‘నీళ్ల’పై తడాఖా.. జోరుగా ప్రపంచ రాపెల్లింగ్‌ పోటీలు | World Rappelling Competition Was Held At Gayatri Falls In Adilabad | Sakshi
Sakshi News home page

‘నీళ్ల’పై తడాఖా.. జలపాతం వద్ద ప్రపంచ రాపెల్లింగ్‌ పోటీలు

Published Sun, Oct 2 2022 8:39 AM | Last Updated on Sun, Oct 2 2022 3:03 PM

World Rappelling Competition Was Held At Gayatri Falls In Adilabad - Sakshi

సాక్షి, ఇచ్చోడ(బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన గాయత్రి జలపాతం వద్ద శనివారం ప్రపంచ రాపెల్లింగ్‌ పోటీలు నిర్వహించారు. అడ్వెంచర్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు వివిధ దేశాల నుంచి 20 మంది యువతీ, యువకులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం విదేశీ యువతితోపాటు ఇద్దరు యువకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 30 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం విదేశీ యువతతోపాటు మరో 30 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. రెండు ఎత్తైన భారీ కొండల మధ్య నుంచి వస్తున్న గాయత్రి జలపాతం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.

గాయత్రి జలపాతం వద్ద ప్రపంచ రాపెల్లింగ్‌ పోటీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement