర్యాటకులు దూధ్ సాగర్ చేరుకోవడానికి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. అది ఇంకా ప్రమాదమని రైల్వే పోలీసులు అనేకమార్లు పర్యాటకులను హెచ్చరిస్తున్నా వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం అయితే వందల కొద్దీ పర్యాటకులు ఈ మార్గం గుండా వెళ్తూ రైల్వే పోలీసుల కంటపడ్డారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన రైల్వే పోలీసులు నిబంధనలను అతిక్రమించిన వందల టూరిస్టులతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. A huge crowd who set out to watch Dudhsagar Waterfalls in Goa were seen on the railway tracks after authorities denied them entry As per social media accounts, some of them were also asked to perform squats by Railway Police personnel as punishment#Dudhsagarwaterfall pic.twitter.com/jh7uzHcJiR — ET NOW (@ETNOWlive) July 16, 2023 దక్షిణ పశ్చిమ రైల్వే వారు ట్విట్టర్ వేదికగా దయచేసి దూధ్ సాగర్ జలపాతాలను రైలులో నుండే చూసి ఆస్వాదించండి. రైలు పట్టాలెక్కి కాదు. అలా చేస్తే ఇకపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. We urge you to savour the beauty of Dudhsagar Falls from WITHIN your coach. Walking on/along tracks not only endangers your own safety but is also an offence under Section 147, 159 of Railway Act. It can also endanger safety of trains. (1/2) pic.twitter.com/Puj7hKh5JF — South Western Railway (@SWRRLY) July 16, 2023 ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
నిజం నిరూపించిన మహీంద్రా.. వాటర్ లీక్ వీడియోకి గట్టి రిప్లే
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ప్రజలు ఎక్కువ నమ్మే బ్రాండ్. అయితే ఇటీవల వెలువడిన ఒక వీడియోలో మహీంద్రా స్కార్పియో-ఎన్ సన్‌రూఫ్ నుంచి జలపాతం నీరు రావడం పెద్ద వైరల్ అయింది. దీనికి సమాధానంగా కంపెనీ మరో వీడియో విడుదల చేసింది. గతంలో వెలువడిన వీడియోలో అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ తన మహీంద్రా స్కార్పియో-ఎన్ కారుని జలపాతం కిందకి తీసుకెళ్లినప్పుడు, నీరు సన్‌రూఫ్ నుంచి లోపలికి వచ్చాయని, దానికి సంబంధించిన వీడియో విడుదల చేసాడు. ఇది అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మహీంద్రా కంపెనీ అదే జలపాతం కిందికి మరో స్కార్పియో-ఎన్ తీసుకెళ్లి టెస్ట్ చేసింది. అయితే జలపాతం నీరు ఏమాత్రం లోపలికి రాలేదు. ఈ వీడియోను మొదటి వీడియోకి రీప్లేగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో జలపాతం నీరు ఏ మాత్రం లోపలికి రాకుండా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి మహీంద్రా తమ వాహనాలను పటిష్టంగా తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తుంది. అయితే కష్టమర్ కారు నుంచి ఎందుకు నీరు లోపలికి వచ్చింది అనేదానికి ఖచ్చితమైన సమాధానం తెలియదు. బాధితుడి కారులో ఏదైనా సమస్య ఉందా.. లేకుంటే పబ్లిసిటీ కోసం ఇలాంటిది ఏమైనా చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. కంపెనీ ఉత్పత్తులలో ఏదైనా సమస్య తలెత్తితే తప్పకుండా దానికి పరిష్కారం పొందవచ్చు. అది మాత్రమే కాకుండా కంపెనీ అటువంటి సమస్యను గుర్తిస్తే రీకాల్ ప్రకటిస్తుంది. అలా కాకుండా వీడియోలు సోషల్ మీడియాలో వెల్లడైతే కస్టమర్లకు బ్రాండ్ మీద ఉన్న నమ్మకం పోతుంది. జలపాతం కింద డ్రైవింగ్ చేయడం అనేది చాలా ప్రమాదం, ఇది అనుకోని ప్రమాదాలకు దారి తీస్తుంది. జలపాతం కింది నుంచి డ్రైవింగ్ చేస్తే కారు బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉండవచ్చు, లేదంటే పైనుంచి ఏదైనా కిందికి పడినప్పుడు కారులో ఉన్న ప్రయాణికులు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. వాహన వినియోగదారులు తప్పకుండా ఇలాంటివి గుర్తుంచుకోవాలి. Just another day in the life of the All-New Scorpio-N. pic.twitter.com/MMDq4tqVSS — Mahindra Scorpio (@MahindraScorpio) March 4, 2023 -
అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతి..
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు కొత్త టూరిస్టు స్పాట్లు వెలుగు చూస్తున్నాయి. అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతిని పంచుతున్నాయి. పాల సంద్రాన్ని తలిపించే మంచు మేఘాలతో పాటు ఇప్పుడు హొయలొలికే కొత్త జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అంతెత్తునుంచి ఎగసిపడే జలసవ్వడులు సుమధుర సంగీత ఝరిలో జలకాలాడిస్తున్నాయి. వాటిని సందర్శించేందుకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలిస్తున్న సందర్శకులు అయిష్టంగానే తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడెంకొత్తవీధి/అరకులోయ రూరల్: జిల్లాలో కొత్తగా వెలుగులోకి వస్తున్న టూరిస్టు స్పాట్లు సైతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి అన్నట్టు ఉన్న కొత్త ప్రాంతాలను టూరిస్టులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. అనంతగిరి, లంబసింగి, తాజంగి, చెరువులవెనం, పాడేరులోని వంజంగి మేఘాల కొండలే కాదు. అంతకు మించిన ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు అరకులోయ, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో చాలా ఉన్నాయి. సప్పర్ల రెయిన్ గేజ్ గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్పర్ల రెయిన్‌గేజ్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ 24 గంటలూ అత్యంత శీతల వాతావరణంతోపాటు మంచు మేఘాలు చాలా కిందనుంచి సందర్శకులను తాకుతూ వెళుతుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దారకొండ దారాలమ్మ ఆలయంతోపాటు సీలేరు వెళ్లే పర్యాటకులంతా తప్పనిసరిగా ఇక్కడ రెయిన్‌గేజ్ వద్దకు వెళ్లి కాసేపు ఉండి ఇక్కడ అందాలను ఆస్వాదిస్తారు. గతంలో అప్పటి ఉమ్మడి విశాఖ కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత సీజనులో దూరప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తున్న పర్యాటకులసంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. రణజిల్లేడలో.. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో మరో అద్భుతమైన టూరిజం స్పాట్ చూపరులకు కనువిందు చేస్తోంది. పద్మాపురం పంచాయతీ రణజిల్లేడ జలపాతం ఇప్పటికే ప్రాచుర్యం పొందగా, దాని సమీపంలో అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింప చేస్తున్నాయి. ఇక్కడి మంచు సోయగాలు, సూర్యోదయ అందాలు ఆకర్షిస్తున్నాయి. మాడగడలో వ్యూ పాయింట్ కొద్ది రోజుల నుంచి పర్యాటకులతో సందడిగా మారిన మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ సోమవారం పర్యాటకులతో కిటకిటలడింది. వివిధ ప్రాంతల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు, తెల్లవారుజామునలో చల్లని వాతవరణంలో మంచు అందాలను వీక్షించి ఫొటోలు తీసుకుంటూ గడిపారు. మూడు కొత్త జలపాతాలు గూడెంకొత్తవీధికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లికి సమీపంలో దోనుగుమ్మల జలపాతం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వెళ్లేందుకు కొద్దిదూరం సీసీ రోడ్డు నిర్మిస్తే చాలు ఈప్రాంతానికి పర్యాటకంగా ఆదరణ లభించే అవకాశం ఉంది. దోనుగుమ్మల జలపాతానికి రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు తెలిపారు. జలపాతాలకు వెళ్లేందుకు రహదారి నిర్మాణానికి రూ.19లక్షలు మంజూరు చేసినట్టు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యరూపం దాల్చితే త్వరలోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంపంగిగొంది జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అనంతగిరి మండలం చిట్టంపాడు జలపాతం ఇటీవల వెలుగుచూసింది. అక్కడికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. -
విహారయాత్రలో విషాదం.. అమ్మాయిలు మృతి
సరదా కోసం వెళ్లిన విహారయాత్ర విద్యార్థులకు విషాదాన్ని నింపింది. వాటర్‌ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేసే క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నలుగురు విద్యార్థినిలు మృత్యువాతపడగా.. మరో యువతి ప్రాణాల కోసం ఆసుప్రతిలో పోరాడుతోంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కర్నాటలోని బెలగావికి చెందిన 40 మంది విద్యార్థినిలు పిక్నిక్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో టూర్ కోసం మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా కొల్హాపూర్ జిల్లాలోని కిట్వాడ్ వాటర్‌ఫాల్స్ వద్దకు చేరుకున్నారు. అనంతరం, యువతుందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో మృత్యువు వారిని వెంటాడింది. విద్యార్థినిలు సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ఐదుగురు యువతులు అదుపుతప్పి జలపాతంలో పడిపోయారు. ఈ క్రమంలో నలుగురు యువతులు మృతిచెందగా.. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది మరో యువతిని కాపాడారు. కానీ, ఈ ప్రమాదంలో సదరు యువతి తీవ్రంగా గాయపడటంతో ఆమెను వెంటనే బెలగావిలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక, మృతిచెందిన వారిని ఆసియా ముజావర్(17), కుద్రషియా హసమ్ పటేల్(20), రుక్కాషా భిస్తీ(20), తాస్మియా(20)గా గుర్తించారు. వీరి మృతి కారణంగా విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా ముగిసింది. Maharashtra: 4 college girls drown while clicking selfies at Kitwad waterfall in Kolhapur https://t.co/4dlwRCdYmP — TOI Cities (@TOICitiesNews) November 26, 2022 -
TSRTC: సుందర జలపాతాలు చూసొద్దాం రండి..
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. జలపాతాల సందర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రతి శని, ఆదివారాల్లో బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈప్రత్యేక బస్సులు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 55, 56) నుంచి, ఉదయం 5.30 గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 20) నుంచి బయల్దేరుతాయి. పర్యటనలో భాగంగా పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, పోచేరా జలపాతం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని, అనంతరం నిర్మల్ బొమ్మలు, హస్తకళలను సందర్శిస్తారు. రాత్రి 10.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. (క్లిక్: ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు) ఈ పర్యటనలో కుంటాల వద్ద మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో చేగుంట వద్ద రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. పిల్లలకు రూ.599, పెద్దవాళ్లకు రూ.1099 చొప్పున చార్జి ఉంటుంది. పర్యటన టిక్కెట్ల బుకింగ్ కోసం ఫోన్ : 7382842582 నంబర్‌ను సంప్రదించవచ్చు. (క్లిక్: పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
గోవాలో టూరిస్టులకు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్
Dudhsagar Water Falls.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, వర్షాల నేపథ్యంలో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాల వేళ గోవాలోని దూద్‌సాగర్ వాటర్‌ఫాల్స్ వద్ద పెను ప్రమాదం తప్పింది. 40 మంది పర్యాటకులను సిబ్బంది కాపాడారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా గోవాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాగా, శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షాలు కురవడంతో దూద్‌సాగర్ జలపాతం నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వాటర్‌ఫాల్స్ చూసేందుకు వచ్చిన 40 మందికి పైగా పర్యాటకులు నీటిలో చిక్కుకున్నారు. నీటిమట్టం పెరగడం వల్ల క్రాసింగ్ కోసం ఉపయోగించిన వంతెన కూలిపోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన దృష్టి లైఫ్‌సేవర్స్ పర్యాటకులను కాపాడారు. అనంతరం, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. The River Lifesaver rescued around 40 guests stuck at Dudhsagar Waterfall due to turning of crossing bridge where water level increased due heavy rainfall. I thank and congratulate the River Lifesavers for rescuing the tourists. pic.twitter.com/prw6yK69qi — Dr. Pramod Sawant (@DrPramodPSawant) October 14, 2022 ఈ సందర్భంగా లైఫ్‌సేవర్స్.. పర్యాటకులను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ ప్రాంతంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంతో కొద్దిరోజుల పాటు దూద్‌సాగర్ జలపాతంలోకి ఎవరూ వెళ్లకూడదని దృష్టి లైఫ్‌సేవర్స్ హెచ్చరించింది. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. ఈ సందర్భంగా పర్యాటకులను కాపాడిన లైఫ్ సేవర్స్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. Today evening due to heavy rain at Karnataka water level at Dudhsagar waterfall increase due to this crossing bridge got turn. around 40 Guest stuck and unable to cross River Lifesaver went on bridge and help one by one to cross bridge pic.twitter.com/TutWgQFci8 — Dev walavalkar (@walavalkar) October 14, 2022 -
‘నీళ్ల’పై తడాఖా.. జోరుగా ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు
సాక్షి, ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన గాయత్రి జలపాతం వద్ద శనివారం ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు నిర్వహించారు. అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు వివిధ దేశాల నుంచి 20 మంది యువతీ, యువకులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం విదేశీ యువతితోపాటు ఇద్దరు యువకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 30 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం విదేశీ యువతతోపాటు మరో 30 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. రెండు ఎత్తైన భారీ కొండల మధ్య నుంచి వస్తున్న గాయత్రి జలపాతం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గాయత్రి జలపాతం వద్ద ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు -
చూడముచ్చటైన జలపాతాలు.. అబ్బురపరిచే వ్యూపాయింట్లు
కనుచూపు మేర కనిపించే పచ్చని కొండలు.. జలజల జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే వ్యూ పాయింట్లు... పిల్లలను ఆకర్షించే పార్కులు.. బోటు షికారు.. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు.. పర్యాటకులను మురిపించి.. ఆహ్లాదపరిచే ప్రదేశాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా మన్యం అందాలను ఓ సారి తిలకిద్దాం. సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు... పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదపరుస్తున్నాయి. పచ్చని కొండల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట మండలాల్లో ఉన్న 9 జలపాతాల వద్ద ఏడాది పొడవునా నీటి సవ్వడి కనిపిస్తుంది. సీతంపేట ఏజెన్సీ అందాలను గత రెండేళ్లలో 2,58,580 మంది పర్యాటకులు తిలకించారు. సీతంపేటలో గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు మానవ జీవన చక్రం, గిరిజన ఆచార, సంప్రదాయాలు, పండగలు, ప్రపంచ దేశాల ఆదిమ తెగల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మెట్టుగూడ, సున్నపుగెడ్డ, ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్లు చూసేవారికి కనువిందు కలిగిస్తాయి. కొత్తలోకాన్ని చూపిస్తాయి. మెట్టుగూడ జలపాతాన్ని ఇటీవల కాలంలో సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. సున్నపుగెడ్డ, మల్లి, కొండాడ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జగతపల్లి వ్యూపాయింట్ వద్ద రీసార్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా జలవిహార్‌లో బోటు షికారు, ఆల్టర్న్ వెహికల్ వంటివి ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులు వివిధ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జెయింట్‌వీల్, హ్యాంగింగ్ బ్రిడ్జి, జలవిహార్‌లో బోటుషికారు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన 5డీ థియేటర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఈ ప్రదేశాలన్నీ వనసమారాధకులతో నిండిపోతాయి. పర్యాటక శాఖ ప్రతిపాదనలు ఇలా.. తొటపల్లి రిజర్వాయర్ వద్ద సమగ్ర పర్యాటక అభివృద్ధికి సుంకి ప్రాంతంలో 22.18 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. ఇక్కడ కార్తీకవనం, ఓపెన్ థియేటర్, ట్రైబుల్ మ్యూజియం, ట్రైబుల్ ఆర్ట్‌గ్యాలరీ అండ్ బజార్, హెలీప్యాడ్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉల్లిభద్ర ప్రాంతంలో 36 ఎకరాల్లో వైఎస్సార్ హార్టీకల్చర్ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. బోటింగ్ యాక్టివిటీ, రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్, స్పాసెంటర్, చల్లంనాయుడువలస వద్ద 3 ఎకరాల బర్డ్ శాంక్చూరీ వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. మూడు రోప్‌వేలు... సీతంపేట మండలం ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్, చంద్రమ్మతల్లి గుడి వద్ద మూడు రోప్‌వేల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగతపల్లి హిల్ రీసార్ట్ పనులు, గుమ్మలక్ష్మీపురం మండలంలో సవరకోటపాడు వద్ద హార్టికల్చర్ ఫారం పనులు చకచకా సాగుతున్నాయి. (క్లిక్: విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..) పర్యాటకాభివృద్ధికి కృషి జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. – నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి పర్యాటక రంగానికి పెద్దపీట పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మన్యం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు
అనంతగిరి(అరకులోయ): మన్యంలోని ప్రకృతి రమణీయత పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక్కడి సహజసిద్ధ అందాలను ఆస్వాదించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలను సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలను తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవు తున్నాయి. చదవండి: అమ్మ బాబోయ్ పులస.. అంత రేటా? ఈ నేపథ్యంలో మన్యంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జలపాతాల వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. కొంత మంది సరదాకు ఈతకు దిగి, మరికొంతమంది ప్రమాదవశాత్తూ జారిపడి, మరికొంత మంది సెల్ఫీలు, ఫొటోలు అంటూ అజాగ్రత్త వ్యవహరిస్తూ.. మృత్యువాతపడుతున్నారు. కన్నవాళ్లకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నారు. ఆకట్టుకునే జలపాతాల వెనుక అంతులేని విషాదగాథలెన్నో ఉన్నాయి. సరియా జలపాతం(అనంతగిరి) సరియా జలపాతం 2015లో బహ్య ప్రపంచానికి పరిచయం అయింది. ఈ జలపాతం వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇందులో 15 మందికి పైగా యువతే ఉన్నారు. కొంతమంది అజాగ్రత్త కారణంగా.. మరికొంతమంది ఈత రాక ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సరియా జలపాతం ఉరకలేస్తూ.. ప్రవహిస్తోంది. ఇక్కడకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోని స్థానికుల సూచనలు, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను చదివి అవగాహన పెంపొదించుకోవాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించవచ్చు. డుడుమ (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు) ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతం సుమారు 2,600 అడుగుల ఎత్తుల్లోంచి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు ఆరుగురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ జారిపడి మృత్యువాత పడ్డారు. హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినా.. పర్యాటకులు పెడచెవిన పెడుతున్నారు. పొల్లూరు(మోతుగూడెం) పొల్లూరు జలపాతం సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రాస్. అల్లరి నరేష్ నటించిన దొంగలబండి, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. చూసేందుకు జలపాతం అందంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తూ కొంత మంది, ఈతకు దిగి మరికొంత మంది మరణించారు. గాదిగుమ్మి(కొయ్యూరు) చూసేందుకు గాదిగుమ్మి జలపాతం అందంగా కనిపిస్తుంది. అందులో దిగితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 40 మందిపైగా పర్యాటకులు మృతి చెందారు. దూరం నుంచే జలపాతం అందాలను వీక్షిస్తే ప్రమాదాలు జరగావు. యువతా.. జాగ్రత్త జలపాతాలను తిలకించే క్రమంలో యువత ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వాళ్లే దూకుడుగా వ్యవహరించి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి.. ఈత సరదాలు.. సెలీ్ఫలు అంటూ అక్కడ పరిస్థితులపై అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబానికి కన్నీరు మిగులుస్తున్నారు. కుటుంబం తమపై పెట్టుకున్న ఆశలను తుంచేసి.. తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. వర్షాలకు రాళ్లు నాచుపట్టి ప్రమాదకరంగా ఉంటాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో జలపాతాలకు దూరంగా ఉండడమే మంచిదని అధికారులు, స్థానికులు సూచిస్తున్నారు. చాపరాయి(డుంబ్రిగుడ) చాపరాయికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అరకు–పాడేరు ప్రధాన రహదారి అనుకుని ఉండడంతో పాటు అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, పర్యాటకులు చాపరాయి అందాలను తిలకిస్తుంటారు. చాపరాయి వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు సుమారు 25 మందిపైగా మృత్యువాత పడ్డారు. ఈతకు దిగి ప్రమాదవశాత్తూ సొరంగంలోకి వెళ్లడంతో మృత్యువాత పడేవారు. అధికారులు చొరవ.. టెండర్‌దారుల సహకారంతో సొరంగం రాయిని బ్లాస్టింగ్ చేయడంలో ప్రమాదాలు తప్పాయి. అయినప్పటికీ అప్రమత్తత అవసరం. గుడ్డిగుమ్మి(హుకుంపేట) హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీ జెండాకొండ మార్గమధ్యలో ఉన్న గుడ్డిగుమ్మి జలపాతం బహ్యప్రపంచానికి పరిచయమై ఏడాదే అయింది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మత్యువాతపడ్డారు. సరదాగా ఈతకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వీళ్లంతా హుకుంపేట మండలానికి చెందిన వాళ్లే. దాలమ్మతల్లి(సీలేరు) సీలేరు దాలమ్మతల్లి జలపాతం 100 అడుగులు ఎత్తుల్లోంచి జాలువారుతుంది. గుడి బయట నుంచి జలపాతం తిలకిస్తే ప్రమాదాలు జరగవు. జలపాతం పక్కనున్న కొండపై సెలీ్ఫలు, ఫొటోలు దిగేందుకు వెళ్లి 20పైగా మృత్యువాతపడ్డారు. ఏటా ఇద్దరు, ముగ్గురు ఇక్కడ ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ►పర్యాటకులు ఎట్టి పరిస్థితిలోనూ జలపాతం కొండలపై ఎక్కడం చేయకూడదు. ఎందుకంటే ఆ బండరాళ్లపై నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల అవి నాచుపట్టి ఉంటాయి. వాటిపై ఎక్కితే జారిపడి పోయే ప్రమాదం ఉంది. ►సెల్ఫీల కోసం జలపాతం లోపల ఉన్నా ఎత్తైన బండలను ఎక్కకూడదు. ►నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న ప్రదేశంలో స్నానాలు చేయకూడదు. ►జలపాతాలకు వెళ్తున్న సమయంలో ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి. ►ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సహసించద్దు. ►వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడమే మేలు. ►జలపాతాలకు ఒక్కరుగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం జలపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. యువత జలపాతాల వద్దకు వెళుతూ దూకుడుగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హెచ్చరికలు ఉన్నా పట్టించుకోవడం లేదు. దూరంగా జలపాతాల అందాలు వీక్షించడమే మేలు. – కరక రాము, ఎస్ఐ, అనంతగిరి -
Puli Gundala Project: కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగం
సాక్షి, ఖమ్మం: పచ్చని కొండలు, చిక్కని అటవీ ప్రాంతం.. ఆహ్లాదకరమైన వాతావరణానికి తోడు పక్షుల కిలకిలరావాలతో సందడిగా ఉండే పులిగుండాల ప్రాజెక్టు పర్యాటకులను రా.. రామ్మని ఆహ్వానిస్తోంది. ఇక్కడ ఎంతసేపు చూసినా తనివితీరని ప్రకృతి అందాల సోయగాలు కనువిందు చేస్తున్నాయి. పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో గిరిజన రైతుల భూములు సాగు అవసరాల నిమిత్తం కొండల నడుమ పులి గుండాల సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కొండల నడుమ అటవీప్రాంతంలో ఉండడంతో సాగునీటి అవసరాలు తీరుస్తూనే పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టుతో పాటు నీలాద్రీశ్వర అటవీప్రాంతం, లంకాసాగర్ ప్రాజెక్టులు చెప్పుకోదగిన పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దుకున్నాయి. అటవీశాఖ ఈ పులిగుండాల ప్రాజెక్టు వద్ద వాచ్ టవర్ నిర్మించి రక్షిత అటవీ ప్రాంతాన్ని కాపాడుతోంది. రెండేళ్ల క్రితం పులిగుండాల సాగునీటి ప్రాజెక్టు వద్ద పులి జాడలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో ఇక్కడ వన్యప్రాణుల సంతతి అభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తద్వారా పాపికొండలు, ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా వారాంతాల్లో జిల్లా వాసులు సరదాగా గడిపేందుకు అద్భుతమైన పర్యాటక ప్రాంతం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. చదవండి: యాక్టర్‌గా మారిన టీచర్.. ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్న యూట్యూబర్ అనిల్ పులిగుండాల ప్రాజెక్టు వద్ద శివాలయం... రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకులు జిల్లాలోని పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, సత్తుపల్లితో పాటు ఏపీలోని తిరువూరు తదితర ప్రాంతాల ప్రజలు పులిగుండాల ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు బారులు తీరుతున్నారు. ఆదివారాల్లో ఇక్కడకు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వచ్చే వారితో సందడి కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు వద్ద స్థానికులు శివాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి పలువురు ఐఏఎస్‌లు, ఐసీఎస్లతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వారంతాల్లో వచ్చి అటవీశాఖ ఆధ్వర్యాన నిర్మించిన వాచ్ టవర్ (పాలపిట్ట భవనం) నుంచి అటవీ అందాలు తిలకిస్తూ సేద తీరుతుంటారు. అటవీ ప్రాంతంలో నిర్మించిన పులిగుండాల ప్రాజెక్టును చేరుకోవాలంటే బ్రహ్మళకుంట నుండి సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర మట్టిరోడ్డుపై ప్రయాణించాల్సి వస్తోంది. ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నందున... అధికారులు పరిగణనలోకి తీసుకుని బ్రహ్మళకుంట నుండి పులిగుండాల ప్రాజెక్టు వరకు రహదారి నిర్మిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అంతేకాకుండా పాలపిట్ట పేరిట వాచ్‌టవర్(భవనం)ను నిర్మించినా విశ్రాంతి గదులు, టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు విద్యుత్, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చు. వాచ్ టవర్‌కు సోలార్ ద్వారా విద్యుత్‌సౌకర్యం, బోరు, మోటారు ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే అటవీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. -
పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం
కరోనా దెబ్బకు కుదేలైన పర్యాటక రంగం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు పూర్తిస్థాయిలో పుంజుకుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, డముకు వ్యూ పాయింట్, కటికి, తాటిగుడ జలపాతాలు, అరకులోయలో పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్, డుంబ్రిగుడలోని చాపరాయి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అనంతగిరి/అరకులోయ: కరోనా కారణంగా మన్యంలో మూతపడిన పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభమైన తరువాత మండలంలోని బొర్రా గుహలతో పాటు మిగతా వాటికి సందర్శకులు తాకిడి పెరిగింది. గత రెండేళ్ల కన్నా ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. 2020 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 1,80,260 మంది సందర్శించగా రూ.131.35 లక్షల ఆదాయం లభించింది. 2021 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2,61,000 మంది సందర్శించగా రూ.187 లక్షల ఆదాయం సమకూరింది. 2021 సంవత్సరం కంటే ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య సుమారు 80 వేలు అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి జూలై వరకు 2,22,653 మంది సందర్శించగా రూ.161.21 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు సుమారు మూడు లక్షల మంది సందర్శించగా సుమారు రూ.200 లక్షలు ఆదాయం లభించింది. అరకులోయలో... గత ఏడాది అక్టోబర్ నెల నుంచి అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియంతో పాటు చాపరాయి జలపాతం ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా తరలివస్తున్నారు. గత 12నెలల్లో అరకులోయ గిరిజన మ్యూజియాన్ని 3 లక్షల మంది, పద్మాపురం గార్డెన్‌ను సుమారు 2.50 లక్షల మంది సందర్శించారు. సుమారు రూ.2 కోట్ల ఆదాయం లభించింది. చాపరాయి జలపాతం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరగడంతో టూరిజంశాఖకు చెందిన రిసార్టులు, రెస్టారెంట్ల ఆదాయం భారీగా సమకూరుతోంది. (క్లిక్: వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే..) పెరిగిన పర్యాటకులు బొర్రా గుహలను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. బొర్రాలోని సదుపాయలు కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – బాబుజీ డీవీఎం పర్యాటకశాఖ -
వావ్ అనిపించే వాటర్‌ఫాల్స్.. చూపు తిప్పుకోలేరు!
సాక్షి, ముంచంగిపుట్టు: పరవళ్లు తొక్కుతున్న నదీ జలాలు.. వాగులు, సెలయేర్లు.. కొండలు, కోనలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మన్యంలో అద్భుత దృశ్యంగా పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో జలపాతాలు హొయలొలుకుతున్నాయి. తొలకరి వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జలపాతాల నీటి ఉధృతికి తోడై మరింత కనువిందు చేస్తున్నాయి. చిన్న జలపాతాలు సైతం ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో డుడుమ జలపాతం 2,700 అడుగుల పైనుంచి మంచు తెరల మధ్య జాలు వారుతూ ఆహ్లాద పరుస్తోంది. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ జడిగూడ జలపాతం సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం నింగికి ఎగసి పడుతున్నట్లు కనిపిస్తోంది. బరడ పంచాయతీ హంశబంద, జర్జుల పంచాయతీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వీటిని చూసేందుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి విశేష అనుభూతిని పొందుతున్నారు. అక్కడ చుట్టు పక్కల వంటలు చేస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ, సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. పాల కడలి స్నోయగాలు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్ పొగమంచు, మేఘాలతో గురువారం ఉదయం పాలసముద్రంలా దర్శనమిచ్చింది. వేకువజాము నుంచి ఉదయం 10గంటల వరకు కొండల నిండా మంచు పరుచుకుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించి పరవశించారు. – సాక్షి, పాడేరు -
Photo Feature: మన్యం అందం.. ద్విగుణీకృతం
కవుల వర్ణనలో కనిపించే అందాలెన్నో మన్యంలో కనువిందు చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలు సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలకు తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రకృతి పచ్చని తివాచీ పరిచిందా అన్నట్లు అబ్బురపరిచే పొలాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సీలేరు జలాశయం వ్యూ పాయింట్, గుంటవాడ డ్యాం, సీలేరు సమీపంలోని తురాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, గుర్రాయి, ఎగ కంఠవరంలోని అక్కాచెల్లెల జలపాతాలు, కుంబిడిసింగి మార్గంలో జలపాతం అందాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. అరమ, సొవ్వ, సాగర, కొర్రా తదితర ప్రాంతాలు పచ్చదనంతో ముచ్చటగొల్పుతున్నాయి. కొండ ప్రాంత అందాలకు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. – సీలేరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
'రివర్స్ వాటర్ ఫాల్'.. ఎక్కడో కాదు మన దేశంలోనే
ముంబై: ఎత్తైన కొండల నుంచి కిందికి జాలువారే జలపాతాల్ని చాలానే చూసి ఉంటాం. కానీ గాల్లో పైపైకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? అలా ఎలా అనుకుంటున్నారా? అవునండి అది నిజమే.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం ఎక్కడో కాదు మన దేశంలోనే కనువిందు చేస్తోంది. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఈ ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత్ నంద.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం అద్భుత దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాదు.. అసలు ఇలా రివర్స్ వాటర్‌ఫాల్ ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని వివరించారు. గురుత్వాకర్షణ, గాలి ఒకదానినొకటి వ్యతిరేక దిశలో సమానంగా ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు. పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ వద్ద ఆదివారం ఇదే జరిగిందంటూ దానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. When the magnitude of wind speed is equal & opposite to the force of gravity. The water fall at its best during that stage in Naneghat of western ghats range. Beauty of Monsoons. pic.twitter.com/lkMfR9uS3R — Susanta Nanda IFS (@susantananda3) July 10, 2022 వర్షాకాల సోయగం.. ఈ ప్రకృతి అద్భుతాన్ని 'వర్షాకాల సోయగం'గా అభివర్ణించారు నంద. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షల వీక్షణలు, 15వేలకుపైగా లైక్‌లు సంపాదించింది. చాలా మంది ఆ అద్భుతంపై కామెంట్లు చేశారు. 'ఆ ప్రాంతాన్ని నేను సందర్శించాను. అది భూలోక స్వర్గం' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. 'దీనికన్నా సుందరమైనదాన్ని ఇప్పటి వరకు చూడలేదు' అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: IndiGo Airlines: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
పాల ధారల జలపాతాలు చూసొద్దామా!
-
తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. కనువిందు చేస్తున్న ఆ 5 జలపాతాలు
రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు అలుపెరుగక పరుగెడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.. 1. ములుగు జిల్లాలో కొండలపై నుంచి జాలువారుతున్న ముత్యంధార 2. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల (బాహుబలి) జలపాతం 3. మహబూబాబాద్ జిల్లా మిర్యాలపెంట గ్రామశివారులోని ‘ఏడుబావుల’ ఉరకలు 4. నిర్మల్ జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న పొచ్చర 5. నాగర్‌కర్నూలు జిల్లా నల్లమలలోని మల్లెలతీర్థం. -
AP: టూరిస్ట్ స్పాట్‌గా ఉబ్బలమడుగు.. వాటర్ ఫాల్స్ స్పెషల్ అట్రాక్షన్
వరదయ్యపాళెం: స్వచ్ఛమైన నీరు, గాలి, పచ్చటి అడవి.. పక్షుల కిలకిలారావాలు, కొండ కోనల్లోంచి నిరంతరం ప్రవహించే సెలయేరు... జలపాతం, చుట్టూ ఎతైన కొండలు... ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉబ్బలమడుగు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తోంది. అటవీశాఖ ఎకో టూరిజం అభివృద్ధి పనులతో ఉబ్బలమడుగు వేసవి విడిది ప్రదేశంగా కొత్త అందాలను దిద్దుకుంటోంది. వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల సరిహద్దుల్లో కాంబాకం రిజర్వు ఫారెస్టులో ఉబ్బలమడుగు వరదయ్యపాళెం నుంచి 10కిలోమీటర్లు దూరంలో ఉంది. ఒకరోజు విహారయాత్రకు ఇది చక్కటి ప్రదేశం. ఆహ్లాదం, విజ్ఞానం పర్యాటకులకు ఆహ్లాదం పంచడంతోపాటు విజ్ఞానం అందించే దిశగా అటవీశాఖ చెట్లు, వాటి శాస్త్రీయ నామం, పుట్టుక లాంటి విశేషాలను దారి పొడవునా పేర్లతో సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. రాజులు వాడిన ఫిరంగి, టన్ను బరువు ఉన్న తిరగలి, పూసలదిబ్బ, ఎలిజబిత్ రాణి బంగ్లా, పాలేగాళ్లు, వారి తోటలు.. ఇలా అన్నింటినీ పర్యాటకులు చూడదగినవే. చూడాల్సిన ప్రాంతాలు వరదయ్యపాళెం నుంచి 7కి.మీ ప్రయాణిస్తే అవంతి ఫ్యాక్టరీ వస్తుంది. ఈ ఫ్యాక్టరీని దాటితే రిజర్వు ఫారెస్టు మెుదలవుతుంది. ఫారెస్టు మెుదట్లో తెలుగుగంగ కాలువ, టోల్ గేట్ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి సుమారు 12 కి.మీలలో సెలయేరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. దీని పక్కన వరుసగా తంతి పందిరి, దొరమడుగు, సీతలమడుగు, తంగశాల, పెద్దక్కమడుగు, ఉబ్బలమడుగు, సిద్ధేశ్వరగుడి, సద్దికూటి మడుగు, అంజూరగంగ, దోగుడుబండ జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సీతాళం అని పిలుస్తారు. సిద్ధేశ్వరగుడి నుంచి 3 కిలోమీటర్లు కొండపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో పర్యాటకులు ఉబ్బలమడుగుకే పరిమితవుతారు. ఈ ప్రాంతాలను సందర్శించడానికి అటవీశాఖ నావువూత్రపు రుసుంతో సహాయకులను నియమించింది. తంతిపందిరి(తన్నీర్ పందల్) ఒకప్పుడు బ్రిటీష్ పాలకులు చేపల పెంపకం కోసం ఎంపిక చేసిన ప్రాంతమై ఈ తన్నీర్ పందల్ ఇప్పుడు తంతిపందిరిగా మారింది. వరదయ్యపాళెం నుంచి ఇక్కడి వరకు తారు రోడ్డు ఉంది. ఉబ్బలమడుగు వరకు వెళ్లలేనివారు ఇక్కడి మడుగులోనే సేదదీరుతుంటారు. ఉబ్బలమడుగు(ఉపరి మడుగు) తంతి పందిరి నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉబ్బలమడుగు ఉంది. వాహనాలలో వెళ్లేందుకు గ్రావెల్ మార్గం ఉంది. 1953 ప్రాంతంలో చిత్తూరుకు చెందిన శ్రీనివాసన్ బ్రిటీష్ మిలటరీలో కీలక స్థానంలో విధులు నిర్వహించి తన రిటైర్మెంట్ తర్వాత విశ్రాంత జీవనం కోసం ఈ ప్రాంతాన్ని అంగ్లపాలకుల నుంచి ఇనాంగా పొందారు. ఇక్కడే దొరమడుగు, మామిడి చెట్ల మడుగు, తంగశాలమడుగు, పూలమడుగు, చద్దికూటి మడుగులున్నాయి. శివరాత్రి రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. మిగిలిన సమయాల్లో ఆటోలు నడుస్తుంటాయి. సిద్ధులకోన పూర్వం మునులు ఈ ప్రాంతంలో ఉండటం మూలాన సిద్ధులకోన అనే పేరు వచ్చింది. ఇక్కడకు వెళ్లాలంటే ట్రాక్టరు వంటి వాహనాల్లోగానీ కాలినడకన 2కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు పక్కనే ఉన్న సిద్ధుల మడుగులో స్నానమాచరించి సిద్ధేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దిగువ శీతాలం లోతైన మడుగులు, నిలువెత్తు జలపాతాలకు నెలవు ఈ దిగువశీతాలం. రెండు కొండ చరియల నడుమ ఉన్న ఈ ప్రాంతాల్లో ఎటుచూసినా తేనెతుట్టెలు కనిపిస్తుంటాయి. సిద్ధులకోన నుంచి కొండబండల నడుమ 2కి.మీ దూరం కాలినడకన దిగువశీతాలం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడున్న నీటి మడుగులు రెండు తాటిచెట్లకు పైగా లోతున్నా నీరు స్వచ్ఛంగా ఉండడంతో లోపల ఉన్న రాళ్లు సైతం కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తూంటాయి. నీటి మడుగులోకి దిగితే ఎంత వేసవిలోనైనా చలితో వణుకు తెప్పిస్తాయి. పర్యాటకులకు మరిన్ని వసతులు ఉబ్బలమడుగుకు వచ్చే సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే కొన్ని వసతులు కల్పించాం. జలపాతాల వద్ద బోటింగ్ పార్కులు, మరో వన్య పాయింట్, విశ్రాంత గదులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనికి సంబంధించి రూ. 2కోట్ల నిధులు అవసరముంది. నిధులు కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. –జి. జయప్రసాదరావు,ఎఫ్ఆర్ఓ, సత్యవేడు -
Meenmutty Waterfalls: మీన్ముట్టి జలపాతం.. అద్భుతానికే అద్భుతం
మీన్ముట్టి... జలపాతం... వయనాడు తలమీద జల కిరీటం. వెయ్యి అడుగుల ఎత్తు నుంచి దూకే ప్రవాహవేగం తెల్లగా ... పాలధారను తలపిస్తుంది. నీటిచుక్కల సవ్వడి... ఝంఝామారుతాన్ని గుర్తు చేస్తుంది. కేరళ రాష్ట్రం అనగానే మనకు ఇండియా మ్యాప్‌లో దక్షిణాన అరేబియా సముద్రతీరానికి ఆనుకుని ఉన్న సన్నటి స్ట్రిప్ గుర్తుకు వస్తుంది. కేరళలో నివాస ప్రాంతాలన్నీ అరేబియా తీరానే ఉన్నాయేమో అని కూడా అనుకుంటాం. కానీ సాగరతీరాన్ని తాకకుండా కొన్ని జిల్లాలున్నాయి. వాటిలో ఒకటి వయనాడు. ఇది ఓ దశాబ్దం కిందట పర్యాటక ప్రదేశంగా బయటి ప్రపంచానికి పరిచయమైంది. రాహుల్‌గాంధీ 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడంతో వయనాడు దేశమంతటికీ సుపరిచయమైంది. పశ్చిమ సుగంధం వయనాడు సుగంధ ద్రవ్యాలు పుట్టిన నేల. పశ్చిమ కనుమల మీద విస్తరించిన హిల్‌స్టేషన్, ఏడు వేల అడుగుల ఎత్తు ఉంటుంది. టూరిజం ఆధారంగా అభివృద్ధి చెందిన హోటళ్లు పెద్ద పెద్ద హోర్డింగులతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంటాయి. కొండ పైకి వెళ్లే కొద్దీ లోయలో పెరిగిన కొబ్బరి చెట్ల తలలు రోడ్డుకు సమాంతరంగా కనిపిస్తుంటాయి. కొబ్బరి, పోక, కాఫీ, టీ, ఏలకులు, మిరియాలు, లవంగాల చెట్లు, అక్కడక్కడా మామిడి, పేర్లు తెలియని లెక్కలేనన్ని జాతులు... అన్ని ఆకులూ పచ్చగానే ఉన్నా, దేని పచ్చదనం దానిదే. ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ అందంగా ఉంటాయి. వయనాడుకు వెళ్లే దారిలో కొండల్లో ప్రమాదకరమైన మలుపులున్నాయి. వాటిని హెయిర్‌పిన్ బెండ్లు అంటారు. మీన్ముట్టికి వెళ్లే దారిలో... వయనాడు కొండ మీదకు చేరేలోపు ఒక చోట పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టుకు రెండు పెద్ద ఇనుప గొలుసులు ఉంటాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఒక విదేశీయుడు గిరిజనులు నివాసం ఉండే ఈ ప్రదేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి బయలుదేరాడు. దట్టమైన కొండల్లో దారి తప్పి పోకుండా ఉండడానికి స్థానిక గిరిజనుడిని సహాయంగా తీసుకెళ్లాడని, ఆ గిరిజనుడి మార్గదర్శనంతో దారి తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి తను మాత్రమే తెలియాలనే దురుద్దేశంతో ఆ విదేశీయుడు, తనకు సహాయం చేసిన గిరిజనుడిని ఈ చెట్టుకు గొలుసులతో కట్టేశాడని చెబుతారు. అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణం తర్వాత పూకాట్ లేక్‌కు చేరుకుంటాం. కొండల మీద ఉన్న పెద్ద మంచి నీటి సరస్సు ఇది. ఇందులో బోట్ షికారు చేయవచ్చు. మీన్ముట్టి జలపాతానికి చేరాలంటే ట్రెక్కింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పూకాట్ సరస్సులో బోటింగ్‌కి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడమే మంచిది. పూకాట్ నుంచి ముందుకు సాగే కొద్దీ జనం ఆనవాళ్లు తగ్గుతుంటాయి. జలపాతం రెండు కిలోమీటర్లు ఉందనగా రోడ్డు ఆగిపోతుంది. అక్కడి నుంచి కొంత దూరం రాళ్ల బాటలో నడక. తర్వాత కొండవాలులో నడక. ఫారెస్ట్ సెక్యూరిటీ పాయింట్ దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. వాళ్ల రిజిస్టర్లో మన పేరు, ఊరు, ఫోన్ నంబరు రాయాలి. బృందంలో ఎంతమంది ఉంటే అన్ని కర్రలతో ఒక గార్డును సహాయంగా వస్తాడు. ఆ చెక్ పాయింట్ నుంచి ముందుకు వెళ్లిన వాళ్లు తిరిగి ఆ పాయింట్‌కు చేరే వరకు బాధ్యత వాళ్లదే. అదో జానపద చిత్రమ్ కొండవాలులో దట్టమైన అడవిలో ట్రెకింగ్. చెట్లకు పెద్ద పెద్ద తాళ్లు కట్టి ఉంటాయి. గార్డు పర్యాటకుల చేతికి కర్రలిచ్చి, ముందుగా తాను నడుస్తూ, ఎక్కడ రోప్‌ను పట్టుకోవాలో హెచ్చరిస్తూ తీసుకెళ్తాడు. ఎక్కువ లగేజ్ లేకపోతే ట్రెకింగ్ సులువుగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఎదురుగా కనిపించే కొండ తమిళనాడుది, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు కూడా కనిపిస్తాయి. నడుస్తూ ఉంటే చెట్ల సందుల్లో జలపాతం కనిపిస్తూనే ఉంటుంది. సవ్వడి వినిపిస్తూ ఉంటుంది. పొరపాటున కాలు జారితే... లోయలో ఎక్కడకు చేరుతామో కూడా ఊహించలేం. ‘ఇంతదూరం వచ్చిన తర్వాత భయపడి వెనక్కి పోవడమేంటి’ అని మనసులో సాహసాన్ని ఒడిసిపట్టుకుని ముందుకు నడిస్తే అద్భుతానికే అద్భుతం ఆవిష్కారమవుతుంది. అదే మీన్ముట్టి జలపాతం. పచ్చటి చెట్ల మధ్య తెల్లటి నీటిధారలు. ఆ జల్లులో తడిస్తే తప్ప టూర్ పరిపూర్ణం అనిపించుకోదు. మీన్ ముట్టి అంటే... చేపలకు అడ్డుకట్ట అని అర్థం. – వాకా మంజులారెడ్డి -
కొత్త అందాలు: సిక్కోలు ‘నయాగరా’ చూశారా..
పై మొదటి ఫొటో చూశారా..! అచ్చం నయాగరా జలపాతాన్ని తలపించేలా ఉంది కదా. దట్టమైన అడవి మధ్య.. కనువిందు చేసే ప్రకృతి సోయగాల వడిలో పర్యాటకుల్ని రా.. రమ్మని పిలుస్తోన్న ఈ ప్రదేశం ఎక్కడో తెలుసా..! మందస మండలంలోని బుడారిసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆంధ్రా– ఒడిశా మధ్య కళింగదళ్ రిజర్వాయర్ ఎగువ భాగంలో కొండలపై నుంచి దూకుతున్న జలపాతమిది. దీన్ని బత్తర్సాయి జలపాతంగా పిలుస్తున్నారు. రెండో చిత్రం చూశారా? వనగిరుల నుంచి స్వచ్ఛమైన జలధార ఎలా కిందికి జారుతుందో..! పచ్చందాల మధ్య చెంగున దూకుతూ కనువిందు చేస్తున్న ఈ జల పాతం మందస మండలం చీపి పంచాయ తీలోని దాలసరి అనే చిన్న గిరిజన కుగ్రామం సమీపంలోనిది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కరోనా లాక్డౌన్ కాలంలో బయట ప్రపంచానికి పరిచయమైన సుందరమైన జలపాతాలివి. ఈ రెండే కాదు భామిని మండలం నులకజోడు గ్రామ సమీపంలో గల తువ్వకొండలో మరో జలపాతం వెలుగు చూసింది. పిల్లలు సరదాగా అటవీ ప్రాంతంలోకి వెళ్లే సరికి ఈ జలపాతాలు దర్శనమిచ్చాయి. దీంతో ఇప్పుడందరి దృష్టి జలపాతాలపై పడింది. పేదల ఊటీగా సిక్కోలు జిల్లాను చెబుతారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ చల్లగా ఉంటుందని అంటారు. ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదులు, ఇంకోవైపు అటవీప్రాంతం, మహేంద్ర గిరులు ఇలా ఒకటేంటి చల్లదనాన్ని ఇచ్చే ఎన్నో వనరులు సిక్కోలు సొంతం. ఇప్పుడు ఆ జాబితాలోకి జలపాతాలు వచ్చి చేరాయి. ఇప్పటికే సీతంపేట గిరిజన మండలంలో ఎనిమిది జలపాతాలు, భామిని మండలంలో ఒక జలపాతం ఉన్నాయి. తాజాగా మందసలో రెండు, భామినిలో ఒకటి బయటపడ్డాయి. పర్యాటక శాఖ, అటవీశాఖ సంయుక్త సర్వే చేపడితే జిల్లాలో ఉన్న జలపాతాల లెక్క తేలే అవకాశం ఉంది. జలపాతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. జిల్లాలో ఇప్పటికే ఉన్న ఎనిమిది జలపాతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సుమారు రూ. 4 కోట్లతో పనులు చేపట్టాలని పర్యాటక నిర్ణయించింది. అందులో సీతంపేట మండలంలో మెట్టుగూడ, దోనుబాయి జలపాతాలను రూ. 60లక్షలతో ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు మాస్టర్ ప్లాన్ ద్వారా మరికొన్ని పనులు చేపడుతున్నారు. మెట్టగూడ జలపాతాన్ని రూ. 50 లక్షలతో, సున్నపుగెడ్డ జలపాతాన్ని రూ. 45లక్షల తో, కుసిమి జలపాతాన్ని రూ. 27లక్షలు, తొత్తడి జలపాతాన్ని రూ. 21లక్షలు, మెకువ జలపాతాన్ని రూ. 46లక్షలు, బెనరాయి జలపాతాన్ని రూ.30లక్షలు, సవరగోడి జలపాతాన్ని రూ.75లక్షలు, పండరాయి జలపాతాన్ని రూ. 41లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అలాగే భామిని మండలం నల్లరాయి గూడ జలపాతం వద్ద కూడా అప్రోచ్ రోడ్డు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ‘కొత్త’ జలపాతాలపై మంత్రి సీదిరి దృష్టి... కొత్తగా బాహ్య ప్రపంచానికి తెలిసిన మందస మండలంలో దాలసరి, బత్తర్సాయి జలపాతాలపై రాష్ట్ర పశు, మత్స్య శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టిసారించారు. తన సొంత నియోజకవర్గంలో వెలుగు చూసిన జలపాతాలు గురించి తెలుసుకుని, వాటి అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఇప్పటికే దాలసరి జలపాతం వద్దకు లోయల మీదుగా వెళ్లి తిలకించారు. ఎలాగైనా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధి చేస్తాం... జిల్లాలోని జలపాతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. కొత్తగా వెలుగు చూసిన జలపాతాలపై మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టి సారించారు. త్వరలో మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తాం. పర్యాటకులు సురక్షితంగా జలపాతాలను వీక్షించేలా సౌకర్యాలు కల్పిస్తాం –నారాయణరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి -
ఏడాది కాలంలో నలుగురిని మింగిన 'ఆ' జలపాతం!
సాక్షి, ఇల్లెందు: ఏడు బావుల జలపాతం మృత్యు కుహురంగా మారుతోంది. రెండో రోజుల క్రితం ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడేనికి ఇద్దరు యువకులు విహారానికి వెళ్లగా.. ఒకరు మృతి చెందిన విషయం విదితమే. అప్పటి నుంచి మరో యువకుడి ఆచూకీ తెలియకుండాపోయింది. గురువారం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరోసారి జలపాతం వద్దకు వెళ్లి వెతకగా మృతదేహం లభించింది. ఏడాది కాలంలో ఇక్కడ నలుగురు యువకులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం సరిహద్దుల్లో ఉన్న ఏడు బావుల జలపాతం ప్రమాదభరితంగా మారుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. ఇల్లెందు మండలం రాఘబోయినగూడేనికి చెందిన పొగాకు నాగేశ్వరరావు, లలిత దంపతుల కుమారుడు సురేష్ (22), తన స్నేహితుడు దొడ్డా మహేష్(16)తో కలిసి గత మంగళవారం సాయంత్రం సరదాగా ఏడుబావుల జలపాతానికి వెళ్లారు. జలపాతం తిలకిస్తున్న క్రమంలో పైనుంచి జారి బావిలో పడిపోయారు. ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. మరుసటి రోజు అటు వైపునకు వెళ్లిన కొందరు సురేష్ మృతదేహాన్ని గమనించి ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. అప్పటికే రాఘబోయినగూడేనికి చెందిన ఇద్దరు యువకులు కనిపించటం లేదని కుటుంబ సభ్యులు వెతకసాగారు. వాట్సాప్‌లో ఫొటోలు చూసి సురేష్ వేసుకున్న దుస్తులు, ద్విచక్ర వాహనం గమనించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జలపాతం వద్దకు వెళ్లారు. అప్పటికే గంగారం పోలీసులు మృతదేహాన్ని పాఖాల కొత్తగూడ తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. జారి పడి.. సొరికేలో ఇరుక్కుపోయి.. తన స్నేహితుడు సురేష్ గుట్ట పైనుంచి జారి పడి చనిపోయిన సంఘటనను చూసిన మహేష్ భయానికి పారిపోయి ఉంటాడని అంతా భావించారు. కానీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో గురువారం మరోసారి సంఘటన స్థలానికి వెళ్లి బావుల్లో వెతికారు. బావి లోపల పడిపోయి ఓ సొరికేలో ఇరుక్కుని ఉండటాన్ని గమనించి బయటకు లాగారు. ఆ మృతదేహం మహేష్దిగా గుర్తించారు. గంగారం పోలీసులకు సమాచారం అందించగా, వారు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పాఖాల కొత్తగూడ తరలించారు. మహేష్ చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి నాగమణితో కలిసి అమ్మమ్మ దేవనబోయిన మంగమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. నాగమణికి ఇద్దరు కుమారులు కాగా మహేష్ పెద్ద కుమారుడు. రాఘబోయినగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏడు బావుల అందాలను తిలకించేందుకు వెళ్లి మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలానికి పురుగు మందులు తీసుకొస్తామని వెళ్లి.. పొలానికి పురుగు మందుల తీసుకొస్తామని చెప్పి సురేష్, మహేష్‌లు రాఘబోయినగూడెం నుంచి ఇల్లెందుకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు రాఘబోయినగూడెం వారికి ఇల్లెందులో కనిపించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారికి ఏడు బావుల జలపాతం తిలకించాలని ఆలోచన ఎందుకు వచ్చిందో కాని అక్కడి వెళ్లారు. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో వర్షం కురిసినట్లు ఆ ఏరియా వాసులు, చేన్ల వద్ద పనులు చేసే వారు పేర్కొంటున్నారు. గుట్ట పైకి వెళ్లిన తర్వాత, వర్షం కురుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయాలపాలై ఉండటం, బావుల్లో పడిపోవటం వల్ల మృతి చెంది ఉంటారని సంఘటన స్థలాన్ని చూసిన వారు చెబుతున్నారు. ప్రమాదభరితంగా ఉన్న ఏడు బావుల జలపాతాన్ని నిషేధిత స్థలంగా ప్రకటించాలని, గుట్టపైకి వెళ్లేందుకు రక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎన్నారైల నీటి ప్రమాదాలపై ‘టాటా’ ఆందోళన
ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో అమెరికా బాటపడుతున్న తెలుగు యువత అవి నెరవేరకముందే అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కలల్ని మోసుకుంటూ ఉన్నత దిశగా ఎదగాలని, వారి మీదే ప్రాణాల్ని పెట్టుకున్న కుటుంబ సభ్యులకి మంచి జీవితం ఇవ్వాలనే కోరికలతో వెళ్లి ఇలా విదేశాల్లో ప్రమాదాల బారిన పడి అయినవారికి తీరని శోకాన్ని మిగల్చడం బాధాకరం. అమెరికా గడ్డపై ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వాటిలో కూడా సరదా కోసం నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో పీజీ చేస్తున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు కౌశిక్ ఓలేటి, కొయ్యలముడి అజయ్‌లు సెప్టెంబరు 3న నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ప్రమాదాలపై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) ఆందోళన వ్యక్తం చేసింది. టాటా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మహేష్ ఆదిభట్ల దీనిపై ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. నీటిలో మునిగి చనిపోవడం వల్ల అమెరికాలో ఏడాదికి 3,72,000మంది చనిపోతున్నారు. ఈ మరణాలలో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగడం మా దృష్టికి వచ్చింది. సరైన అవగాహన లేక నదులు, జలపాతాలలోకి దిగి ప్రాణాలు విడుస్తున్నారు. కొందరు తమ మాతృదేశంలో మంచి ఈత వచ్చిన వారు కావొచ్చు. అలా అని అమెరికాలోని నదులలో ఈత అంత సులభం కాదు. మన నదుల తీరు వేరు. ఇక్కడి పరిస్థితులు వేరు. ఇవేవి తెలియకుండా భారత్‌లో ఈత కొట్టాం.. అమెరికాలో కొట్టలేమా అని నదులలోకి దిగి మృత్యువాత పడుతున్నారు. భారత నదులకు పూర్తి భిన్నంగా ఇక్కడి నదులు ఉంటాయి. ఒక్లహామాలోని టర్నర్‌ఫాల్స్, డల్లాస్‌లోని గ్రేప్‌వైన్, క్రేటర్ లేక్, లివర్మోర్ నదులలో ఎక్కువగా భారతీయులు ప్రమాదాల బారిన పడుతున్నారు. టర్నర్‌ఫాల్స్ జలపాతంలో గత మూడు నెలల్లోనే నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. జులై నెలలో ఒకరు, ఆగస్టులో ఒకరు, సెప్టెంబర్‌లో ఇద్దరు ఈ జలపాతంలో మునిగి చనిపోయారు. భారతీయులకు ఈ నదులపై సరైన అవగాహనలేక వీటిని పర్యాటాక స్థావరాలుగా భావించి తెలియక నీటిలో దిగి మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని టాటా సూచిస్తోంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వీటిపై అవగాహన కల్పించేందుకు పలు సదస్సులు నిర్వహిస్తోంది. ఒత్తిడికి గురైన వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. టాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పైల మల్లారెడ్డి, అధ్యక్షుడు విక్రమ్ జంగం సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. -
చిన్ని రాజు చదువు చదువు
నాగావళి పర్వత శ్రేణులను ఆనుకుని ఒక అందమైన అడివి వుంది. ఆ అడివిలో పెద్ద పెద్ద మర్రి, టేకు, మద్దిలాంటి వృక్షాలు ఉన్నాయి. మామిడి, నేరేడు, జామ, వెలగ లాంటి పండ్ల చెట్లు ఉన్నాయి. పర్వత శ్రేణుల నుంచి వచ్చిన జలపాతాలు సరస్సులుగా, సెలయేర్లుగా ఆ అడివిలో అక్కడక్కడ నిర్మితమై ఎంతో ప్రకృతి శోభను తెచ్చాయి. ఆ అడవికి సంజయుడు అనే మృగరాజు రాజుగా వున్నాడు. సంజయుని పాలనలో అన్ని జంతువులూ ఏ భయం లేకుండా నివసిస్తున్నాయి. కానీ మహారాజుకు సంతానం లేదనే బాధ అందరిలోనూ ఉంది. కొంత కాలానికి రాజుకు మగ సంతానం కలిగింది. మృగరాజు, భార్య సివంగి ఎంతో సంతోషించారు. అడవిలో జంతువులన్నీ పండుగ చేసుకున్నాయి. నామకరణం, పుట్టినరోజులు ఇలా చిన్న మృగరాజుకు జరిపాక, ఇక చిన్ని మృగరాజుకు చదువు నేర్పించాలని తలచాడు సంజయ మృగరాజు. కానీ లేక లేక కలిగిన సంతానం అతి గారం వలన చిన్ని మృగరాజు పెంకిగా తయారయ్యాడు. చిన్ని మృగరాజుకు విద్య నేర్పడానికి అడివిలో తెలివైన ఏనుగు, లేడి, ఓ కుందేలు, నక్క నియమించబడ్డాయి. అవి ఎంతో ఓర్పుగా చిన్ని మృగరాజుకు పాఠాలు చెప్పసాగాయి. అయితే చిన్ని మృగరాజు వింటేగా! ఏనుగు పైకెక్కి కూర్చోడం, నక్కను ఏడిపించడం, కుందేలును కొట్టడం లాంటి పనులు చేస్తూ .. అసలు పాఠాలు వినేవాడు కాదు. దాంతో అవి అన్నీ రాజుని కలిసి చిన్ని రాజుకు పాఠాలు చెప్పడం మావల్ల కాదని చెప్పేసాయి.సంజయ రాజుకు మరలా విచారం పట్టుకుంది. తాను రాజుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన తరువాత తన కొడుకు కూడా అలాగే అవ్వాలని తలచినా, చిట్టి మృగరాజు ఇలా తయారవడం బాధ కలిగించింది. అప్పుడు ఆ అడివిలో ఉండే ఒక కోతి రాజును కలసి ‘మహారాజా! మీ కుమారుని కోసం మీరు బెంగ పెట్టు కోవద్దు. ఒక ఆరు నెలలు చిన్ని రాజుని నాకు వదలి పెట్టండి. నేను ప్రయోజకుని చేసి మీకు అప్పగించుతాను’ అంది. ఏ పుట్టలో ఏ పాము వుందో .. మిగిలిన జంతువులు కూడా రాజుకు, కోతితో చిన్ని రాజుని పంపండి. అంతగా కాకపోతే అప్పుడే వేరొక మార్గం ఆలోచిద్దాం అన్నాయి. విధిలేని పరిస్థితిలో రాజు, చిన్ని రాజును కోతికి అప్పగించాడు. ‘‘నువ్వా .. నాకు పాఠాలు చెప్పేది’’ అన్నాడు చిన్ని రాజు. ‘‘పాఠలా .. మరేమన్నానా .. నాకే ఏమీ రావు. ఇక మీకు చెప్పేది ఏమున్నది. నేనలా అనక పోతే మిమ్మలి వేరొక ఆడవికి పంపే ఆలోచనలో వున్నారు మహారాజు .. అందుకే ఇలా చెప్పాను. ఈ ఆరు నెలలూ మన మిద్దరం ఆడుతూ పాడుతూ గడిపేద్దాము. తరువాత సంగతి తరువాత’’ అంది కోతి.కోతి మాటలు చిన్ని రాజుకు బాగా నచ్చాయి. రెండూ కలసి అడివి లోకి పోయాయి. చెట్లు ఎక్కాయి. ఉయ్యాలలు ఊగాయి. సరస్సులలో స్నానాలు చేశాయి. చిన్నిరాజుకి కోతి బాగా నచ్చేసింది. ఇలా వారంలో ఆరు రోజులు గడిచాయి. అప్పుడు కోతి ‘‘చిన్ని రాజా మనం అప్పుడే ఆరు రోజులు ఆట పాటలతో కాలం గడిపాము. రేపు మహారాజు ‘మా చిన్ని రాజుకు నీవు ఏం నేర్పావు’ అంటే నేనేమీ చేప్పగలను.నేనేమీ చెప్పలేదు అంటే నా నుండి నిన్ను దూరం చేసి వేరే ఆడవికి పంపుతారు. కనుక ఈ ఒక్క రోజు నేను చెప్పిన పాఠం విని రేపు అందరి ముందు చెప్పేయి దానితో ఈ గండం గడుస్తుంది.తరవాత నుండి మరలా మామూలే .. మన ఆటలు.. పాటలు’’ అంది కోతి. కోతి చెప్పింది కూడా నిజమే అని తలచాడు చిన్ని రాజు. బుద్ధిగా కోతి నేర్పిన పాఠాలు నేర్చుకున్నాడు . పద్యాలు వల్లె వేశాడు. మరుసటి రోజు కోతి , చిన్ని రాజుని తీసుకుని సభకు వెళ్లింది. జంతువులన్నీ కోతి పని అయిపోయింది. ఈ వారం రోజులూ అది చిన్ని రాజుతో ఆడిన ఆటలు పాటలు అన్నీ చూశాయి. పెద్ద పెద్ద గురువులు చెప్పలేనిది తగుదునమ్మా అనుకుంటూ .. నేను పాఠం చెబుతానని తయారయింది అనుకున్నాయి. మహారాజు సంజయుడు చిన్ని రాజుని పక్కన కూర్చో బెట్టుకుని ‘‘చిన్నా .. నీవేమీ నేర్చుకున్నావు మీగురువు నీకేమి నేర్పారు?’’ అని అడిగాడు. ముందురోజు నేర్చుకున్న పద్యాలను పాడాడు చిన్ని మృగరాజు. ఎవరైనా మీదకు వస్తే ఎలా తప్పించుకోవాలో చేసి చూపాడు. మాటు వేసే వేటాడే పద్ధతులు చూపించాడు. ‘‘శహబాష్..’’ అంటూ చప్పట్లు కొట్టాడు మృగరాజు. కోతికి అనేక బహుమానాలు ఇచ్చాడు. ‘‘మహారాజా! .. ఇది కొంత మాత్రమే. నాకు ఇచ్చిన ఆరు నెలల గడువులో మీ చిన్ని రాజుని మీ అంత వాడిగా చేస్తాను’’ అంది కోతి. మిగిలిన జంతువులు కూడా కోతిని ప్రశంసించాయి. అక్కడ నుండి సెలవు తీసుకుని చిన్ని రాజుని తీసుకుని సెలయేరు దగ్గరకు పోయింది కోతి. ‘‘ చిన్నిరాజా..! ఈ చదువులతో .. విసుగు వచ్చింది. పద కాసేపు అదువుకుందాం అంది. రెండూ కలసి బాగా ఆడుకున్నాయి. వారం తరువాత ‘‘ఈసారి చదువుకు రెండూ రోజులు కేటాయిద్దాము’’ అంది కోతి. మరలా ఆ రెండు రోజులు చదువులో పడిపోయాడు చిన్నిరాజు.మరలా రాజు దగ్గర సభలో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పాఠాలు వినిపించాడు. మహారాజు , అన్నీ జంతువులు చిన్ని రాజుని, కోతిని తెగ పొగిడాయి. చిన్ని రాజుకు చాలా గర్వంగా అనిపించింది. అప్పుడు అంది కోతి ‘‘ చిన్ని రాజా! వారం లో రెండురోజులు చదివితేనే నీ కింత ఆదరణ లబిస్తోంది కదా! నువ్వు వారంలో ఒకరోజు ఆడుకుని మిగిలిన రోజులు చదువుకుంటే ఎంత గొప్పవాడివి అవుతావో ఊహించు’’ అంది. ‘‘అంతే కాదు నీకు మొదట విద్యా నేర్పడానికి వచ్చిన గురువులు చాలా తెలివైన వారు, వారి దగ్గర నేర్చుకుంటే నీకు చదువు ఇంకా బాగా వస్తుంది. పైగా నీవు ఈ అడవికి కాబోయే మహారాజువి.నిన్ను చూసి మిగిలివారు నేర్చు కోవాలి తెలిసిందా’’ అంది. కోతి మాటలతో చిన్ని రాజు జ్ఞానోదయం అయ్యింది. రాజుతో చెప్పి పెద్ద గురువుల దగ్గర విద్య నేర్చుకుంటానని తెలిపింది. ఆరోజు నుండి అందరితో వినయంగా వుంటూ ఆనతి కాలంలోనే అన్ని విద్యలూ నేర్చుకుంది. తనను మంచి మార్గంలో నిలిపిన కోతితో ఎప్పుడూ స్నేహంగా వుంటూ మంచి యువరాజుగా పేరు తెచ్చుకుంది. - కూచిమంచి నాగేంద్ర -
‘కూర్గ్’ సొగసు చూడతరమా!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలోని ‘కూర్గ్’ పేరు వినగానే ఎవరికైనా ఒళ్లు పులకరిస్తుంది. పలు రకాల పూల సమ్మిళిత సువాసనలు. రకరకాల కాఫీ గింజల గుబాళింపులు ముక్కు పుటాలను అదరగొడతాయి. ఊపిరితిత్తులకు కొత్త ఊపిరినిస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయి. అందమైన పచ్చిక బయళ్లు, గుబురైన చెట్ల సముదాయంతో బారులు తీరిన పర్వత శ్రేణులు, వాటి మధ్యనుంచి జాలువారే జలపాతాలు, కొమ్మ కొమ్మకు పలకరించే పక్షుల కిలకిలారావాలు. వన్య ప్రాణుల అలజడి మదిలో మెదులుతాయి. ఇదంతా వినడం వల్లనే, చదవడం వల్లనే మనలో కలిగే అనుభూతి. ఇక ప్రత్యక్షంగా వీక్షిస్తేనా....? ఆ అనుభూతిని ఎవరైనా మాటల్లో చెప్పడం కష్టం. ఎవరికి వారు ఆ అనుభూతిని అనుభవించి పరవశించాల్సిందే. అందుకే కూర్గ్‌ను ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణించారేమో! పర్యాటకులు కూడా పలు రకాలుగా ఉంటారు వయసురీత్యా, అభిరుచుల రీత్యా. కొందరికి చెట్టూ పుట్టలు పట్టుకొని ట్రెక్కింగ్ చేయడం, సుడులు తిరిగే సన్నటి నదీ పాయలో రాఫ్టింగ్ చేయడం, పారా గ్లైడింగ్ చేయడం, పారా జంపింగ్ చేయడం, బోటింగ్ చేయడం, రోప్‌వేలో ప్రయాణించడం ఇష్టం. లగ్జరీ రిసార్టుల్లో ఇవి అందుబాటులో ఉన్నా అంత డబ్బు వెచ్చించని వారికి అందుబాటులో ఉండవు. మరికొందరికి ప్రశాంత వాతావరణం ఇష్టం. కంటి ముందు కనిపించే కొండ కోనల్ల నుంచి వచ్చే చల్లటి, స్వచ్ఛమైన గాలులను ఆస్వాదించడం, దట్టమైన చెట్ల మధ్య నుంచి కాలిబాటన కాస్త దూరం ప్రయాణించడం, జలపాతాలను ఆస్వాదించడం, పక్షలు, వన్య సంరక్షణ ప్రాంతాలను సందర్శించడం వారికీ హాబీ. డబ్బును దండిగా ఖర్చు పెట్టే వారి కోసం కూర్గ్ రాజధాని మడికరి ప్రాంతంలో పలు లగ్జరీ రిసార్టులుండగా, రెండో కేటగిరీ వాళ్ల కోసం కూర్గ్‌లోని కుట్టా ప్రాంతంలో సరైన కాటేజీలు ఉన్నాయి. మడికేరి ఏడు కిలోమీటర్ల దూరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ‘అబే’ జలపాతం ఉండగా, కుట్టాకు సమీపంలో రెండవ అతిపెద్ద జలపాతం ‘ఇరుప్పు’ ఉంది. అబే జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుండగా, ఇరుప్పు ప్రశాంతంగా ఉంటుంది. దీని పక్కనే పక్షుల సంరక్షణ కేంద్రం ఉండగా, ట్రెక్కింగ్ చేసే కుర్రకారు కోసం నిటారైన కొండ ఉండనే ఉంది. ఇరుప్పు జలపాతం సమీపంలో పర్యాటకులు ఉండేందుకు పలు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కొండ దిగువ ప్రాంతంలో ఉండగా, పూర్తిగా కొండ ఎగువున ‘ట్రాపికల్ బూమ్స్’ అనే కాటేజీ కొత్తగా వెల్సింది ఆకర్షణీయంగానే కాకుండా, అందుబాటు ధరల్లో ఉంది (ఆసక్తిగల వారు మరిన్ని వివరాలకు 9449118698 మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చు). ఎక్కడికి వెళ్లనవసరం లేకుండానే ఈ క్యాటీజీ వసారాలో కూర్చొని ఆవలి కొండలను, కొండలను కౌగలించుకునే మబ్బులను, ఎప్పుడూ కురిసే మంచు ముత్యాలను చూడవచ్చు. ఈ కాటేజీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ‘ఇరుప్పు’ వాటర్ ఫాల్స్ ఉండగా, పది కిలోమీటర్ల దూరంలో నాగర్హోల్ నేషనల్ పార్క్, అంతే దూరంలో తోల్పట్టి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది. కాఫీ గింజల సువాసనలు, పూల గుబాళింపులు ఎల్లప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. రుతువులతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కూర్గ్‌ను సందర్శించవచ్చు. ఒక్కో రుతువులో ఒక్కో రకమైన అనుభూతిని పొందవచ్చు. నిండైన వాగులు, వంకలతోపాటు పచ్చదనం ఎక్కువగా ఉండే ‘సెప్టెంబర్ నుంచి మార్చి’ మధ్యలో సందర్శించడం మరీ బాగుంటుంది. -
కూర్గ్ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం
-
విశాఖలో కనువిందు చేస్తోన్న కొత్తపల్లి జలపాతం
-
3 జలపాతాలకు ముచ్చటైన వసతులు
జలపాతాల వద్ద పర్యాటకానికి ప్రాణం పోసేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. మంచిర్యాల జిల్లా కుంటాల, దానికి చేరువగా ఉన్న పొచ్చెర, భూపాలపల్లి జిల్లాలోని బొగత జలపాతాల వద్ద రోడ్లు, హోటల్, బస వసతులు కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధిపై నిర్ణయం తీసుకోనుంది. – సాక్షి, హైదరాబాద్ పదుల సంఖ్యలో ఉన్నా.. ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని జలపాతాల కూటమి సప్తాహం, ఇచ్చోడ సమీపంలోని గాయత్రి జలపాతం, నిర్మల్‌కు 60 కి.మీ. దూరంలో ఉన్న సహస్త్రకుండ్, గూడూరు సమీపంలోని భీమునిపాదం, నిర్మల్ సమీపంలోని కనకాయి.. ఇలా ఎన్నో జలపాతాలున్నా 2 నెలలకు మించి కనువిందు చేయటం లేదు. దీంతో ప్రస్తుతానికి వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4 నుంచి 6 నెలలు నీటి ప్రవాహం ఉండే కుంటాల, పొచ్చెర, బొగత వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుమతులకు అటవీ శాఖ ససేమిరా.. జలపాతాల వద్దకు పర్యాటకులు వచ్చేందుకు వీలుగా వసతులు కల్పిస్తే జీవ వైవిద్యానికి ఇబ్బందిగా పరిణమిస్తుందని అటవీ శాఖ చెబుతోంది. అనుమతులిచ్చేందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే బొగత, కుంటాల వద్ద రోడ్లు నిర్మించగా.. బొగత వద్ద వసతి గదుల నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. దీన్ని అటవీ శాఖ వ్యతిరేకిస్తోంది. ‘దట్టమైన అడవుల్లో ఈ జలపాతాలుంటున్నాయి. జంతుజాలం, గిరిజన గూడేలకు కేంద్రాలవి. రోడ్లు, ఇతర వసతులు కల్పిస్తే జంతుజాలం, గిరిజన జీవనానికి ఇబ్బందవుతుంది. పర్యావరణానికి హాని చేసే చర్యలు సరికాదన్న అభిప్రాయం నేపథ్యంలో వసతుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది’ అని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. అది ఆదిమానవుల నెలవు భూపాలపల్లి జిల్లా గద్దలచెర గుట్ట వద్ద మరో జలపాతం ఉంది. వందల అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతున్న తీరు అద్భుతంగా ఉంది. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఆదిమానవులకు నెలవని తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అక్కడ వారు వాడిన పనిముట్లు, నీళ్లు నిలిచేందుకు చేసుకున్న ఏర్పాట్ల ఆనవాళ్లు కనిపించాయి. – సత్యనారాయణ, ఔత్సాహిక పరిశోధకుడు -
ఏడుబావుల అందాలు కనువిందు
⇒ ఒక బావిలో నుంచి మరో బావిలోకి జలధార ⇒ మహబూబాబాద్-భద్రాద్రి జిల్లాల సరిహద్దులో అద్భుత జలపాతం బయ్యారం: ఏడుబావుల జలపాతం చూపరులను కనువిందు చేస్తోంది. ఇది మహబూబాబాద్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతం లో ఉంది. ఏటా వర్షాకాలంలో ఏడుబావుల నుంచి నీరు ఒకదానిలో నుంచి మరొకదానిలో జాలు వారుతున్న అద్భుత దృశ్యం పర్యాటకులను కనువిందు చేస్తోంది. చారిత్రక నేపథ్యమూ ఉంది.. మహబూబాబాద్-భద్రాద్రి జిల్లాల సరిహద్దులో ఏడుబావులు ఉన్న పాండవులగుట్టకు చారిత్రక నేపథ్యం ఉంది. పాండవులు ఏడు బావులున్న ప్రాంతంలో అరణ్యవాసం చేయడంతో దీనికి పాండవులగుట్టగా పేరొచ్చినట్లు స్థానికులు చెబుతారు. పాండవుల తపోఫలం వల్ల ఏడు బావులు ఏర్పడ్డాయని అందుకే పై నుంచి కిందికి వచ్చిన నీరు కొంత దూరం తర్వాత అదృశ్యమవుతుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. గుట్టలపై నుంచి వచ్చే నీరు వర్షాకాలంలో ఒక దాని నుంచి మరో బావి లోకి ఇలా ఏడు బావుల్లో నుంచి జాలువారి భూమి చేరుతోంది. వేసవిలో నీటి జలధార ఆగినా బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. సాహసం చేస్తేనే బావుల వద్దకు.. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గం గారం, భద్రాద్రి జిల్లా గుండాల, ఇల్లెందు మం డలాల సరిహద్దులో ఉన్న అటవీప్రాంతంలో ఈ జలపాతం ఉంది. బయ్యారం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్యాలపెంటకు వెళ్లి అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు కాలిబాటన నడిచి వెళ్లాలి. పాకాల కొత్తగూడెం నుంచి పాకాల-ఇల్లెందు మార్గం ద్వారా కూడా మిర్యాలపెంటకు చేరుకొని అక్కడి నుంచి ఏడుబావుల వద్దకు వెళ్లొచ్చు. గుట్ట వద్దకు చేరిన తర్వాత ఏడుబావులను చూడాలంటే సాహసం చేయాల్సి ఉంటుంది. గుట్టల పైకి వెళ్లేందుకు పాకురుబట్టిన రాళ్లపై అతిజాగ్రత్తగా 900 మీటర్ల వరకు ఎక్కితే మొదటిబావి వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. కిందికి వచ్చిన నీరు కొంత దూరం తర్వాత కనిపిం చదు. వర్షాలు బాగా కురిసి జలపాతం నుంచి ధారాళంగా నీరు కిందికి వచ్చినప్పటికీ పై నుం చి వచ్చిన నీరు సుమారు 100 మీటర్ల దూరం ప్రవహించిన తర్వాత చూపరులకు కనపడవు. ఆ నీరు ఎక్కడికి చేరుతుందో స్థానికులకు సైతం అంతుబట్టని విషయంగా మారింది. రహదారి లేకపోవటంతో ఇబ్బందులు.. పర్యాటకులు స్థానికుల సహకారం లేకుండా పాండవులగుట్ట వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. ఏడుబావుల వద్దకు వెళ్లడం ఇబ్బందికరంగా మారినా పలు ప్రాంతాల నుంచి వర్షాకాలంలో పర్యాటకులు జలపాతాల వద్దకు వస్తున్నారు. ప్రభుత్వం ఏడుబావుల వద్దకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేస్తే అడవి అందాలను చూసే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
జలపాతం.. జనసందోహం
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం సబ్బితం పంచాయతీ పరిధిలోని గౌరీగుండాలు జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. గౌరీగుండాల అందాలను తిలకించేందుకు అధికసంఖ్యలో జనం తరలిరావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు కురువడంతో రోడ్డు బురదమయంగా మారింది. దీంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. నడిచే ఓపికలేనివారు స్థానికంగా ఉన్న ఎడ్లబండ్లపై జలపాతం చేరుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ప్రత్యేక దృష్టి సారించి ఈ రహదారిని బాగు చేయాలని కోరారు. -
కొత్తపల్లి జలపాతాలకు పర్యాటకశోభ
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాలు పర్యాటక శోభ సంతరించుకుంటుంది. గిరిజన ప్రాంతాల్లో పలు సుందర జలపాతాల్లో కొత్తపల్లి జలపాతానికి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ చల్లటి, చక్కటి ఆహ్లదకరమైన వాతావరణంలో జలపాతాలు ఉండటంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండే కాక ఇతర దేశాల నుండి కూడా పర్యాటకులు ఇక్కడకు వచ్చి అందాలను తిలకిస్తున్నారు. గతంలో విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన అమెరికా బృందం కొత్తపల్లి జలపాతాలు అందాలను వీక్షించిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర, జిల్లా, ఐటీడిఏ ఉన్నతాధికార్లు సైతం సందర్శించారు. కొత్తపల్లి గ్రామం సమీపంలో అనేక చోట్ల ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు పై నుండి జలవారుతున్న నీటి అందాల కనుల విందు చేస్తున్నాయి. జలపాతాల వద్ద సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాఫీహౌస్, దుకాణాలు, గెడ్డపై రెండు చోట్ల ఇసుప బ్రిడ్జిలు, కొండవాలు ప్రాంతం నుంచి కిందకు దిగటానికి రక్షణ ఇనుప గొట్టాలు అమర్చి నిర్మించిన మెట్లు, అక్కడడక్కడ కూర్చోవటానికి సిమ్మెంట్ దిమ్మలు వనబంధు కళ్యాణయోజన పథకం కింద నిధులు వె చ్చించి నిర్మంచారు. ప్రధానం ద్వారం వద్ద ఏసుప్రభువు విగ్రహం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొత్తపల్లి జలపాతాలను ప్రకతి అందాలకు తగ్గట్టుగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. -
అదిలాబాద్‌లో కుంటాల జలపాతం వద్ద సందడి
-
కపిలతీర్థ అందాలను ఆస్వాదిస్తున్న భక్తులు
-
చందంపేటలో... రమణీయ సోయగాలు
పచ్చని చీరను పరుచుకున్నట్టున్న కొండలు.. కొండల నడుమ జాలువారే జలపాతాలు.. పురాతన ఆలయాలు.. శివలింగాలను నిత్యం అభిషేకించే జలధారలు.. వేల ఏళ్ల క్రితం నాటి సమాధులు.. నల్లమల అటవీ ప్రాంతంలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో దేవరచర్ల, వైజాగ్ కాలనీ ప్రాంతాల్లోని అందాలివి. ఇంతేకాదు ‘అరకు లోయ’ను తలపించే సోయగాలు.. బొర్రా గుహలను తలపించే గాజుబిడం గుహలు.. వేల ఏళ్లనాటి ఆలయ అద్భుతాలను ఇక్కడ పర్యాటక, పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. చుట్టూ కొండలు.. పచ్చని అందాలు.. జలపాతాలు * బొర్రా గుహలను తలపిస్తున్న గాజుబిడం గుహలు * పురాతన ఆలయాలు.. నల్లమల అడవి సొబగులు * పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిన అధికారులు దేవరకొండ/చందంపేట: నల్లగొండ జిల్లా చందంపేట మండలం దాదాపుగా నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. వైశాల్యంలో చాలా పెద్దదైన ఈ మండలం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏరాటైన తర్వాత పర్యాటక ప్రదేశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది కూడా. ఈ నేపథ్యంలో దేవరచర్లలోని ప్రకృతి అద్భుతాలను, అక్కడి రమణీయ దృశ్యాలను, జలపాతాల గురించి ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన పురావస్తు, పర్యాటకశాఖ అధికారులు దేవరచర్లను సందర్శించారు. అక్కడి అద్భుతాలను తెలంగాణ ‘అరకు’గా అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల డిమాండ్లతో అధికారులు... ఇటీవల ఇక్కడి మరిన్ని ప్రాంతాలను సందర్శించి, ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లుగా వెలుగులోకి రాని ఎన్నో రమణీయ ప్రదేశాలు అక్కడ ఉన్నాయని.. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతం అనువుగా ఉందని వారు పేర్కొన్నారు. కాచరాజుపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మధ్యలోని గుట్టల్లో ఉన్న గాజు బిడం గుహలను పరిశీలించారు. బొర్రా గుహలకు ఇవి ఏమాత్రం తీసిపోవని గుర్తించారు. అంతేకాదు బొర్రా గుహల్లో మామూలుగా రాతి కట్టడం మాదిరిగా ఉండగా గాజుబిడం గుహల్లో మాత్రం ఎరుపు, ఆకుపచ్చ మిళితమైన రంగుల్లో ఉండడాన్ని గుర్తించారు. ఆ గుహలకు ఎంతో విశిష్టత ఉందని, పురావస్తుశాఖ అధికారులతో చర్చించాల్సి ఉందని చెప్పారు. దేవరచర్లలో ఉన్న శివలింగంతో పాటు చందంపేట పరిసర ప్రాంతాల్లో 9 గుట్టల పరిధిలో పురాతనమైన ఆలయాలున్నట్లు తెలుస్తోందని అధికారులు వివరించారు. అక్కడి నుంచి కృష్ణానదిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమయంలో ముంపునకు గురైన ఏలేశ్వరం గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణా నదిలోని ఓ దీవిలో ఉన్న మల్లన్న, మల్లప్ప దేవాలయం గురించి తెలుసుకున్నారు. అభివృద్ధి చేయాల్సి ఉంది.. దేవరచర్ల, వైజాగ్ కాలనీలో గుర్తించిన అంశాలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు, టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్ శివాజీ చెప్పారు. కృష్ణానదిలో ఉన్న పలు దీవులను పరిశీలించిన వారు.. అవి పాపికొండలను తలపించే మాదిరిగా ఉన్నాయని అభివర్ణించారు. అరకును మించిన సోయగాలు చందంపేట ప్రాంతంలో ఉన్నాయని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశక్యత ఉందని పేర్కొన్నారు. కాగా.. దేవరచర్లలో ఉన్న పురాతన ఆలయాలు, ప్రకృతి అందాల విషయమై తన దృష్టికి వచ్చిందని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు నివేదిక తయారు చేశారని హోంమంత్రి నాయిని ఇటీవల దేవరకొండలో పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానన్నారు. -
కృష్ణా జలాలు తాగు అవసరాలకే
* కృష్ణా నదీ బోర్డు వర్కింగ్ గ్రూప్ భేటీలో నిర్ణయం * శ్రీశైలం, సాగర్‌లలో ప్రస్తుత లభ్యత 9.5 టీఎంసీలుగా అంచనా * తాగునీటి ఎద్దడి దృష్ట్యా ఖరీఫ్‌ను పక్కనపెట్టాలని బోర్డు సూచన.. * ఇరు రాష్ట్రాల అంగీకారం * రెండు మూడు రోజుల్లో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రధాన జలాశయాలు అడుగంటిన దృష్ట్యా కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి వినియోగానికే పరిమితం చేయాలని కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ నిర్ణయించింది. సాగు అవసరాలకు నీటిని మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉంటుందని స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకోవాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లో నీరు చేరేవరకు ఖరీఫ్ సాగు అవసరాలను పక్కనపెట్టాలని... ఈ దిశగా రైతులను అప్రమత్తం చేయాలని సూచించింది. కృష్ణాలో ఉన్న కొద్దిపాటి జలాలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ఏవిధంగా పంచుకోవాలన్న అంశంపై సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్‌లతో కూడిన వర్కింగ్ గ్రూప్ కేంద్ర జల సంఘం కార్యాలయంలో సమావేశమై చర్చించింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో లభ్యత ఉన్న జలాలు, అవసరాలను ఇరు రాష్ట్రాల అధికారులు వర్కింగ్ గ్రూప్ దృష్టికి తీసుకెళ్లారు. నాగార్జునసాగర్‌పై ఆధారపడి కుడి కాలువ కింద 12లక్షలు, ఎడమ కాలువ కింద 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని... ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 510.9 అడుగులకు పడిపోగా, శ్రీశైలంలో 802 అడుగులకు తగ్గిందన్న అంశాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కల్పించుకున్న బోర్డు చైర్మన్.. నీటి లోటును దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలకే పరిమితమవ్వాలని సూచించారు. రెండు ప్రాజెక్టుల్లో వినియోగించుకోగలిగే నీరు కేవలం 9.5టీఎంసీల మేరకే ఉన్న దృష్ట్యా ఖరీఫ్ అవసరాలకు ఈ నీటిని మళ్లించరాదని చెప్పారు. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అవసరాన్ని బట్టి శ్రీశైలం నుంచి.. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో వాడుకునేందుకు అవకాశమున్న 9.5 టీఎంసీలను తాగునీటి కోసం అవసరాన్ని బట్టి విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులను కాపాడాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించకూడదని... శ్రీశైలంలో 785 అడుగుల వరకు వెళితే 8 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని అంచనా వేశారు. రాయలసీమ, జంట నగరాలు, నల్లగొండ, కోస్తా జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ఇరు రాష్ట్రాలు చర్చించుకుని షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలని సూచించారు. తొలి విడతగా రెండుమూడు రోజుల్లో శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు బోర్డు సమక్షంలో నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో బోర్డు వెబ్సైట్ రూపకల్పనపైనా చర్చ జరిగింది. బోర్డు వెబ్సైట్లో ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి, ఇరు రాష్ట్రాలు ఏయే అంశాలను అందులో చేర్చాలన్న దానిపై బోర్డు చైర్మన్ పలు సూచనలు చేశారు. ఈ నెల చివరి నాటికి ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలని బోర్డు భావిస్తోంది. -
మన కళ్లముందే మరో అద్భుత ప్రపంచం
రేపు ప్రపంచ పర్యాటక దినం ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయనేది ఒక జాబితా మాత్రమే! కానీ కంటిని కట్టడి చేసేవి, విస్మయపరిచే వింతలు భూమి నిండా ఉన్నాయి. అలాంటి వాటిని కళ్లారా వీక్షించినప్పుడు జన్మ ధన్యమైందని భావిస్తుంటాం. ఇక ఆ తర్వాత జీవితం లేకపోయినా పర్వాలేదనిపించే అనుభూతిలో మునిగిపోతాం. వందల జలపాతాలు కలిసికట్టుగా ఒకేసారి దుమికే అద్భుతం, వేల అడుగుల లోతున గల గుహలోకి వేలాడుతూ వెళ్లే ధైర్యం, భూగర్భంలో ప్రయాణ మార్గాలు, ప్రశాంతతకు కొండంత ప్రతిమ, ఆధ్యాత్మికతకు అలనాటి వైభవం.. చూసినకొద్దీ చూడాలనిపించేవి. ఒక్కసారి చూస్తే చాలు అనిపించే అలాంటి కొన్ని అద్భుతాల వివరాలు... ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా ఈ వారం... లోతైన అద్భుతం: క్రుబేరా గుహ! గుహల సౌందర్యం, వాటి అద్భుతం గురించి మనకు తెలియంది కాదు. మనదగ్గర బొర్రాగుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు.. ఎన్నో లెక్కపెట్టి మరీ ఈ అద్భుతాల గురించి వివరిస్తారు. కానీ, ప్రపంచంలోనే అతి లోతైన గుహగా పేరుపొందిన క్రుబేరా గుహ 2,197 మీటర్లు అంటే సుమారు 7,208 అడుగుల లోతు వరకు ఉంటుంది. భూమి మీద అత్యంత లోతైన గుహగా పేరొందిన క్రుబేరా పై భాగంలో నీరు ఉంటుంది. భూ పొరలలో వచ్చిన మార్పుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. జార్జియా దేశంలోని అబ్ఖజియా ప్రదేశంలో 1960లో ఈ గుహలను గుర్తించారు. రష్యా నుంచి అబ్ఖజియా ప్రదేశం దగ్గర. అందుకని మాస్కో చేరుకొని అక్కడ నుంచి విమానమార్గం లేదా బస్సుల ద్వారా అబ్ఖజియా ప్రాంతానికి చేరుకోవచ్చు. సెప్టెంబర్-అక్టోబర్ మాసపు రోజులు ఇక్కడ చల్లగానూ, వాతావరణం అనువుగానూ ఉంటుంది. భూగర్భ ప్రయాణం: లండన్ మన దగ్గర చిన్నా పెద్ద సబ్ వే (భూగర్భ దారులు)లలో నుంచి కాలినడకన అటూ ఇటూ వెళ్లే ఉంటారు. వాటికే అబ్బురపడి ఉంటారు. లండన్‌లో భూగర్భ ప్రయాణం చేస్తే మనిషి తెలివికి ‘ఔరా’ అనిపించకమానదు. ఇక్కడి భూగర్భ మెట్రో రైలు సిస్టమ్ ప్రపంచంలోనే అత్యద్భుతమైనదిగా పేరొందింది. లండన్‌లో అతి ప్రాచీన భూగర్భ మెట్రో రైలు వ్యవస్థ 1863లోనే ప్రారంభమైంది. నేటికి లండన్‌లో 270 అండర్‌గ్రౌండ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌కి 260 మంది, మొత్తంగా 19,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. భూగర్భ మార్గంలో 4,134 స్టేషన్లు, 426 ఎస్కలేటర్లు, 164 లిఫ్ట్‌లు ఉన్నాయి. ట్యూబ్లలో రైలు వేగం 33 కి.మీ. అత్యంత రద్దీగల స్టేషన్‌గా ‘వాటర్ లూ’ పేరొందింది. ఇక్కడ ప్రతి మూడు గంటల వ్యవధిలో 57,000 వేల మంది ప్రయాణీకులు తమ తమ గమ్యస్థానాలకు ఈ భూగర్భదారుల గుండానే ప్రయాణమవుతుంటారు. మార్చ్-మే నెలలో వసంత రుతువు చివరి రోజులు. సెప్టెంబర్ - నవంబర్లోనూ వాతావరణం అనువుగా ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. కొండంత ఎత్తు: లేషన్ జెయింట్ బుద్ధ అమెరికాలోని లిబర్టీ ఆఫ్ స్టాట్యూ మనకు కొట్టిన పిండి. జపాన్‌లోని బుద్ధుని ప్రతిమ, మాస్కోలో పీటర్ స్టాట్యూ ఎత్తును చూసి మనిషి అపారజ్ఞానానికి అబ్బురపడుతూనే ఉన్నాం. సుఖాసనంలో కూర్చున్నట్టుగా ఉన్న ఈ బుద్ధుని ప్రతిమ కోసం ఏకంగా కొండ రూపునే మార్చారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా పేరొందిన ఆ దేశంలోనే ‘ఎమీ’ పర్వత రాయిని క్రీ.శ. 713 వ సంవత్సరంలో ఇలా బుద్ధుని ప్రతిమగా తొలిచారు. ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ రాయిగా పేరొందింది ఇది. ప్రాచీన సంపదకు ఆనవాలుగా నిలిచన ఈ ప్రాంతాన్ని పరిరక్షించడానికి యునెస్కో 1996లో హెరిటేజ్ సైట్లో చేర్చింది. బుద్ధుని పాదాల చెంతకు చేరుకోవాలంటే పడవలలో ఇక్కడి క్వింగీ నదిని దాటాలి. వేసవిలో ‘ఎమీ’ పర్వతం మీద వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. చలికాలంలో ఆహ్లాదంగా ఉంటంది. హోటళ్లు, విమానయాన టికెట్లు ఈ కాలంలో ఆఫర్లు ప్రకటిస్తాయి. అక్టోబర్ - డిసెంబర్ వరకు అత్యల్ప ఉష్ణోగతలు నమోదవుతాయి. జలపాతాల పెద్ద: ఇగుఅజు నయాగరా, విక్టోరియా జలపాతాల అద్భుతాన్ని తిలకించకపోయినా వినే ఉంటారు. కానీ ‘ఇగుఅజు’ జలపాతం గురించి విన్నారా? ‘ఇగూజు’ అని కూడా పిలిచే ఈ జలపాతం బ్రెజిల్, అర్జెంటీనా దేశాల మధ్యన ఉంది. రెండు దేశాల ప్రజలకు గర్వకారణంగా నిలిచే ఈ జలపాతం దాదాపు 275 చిన్నా పెద్ద జలపాతాల కలయికతో విస్మయపరుస్తుంటుంది. 82 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వైశాల్యం గల ఈ జలపాతం సెకనుకు 1000 ఘనపు మీటర్ల వేగంతో దుముకుతుంది. పర్యాటకులు బ్రెజిల్ వెళ్లినా, అర్జెంటినా వెళ్లినా ఈ జలపాతాన్ని రెండు విధాలుగా సందర్శించవచ్చు. బ్రెజిల్ వైపు జలపాతానికి చేరువలో వెళ్లేందుకు వంతెనలు, జెట్ బోట్స్, హెలికాఫ్టర్ సదుపాయాలు ఉంటే, అదే అర్జెంటీనా వైపుగా వెళితే బ్రెజిల్ కన్నా మరింత దగ్గరగా వంతెన మార్గాలు ఉన్నాయి. జలపాతం చుట్టుపక్కల దాదాపు రెండు వేల ఔషధ మొక్కలు, 400 రకరకాల పక్షులు, 70 రకాల క్షీరదాలను గుర్తించారు. ఈ అద్భుతానికి గులాము అయిన యునెస్కో 1986లో వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. డిసెంబర్-మార్చ్ వరకు ‘ఇగూజు’లో వేసవి సమయం. జూన్ - ఆగస్టు వరకు చలికాలం. అందుకే పర్యాటకులు ఈ సమయంలో జలపాత వీక్షణకు ఆసక్తి చూపుతారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలు ఇక్కడి ఉష్ణోగ్రతలు అత్యంత అనుకూలంగా 28 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటాయి. చారిత్రక వైభవం: అంకోర్ వాట్! ప్రపంచంలోనే గొప్ప చారిత్రక కట్టడంగా తాజ్‌మహల్ పేరొందింది. దీని తర్వాత ప్రాచీన వైభవాన్ని కళ్లకు కట్టే కట్టడం ‘అంకోర్ వాట్’ దేవాలయం. కాంబోడియా దేశంలో గల ఈ కట్టడం తొమ్మిదవ శతాబ్దంలో మొదలై 15వ శతాబ్దం వరకు ఖెమెర్ రాజుల కాలంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 400 చదరపు కిలోమీటర్లలో దేవాలయ సముదాయాలను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం పూర్తవడానికి దాదాపు 600 ఏళ్లు పట్టడంతో ఆయా కాలాలకు తగ్గ మార్పులతో విభిన్న శైలులతో ఆకట్టుకుంటుంది. ఖెమెర్ రాచ వైభవం ఈ దేవాలయ గోడల మీద అణువణువునా... నాటి సాంస్కృతిక సంప్రదాయ శైలులను అడుగడుగునా చూడవచ్చు. ఆగ్నేయాసియాలో ఉండే కాంబోడియా మన దేశానికి సుమారు మూడు వేల కి.మీ.దూరంలో ఉంది. విమాన ప్రయాణం రాను పోను టిక్కెట్ ధరలు 50 వేల రూపాయలకు పైగా ఉంటుంది. రాబోయే రెండు నెలలలో వర్షాలు తగ్గి, వాతావరణం పొడిగా ఉండే ఈ నెలలు ఇక్కడి దేవాలయాల సందర్శనకు అనువైనవి. -
సోమంచి ‘కుంచె’ సొగసులు
ఆ చిత్రాల్లో హిమగిరి సొగసులు కళ్లముందే కొలువుదీరుతాయి... ఎత్తయిన కొండలపై నుంచి దుమికే జలపాతాలు, వాటిపై ప్రతిఫలించే సంజెకాంతులు కాన్వాసుపై నిశ్చలంగా ఒదిగిపోతాయి...ఈ చిత్రాలన్నీ ప్రకతి సౌందర్య చిత్రణలో చేయితిరిగిన చిత్రకారుడు విజయకుమార్ సోమంచి కుంచె నుంచి జాలువారాయి. నగరంలో బాగ్‌లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్ట గ్యాలరీలో ఇవి కొలువుదీరాయి. సహజ సుందరంగా తీర్చిదిద్దిన ఈ చిత్తరువులు కళాభిమానులకు కనువిందు చేస్తున్నాయి. -
అడవితల్లి అందం... జలపాత సౌందర్యం
మన దగ్గరే! - మల్లెల తీర్థం కోకిల గీతాలు, నెమళ్లు నృత్యాలు, పారే సెలయేళ్లు, దుమికే జలపాతాలు... నల్లమల అడవుల్లో కనువిందు చేసే దృశ్యాలు ఎన్నో! కృష్ణానదికి ఇరువైపులా విస్తరించి ఉన్న నల్లమల అడవిని కళ్ల నిండుగా సందర్శించడానికి వారాంతాలు చక్కని ఎంపిక. హైదరాబాద్ నుంచి 232 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 58 కి.మీ దూరంలో నల్లమల అడవులు ఉన్నాయి. దాదాపు 350 అడుగుల ఎత్తు నుంచి ఓ జలధార ఆకాశం నేలను ముద్దాడుతుందా అనిపించేలా దుముకుతుంటుంది. అంతెత్తు నుంచి పడుతున్న నీటి తుంపరలు మల్లెల విరిజల్లులా మనల్ని అభిషేకిస్తుంటాయి. ఈ జలపాతానికే ‘మల్లెల తీర్థం’ అని పేరు. ఇక్కడి కొండలు, గుట్టలు, గిరిపుత్రుల పలకరింపులు.. మనసారా స్వాగతం పలుకుతాయి. పచ్చని చెట్ల నీడన, జలపాతపు చల్లదనానికి ఎండ దరిచేరదు. పరీక్షల ఒత్తిళ్ల నుంచి విద్యార్థులు, పని ఒత్తిడి నుంచి ఉద్యోగులు విశ్రాంతికి ఎంచుకునే ఆహ్లాదకర ప్రాంతం. చూడదగినవి మన్ననూరు వద్ద చెంచుల మ్యూజియం. అడుగడుగునా చెంచుల జీవనశైలిని కళ్లకు కడుతున్న కళాక్షేత్రమిది. అటవీ జంతువుల బొమ్మలను ఇక్కడ అందంగా కొలువుతీర్చారు. ఈ బొమ్మలను బట్టే చెంచుల జీవనశైలిని అవగాహన చేసుకోవచ్చు. ట్రె క్కింగ్కి సరైన ప్రాంతం. వెంట ఇవి తప్పనిసరి! కెమెరా, వీడియోలు వెంట తీసుకెళితే ప్రకృతి అందాలను చిత్రరూపంగా బంధించుకోవచ్చు. కాలినడకన ఎత్తు పల్లాలలో నడిచేందుకు వీలుగా షూ ధరించడం మేలు. ఇది ఒక మారుమూల ప్రాంతం. అందుకని కళ్లజోడు, ఆహారం, మంచినీళ్లు, తగిన మందులు, బ్యాకప్ బ్యాటరీలు, దుప్పట్ల వంటివి తీసుకెళితే ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తవు. అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ రాత్రులు ఉండటం కష్టం. ఇక్కడ రాత్రి పూట బస చేసేందుకు ఎలాంటి వసతీ లేదు. తీర్థానికి దారి హైదరాబాద్ నుంచి 232 కి.మీ శ్రీశైలం నుంచి 58 కి.మీ 350 అడుగుల ఎత్తు నుంచి జలపాతం దుముకుతుంది. కృష్ణానది నల్లమల అడవుల గుండానే సాగుతుంది. సాహస పర్యాటకం పట్ల ఆసక్తి గలవారికి మల్లెల తీర్థం సరైన ఎంపిక. బస్సులు, ప్రైవేట్ కార్లు/ ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఉదయం 7కు బయల్దేరితే 11 గంటలకు మల్లెల తీర్థానికి చేరుకోవచ్చు. -
అమెరికాలో జలపాతంలో జారిపడి పొదిలి యువకుడి మృతి
పొదిలి, న్యూస్‌లైన్: వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ యువకుడు జలపాతంలో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన అమెరికాలోని డెలావేర్ స్టేట్ విల్‌మిల్టన్ సిటీలో భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన నారాయణరెడ్డి, సుజాతలు ఉద్యోగరీత్యా ఒమన్ దేశంలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు, చికాగోలో ఎమ్ఎస్ చేస్తున్న సందీప్‌రెడ్డి(22) వీకెండ్ సెలవులు గడిపేందుకు అతని బాబాయి శ్రీనివాసులరెడ్డి నివాసం ఉంటున్న డెలావేర్ స్టేట్‌లోని విల్‌మిల్టన్ సిటీకి వెళ్లాడు. సెలవుల్లో శ్రీనివాసరెడ్డి, అతని మిత్రులు, కుటుంబ సభ్యులతో కలసి సందీప్‌రెడ్డి ఆదివారం సాయంత్రం జలపాతం దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడిన సందీప్‌రెడ్డిని రక్షించేందుకు శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కోమాలోకి వెళ్లిన సందీప్‌రెడ్డిని అక్కడి వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సందీప్‌రెడ్డి విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. -
సుందర దృశ్యాల సిరి... అనంతగిరి
మన దగ్గరే! రాష్ర్టంలో పేరొందిన హిల్ స్టేషన్లలో ఒకటి అనంతగిరి. పచ్చని చెట్లతో అలరారే దట్టమైన అడవులు, గలగల పారే సెలయేర్లు... తేయాకు తోటల సుగంధాలు...ఇవీ అనంతగిరుల సోయగాలు. ఏడాది పొడవునా చల్లగా ఉండే ఈ ప్రాంతం వేసవి విడిదిగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కునగరంగా పేరుగాంచిన సుందరనగరం విశాఖపట్టణం. ఇక్కడి సముద్ర తీరానికి 40 కి.మీ దూరంలో ఉంది అనంతగిరి. ప్రకృతి ప్రేమికులను ఓ సరికొత్త లోకంలో విహరింపజేస్తుంది. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా నయనా నందకరంగా ఉండటంతో ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. అంబరాన్ని తాకే కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకుల మనసును రంజింపజేస్తాయి. అరకు లోయకు 17 కి.మీ దూరంలో తిరుమలగిరి పై భాగంలోని తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కాఫీ తోటల సౌందర్యం పర్యాటకులను ఆనందసాగరంలో ఓలలాడిస్తుంది. రకరకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. ఇక్కడ వనమూలికలు సైతం లభ్యమవుతాయి. భవనాశి సరస్సు దక్షిణ బద్రీనాథ్‌గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సు ఉంది. అత్యంత పవిత్రమైనదిగా ఈ సరస్సుకు పేరు. ఈ సరస్సు వల్లే ఈ ప్రాంతానికి దక్షిణ బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. కాఫీ తోటల పరిమళాలు, పక్షల కిలకిలరావాలు, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది. మామిడి తోటలు కూడా పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. అనంతపద్మనాభుడు ప్రకృతి రమణీయత ఆనంద పారవశ్యాన్ని కలిగిస్తే, ఇక్కడి వచ్చే యాత్రికులను భక్తిపారవశ్యంలో నింపుతుంది అనంతపద్మనాభస్వామి ఆలయం. ఆంధ్రా ఊటీగా స్థానికులు ప్రేమగా పిలిచే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు ఇక్కడి ఎత్తై ప్రాంతాలు, సెలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను చూపులను కట్టి పడేస్తాయి. వెళ్లేదారి.. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి 3 కి.మీ దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. విశాఖపట్టణం నుంచి బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, బంగళాలు అందుబాటులో ఉన్నాయి. -
ప్రకృతి మెడలో పచ్చల హారం...
పాపి కొండలు అమాయకపు కొండరెడ్ల ఆచారాలు, గలగలా పారే గోదావరి తల్లి ఒడిలో లాంచీ ప్రయాణం, పచ్చని పండ్ల చెట్లు, ఆనందంగా ఆహ్వానించే గిరిజనులు, అలవోకగా గిరిజనుల చేతిలో తయారైన వెదురు వస్తువులు... ఇన్ని అందాల సమాహారమే పేరంటపల్లి, పాపికొండలు. ఈ ప్రదేశాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ అనుభూతులన్నీ కావాలనుకుంటే ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళాల్సిందే. కూనవరం నుంచి లాంచీలో బయలుదేరితే గోదావరి శబరి సంగమం మొదలుకొని పురాతన రామగిరి, వాలి సుగ్రీవ గుట్టలు, పేరంటపల్లి, శివాలయం, పాపికొండలు, కొల్లూరు కాటేజీలను చూడవచ్చు. ప్రశాంతతకు నిలయం ఎన్నో ప్రకృతి అందాలకు పెట్టింది పేరు పేరంటపల్లి. ఇక్కడ 36 కొండ రెడ్ల కుటుంబాలున్నాయి. వీరంతా వెదురు వస్తువుల తయారీతో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ పనస, జీడిమామిడి తోటలతో పాటు దట్టమైన చెట్లతో నిండిన పచ్చని కొండల నడుమ ప్రశాంతతకు నిలయమైన రామకృష్ణ మునివాటిక ఉంది. నిష్టా నియమాలతో గ్రామంలోని కొండ రెడ్ల మహిళలే ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తారు. ఎలాంటి కానుకలూ స్వీకరించరు. ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి. జలపాతం గలగలలు ఈ ఆశ్రమానికి దగ్గర్లోనే పారే జలపాతం పర్యాటకులను ఆహ్లాదపరుస్తోంది. ఎక్కడో కొండల్లో నుంచి జాలువారే ఈ జలపాతం మండు వేసవిలో సైతం మంచును తలపిస్తుంది. ఈ నీటిలో పర్యాటకులు స్నానమాచరించి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రమణీయ గంధం పాపికొండల అందం గోదావరి తల్లి సుడులు తిరుగుతూ... గిరుల నడుమ గలగలా పరుగులు తీసే ప్రదేశమే పాపికొండలు. ఇక్కడ గోదావరి వెడల్పు తక్కువగా ఉంటుంది. మైదాన ప్రాంతంతో మూడు కిలో మీటర్ల మేర వెడల్పుతో విస్తరించి ఉన్న గోదావరి, ఇక్కడ 200 మీటర్ల వెడల్పులోనే ఒదిగిపోతుంది. ఇక్కడ ఎప్పుడూ నీళ్ళు సుడులు తిరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో గోదావరికి దారి చూపుతున్నట్లు ఉండే రెండు కొండలనే పాపికొండలుగా పిలుస్తారు. లాంచీ శబ్దం తప్ప మరే శబ్దం ఇక్కడ విన్పించదు. ఈ కొండలను చూస్తే మనసు పరవశించిపోతుంది. సినీ దృశ్యాలు పుష్కలం సినిమాల చిత్రీకరణకు పనికొచ్చే సుందర దృశ్యాలు యాత్రలో పుష్కలంగా కన్పిస్తాయి. ఈ ప్రాంతంలోనే అనేక సినిమాల షూటింగ్‌లు జరిగాయి. అనాటి ‘అందాలరాముడు’, నేటి ‘గోదావరి’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’.., ఇంకా అనేక సినిమాలలో ఈ సుందర ప్రకృతి సౌందర్యాలను కెమరాలో బంధిం చారు. సినిమాల్లో చూపించే లాంచీ ప్రయాణాలు ఇక్కడ చిత్రీకరించినవే. అనేక టీవీ సీరియల్స్ చిత్రీకరణ కూడా ఈ ప్రాంతంలో జరుగుతుంటుంది. ఎలా చేరుకోవచ్చంటే... కూనవరానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోచవరం నుంచి లాంచీపై వెళితే రెండు గంటల్లో పేరంటపల్లి చేరుకోవచ్చు. ఖమ్మంజిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణదేవర, కనిష్క, అక్బర్ అనే పేర్లు ఉన్న మూడు లాంచీలు పాపికొండల వరకు తిరుగుతున్నాయి. ఖమ్మంలో విహారి టూర్స్ ద్వారా కూడా టికెట్ బుకింగ్‌లను టూరిజం శాఖ నిర్వహిస్తోంది. పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150 చొప్పున చెల్లిస్తే పాపికొండల వరకు తీసుకెళ్ళి మరలా భద్రాచలంలో దించుతారు. భోజనంతో పాటు టిఫిన్ కూడా లాంచీలోనే పెడతారు. ఖమ్మంలో టికెట్లు బుక్ చేయాలంటే 9492101066, 9440281518, సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలి. భద్రాచలంలో అయితే 9553089342 నెంబర్‌కు సంప్రదించాలి. ప్రతీ వారం టూరిజం శాఖ ప్యాకేజ్ టూర్లు కూడా నిర్వహిస్తోంది. అదే విధంగా వేలేరుపాడు మండలంలోని కొయిదా నుంచి కూడా పడవలు నడుస్తున్నాయి. కొయిదా నుంచి అయితే 45 నిమిషాల్లో పేరంటపల్లి వెళ్ళవచ్చు. వేలేరుపాడు మండలం మీదుగా అయితే సమయం ఆదా అవుతుంది. ఇక్కడి నుంచి కూడా ప్రైవేట్ పడవలు నడుస్తున్నాయి. రాజమండ్రి నుంచి అయితే ఇలా.. తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి నుంచి పాపికొండలకు చేరుకోవాలంటే అక్కడి నుంచి కూడా టూరిజం లాంచీలు, లగ్జరీ బోట్లు తిరుగుతున్నాయి. రాజమండి నుంచి పట్ట్టిసీమ, పోచమ్మగండి మీదుగా పేరంటపల్లి పాపికొండలకు చేరుకోవాలంటే రానూ పోనూ 13 గంటల సమయం పడుతుంది. రాజమండ్రి, పురుషోత్తమ పట్టణం, పట్టిసీమ నుంచి ఏపీ టూరిజం ప్రైవేట్ ఏసీ బోట్లను నడుపుతోంది. ఈ బోట్లలో రానూ పోనూ ప్రయాణానికి ఒక్కొక్కరూ రూ.650 వరకు చెల్లించాలి. ఉదయం 7 గంటలకు రాజమండ్రిలో బయలుదేరితే రాత్రి 9 గంటలకు తిరిగి చేరుస్తారు. ఇక్కడి నుండి 15 ప్రైవేట్ లాంచీలు కూడా తిరుగుతున్నాయి. రాజమండ్రిలో విహారయాత్రనిర్వాహకుల వద్ద టిక్కెట్లు బుక్ చేయాలంటే 9866148177, 9866146177 నెంబర్లను సంప్రదించాలి. పర్యాటకులకు భోజన వసతితో పాటు ఒక రోజు ఉండాలంటే గెస్ట్‌హౌస్ సౌకర్యం కూడా కొల్లూరులో కల్పిస్తారు. - ఎం.ఏ సమీర్ సాక్షి ప్రతినిధి, వేలేరుపాడు ఖమ్మం జిల్లా విశ్రాంతికి వెదురు గుడిసెలు కొల్లూరులో వెదురు బొంగులతో తయారు చేసిన గడ్డి గుడిసెల్లో హాయిగా విశ్రాంతి పొందవచ్చు. వెదురుతో నిర్మించే ఈ హట్స్ పర్యాటకులకు గెస్ట్‌హౌస్‌లుగా మారాయి. వీటిలో ఒక రోజు ఉండాలంటే భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. ఇక్కడ ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తే అన్ని వసతులతో ఆతిథ్యం కల్పిస్తున్నారు. -
ప్రాణం తీసిన సరదా
కుంటాల (నేరడిగొండ), న్యూస్‌లైన్ : విహారయాత్ర ఆ యువకుడి పాలిట అంతిమయాత్రగా మారింది. కుంటాల జలపా తం సందర్శనకు వచ్చి స్నానం చేస్తూ నీటిగుండంలో గల్లంతయ్యాడు. బంధువులు కేకలు వేసేలోపే నీటమునిగి చనిపోయాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన నరపరాజు ఆదిత్య అలి యాస్ రోహన్(27) తన కుటుంబ సభ్యులు, బంధువులతో ప్రత్యేక వాహనంలో శనివారం కుంటాల జలపాతానికి వచ్చాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జలపాతం అందాలు వీక్షించారు. అనంతరం సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలోని ఓ కాలువ వద్దకు రోహన్ వెళ్లాడు. స్నానం చేస్తుండగా కాలుజారి పక్కనే ఉన్న నీటిగుండంలో పడిపోయూడు. కేకలు వేస్తూనే నీటిలో మునిగిపోయూడు. గమనించిన కుటుంబ సభ్యులు రక్షించాలని కేకలు వేశారు. జలపాతం వద్ద ఉన్న జాలర్లు వెంటనే నీటి గుండంలో గాలించినా అతడి జాడ కనిపించలేదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రోహన్ మృతదేహం నీటి గుండంలో తేలడంతో జాలర్లు బయటకుతీశారు. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. వీరి రోదన సందర్శకులను కంటతడి పెట్టించింది. రోహన్ హైదరాబాద్‌లో ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఏఎస్సై ఈశ్వర్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సందర్శకుల్లో భయం..భయం.. స్నానం చేస్తూ ఓ యువకుడు కళ్లముందే నీటిలో మునిగి చనిపోవడంతో కుంటాల జలపాతం చూసేందుకు వచ్చిన వారంతా భయూందోళన కు గురయ్యూరు. అకస్మాత్తుగా సామగ్రి సర్దుకు ని తిరుగుపయనమయ్యూరు. రాష్ట్రంలోనే ఎత్తై జలపాతంగా పేరొందినా సరిపడా సిబ్బంది లేకపోవడం.. రక్షణ చర్యలు కొరవడడంతోనే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.