Man Falls Into Karnataka Arasinagundi Waterfalls While Making Instagram Reel - Sakshi
Sakshi News home page

జలపాతం ఒడ్డున ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ చేస్తూ.. అంతా క్షణాల్లోనే.. వీడియో వైరల్..

Published Tue, Jul 25 2023 12:48 AM | Last Updated on Tue, Jul 25 2023 2:33 PM

- - Sakshi

కర్ణాటక: భారీ వర్షాలు కురుస్తున్నందున జలపాతం వద్ద వీడియోలు తీసుకోవడానికి వెళ్లిన యువకుడు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా కొల్లూరు అరశినగుండి జలపాతం వద్ద సోమవారం చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లా భద్రావతి కి చెందిన శరత్‌కుమార్‌ (23) అనే యువకుడు.

దక్షిణ కన్నడ జిల్లా కొల్లూరు అరశినగుండి జలపాతం చూడడానికి వెళ్లాడు. జలపాతం దగ్గర బండపై నిలబడి వీడియోలు తీసుకుంటూ ఉండగా పట్టుతప్పి కిందకు పడిపోయాడు. నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈ దృశ్యాలను కొందరు మొబైళ్లలో వీడియోలు తీశారు. ఫైర్‌, కొల్లూరు పొలీసులు చేరుకుని నీటిలో గాలించగా అతని మృతదేహం బయటపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement